NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

జగన్‌పై కేటీఆర్‌ మిత్ర ధర్మాన్ని పాటించారు

వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో BRS(కేటీఆర్) ఓడితే జగన్ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు. YCP పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు రఘురామకృష్ణం రాజు. ఇదిలా ఉంటే.. ఏపీలో వైసీపీ, కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియడం లేదంటూ కేటీర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారని విమర్శించారు. మీకు మీరే మంచివారంటూ.. సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా కేటీఆర్‌? అంటూ ప్రశ్నించారు సత్యకుమార్‌.

బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంనకు చెందిన బద్ది దర్శిని రాంబిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 6న ఆమె స్కూల్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది.. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లోంచి బోడాబత్తుల సురేష్‌ అనే యువకుడు బయటికి రావడాన్ని బాలిక నానమ్మ గమనించారు. ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే చుట్టుపక్కలవారిని పిలిచి చూడగా.. బాలిక అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు.

ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామంలో ఉన్న ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆరు ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం తెలుస్తోంది. అర్ధరాత్రి ప్రమాదం జరగడం, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ పరిశ్రమలో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

13 ఏళ్లకే గర్భిణి.. 35 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ

దేశ జనాభా రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ల అయినా ఇంకా కొన్ని తెగల ప్రజలు వెనకబడే ఉన్నారు. అలాంటి తెగలలో ఒకటి బాలాఘాట్ జిల్లాలోని బైంగా తెగ. జనాభా పెరుగుదలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా మరోవైపు బైంగా తెగకు చెందిన ఓ మహిళ పదవ బిడ్డకు జన్మనిచ్చింది. 35 ఏళ్ల జుగ్తీబాయి బైంగా గిరిజన సంఘం నుండి వచ్చింది. జూలై 8వ తేదీ రాత్రి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఆమె తన పదవ బిడ్డకు జన్మనిచ్చింది.

ఆమె మొదటిసారి తల్లి అయినప్పుడు తన వయస్సు 13 సంవత్సరాలు మాత్రమే. డాక్టర్ అర్చన లిల్హరే మాట్లాడుతూ అంతరించిపోతున్న బైంగా గిరిజనులను సంరక్షించాల్సిన అవసరం ఉన్నందున, మేము వాటిని స్టెరిలైట్ చేయలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ వయసు 35 ఏళ్లు అని తెలిపారు. కుటుంబం పథకం ప్రయోజనాన్ని పొందేందుకు మహిళ ప్రభుత్వం నుండి ఏ విధమైన ప్రామాణికమైన పత్రాన్ని కలిగిలేదు. సిజేరియన్ తర్వాత ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.


అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత్‌!

భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో విజయానంతరం ఈ రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో టీ20 ఫార్మాట్‌లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 230 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 150 మ్యాచ్‌ల్లో గెలుపొంది అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా పాకిస్థాన్ ఉంది. పాక్ 245 మ్యాచ్‌ల్లో 142 విజయాలు అందుకుంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ 220 మ్యాచ్‌ల్లో 111 విజయాలు, ఆస్ట్రేలియా 195 మ్యాచ్‌ల్లో 105 విజయాలు, దక్షిణాఫ్రికా 185 మ్యాచ్‌లో 104 విజయాలు సాదించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆదిలాబాద్ లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటన..

రైతుభరోసా పథకం అమలుపై అనేక ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు సాగుతున్న వేళ నేరుగా రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సమక్షంలోనే పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. ఇవ్వాళ ఆదిలాబాద్ లో కేబినెట్ సబ్మి కమిటీ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు జిల్లాలో కమిటీలోని మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు,సీతక్క పర్యటించనున్నారు. ఉట్నూర్ కె.బీ. కాంప్లెక్స్ లో రైతు భరోసా పై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 10.20 గంటలకు ఉట్నూర్ కు మంత్రుల బృందం చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద నుంచి 10.30 గంటలకు మీటింగ్ హాల్ లో వర్క్ షాప్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహిస్తారు. రైతు భరోసా పై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు ఉపసంఘం తీసుకోనున్నారు.


ఢిల్లీలో భారీ వర్షం… ఐదు రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ

దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో మళ్లీ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బీహార్‌తో పాటు, ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాతావరణంలో వేడి, తేమ ఉంది. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వర్షం బీభత్సంగా మారింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ వరదలు, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌లోని నోయిడా, ఘజియాబాద్‌లలో మధ్యాహ్నం మంచి వర్షం కురిసింది. దీంతో సాయంత్రం పూట వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అయితే అర్థరాత్రి తేమశాతం పెరిగింది. మరోవైపు ఉత్తరాఖండ్‌తో పాటు యూపీ, బీహార్‌లో రోజూ రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్రతిరోజూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బీహార్‌లోని డజను జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉంది.


ప్రధాని మోడీ ప్రతిపాదనకు పుతిన్ ఓకే.. భారత్‎లోనే సుఖోయ్ విమానాల భాగాల తయారీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత సైన్యానికి చెందిన అనేక రక్షణ పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందని తెలుస్తోంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలోభారత్‌లో ఇటువంటి భాగాలను ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ప్రకటన చాలా ముఖ్యమైనదిగా ఆర్మీ వర్గాలు వివరించాయి. ఆ పరికరాలను సేవ చేయగలిగేలా చేయడంలో త్రివిధ దళాలకు ఇది సహాయపడుతుందని, దీని కోసం రష్యా లేదా ఉక్రెయిన్ నుండి విడిభాగాల సరఫరా గత రెండేళ్లుగా యుద్ధం కారణంగా నిలిచిపోయింది. కొన్ని పరికరాలు కూడా స్థానికంగా తయారు చేయబడినప్పటికీ, సమస్య కొనసాగుతోంది.

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌… ఈ నెల 18న ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పంది. ఈ నెల 18నుంచి ఆన్ లైన్‌ అక్టోబర్ నెల దర్శన టిక్కెట్ల విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు టీటీడీ అధికారులు. రోజు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్నప్రసాద సముదాయంలో యంత్రాల ఆధునీకీకరణ, ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. అటు తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఉంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 353 మంది భక్తులు కాగా.. 28, 444 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లుగా నమోదు అయింది.

ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై ప్రియుడి దాడి.. తల్లిదండ్రులు మృతి

ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విశిక్షణ రహితంగా తల్వార్ దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రరావు పేట మండలం 16చింతల తండాలో చోటుచేసుకుంది. గిర్నిబాయి కి చెందిన నాగరాజు 16 చింతల తండా దీపిక ప్రేమించుకున్నారు. వీరు మూడు నెలలు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. అయితే.. వీరిద్దరిని అమ్మాయి కుటుంబ సభ్యులే విడదీశారనే అమ్మాయి కుటుంబంపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. అమ్మాయి కుంటుంబంపై దాడి చేయాలని ప్లాన్ వేశాడు. చివరకు ఆ సమయం రానే వచ్చింది. నిన్న అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో మంచంలో బయట నిద్రిస్తున్న కుటుంబం పై తల్వార్ తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా నిందితుడు దాడి చేశాడు. అయితే దీపిక కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారు.