నెల్లూరు రాజకీయాలను వీళ్లు నీచ స్థాయికి తీసుకువచ్చారు.. విజయసాయి రెడ్డి ఫైర్
నెల్లూరు రాజకీయాలను టీడీపీ అభ్యర్ధులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్లు నీచ స్థాయికి తీసుకువచ్చారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ దుష్టశక్తులుగా మారిపోయారని దుయ్యబట్టారు. వైసీపీకీ వెన్నుపోటు దారుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్లందరికీ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు చేస్తూ గెలవాలని చూస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్, కడప, విజయవాడల నుంచి దొంగతనాలు, హత్యలు చేయడంలో.. అసాంఘీక కార్యకలాపాలు చేయడంలో ఆరితేరిన వారిని తీసుకువచ్చి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉంచారని పేర్కొన్నారు.
వంగా గీత, భరత్కు బంపర్ ఆఫర్.. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు
కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని, తొలి మంత్రి పదవి హామీ ఇచ్చారు సీఎం జగన్. మరోవైపు.. కుప్పం భరత్ ను కూడా మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దత్త పుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త పుత్రుడును నమ్మే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఐదేళ్లకి ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలు మారుస్తాడు.. ఈయన ఎమ్మెల్యే అయితే మహిళలు కలిసే పరిస్థితి ఉంటుందా? అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అని ఎద్దేవా చేశారు సీఎం జగన్.
కాలికి గాయం.. నడవలేకపోతున్న పవన్ కళ్యాణ్!!
రణరంగాన్ని తలపించిన ఏపీ ఎన్నికల ప్రచారం మరికొద్ది నిమిషాల్లో ముగియనుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగియగా సరిగ్గా 6 గంటలకు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. సరిగ్గా చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన ఆయన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. ఇక ఈ క్రమంలో రామ్ చరణ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు జనసేన కార్యకర్తలు గుమిగూడారు.
కాంగ్రెస్ కనీసం 50 సీట్లను కూడా గెలుచుకోలేదు..ప్రతిపక్ష హోదా రాదు..
మరోసారి ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు. ఒడిశాలో తొలిసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి కాంగ్రెస్ కనీసం 50 సీట్లు కూడా గెలవదని చెప్పారు. కంధమాల్‌లోని ఫుబావిలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.
గత 10 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. 500 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో తమ ప్రభుత్వం రామమందిరాన్ని నిర్మించిందని చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పోఖ్రాన్ పరీక్షలను నిర్వహించి భారతదేశ ప్రతిష్టను పెంచారని, 26 ఏళ్ల క్రితం బీజేపీ సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఒడిశాకు చెందిన వారు మాత్రమే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని హామీ ఇచ్చారు. ఒడిశా భాష, సంస్కృతిని అర్థం చేసుకునే ఈ నెల బిడ్డలే బీజేపీ ప్రభుత్వానికి సీఎం అవుతారని అన్నారు.
ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, జీన్స్ ధరించి విధులకు హాజరుకావద్దని ఆదేశాలు జారీ చేశారు. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, డెనిమ్ ప్యాంట్‌లతో విధులకు వస్తున్నప్పటికీ.. ఈ తరహా దుస్తులు సంస్థను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అందరూ యూనిఫాం లేదా అధికారిక దుస్తుల్లోనే విధులు నిర్వహించాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రతిపాదించారు.
చేవెళ్ల ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలి..
వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రియాంక గాంధీ వచ్చారని, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, వికారాబాద్ జిల్లా కు ముఖ్యమంత్రి పదవి, స్పీకర్ పదవి దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేవెళ్ల ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను తీసుకువచ్చారని, వికారాబాద్ ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలు రద్దు చేసి కేసీఆర్ ఎడారిగా మార్చాడని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన అన్యాయం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రాలేదని, పాలమూరు రంగారెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు. పాలమూరు రంగారెడ్డికి బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదని, కందులకు సరైన మద్దతు ధర రాకపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో కేంద్రమంత్రి ఇష్టాగోష్టి
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సడన్‌గా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ దగ్గరకు వచ్చారు. క్యాంటిన్‌లో మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తుండగా విద్యార్థులతో ముచ్చటించారు. అనేక అంశాలపై వారితో చర్చించారు. హఠాత్తుగా కేంద్రమంత్రి ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను నిర్మలా సీతారామన్ తన ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టుచేశారు.
ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
మే 13న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఉండనున్నాయని తెలిపింది. హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11వ తేదీన 302, 12 వ తేదీన 206 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. రోజు హైదరాబాద్ నుండి ఒంగోలు 38, ఏలూరుకు 20 బస్సులు, మచిలీపట్నంకు 23, విజయవాడకు 45, గుంటూరు 18, నరసరావు పేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నం 4 ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు
రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమాకు త్వరలోనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తనను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం మాట ఇచ్చారు. తమకు ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కోరారు. గతంతో పోలిస్తే న్యాయవాదుల సంఖ్య పెరిగిందని, అందుకు తగినట్లుగా న్యాయవాదుల సంక్షేమ సంఘానికి తగినంత ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు.
ఎన్నికల కోడ్ అయిపోగానే మహిళలకు మహాలక్ష్మి కింద రూ.2,500 ఇస్తాం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అయిపోగానే మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామని ఆయన వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంగా ప్రతి రోజూ నేను రివ్యూ చేసే అంశం గౌరవెల్లి ప్రాజెక్టు అని, ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే నా లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ ఇస్తామని గతంలో అప్పటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చి తొమ్మిది ఏండ్లు అయిన ఇవ్వలేదని, హుస్నాబాద్ కు మెడికల్ కాలేజీ కావాలంటే హుస్నాబాద్ లో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కావాల్సిందేనన్నారు పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడుకలకు పెంచి, మెడికల్ కాలేజీ తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రజల పక్షాన పోరాడి మరింత బలంగా పుంజుకుంటాం
ఎన్నికల్లో బీజేపీని ఓడించి పాతిపెడితే దేవుడికి ఏమీ పట్టదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం అన్నారు. ‘బీజేపీ నేతలు ఎప్పుడూ శ్రీరాముడి గురించే మాట్లాడతారు. మనం కూడా శ్రీరాముని పూజిస్తాం. హుజూరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పండుగలు, ఇతర సంప్రదాయాలతోపాటు అన్నీ నేర్పిస్తున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాడి మరింత బలంగా పుంజుకుంటాం అని కేటీఆర్ అన్నారు. కరీంనగర్‌లో మూడు రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పదేళ్ల పాలన నిజమని, పదేళ్ల బిజెపి పాలన విషపూరితమని అన్నారు.
