Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీఎస్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి ఏపీ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఒక కేసులో సీజ్ చేసిన తన ఫోన్.. కోర్టు నుంచి దొంగలించి తనను పోలీసులు బెదిరిస్తున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఫోన్ లో తన కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా.. రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్న విషయాన్ని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అంతేకాకుండా.. కాల్ రికార్డ్స్ ను కూడా కోర్టుకు అందించాడు. ఈ క్రమంలో.. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

పర్యాటకంలో మౌలిక వసతులకు పెద్దపీట

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆక్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అబ్కారీ, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేట లోనిహరిత ప్లాజా లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారామంత్రికి వివరించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట కాల వ్యవధిని నిర్దేశించుకొని, దానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు.

పాక్‌లో దారుణం.. బార్బర్స్‌ని కిడ్నాప్ చేసి కాల్చి చంపిన టెర్రరిస్టులు..

పాముకు పాలు పోసి పెంచిన విధంగా టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషించింది, ఇప్పుడు ఆ పాముకే బలైపోతోంది. ఆ దేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్మీ, పోలీసులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.

గెలుపు అవకాశాలు, అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను బట్టి సీట్లు మార్పు

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జగన్ తరపున తాను వైఎస్ షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం జరుగుతోంది అని అన్నారు. తాను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదని తెలిపారు. తాను మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని చెప్పారు. నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్ లో కలిశానన్నారు. కొద్దిసేపు కుటుంబ విషయాలపై విజయమ్మ, తాను మాట్లాడుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే మంచిది..

దాడి వీరభద్రరావు రాజీనామాపై ఐటీ మంత్రి అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదని అన్నారు. వైసీపీలో గెలిచే వారికి సీట్లు, కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదని తెలిపారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని తెలిపారు. టికెట్లు రాని వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండటం వల్ల పార్టీకి నష్టం లేదని వివరించారు. దాడి వీరభద్ర కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది, అప్పుడు తిరస్కరించారు.. ఆ విషయంలో వారిదే ఆఖరి నిర్ణయమని చెప్పారు.

ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు

ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు అని మళ్ళీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఇవాళ ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు అని అన్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారని, కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామన్నారు. కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ బీజేపీ అడుగుతుందన్నారు. జ్యుడీషియల్ విచారణకు కేంద్రంలో ఉన్న బీజేపీ న్యాయ శాఖ సుప్రీం, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జీని నియమించాలని పొన్నం ప్రభాకర్‌ కోరారు. బీఆర్ఎస్ కు బీజేపీకి దోస్తీ ఉందని, గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు, జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ పై ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. ఇప్పటి కి బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే పరిస్థితి లేదని, కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే… మీ లేఖకు విలువ లేకుంటే కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. బీజేపీది, బిఆర్ఎస్ ది అపవిత్ర కలయిక. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదన్నారు పొన్నం ప్రభాకర్.

అనిల్ వర్సెస్ నారాయణ.. కాక పుట్టిస్తున్న నెల్లూరు రాజకీయం

మాజీ మంత్రి నారాయణ పై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నా.. దమ్ముంటే జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి కాదు.. నేనే పోటీ చేస్తానని మాజీ మంత్రి నారాయణ ప్రకటించాలని అన్నారు. కనిగిరి, కందుకూరు, వెంకటగిరి లేదా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు.. అంటే నాకు అంత సత్తా ఉందని గుర్తించాలని అనిల్ అన్నారు. మీ లాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని కాను.. మళ్లీ నారాయణను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ధర్నా విరమించిన ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్లు

మోటారు వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. ఇవాళ ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు. పెద్దఎత్తున బారులు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులకు పెట్రోల్ సరఫరా కానుంది. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ కొరతపై ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిలకు సంబంధించి కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర చట్ట సవరణతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఆయిల్ ట్యాంకర్లు యథావిధిగా నడుస్తాయని ఆయన వివరించారు.

కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నా..

కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు షర్మిల అన్నారు. రేపే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీ చేయలేదని షర్మిల చెప్పారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో తమ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము పోటీ పెట్టకపోవడమే ప్రధాన కారణమని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు తన వంతు కృషి చేశానని తెలిపింది. రెండు రోజుల్లో అన్ని విషయాలు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అయితే ఖాయమని చెప్పారు. తన కుమారుడి వివాహం సందర్భంగా తండ్రి ఆశీస్సులు తీసుకోవడానికి పులివెందులకు వచ్చానని తెలిపారు.

కిషన్‌ రెడ్డి కాంగ్రెస్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారు

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆయన మాట్లాడిన మాటల్లో సత్యదూరం అయినవి ఉన్నవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కలిసి 3500 రోజులు గడిపారని, పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీ అన్ని విషయాల్లో కలిసి పని చేసారన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నవని, కాళేశ్వరంకు బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు ఎలక్ట్రిసిటీ సెక్టార్ కు 1లక్షా 27వేల కోట్ల లోన్లు ఇచ్చిందని, మొదటి సారి పవర్ కార్పొరేషన్ ఫైనాన్స్ తన నిబంధనలు మార్చుకుని కాళేశ్వరంకు లోన్లు ఇచ్చారన్నారు.

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బళ్ళారి మాజీ ఎంపీ

సీఎం జగన్ సమక్షంలో బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ వైసీపీలో చేరారు. గతంలో ఆమే బీజేపీ ఎంపీగా పని చేశారు. అయితే.. హిందూపూర్ ఎంపీగా బరిలో శాంతమ్మను నిలబెట్టాలని అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీలో అధికారికంగా చేరింది. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ.. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరానని అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు.

పబ్ లో మినిస్టర్ రోజా చిందులు.. ఏకిపారేస్తున్న ప్రజలు

నటి, మినిస్టర్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం టీడీపీ, జనసేన నేతలపై విరుచుకుపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జిగాఉన్న రోజా మినిస్టర్ అయ్యాక పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యింది. ఇక రోజాకు వివాదాలు కొత్తేమి కాదు. ఎంతోమంది ఆమెను విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా వివాదంలో చిక్కుంది. రోజా ఈ ఏడాది న్యూయర్ సెలబ్రేషన్స్ను బెంగుళూరులో జరుపుకుంది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికింది. బెంగళూరు పబ్‌‌లో డ్యాన్సులు చేస్తూ.. పాటలకు లయబద్దంగా స్టెప్పులు వేస్తూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలు బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకొని.. రోజా డ్యాన్స్ వేస్తూ కనిపించింది.

ఏపీలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు

ఏపీలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచుతోంది. రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నేపధ్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. సీఎస్, డీజీపీలు సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.

 

ప్రేమిస్తుందని కూతురిని, ఆమె లవర్‌ని నరికి చంపిన తండ్రి..

ఇటీవల కాలంలో ప్రేమ వ్యవహారాల్లో పరువు హత్యలు జరుగుతున్నాయి. తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమిస్తుందని, తన మాట వినడం లేదని తల్లిదండ్రులు కూతుర్లను చంపేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కుమర్తె ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆమెను, ఆమె లవర్‌ని ఘోరంగా హత్య చేశాడు.

తన కుమార్తె ప్రేమ ఇష్టం లేని వ్యక్తి, ఆమెను, ఆమె లవర్నిని పారతో నరికి చంపాడు. ఘటన తర్వాత రక్తంతో తడిసిన ఆయుధంతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయారు. ప్రాథమికంగా పరిశీలిస్తే ఇది పరువు హత్యగా పోలీసులు నిర్థారించారు. వివరాల్లోకి వెళ్తే… పరౌలి గ్రామానికి చెందిన సచిన్ (20) అదే గ్రామానికి చెందిన మహేష్ కుమార్తె నీతు (20)ను రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

సీఎం రేవంత్‌ను కలిసిన సింగ‌రేణి నూత‌న సీఎండీ

రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌పై సింగ‌రేణి ఛైర్మ‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ (ఎఫ్ ఏ సి)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎన్‌.బ‌ల‌రామ్ స‌చివాల‌యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాల‌కు బొగ్గు కొర‌త లేకుండా చూడాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆదేశించ‌గా.. త‌గినంత బొగ్గు ర‌వాణాను ఎటువంటి కొర‌త లేకుండా కొన‌సాగిస్తామ‌ని, అలాగే సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవ‌స‌రాల కోసం నిరంత‌రాయంగా అంద‌జేస్తామ‌ని సింగ‌రేణి సీఎండీ శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ తెలియ‌జేశారు.

బేసిక్ పే ఇవ్వడం కుదరదు.. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు విఫలం

మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్మికులకిస్తే అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతాయని మంత్రుల బృందం తెలిపింది. దీంతో మున్సిపల్ కార్మిక సంఘాలు కూడా సమ్మె విరమించేదే లేదని ఖరాకండిగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని సంఘాలతో చర్చలు జరిగాయన్నారు. చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు.

 

Exit mobile version