Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

మంత్రి గుడివాడ సీటుపై అధిష్టానం క్లారిటీ.. అక్కడి నుంచి పోటీ..!

రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తులు చేస్తుండగా.. పార్టీ గెలవలేని చోట గెలిచే అభ్యర్థిని ఖరారు చేస్తుంది అధిష్టానం. ఈ క్రమంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడో తెలిపింది. అతని సీటుపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈసారి పెందుర్తి నుంచి అమర్నాథ్ పోటీ చేయనున్నారు. పెందుర్తిలో కాపు, వెలమ ఓట్లు ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది హై కమాండ్.

దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాను మోడీ అరికట్టారు

బీజేపీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ పార్లమెంట్​ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు కిషన్‌ ​రెడ్డి సమక్షంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని అనేక మంది పరిపాలించారని ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉందని, కానీ పదేళ్లుగా నరేంద్రమోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్​ నేతృత్వంలో ఫ్రంట్​ ఏర్పాటు చేశాయని ఎద్దేవా చేశారు.

రాబోయే ఎన్నికల్లో బాలయ్యపై పోటీకి బీసీ మహిళ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని కిరికెరలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఒక అద్దాల మేడ.. రాయి వేస్తే పగులుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బాలయ్యపై పోటీకి బీసీ మహిళను ప్రయోగిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణ అయినా.. ఆయన అల్లుడు అయినా.. ఆయన వియ్యంకుడు చంద్రబాబు అయినా ఓడిపోవాల్సిందేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణ వర్సెస్ బీసీ మహిళగా పోటీ ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

ప్రజలు భయాందోళనలో ఉన్నారు..

కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని, ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనలో ఉన్నారని, ఆరు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు..? ఆరు గ్యారెంట్ లకు నిధులు ఎక్కడినుంచి తెస్తారు..? అని ఆయన అన్నారు. 5 అంశాల పై సమాధానం చెప్పండన్నారు. కేసీఆర్ హాయoలో డ్రగ్స్ కేసు నిర్వీర్యం అయ్యింది.. కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీయాలన్నారు బండి సంజయ్. గ్లోబరిన సంస్థ వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆ సంస్థ మీద విచారణ చేపట్టాలని, ప్రభుత్వం టీఎస్పీఎస్సీపై విచారణ ఎందుకు చేయడం లేదు..? 317 జీవోను సవరించాలన్నారు. ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

కాసేపట్లో వైసీపీ మూడో జాబితా ప్రకటించే ఛాన్స్..!

కాసేపట్లో మూడో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 22 నుంచి 25 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సీరియస్ గా కసరత్తు కొనసాగించింది పార్టీ అధిష్టానం. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేయగా.. నియోజకవర్గ మార్పులు-చేర్పులు, సర్దుబాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మూడో జాబితా ప్రకటన చేసే అవకాశముంది.

మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్న మంచు మనోజ్ దంపతులు..

మంచు కుటుంబంలో కాస్తా ట్రోల్ చేయకుండా.. అందరు మెచ్చుకునే హీరో అంటే మంచు మనోజ్ మాత్రమే. అన్న, అక్క లా కాకుండా మీడియా ముందు ట్రోల్ కాకుండా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా అందరితో కలిసిపోతాడు. అభిమానులను అయితే తమ్ముళ్లుగా చూసుకుంటాడు. ఇక గత కొన్నేళ్లుగా మనోజ్ ప్రసంగాలు లైఫ్ లో ఎన్నో గందగోళాలు జరిగాయి. ఇక గతేడాది వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పడ్డాయి. భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ మధ్యనే వీరు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్ గా ఉంది. మొదటి నుంచి కూడా మనోజ్.. పేదవారికి సాయం చేస్తూనే వచ్చాడు. తాజాగా మరోసారి ఈ దంపతులు తమ గొప్పమనసును చాటుకున్నారు.

తెలంగాణలో పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే

పూర్తి శక్తితో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లో చేరికలు పై దృష్టి సారించినట్లు, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ నినాదం తో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. తెలంగాణలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య నే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం అవశ్యకత తెలంగాణకు అవసరం లేదు.. బీఆర్ఎస్‌ ఇరెలవెంట్(అప్రస్తుతం) పార్టీ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నవ యువ ఓటర్ లను కలుస్తాం… 90 శాతం వారు మోడీ కి అండగా ఉన్నారన్నారు.

గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్

గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది పార్టీ అధిష్టానం. వారిని అనర్హులను చేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆఫీసుల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. చీఫ్ విప్ ప్రసాద్ రాజు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. కాగా.. అనర్హులుగా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్సీలలో వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య ఉన్నారు.

జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు..

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ప్రభుత్వంతో కలిసి పలుమార్లు చర్చించినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపాం.. అయినా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఎస్మా పెట్టామని తెలిపారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయి.. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని సజ్జల తెలిపారు. వాళ్ళు రాజకీయం చేస్తున్నారని తాను అనటం లేదన్నారు. చేయగలిగినంతా ప్రభుత్వం చేసింది.. భవిష్యత్తులో మరింత చేస్తాం అని కూడా చెప్పామని పేర్కొన్నారు. వాళ్ళ డిమాండ్ లో నిజాయితీ ఉన్నట్లే.. తమ హామీలోనూ నిజాయితీ ఉందని చెప్పారు.

 

Exit mobile version