NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

820కి చేరిన మృతుల సంఖ్య.. ఎటూ చూసినా శిథిలాలే..

శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 672 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 51 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నగరాలు, పట్టణాల వెలుపల ఎక్కువ నష్టం సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, నష్టం ఏ స్థాయిలో ఉందో అధికారులు ఇంకా తేల్చలేదు.
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. 6.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది ఆ తర్వాత కొద్ది సేపటికి 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..

గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం మొదలైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తార్నాక, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్. లిబర్టీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం మాదాపూర్, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు సంగారెడ్డి, పటేన్ చెరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పవన్ కల్యాణ్ వస్తుంటే ఎందుకు భయపడుతున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బెజవాడ ప్రయాణం వాయిదా పడింది. పవన్ శంషాబాద్ నుంచి రావాల్సిన విమానం టేకాఫ్ కు నిరాకరించడంతో వాయిదా పడింది. దీంతో గన్నవరం విమానాశ్రయం దగ్గర నుంచి నాదెండ్ల మనోహర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల పక్షంగా నిలబడి పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీల్ని, వ్యక్తుల్ని ప్రత్యేకంగా వారి పైన కక్ష సాధింపు కోసం చేస్తున్న చర్యలను జనసేన ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ.. పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ నుండి బయలుదేరితే ఆయన ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని టేక్ ఆఫ్ అవ్వకుండా ఎయిర్ పోర్ట్ సిబ్బంది నిలిపివేశారని పేర్కొన్నారు.

జీ20లో కీలక పరిణామం.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

జీ20 కూటమిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ శనివారం జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ప్రతిపాదనను అన్ని సభ్య దేశాలు స్వాగతించాయి. స్వాగతించారు. నేడు భారత్‌ మండపంలో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించగా.. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని జీ20 హై టేబుల్‌లో కూర్చోవాలని ఆహ్వానించారు. ఆనందోత్సాహాలు, చప్పట్ల మధ్య, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసోమానీని తన సీటుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రధాని మోడీ, అసోమానీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేయడం సబబే.. స్కీంను స్కాంగా మార్చారు

చంద్రబాబును అరెస్ట్ చేయడం సబబే.. స్కీం ను స్కాం గా మార్చారని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. సిమెన్స్ కంపెనీతో ఒప్పందం అంటే నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు వస్తాయని భావిస్తారు. కానీ సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుని.. రూ.370 కోట్లను ప్రభుత్వ వాటా కింద మూడు నెలల్లో విడుదల చేసారని తెలిపారు. ఇది నిబంధనల ప్రకారం చేయలేదని ఆర్థిక శాఖ కూడా అభ్యంతరం తెలిపిందని నేదురుమల్లి అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో నిధులు విడుదల చేసినట్లు నోట్ ఫైల్ లో రాశారని.. షెల్ కంపెనీల ద్వారా ఎవరికి చేరాలో వారికి ముడుపులు చేరాయని పేర్కొన్నారు.

వెల్డీ హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ..

నూలు పోగులతో అపురూప “కళ” చిత్రం. సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసిన “జీ 20” ప్రత్యేక చిత్రం. ప్రధాని మోడీ తోపాటు ప్రతినిధుల చిత్రాలు చేతిమగ్గంపై ఆవిష్కరణ. చేతిమగ్గంపై నూలు పోగులతో అద్భుతాలను ఆవిష్కరించే చేనేత కళాకారుడు వెల్డీ హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ చేశారు. భారతదేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను పురస్కరించుకొని అపురూపమైన కళారూపాన్ని వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసి సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను మరోసారి జాతీయస్థాయిలో నిలబెట్టునున్నారు. సిరిసిల్ల చేనేత కళ కు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చి దేశ ప్రధాని మోడీతో శభాష్ అనిపించుకున్న కళాకారుడు వెల్ది హరిప్రసాద్. మన్‌కీ బాత్ కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోడీ వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.

జీ20 సమ్మిట్‌లో భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం

వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రపంచ నాయకులు శనివారం జీ20 సమ్మిట్‌లో భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు. కారిడార్‌ను ప్రారంభిస్తూ, కనెక్టివిటీ, స్థిరమైన అభివృద్ధికి ఇది కొత్త దిశను ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే కాలంలో ఈ కారిడార్ భారతదేశం, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారుతుందని ఆయన అన్నారు.

భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈవెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు మనందరం ఒక ముఖ్యమైన, చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం చూశామన్నారు. రాబోయే కాలంలో, పశ్చిమాసియా, ఐరోపా మధ్య ఆర్థిక ఏకీకరణకు భారతదేశం సమర్థవంతమైన మాధ్యమం అవుతుందని. ఇది ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ, అభివృద్ధికి స్థిరమైన దిశను అందిస్తుందన్నారు ప్రధాని మోడీ .

సీఐడీ ప్రశ్నల వర్షం.. చంద్రబాబు ఏమన్నారంటే..!

తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీఐడీ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబును సీఐడీ 20 కఠినమైన ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని.. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం అందుతోంది. తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీఐడీ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబును సీఐడీ 20 కఠినమైన ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని.. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం అందుతోంది.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అరెస్ట్‌

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు స్పీడ్‌ పెంచారు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల వైఫల్యాలను ఎండగంటి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ‘తిరగబడదాం- తరిమికొడదాం’ నినాదంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు చార్మినార్‌ వద్ద ‘తోడుదొంగలు’ అనే పోస్టర్‌ను టీపీసీపీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ విడుదల చేసేందుకు వచ్చారు. అయితే.. చార్మినార్‌ వద్ద ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని నిర్భందించారు. దీంతో అక్కడ కాంగ్రెస్‌ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. మధు యాష్కీతో పాలు పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుంది

చంద్రబాబు అరెస్ట్ పై ఉదయం నుంచి వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబును సీఐడీ ప్రశ్నిస్తుంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని, అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందన్నారు. ‘పిచ్చోడు లండన్‌కి… మంచోడు జైలుకి… ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం’ అంటూ నారా లోకేశ్ చేసిన ట్వీట్‌కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.

ఉక్రెయిన్‌ యుద్ధంపై తీర్మానం.. జీ20 ప్రకటనపై ఉక్రెయిన్‌ ఏమందంటే?

జీ20 ఢిల్లీ డిక్లరేషన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేసే ముప్పు నుంచి దూరంగా ఉండాలని దేశాలను కోరింది. ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా అణ్వాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదని సభ్య దేశాలు కోరాయి. “యూఎన్‌ చార్టర్‌కు అనుగుణంగా అన్ని దేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం లేదా ఏదైనా దేశ రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ప్రాదేశిక స్వాధీనం కోసం బెదిరింపు లేదా బలప్రయోగం నుంచి దూరంగా ఉండాలి” అని జీ20 నాయకులు ఆమోదించిన ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాలు ఇండోనేషియా బాలీలో జరిగిన తీర్మానాన్ని పునరుద్ఘాచించాయి.

రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు

రాష్ట్రంలో యూరియా కొరత లేదు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. ఇవాళ ఆయన హైదరాబాద్ సచివాలయంలో ఎరువుల సరఫరా, నిల్వలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ వానాకాలం సీజన్ కు 9.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు, మార్చి 31 నాటికి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ముందస్తు నిల్వ ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఈ సీజన్ లో ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన యూరియా 9.93 లక్షల మెట్రిక్ టన్నులు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిల్వలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు అని, ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యం మూలంగా 10 లక్షల ఎకరాల సాగువిస్తీర్ణం తగ్గిందని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ‘