Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

విషాదాంతం అయిన విహారయాత్ర.. నాగ్‌పూర్‌లో చెరువులో మునిగి ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు వ్యక్తులు సరస్సులో మునిగి మృతి చెందారు. ఎనిమిది మంది యువకుల బృందం హింగ్నా ప్రాంతంలో ఉన్న సరస్సు వద్ద విహారయాత్రకు వెళ్లిందని, అయితే వారు మనసు మార్చుకున్నారని, కొంతమంది యువకులు సరస్సులో స్నానానికి వెళ్లారని పోలీసులు తెలిపారు. ఇందులో ఐదుగురు గల్లంతయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ఎనిమిది మంది స్నేహితులు జిల్పి సరస్సు ఒడ్డున నడుచుకుంటూ వెళుతుండగా, వారిలో కొందరు నీటిలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారని ఒక అధికారి తెలిపారు. గుంపులోని ఓ సభ్యుడు ఈత కొట్టేందుకు తల్లడిల్లుతున్నాడని గమనించిన మిగతా వారు అతడిని కాపాడేందుకు ప్రయత్నించగా.. ఐదుగురు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో స్థానిక డైవర్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు. రిషికేశ్ పరేడ్ (21), వైభవ్ వైద్య (20), రాహుల్ మెష్రామ్ (21), నితిన్ కుంబారే (21), శంతను అర్మార్కర్ (22) మృతదేహాలను రాత్రి 10 గంటల సమయంలో నీటిలోంచి బయటకు తీశామని చెప్పారు. అందులో ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు.

మరోసారి ఆస్ట్రేలియా చీటింగ్.. అనూహ్య రీతిలో బెయిర్‌స్టో అవుట్!

లార్డ్స్‌ వేదికగా జరిగిన యాషెస్‌ 2023 రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన విధానం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దాంతో ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ అభిమానులతో పాటుగా క్రికెట్ ఫాన్స్ అందరూ ఆసీస్ తెరుపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అదే పాత ఆస్ట్రేలియా.. ఎప్పుడూ మోసం’, ‘ఆస్ట్రేలియా చీటింగ్ అలవాటే గా’, ఆస్ట్రేలియా పెద్ద చీటర్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

52వ ఓవర్‌ చివరి బంతిని ఆసీస్ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌.. ఇంగ్లండ్ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టోకు లెఫ్ట్‌ సైడ్‌ వేశాడు. క్రీజులో ఉన్న బెయిర్‌స్టో.. ఆ బంతి బౌన్స్ అవుతుందని భావించి ఆడకుండా కిందికి వంగాడు. దీంతో బంతి బెయిర్‌స్టో మీదుగా కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. ఓవర్‌ ముగిసిందని భావించిన బెయిర్‌స్టో.. వెంటనే క్రీజులోంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఆస్ట్రేలియా కీపర్‌ అలెక్స్‌ క్యారీ బంతిని వికెట్లకు విసిరాడు. స్టంప్స్‌ కింద పడగానే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఔట్‌ కోసం అప్పీలు చేశారు. దాంతో బెయిర్‌స్టో ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అయ్యాడు.స

అమరావతిపై దృష్టిపెట్టిన రాహుల్.. రంగంలోకి ప్రియాంక గాంధీ, విశాఖలో..

కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో పెట్టిన సభ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏపీ పై కూడా దృష్టి సారించింది. ఆ దిశలోనే అడుగులు వేస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని గతంలోనే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అదే అంశంతో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కార్మికులకు అండగా ఉండాలనుకుంటోంది. ఇందుకు ఆ పార్టీ కార్యకర్తలకు రాహుల్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఖరారు చేశారు. ఖమ్మం సభలో పాల్గొన్న అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో గన్నవరం నుంచి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలతో కాసేపు సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏపీ రాజకీయాల పైన చర్చించారు. ఏపీ రాజధాని..విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలను రాష్ట్ర నేతలు రాహుల్ కు వివరించారు. ఈ సమయంలో అమరావతి రాజధాని..విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాహుల్ మరోసారి పార్టీ విధానం స్పష్టం చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

విజయవాడ – చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ప్రారంభానికి ముహూర్తం ఖరారు

ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీనిని విజయవాడ-చెన్న నడపాలని కేంద్రం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలకు ఇది మూడో వందేభారత్ రైలు కానుంది. కొంత కాలంగా ఈ రైలుపై కసరత్తు చేస్తున్న అధికారులకు తాజాగా రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించింది. ఈ నెల 7న ప్రారంభ ముహూర్తంగా నిర్ణయించారు. ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా అయిదు వందేభారత్ రైళ్లను వర్చ్యువల్ గా ప్రారంభించనున్న జాబితాలో ఈ రైలును చేర్చారు. రూటు.. ధరలు ఖరారు చేశారు. ఈ నెల 8వ తారీఖు నుంచి రైలు రాకపోకలు నిరంతరాయంగా అందుబాటులోకి రానున్నాయి.

అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ల అజాగ్రత్త.. వన్డేలో 11 ఓవర్లు వేసిన బౌలర్‌!

సాధరణంగా ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో జట్టు 50 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉండగా.. ఒక బౌలర్ గరిష్టంగా 10 ఓవర్లు మాత్రమే వేయాలి. ఒక వన్డే మ్యాచ్‌లో ఓ బౌలర్ 10 ఓవర్లకు మించి వేయరాదు. అయితే ఓ మహిళా బౌలర్ ఏకంగా 11 ఓవర్లు వేసింది. ఈ ఘటన తాజాగా శ్రీలంక, న్యూజిల్యాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో జరిగింది. అంపైర్ల అజాగ్రత్త, కెప్టెన్ గమనించకపోవడంతో ఈ తప్పిదం జరిగింది.

గత శుక్రవారం (జూన్ 30) గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో న్యూజిల్యాండ్ మహిళల జట్టు రెండో ఒన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫియా డివైన్ (138), స్టార్ బ్యాటర్ అమీలియా కెర్ (108) సెంచరీలు చేశారు. శ్రీలంక బౌలర్ ఓషది రణసింగ్ మూడు వికెట్స్ తీయగా.. ఉదేశిక ప్రబోధని
2 వికెట్స్ పడగొట్టింది.

ఆమె మృత్యుంజయురాలు.. రైలు పట్టాలు రైలు మధ్యలో పడినా బ్రతికింది

కొన్ని సందర్భాల్లో కొందరికి అదృష్టం కలిసి వస్తే.. మరికొన్ని సార్లు దురదృష్టం వెంటాడుతుంటుంది. ఇక్కడ ఒక మహిళకు మాత్రం అదృష్టం వరించి ఆమె మృత్యుంజయురాలుగా మారింది. మహిళ ఆకస్మాత్తుగా స్పృహతప్పి రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఇంతలో ఓ గూడ్సు రైలు ఆమె పడిపోయిన ట్రాక్‌పై నుంచి దూసుకెళ్లింది. 30 సెకన్ల పాటు ఆ మహిళ రైల్వే ట్రాక్ మధ్యలో గూడ్స్ రైలు కింద పడి ఉంది. ఆ మహిళ మృత్యువును చాలా అంటే.. చాలా దగ్గరగా చూసింది. ఆమె పై నుంచి రైలు వెళ్లినా.. ఆమె మాత్రం ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది..

ఎన్‌సిపిలో తిరుగుబాటుపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం.. మీటింగ్ అని పిలిచి బీజేపీతో వెళ్తారా?

ఎన్సీపీలో శరద్ పవార్ తిరుగుబాటు తర్వాత ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ ఆహ్వానించిన వళ్లే బీజేపీతో కలిసి వెళ్లారు. ఇంతమంది సెక్యులరిజం సర్టిఫికెట్లు పంచి మాపై ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది నాయకులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నందున కాంగ్రెస్ తన సొంత ఇంటిని చూసుకోవాల్సిన అవసరం ఉందని ఒవైసీ అన్నారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి బీహార్ ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు ఇదే.. ఇద్దరు స్టార్‌ ప్లేయర్‌లపై వేటు!

బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న వైట్ బాల్ టూర్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ఆదివారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో భారత్ వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. బంగ్లా పర్యటనకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరించనుంది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత భారత మహిళల జట్టు మ్యాచ్‌లు ఆడటం ఇదే మొదటిసారి.

బంగ్లాదేశ్‌ పర్యటనకు గాయంతో పేసర్‌ రేణుక సింగ్‌ దూరం అయింది. ఇక వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ను సెలెక్టర్లు పక్కనబెట్టారు. రిచా స్థానంలో అసోం యువ వికెట్ కీపర్ ఉమా ఛెత్రి ఎంపికైంది. వెటరన్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు యువ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు.

ప్రియురాలి కోసం పెళ్లాం ముక్కు కోసిన భర్త.. ఆ తర్వాత జేబులో వేసుకుని పరార్

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఓ యువకుడు తన ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసేశాడు. తర్వాత జేబులో పెట్టుకుని పారిపోయాడు. నిందితుడైన భర్తపై భార్య పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో, పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత వెంటనే అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బన్‌స్తలి గ్రామానికి చెందిన విక్రమ్‌కు మహ్మదాబాద్ గ్రామానికి చెందిన సీమా దేవితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇంతలో గ్రామానికి చెందిన మరో మహిళతో విక్రమ్‌కు సంబంధం మొదలైంది. ఈ విషయం సీమకు తెలియడంతో ఆయన వ్యతిరేకించారు.

సీక్రెట్ ను రివిల్ చేసిన మృణాల్.. షాక్ లో ఫ్యాన్స్..

మృణాల్ ఠాకూర్ ఈ పేరు వినగానే యువతకు పూనకాలు వస్తున్నాయి.. గత ఏడాది రిలీజ్ అయ్యిన బ్లాక్ బాస్టర్ మూవీ సీతారామం..మూవీతో ఈ అందాల భామ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సీతారామం విడుదల తర్వాత మృణాల్ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా అయింది. రీసెంట్ గా `లస్ట్ స్టోరీస్ 2′ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్ లో మృణాల్ చాలా బోల్డ్ గా నటించింది..

పంచి రొమాన్స్ లిప్ లాక్ సీన్స్‌, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. సీతారామంలో ఎంతో పద్ధతిగా, సాఫ్ట్‌గా కనిపించిన మృణాల్‌.. వెబ్ సిరీస్ లో మాత్రం రెచ్చిపోయింది.. ఈ సిరీస్ విడుదలకు ముందు మృణాల్ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూలో పాల్గొంది.. ఆ సందర్భంగా ఆమె తనకు సంబంధించి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ను లీక్ చేసింది. తన ఫస్ట్ లవ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.. టెన్త్ క్లాస్ లోనే ప్రపోజ్ చేశారు. అతను చాలా అందంగా, హ్యాండ్సమ్‌గా ఉండేవాడు. ఆ ఏజ్ లో పెద్దగా మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అతడితో ఆ పని చేశాను. కొద్ది రోజులు అతనితో బాగా ఉంది. కానీ, టెన్త్ తర్వాత పై చదువుల కోసం ముంబై వెళ్లాను. దాంతో అతడితో రిలేషన్ కట్ అయిపోయింది అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది..

రిటైర్మెంట్ ప్రకటించిన కూడా మళ్ళీ టెన్నిస్ ఆడనున్న సానియా..

టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఆమె అంతర్జాతీయ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు సానియా మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీకి రెడీ అయ్యింది. అయితే ప్రధాన వింబుల్డన్ డ్రాలో మాత్రం సానియా మీర్జా పోటీ చేయడం లేదు. లేడీస్ లెజెండ్స్ ఇన్విటేషన్ డబుల్స్‌లో సానియా పోటీపడనుందని తెలుస్తుంది..గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోహన్నా కొంటాతో సానియా భాగస్వామి కానుందని సమాచారం.. 32 ఏళ్ల జోహన్నా కొంటా గ్రేట్ బ్రిటన్ తరఫున ఆడడానికి ముందు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించింది. కానీ 2021 ఎడిషన్ చివరిలో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది..వీరిద్దరూ కూడా ఈ సంవత్సరం వింబుల్డన్‌కు హాజరవుతారని సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పష్టం చేసారు.

ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్ కదలికలు.. దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణను ప్రారంభించారు. ప్రధాని మోదీ నివాసం డ్రోన్ లేని జోన్‌ కిందకు వస్తుంది. అయినప్పటికీ ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్‌ ఎగరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ సంచరించినట్లు తెలియడంతో ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు, ప్రధానమంత్రికి రక్షణగా ఉండే ఉన్నత దళం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు డ్రోన్ వీక్షణ గురించి పోలీసులకు సమాచారం అందించారు.

 

 

Exit mobile version