“స్కాన్ చేసి స్కామ్ చూడండి”.. బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు..
లోక్‌సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాట బీజేపీ టార్గెట్‌గా పోస్టర్ల ప్రచారం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్ల ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ‘స్కాన్ చేసి స్కామ్‌లని చూడండి’ అంటూ పోస్టర్లపై రాసి ఉంది. ‘‘జీ పే’’ ని ప్రధాని ఫోటో మరియు క్యూఆర్ కోడ్ ఉంది.
కన్నీటి పర్యంతమైన జనసేన నేత.. టికెట్ ఇస్తామని చెప్పి..!
కూటమిలో టికెట్ల కేటాయింపుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. టికెట్ కోసం ఆశావహులు రచ్చకెక్కుతున్నారు. ఈ క్రమంలో మన్యం జిల్లా పాలకొండ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇంచార్జ్ జయకృష్ణకు వ్యతిరేకంగా పడాల భూదేవి వర్గం సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. మీడియా సమావేశంలో జనసేన నేత పడాల భూదేవి కన్నీటి పర్యంతమయ్యారు. టికెట్ ఇస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మాట తప్పారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరి క్షణంలో జయకృష్ణకు టికెట్ కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాని మోడీ “సరిహద్దు” వ్యాఖ్యలపై స్పందించిన చైనా..
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైనా-ఇండియా సరిహద్దు సమస్యలపై మాట్లాడారు. సరిహద్దుల్లో ఉన్న సుదీర్ఘమైన పరిస్థితిని పరిష్కరించాలని చెప్పారు. సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సాధారణీకరించడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ చైనా గురువారం స్పందించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి వ్యాఖ్యలను చైనా గుర్తించిందని అన్నారు. సుస్థిరమైన చైనా-భారత్ సంబంధాలు ఇరు పక్షాల ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడుతాయని, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయని మేము విశ్వసిస్తున్నామని ఆమె అన్నారు. 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్, చైనాల మధ్య సరిహద్దు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలో ఇరు దేశాలు కూడా భారీగా సైనిక సిబ్బందిని మోహరించింది. సైనిక దళాల ఉపసంహరణ కోసం ఇరు దేశాలు దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరిపాయి.
తొందరపడి దళారులకు అమ్ముకొని మోసం మోసపోవద్దు
రైతులు ఎవరు అధైర్యపడొద్దు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి మార్కెట్ యార్డ్ లోనే PACS ధాన్యం కొనుగోలు సెంటర్‌ని ప్రారంభించినమన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తొందరపడి దళారులకు అమ్ముకొని మోసం మోసపోవద్దన్నారు. తేమ పేరుతో రైతులను దళారులు,అధికారులు కలిసి దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తేమ శాతం ఉన్నవాటికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని, నాలుగు రోజులుగా వ్యవసాయ మార్కెట్లో కపాల కాస్తున్న రైతులు ఎక్కడ వర్షాలు వస్తాయని భయపడి దళారులకు అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తానని బుకాయించిందని, ప్రభుత్వం రైతుని పట్టించుకోవడం లేదు,రైతులకు మద్దతు ధర వచ్చేవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ జైలుకే.. “మిసా” పేరు ఎందుకు పెట్టారని బీజేపీ కౌంటర్
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ ప్రధాని నరేంద్రమోడీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతల్ని జైలులో వస్తామని చెప్పడం పెద్ద వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ, బీజేపీ పార్టీల నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. మిసా భారతీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తోంది. అసలు మీకు ‘మిసా’ అనే పేరు ఎందుకు పెట్టారో ఆలోచించుకోవాలని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
నా జీవితం ఒక తెరిచిన పుస్తకం
జగిత్యాల జిల్లా ధర్మపురిలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. నా ఆస్తులు లెక్క పెట్టడానికి గెలిచినవా, ధర్మపురి ప్రజలకు పని చేయడానికి గెలిచినవా ఎమ్మెల్యేగా అడ్లూరి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకమని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని, కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు అయిన అభివృద్ధి పనులను అన్నింటిని రద్దు చేసింది – కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడ నుండి వచ్చినాయి, అదే నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ముందు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లెక్క చెప్పాలని, ఎన్నికల అప్డేట్ లో నా ఆస్తులు వివరాలు పూర్తి పొందుపరచడం జరిగింది.. ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకండన్నారు. కొప్పుల ఈశ్వర్ ఆస్తుల వివరాలు ప్రజలకు అందరికి తెలుసు అని, నా ఆస్తులు లెక్క పెట్టడానికి గెలిచినవా,ధర్మపురి ప్రజలకు పని చేయడానికి గెలిచినవా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
“ఆర్టికల్ 370ని మార్చే ధైర్యం చేయకండి”.. కాంగ్రెస్‌కి అమిత్ షా వార్నింగ్..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దు’’ అని కాంగ్రెస్‌ని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం బీజేపీ కార్యకర్తలు, ప్రధాని మోడీ నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాలేదని, ఒక వేళ యాదృచ్చికంగా అదే జరిగితే ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దని, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, మీ బుజ్జగింపు రాజకీయాలు ముగిశాయని అమిత్ షా అన్నారు.
రేపు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రేపు(శుక్రవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే టీటీడీ (TTD) అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా రేపు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి.. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు
గెలుపే లక్ష్యంగా చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేష్ త్వరలోనే రానుంది. చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి మరోసారి రంజిత్ రెడ్డి గెలిచేందుకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ రోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం తాండూరు పట్టణంలోని చెన్గెస్ పూర్ రోడ్ సమీపంలో నిర్వహిస్తున్న రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి. ఆయనతో పాటు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, సోదరులతో ఈ వేడుకల్లో పాల్గొని అక్కడ హాజరైన వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అందాల సీమను కలహాల సీమగా మార్చాడు.. జగన్ పై కీలక వ్యాఖ్యలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అందాల సీమను కలహాల సీమగా మార్చాడని దుయ్యబట్టారు. మళ్లీ ఈ పరిస్థితులు రాకుండా కాపాడుతామని పవన్ తెలిపారు. జగన్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుపరచలేదని ఆరోపించారు. మళ్లీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయండని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.
