చంద్రబాబు దొరికిన దొంగ.. మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడు..!
సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సామాజిక యాత్రకు ఎన్నికలతో సంబంధం లేదు.. సామాజిక విప్లవానికి ప్రతీక ఈ యాత్ర అని ఆయన పేర్కొన్నారు. వెనుక బడిన కులాలను అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి ఆలోచన ఈ యాత్ర.. వెనుక బడిన కులాలను తక్కువ చేసి మాట్లాడే చంద్రబాబు కాలంలో అనేక కులాలను వెలి వేసిన పరిస్థితి ఉండేది.. కానీ అలాంటి వెనుక బడిన కులాలను, వర్గాలను రాజ్యాధికారం వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడిపిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున చెప్పుకొచ్చారు.
నా రక్తం చూసి బోయపాటి అలా చేశాడు… షాకింగ్ ఫోటో షేర్ చేసిన రామ్
సినీ పరిశ్రమలో బాడీ డబుల్స్ సర్వసాధారణం, ప్రధానంగా యాక్షన్ పార్ట్స్ – రిస్క్ తో కూడుకున్న షాట్‌ల కోసం ఉపయోగిస్తారు. అయితే ఇటీవల చాలా మంది హీరోలు క్లోజప్ షాట్‌లు కాకపోయినా సాధారణ సన్నివేశాలకు కూడా బాడీ డబుల్స్‌ని వాడుతుండటం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ కి బాడీ డబుల్‌గా చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. స్కంద ఓటీటీలో రిలీజ్ అయ్యాక క్లైమాక్స్ ఫైట్ సీన్‌లో ఎడిటింగ్‌లో టీమ్ చేసిన పొరపాటు కారణంగా బయట పడడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వివరంగా గమనిస్తే బోయపాటిని బాడీ డబుల్ గా వాడుకోవడం అర్థం అయిపోతుంది. నిజానికి స్కంద OTT విడుదలకు అద్భుతమైన స్పందన వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవడం మొదలైన కొద్దిసేపటి నుంచే మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ప్రతి పేదవాడి జీవితంలో వెలుగు చూడాలనే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారు..
సామాజిక యాత్ర పై వాడ వాడలా చర్చ జరుగుతుంది అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏపీ సీఎం చేసిన అభివృద్ధి,సంక్షేమం పై చర్చ జరుగుతుంది.. పేదరికాన్ని తొలగించాలన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు.. ఎన్నికల హామీలను అమలు చేస్తున్న సీఎం జగన్.. సీఎం జగన్ ప్రతి పేదవాడి జీవితం లో వెలుగు చూడాలన్న లక్ష్యం తో పని చేస్తున్నారు.. ఓటు బ్యాంక్ రాజకీయం గా మాత్రమే గతం లో సామాజిక సాధికారత ఉండేది అని ఆయన ఆరోపించారు.
కానీ, సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాలంభన అందించడటమే లక్షంగా పని చేస్తున్నారు అని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజ్యసభ సీటు అంటే బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే దక్కేది.. కానీ వెనుక బడిన వర్గాలకు, బీసీలకు రాజ్యసభ అవకాశాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది.. జగన్ ను ఎందుకు పరిపాలన నుండి దించాలో ప్రతిపక్షాలు చెప్పాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు దించాలో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు మరింత మేలు జరగాలంటే మళ్ళీ జగనే సీఎం అవ్వాలి అని పిలుపునిచ్చారు. 2024లో మరో సారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎంపీ మోపిదేవి అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి మళ్లీ జగన్ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు.
చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీ కలిసి పోటీ చేస్తారు..
జగన్ పాదయాత్ర సమయంలో మాటిచ్చారు.. ఇప్పుడు నెరవేరుస్తున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు దత్త పుత్రుడు, బీజేపీ కలిసి పోటీ చేస్తారు.. ఐదు సంతకాలు చేసారు.. అందులో ఒకటి రైతు రుణమాఫీ అన్నారు ఇచ్చారా.. వైస్ రాజశేఖరరెడ్డి ఇచిత విద్యుత్ పై సంతకం చేసి నెరవేర్చారు అని ఆయన తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వార నవరత్నాలను ఇస్తామన్నారు.. ఎన్ని కష్టలు వచ్చినా నేటికీ ఎక్కడా అంతరాయం లేకుండా అమలు చేస్తున్నారు.. నాలుగు రోజులు గా చూస్తున్నాం.. తప్పు చేసి జైలు కి వెళ్తే.. ఓ పుణ్య పురుషుడు గా కొన్ని పత్రికలు చానళ్లు చెబుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
మరోసారి కేసీఆర్ సర్కార్‌కు వస్తుంది.. అది అవసరం, ఆవశ్యకత
కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదన్నారు బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అహంకారంతోనే చేసే పనితోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని, రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ సర్కార్ కు అవకాశం ఇస్తారన్నారు. అది అవసరం, ఆవశ్యకత అని ఆయన వ్యాఖ్యానించారు. మరెన్నడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తదని ఆలోచన లేదని, కాంగ్రెస్ ది స్వయంకృత అపరాధమన్నారు.
చంద్రబాబు- పవన్ కళ్యాణ్ భేటీ.. కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చంద్రబాబు అనారోగ్యంతో పాటు మధ్యంతర బెయిల్ పై పవన్ పరామర్శించారు. ఇక, జనసేనాని వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉండగా.. బాబు వెనక టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉన్నారు. అయితే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి టీడీపీ-జనసేన పార్టీలు వచ్చాయి.
చంద్రబాబు అంటేనే అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం..
జగన్ పేరు చెప్తేనే ఓ శక్తి వస్తుంది అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన సీఎం జగన్.. చంద్రబాబు అంటే అబద్దం…చంద్రబాబు అంటే మోసం.. అబద్ధాలకు, మోసాలకు చెక్ పెట్టిన నాయకుడు జగన్.. 3,648 కిలోమీటర్ల పాదయాత్రతో తపస్సు చేసిన నాయకుడు జగన్.. నవ రత్నాలతో ప్రతి వెనుక బడిన వర్గాలకు చెందిన వ్యక్తులు అభివృద్ధి సాధించారు అని ఆయన పేర్కొన్నారు. వెనుక బడిన వర్గాల రక్షకుడు సీఎం జగన్.. ఇంత మంది బీసీ లకు ఎస్సీలకు ఎప్పుడైనా పదవులు వచ్చాయా? అని మంత్రి చెల్లుబోయిన వేణు ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో జగన్కి ప్రజలందరూ అండగా నిలవాలి
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యనించారు. సమాజంలో 80 శాతం ఉన్న అణగారిన వర్గాలకు మేలు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
ఇక, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్, మున్సిపల్, స్థానిక సంస్థల పదవులన్నీ బడుగు బలహీన వర్గాలకే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదే.. గత నాలుగున్నరేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలోనే 2500 కోట్ల రూపాయల లబ్ది పొందారని ఆయన తెలిపారు.వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా నిలవాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు.. టీడీపీ హాయం
రాహుల్ బీసీలను అవహేళన చేస్తూ మాట్లాడారు
ఈ నెల 7న ఏల్బి స్టేడియంలో తెలంగాణ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు, దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ రానున్నట్లు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీసీ సీఎం నినాదాన్ని జీర్ణించుకోలేక పోతుందని, రాహుల్ బీసీలను అవహేళన చేస్తూ మాట్లాడారన్నారు. దీన్ని సవాలుగా తీసుకొని ముందుకి వెళ్తున్న బీసీలు.. ఈ సభకు బీసీలంత కదలి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కేసీఆర్, రాహూల్ గాంధీకి తెలంగాణలో బీసీ సీఎంను చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.
కేటీఆర్ తో నాటుకోడి కూర వండించిన గంగవ్వ
తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌కు బాగా పాపులారిటీ ఉంది. చిన్న చిన్న వీడియోలతో ఈ ఛానల్ ను స్టార్ట్ చేసి.. ప్రస్తుతం సినిమా హీరోలతో ప్రమోషన్ వీడియోలు చేసే రేంజ్‌కు ఈ ఛానల్ వెళ్లింది. ముఖ్యంగా యూట్యూబ్ టీమ్ లో గంగవ్వ బాగా ఫేమస్ కావడంతో పాటు అనిల్, అంజిమామ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక, ప్రస్తుతం ‘మై విలేజ్ షో’ గంగవ్వ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తుంది. గంగవ్వ ఇప్పటికే ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసింది.
నాకు పెళ్లి చేస్తేనే, ఎలక్షన్ డ్యూటీకి వస్తా..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎలక్షన్ డ్యూటీ పడుతోంది. అయితే ఇప్పుడు ఓ టీచర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరుకాకపోవడమే కాకుండా, షోకాజ్ నోటీసులు పంపిన అధికారులకు ఖంగుతినే సమాధానం వచ్చింది. ఈ సమాధానం చూసి ఉన్నతాధికారులకు చిర్రెత్తుకొచ్చి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అఖిలేష్ కుమార్ మిశ్రా అనే ఉపాధ్యాయుడికి 35 ఏళ్లు. సాత్నాలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల డ్యూటీ కోసం ఆయనతో పాటు మిగతా ఉపాధ్యాయులకు కూడా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 16,17 తేదీల్లో శిక్షణా తరగతులకు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి అఖిలేష్ కుమార్ హాజరు కాలేదు. దీనిపై ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
