NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి మృతి..హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో దర్యాప్తు

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉరివేసుకుని కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అలీరాజ్‌పూర్ ఎస్పీ రాజేష్ వ్యాస్ సమాచారం ప్రకారం.. గునేరి పంచాయతీ రౌడీ గ్రామంలోని ఓ ఇంట్లో రాకేష్ సింగ్, భార్య లలిత, కుమార్తె లక్ష్మి, కుమారుడు ప్రకాష్, అక్షయ్ మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. కొందరు గ్రామస్తులు హత్య చేసి మృతదేహాలను వేలాడదీస్తారేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదు

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. జూలై 1న మధ్యాహ్నం 3:51 గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 139 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఈ భూకంపం కారణంగా ఏమైనా ప్రాణనష్టం జరిగిందా? ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం ఇంకా తెలియలేదు. రంగంలోకి దిగిన సహాయ బృందం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.’

పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తా..

ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీని గెలిపించింది..జనసైనికులే అని పేర్కొన్నారు. గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని జనసైనికులను ఉత్సాహ పర్చారు. జనసైనికులు ముందు పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి ఆఖరి శ్వాస వరకు కృషి చేస్తానని ప్రమాణం చూశారు. “పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తా. వ్యవస్థను నేను ఒక్కడినే మార్పు చేయలేను. పంచాయతీ అధికారులు సలహా కోరా. ఏఏ పనులు చేపట్టాలని.. జనాలను కోరితే 1423 ఆర్జీలు వచ్చాయి. కూటమికీ 21 ఎంపీ స్థానాలు ఇవ్వడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. గెలుపు కోసం మీరు పడ్డా కష్టం చూస్తే కన్నీరు వచ్చింది. మీకు సేవ చేయడానికి శక్తి ఇమ్మని దేవుడిని ప్రార్థిస్తున్నా. జనసేన లేని ఊరు ఉందేమోగాని..జనసైన్యం లేని ఊరు లేదు. సంతోషం వస్తే పొగుడుతారు.‌ కోపం వస్తే నన్నే తిడతారు. దేవుడని కాళ్ళు పట్టుకుని లాగేయకండీ.” అని వ్యాఖ్యానించారు.

తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ రవాణా శాఖ అధికారుల అధ్యయనం…

తమిళనాడు రాష్ట్రం లో తెలంగాణ రవాణా శాఖ అధికారుల అధ్యయనం చేసింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ IAS ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా శాఖ అధికారుల బృందం రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎం వి ఐ జింగ్లి శ్రీనివాస్ లు ఈ రోజు తమిళ నాడు రాష్ట్రం లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసేందుకు వెళ్లారు…

రెండు రోజుల పర్యటన లోభాగం గా ఈ రోజు తమిళ నాడు రవాణా శాఖ కమిషనర్ శ్రీ షణ్ముగ సుందరం IAS తో భేటి అయ్యారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్, వాహన్ పోర్టల్, స్క్రాపింగ్ పాలసి, పన్నుల విధానం, ఆదాయ వివరాలు, చెక్ పోస్టు ల పని తీరు, ఆన్ లైన్ సర్వీసులు తదితర అంశాలు తమిళనాడు లో అమలవుతున్న తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. రెండు వేర్వేరు పిటిషన్లు వేయగా.. రెండింటినీ ధర్మాసనం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. అటు తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. తాజాగా వేసుకున్న రెండు పిటిషన్లు తిరస్కరణకు గురవ్వడంతో ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మీరు సీఎం..సీఎం అంటే నాకు భయమేస్తోంది..

మీరు సీఎం..సీఎం అంటే నాకు భయం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటే ఏదైనా జరుగుతుందన్నారు. ప్రపంచం గుర్తించేలా పిఠాపురం నుంచి మార్పు ప్రారంభించాలని సంకల్పిస్తున్నామని చెప్పారు. మీ గొంతే నా గొంతు మీ కలే నా కల అన్నారు. గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టి ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని గుర్తుచేశారు. పదవులు వచ్చినంత మాత్రనా తల ఎగుర వేయకూడదని పేర్కొన్నారు. వ్యక్తిగత ద్యేషాలకు విధ్వాంశాలకు పాల్పడవద్దని కార్యకర్తలకు నాయకులకు సూచించారు.

టెస్టు రన్ ఫెయిల్యూర్.. అడవుల్లో కూలిన రాకెట్

చైనాలో ఓ ప్రైవేటు రాకెట్ కుప్పకూలింది. ప్రయోగం ప్రారంభం అయిన కొన్ని క్షణాల్లో నిప్పులు చిమ్ముకుంటూ సమీప అడవుల్లో కుప్పకూలింది. ఆదివారం చైనీస్ టియాన్‌లాంగ్-3 రాకెట్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ప్రయోగం చేపట్టారు. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ప్రయోగం ఫెయిల్యూర్ అయింది. అంతరిక్షంలోకి వెళ్లక ముందే 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కూలిపోయింది. రాకెట్ బాడీ.. టెస్ట్ బెంచ్ మధ్య కనెక్షన్‌లో నిర్మాణ వైఫల్యం కారణంగానే ప్రయోగం విఫలమైందని చైనాకు చెందిన డెవలపర్ మరియు ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ పయనీర్ చెప్పారు. రాకెట్‌లోని కంప్యూటర్‌ కూడా పని చేయకపోవడంతో రాకెట్ కూలిపోయిందని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ సహకరించుకున్నాయి

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నా సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు మెయిల్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారని నా దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. ఆయన ఏ హోదాలో అడుగుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. ఇరు పార్టీలకు లోపాయికారి ఒప్పందం ఉన్నదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బిఆర్ఎస్ సహకరించుకున్నాయని, నేను చాలా సార్లు చెప్పాను..కేటీఆర్ స్వయంగా చెప్పారు అని ఆయన తెలిపారు. గతంలో మెజార్టీతో గెలిచిన స్థానాల్లో తక్కువ ఓట్లు ఎలా వచ్చాయ్. బిఆర్ఎస్ ఓట్లు అన్ని బీజేపీకి డైవర్ట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోతుంది అని ప్రగల్భాలు పలుకుతున్నారు..ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నా సభ్యత్వాన్ని రద్దు చేయమని ఎలా చెబుతాడని, కేసీఆర్ పార్టీ,కేసిఆర్ అడగాలి. బీజేపీకి ఏం సంబంధం..? అని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపులు ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే అని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌పై మరోసారి కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు

ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై గత కొన్ని రోజులు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం నిజం కాదని.. ఇప్పుడు ఇదే అందుకు నిదర్శనమంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌లో ‘నిన్నటి దాకా… మేడిగడ్డ మేడిపండులా మారింది అన్నారు..అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు.లక్షకోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్నారు.అన్నారం బ్యారేజీ కూడా కూలిపోతది అన్నారు. నేడు మాత్రం.. మేడిగడ్డ మరమ్మత్తులు పూర్తి అంటున్నారు..అంటే… ఇంతకాలం కాంగ్రెస్ చేసింది.. విష ప్రచారమని తేలిపోయింది.. 8 నెలల నుంచి చేసింది.. కాలయాపనే అని రుజువైపోయింది..

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2024 పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా జూన్‌ 16న పరీక్ష నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్‌ మార్కులు, ఆన్షర్‌ కీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక UPSC వెబ్‌సైట్ upsc.gov.inలో చూడవచ్చు.