NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఎక్సైజ్శాఖలో సంస్థాగత మార్పులు చేసేలా ఏపీ సర్కార్ చర్యలు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పని తీరు మెరుగు పరిచే విషయమై కసరత్తు చేస్తుంది. స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో- సెబ్ రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులు చేసేలా చర్యలు చేపట్టింది. ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులపై అధ్యయనం చేసేందుకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. 19 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎక్సైజ్ డీసీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరిని సభ్యులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే గొడుగు కింద ఎక్సైజ్ శాఖను తెచ్చేలా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. 2020లో ఎక్సైజ్ శాఖను రెండు ముక్కలు గత వైసీపీ ప్రభుత్వం చేసింది. ఎక్సైజ్, సెబ్ విభాగాలుగా చేసి కార్యకలాపాలు నిర్వహించింది.. సిబ్బంది కొరతతో పాటు ఇబ్బందులను సెబ్, ఎక్సైజ్ శాఖ ఎదుర్కొన్నాయి. ఇక, ఎక్సైజ్ శాఖలో సంస్థాగతంగా మార్పులు చేస్తామని శ్వేత పత్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రస్తావించింది. ఆగస్టు మూడో తేదీలోకా తుది నివేదిక ఇవ్వాలని కమిటీకి ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశారు అని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచీ ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైంది అని పేర్కొన్నారు. అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

పార్లమెంట్‌లో వాటర్ లీకేజీపై అఖిలేష్ విమర్శలు

కొత్త పార్లమెంట్‌లో వాటర్ లీకేజీపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే బుధవారం కురిసిన వర్షానికి పార్లమెంట్ హాల్‌లో ధారగా వర్షపు నీళ్లు కారడం.. బకెట్ పెట్టి నింపడం వంటి వీడియోలు బయటకు వచ్చాయి. పార్లమెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. పాత పార్లమెంట్ బాగున్నా.. కోట్లు ఖర్చు చేసి కొత్త పార్లమెంట్‌కు తీసుకొచ్చారన్నారు. తీరా ఒక్క వర్షానికే తడిసిముద్దైందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అఖిలేష్ యాదవ్ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేసి విమర్శించారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం అని ప్రజలు అడుగుతున్నారని ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కొత్త రేషన్‌ కార్డులకు కేబినెట్‌ ఆమోదం

గంటన్నర పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్‌ సబ్‌ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్‌ , దామోదర రాజనర్సింహ ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెటర్‌ సిరాజ్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌లకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీలో ఔటర్‌ గ్రామాల విలీనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా.. జాబ్‌ క్యాలెండర్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు సభలో జాబ్ క్యాలెండర్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

భూమాతగా ధరణి, కొత్త రేషన్‌ కార్డులు, జాబ్‌ క్యాలెండర్‌.. కేబినెట్‌ నిర్ణయాలివే..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీహాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌.. ధరణి పోర్టల్‌ను భూమాత పోర్టల్‌గా మార్చడంతో పాటు పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇండియా స్కిల్స్ వర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేరళ వరదలు.. సూర్య అండ్ కో భారీ విరాళం

కేరళ వయనాడ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ముండకై, సురల్‌మలై, అట్టమలై, నుల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వయనాడ్ కేరళ రాష్ట్రంలోని అందమైన కొండ ప్రాంతం. తమిళనాడుకు ఊటీ మరియు కొడైకెనాల్ లాగా, కేరళకు వయనాడ్ ఒక హిల్ టూరిజం డెస్టినేషన్. అక్కడి అందాలను ఇచ్చిన ప్రకృతి నేడు ఆ ప్రాంత ప్రజలను కంటతడి పెట్టించింది. ఎందుకంటే అర్ధరాత్రి అనూహ్యంగా వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి అక్కడ మూడు గ్రామాలు మట్టిలో కూరుకుపోయాయి. 280 మందికి పైగా మరణించగా 200 మందికి పైగా గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడిన ప్రజలను రక్షించేందుకు అనేక రెస్క్యూ టీమ్‌లు పగలు, రాత్రి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి.

నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయి..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన.. సోనియమ్మ నాయకత్వం.. అంటూ ఊదరగొడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో మహిళల పాత్ర ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు వణికిపోతున్నారన్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయని, అసెంబ్లీలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలం నాలుగున్నర గంటలు నిల్చుంటే మాకు మైక్ ఇవ్వలేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఆడబిడ్డలకు మైక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం..? అని ఆమె ప్రశ్నించారు. సీఎం సీటులో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లాంటి నాయకులను చూశామని, మేము నిల్చుంటే కాంగ్రెస్ సభ్యుల కళ్ళల్లో రాక్షస ఆనందం కనిపించిందన్నారు.

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు ఆదేశం

గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీఎండీసీ మాజీ ఎండీ వీజీ వెంకట రెడ్డిపై ఏసీబీ విచారణకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏసీబీ డీజీకి సర్కార్ సమాచారం అందించింది. దీనిపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచనలు చేసింది. గనులు, ఇసుక అంశాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలు ఉన్నాయ.. ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ నుంచి డిప్యూటేషనుపై గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి వెంకటరెడ్డి వచ్చాడు. ఇక, ఏపీఎండీసీ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి.. ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించామని కోస్ట్ గార్డ్ సర్వీసెస్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది. ఇప్పటికే వెంకట రెడ్డి హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి ఆచూకీ లభించకుంటే లుకౌట్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది. ఇక, వెంకటరెడ్డిని విచారణ చేసేందుకు ఏసీపీ అధికారులు రెడీ అవుతున్నారని సమాచారం.

కేరళ విలయం.. జాతీయ విపత్తే

కేరళ విలయం తన దృష్టిలో జాతీయ విపత్తు అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి రాహుల్ వయనాడ్‌ ప్రకృతి విపత్తు జరిగిన ప్రాంతాలను సందర్శించారు. బాధితుల్ని పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. కేరళ విలయంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. కేరళకు జరిగిన నష్టం దేశానికి తీరని విషాదంగా పేర్కొన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదని.. బాధితులందరికీ అవసరమైన సాయం అందించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి బాధితులకు రావాల్సిన సాయం అందేవరకు కాంగ్రెస్‌ పోరాడుతుంద్నారు. ఇలాంటి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. దీనిపై సమగ్ర కార్యచరణ ప్రణాళిక అవసరం అని రాహుల్‌ తెలిపారు.

రేపు అమరావతికి రానున్న ఐఐటీ నిపుణులు

రేపు ( శుక్రవారం) అమరావతికి ఐఐటీ నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలోని కట్టడాలను వారు పరిశీలన చేయనున్నారు. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే పనులు నిలిచిపోయిన భవనాలను ఐఐటీ బృందం పరిశీవించనుంది. ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయిన పనులని స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. ఈ భవనల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి ఏపీ సర్కార్ అప్పగించింది.