NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అలాంటి సీన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశా: వెంకటేష్ ఇంటర్వ్యూ

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్ విలేకరుల సమావేశంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ విశేషాల్ని పంచుకున్నారు.

 

బుక్ ఫెస్టివల్‌లో ముఖ్యమైన పుస్తకాలు కొన్న పవన్.. బిల్లు ఎంతయిదంటే..?

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన బుక్ ఫెస్టివల్ ను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది. పుస్తక మహోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవం నిర్వహిస్తోన్నారు. అయితే.. ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. తన కోసం ప్రత్యేకంగా ఉదయం పూట రెండు గంటలు స్టాల్స్ ఓపెన్ చేయాలని పవన్ విజ్ఞప్తి చేయడంతో నిర్వాహకులు అంగీకరించారు. కల్యాణి పబ్లికేషన్స్‌, తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సహా మరికొన్ని స్టాళ్లను పవన్ సందర్శించారు.. అనంతరం.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథంతో పాటు చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు. రూ.10 ల‌క్షలు విలువ చేసే పుస్తకాల‌ను ఆయ‌న కొనుగోలు చేయ‌డం విశేషం. పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో యువత కోసం ఓ మంచి లైబ్రరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందు కోసమే ఇన్ని డబ్బులు వెచ్చించి మరీ భారీగా పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం.. టీటీడీ ఉద్యోగిపై దాడి

తిరుపతిలో మళ్లీ చిరుత కలకలం రేపుతుంది. టీటీడీ ఉద్యోగిపై దాడికి పాల్పడింది. సైన్స్ సెంటర్ వద్ద టీటీడీ ఉద్యోగి ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్ పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు గాయపడిన ఉద్యోగిని రుయా ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ రెండు గ్రామాల ప్రజలు ఏ అభివృద్ధి కావాలన్నా అందిస్తాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పూసుకుంట, కటుకూరు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, చేనేత అనుబంధ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయన ఈ సందర్బంగా ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితిష్ వి పాటిల్, ఐటిడి పిఓ రాహుల్ తో కలిసి పూసుకుంట నుండి రాచన్నగూడెం బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

శనివారం పూసుకుంటకు చేరుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దట్టమైన అటవీ మార్గం ద్వారా కటుకూరు గ్రామానికి వెళ్లి, గ్రామం అభివృద్ధి కోసం రూ.1.30 కోట్లతో హై లెవెల్ వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పూసుకుంట అటవీ ప్రాంతంలో నిర్మించబోయే మరో రెండు వంతెనల నిర్మాణానికి కూడా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కటుకూరు నుండి రాచన్నగూడెం వరకు రూ.4.18 కోట్లతో నిర్మించబోయే బీటీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

వారి కుటుంబాల్లో విషాదం.. గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యం

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఈ రోజు ఉదయం కొండపోచమ్మ సాగర్‌కు పర్యటనకు వెళ్లారు. అందులో కొందరు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఈత కొడుతూ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ క్రమంలో ఆ యువకులు డ్యామ్‌లోకి పడిపోయారు. అక్కడున్న స్థానికులు వారిని రక్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ, ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు.. అయితే… మిగిలిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే.. తాజాగా గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన ఐదుగురు యువకుల మృతదేహాలను అధికారులు వెలికితీశారు. 6 గంటల పాటు  గాలింపు చర్యలు కొనసాగాయి.. మృతిచెందిన వారు దినేష్, ధనుష్, జతిన్, లోహిత్, సాహిల్‌గా గుర్తించారు అధికారులు. ఈ ప్రమాదం నుంచి మృగాంక్, ఇబ్రహీం బయటపడ్డారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రాబోయే రోజుల్లో వైట్ టైగర్ సింహాలను ఈ జూకి తీసుకువస్తాం..

హనుమకొండ అటవీ శాఖ ఆధ్వర్యంలో హంటర్ రోడ్డు లోని జూ పార్కులో రెండు పులులను, అడవి దున్నలను, అదేవిధంగా ఇతర జంతువులను ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం జూ పార్కులో 4 రకాల జంతువులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అందులో అతి ప్రాముఖ్యంగా హైదరాబాద్ జూ పార్క్ నుండి తీసుకువచ్చిన రెండు పులులను మన పార్కులోకి తీసుకురావడం జరిగిందని ఆమె అన్నారు. హైదరాబాద్ జూ పార్క్ తర్వాత అతిపెద్ద జూ పార్క్ మళ్ళీ మన వరంగల్ లోనే ఉందన్నారు మంత్రి కొండా సురేఖ.

పండగ వేళ మహా విషాదం.. ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య.. ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్

దేశమంతా సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్‌కు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా ఇళ్లకు చేరుకున్నారు. పట్టణం, పల్లెటూరు అన్న తేడా లేకుండా ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తేలియాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో కొడుకు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుమారుడిని వెతుక్కుంటూ పొలం వెళ్లిన తండ్రి.. బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి అదే ఉరి తాడు తగిలించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

బీజేపీ రెండో జాబితా విడుదల.. ఎవరెవరికి చోటు దక్కిందంటే?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నిన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు నాయకులు హాజరయ్యారు. కాగా.. తాజా జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కపిల్ మిశ్రాను కరవాల్ నగర్ నుంచి, హరీష్ ఖురానాకు మోతీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చారు. ఈ జాబితాలో ఐదుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు.

Show comments