సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు ఫ్యాన్ పార్టీలోకి భారీగా వస్తున్నారు. తాజాగా, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు చేరారు. ఆయనకు కండువా కప్పిలోకి పార్టీలోకి సీఎం ఆహ్వనించారు. కాగా, ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. అయితే, ప్రస్తుతం సేవా కార్యక్రమాలను అచ్యుతరావు నిర్వహిస్తున్నారు. ఇక, ఆరిలోవ ప్రాంతంలో స్థానికంగా మంచి పట్టున్న నేతగా అచ్యుతరావుకు గుర్తింపు ఉంది. అలాగే, సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విశాఖపట్నంకు చెందిన టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్ర రావుతో పాటు ఆయన సతీమణి సంధ్యా రాణి కూడా జాయిన్ అయ్యారు. వీరికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక, విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్ ఎలక్షన్ ఇంచార్జీగా కూడా రామచంద్ర రావు పని చేసిన అనుభవం ఉంది.
పొత్తుల్లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు..
ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో అప్పుడు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వత అదే నాటకం ప్రారంభించారు అని పేర్కొన్నారు.. ఆ రోజు ఇచ్చిన హామీలు.. ప్రత్యేక హోదాతో సహా తర్వాత ఏమి అయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలు చేశారు? అంటూ అడిగారు. మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు.. కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వ్యక్తిత్వహననం చేశారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు మోసాలను అప్రమత్తంగా ఉండి ప్రజలు తిప్పికొట్టాలి.. చంద్ర బాబు కూటమి మోసపూరిత పాలన ఒక వైపు.. చెప్పిన దాని కంటే ఎక్కువ చేసిన జగన్ విశ్వసనీయత ఉన్న పాలన మరో వైపు ఉందన్నారు. మరో ఐదేళ్లు ఈ స్కీమ్ లు కొనసాగాలంటే జగన్ పాలన రావాలి.. వైసీపీ- కాంగ్రెస్ పార్టీలు ఒక్కటి అంటే ప్రజలు నమ్మరు అని సజ్జల పేర్కొన్నారు.
ఏపీ సీఈఓతో ఎన్డీఏ కూటమి నేతల భేటీ.. డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులపై ఫిర్యాదు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆఫీసర్ ఎంకే మీనాతో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఏపీ సీఈఓను వర్ల రామయ్య, బండ్రెడ్డి రామకృష్ణ, పాతూరి నాగభూషణం నేతృత్వంలోని ఎన్డీఏ బృందం కలిసింది. ఈ మీటింగ్ లో ప్రధాని పాల్గొన్న ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యంపై సీఈఓకు ఎన్డీఏ ఫిర్యాదు చేసింది. డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్డీఏ కంప్లైంట్ చేసినట్లు పేర్కొన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ అధికారిక ప్రకటన..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపింది. వందకోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది.. ఆప్ నేతలకు వంద కోట్లు చెల్లింపులో కవితది కీలకపాత్ర అని ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు 240 చోట్ల సోదాలు చేశాం.. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలో సోదాలు చేపట్టినట్లు ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది. 5 సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్లు దాఖలు చేశామని తెలిపింది. అంతేకాకుండా.. రూ. 128 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు చేశాం.. మనీష్‌సిసోడియా, సంజయ్‌సింగ్, విజయ్‌నాయర్‌లతో కవితకు లింక్‌లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సోమవారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ములాఖత్‌లో భాగంగా వీరిద్దరు కవితను కలవనున్నారు. కాగా.. కవితను ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించింది. అందులోభాగంగా ఈరోజు వీరిద్దరూ కలువనున్నారు.
కేసీఆర్కు పట్టిన గతే మోడీకి పడుతుంది.. తీవ్ర విమర్శలు
ప్రధాని మోడీ జగిత్యాల పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి ఎన్నికల కార్యక్రమంలో దేశ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాల గురించి వివరించాలని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ కి ఏ గతి పట్టిందో.. దేశంలో కూడా మోడీకి అదే గతి పడుతుందని ఆరోపించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అకౌంట్ కూడా ఓపెన్ కాదని విమర్శించారు. కేసీఆర్ గారడీ చేసినట్టే మోడీ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని జీఓ విడుదల చేశారు.. కానీ ఎక్కడా ఏర్పాటు చేస్తారో చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.. షుగర్ ఫ్యాక్టరీ టీడీపీ, బీజేపీ మిత్రపక్షం హయాంలో మూతపడిందని తెలిపారు. మెట్పల్లిలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత కూడా తీసుకుంటానని జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతికి మార్గం సుగమం చేసిందే మోదీనని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని కవిత అరెస్ట్ ను వాయిదా వేశారని మండిపడ్డారు. యావత్ ప్రపంచంలో 100 రోజుల్లో చెప్పిన హామీలు అమలు చేసిన పార్టీ కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని జీవన్ రెడ్డి తెలిపారు.
ఎన్డీఏలో సీట్లు ఖరారు.. బీజేపీ, జేడీయూకు ఎన్నెన్ని సీట్లంటే..!
బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కూటమిలో ఉన్న బీజేపీ, జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఈ మేరకు సీట్ల పంపకాలు ఖరారైనట్లు జేడీయూ వెల్లడించింది. బీహార్‌లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం ఎక్కువగా లభించింది. బీజేపీకి 17, జేడీయూకి 16, చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 5 సీట్లు లభించాయి. ఈ సీట్ల ఖరారులో హోంమంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు. BJP: పోటీ చేసే స్థానాలు ఇవే: పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, ఔరంగాబాద్, మధుబని, అరారియా, దర్భంగా, ముజఫర్‌పూర్, మహారాజ్‌గంజ్, సరన్, ఉజియార్‌పూర్, బెగుసరాయ్, నవాడా, పాట్నా సాహిబ్, పాట్లీపుత్ర, అర్రా, బక్సర్, ససారాం నుంచి బీజేపీ పోటీ చేస్తుంది. JDU: పోటీ చేస్తున్న స్థానాలు ఇవే: వాల్మీకి నగర్, సీతామర్హి, ఝంజర్‌పూర్, సుపోల్, కిషన్‌గజ్, కతియార్, పూర్నియా, మాధేపురా, గోపాల్‌గంజ్, శివన్, భాగల్పూర్, బంకా, ముంగేర్, నలంద, జహనాబాద్, సియోహర్. LJP: పోటీ చేస్తున్న స్థానాలు ఇవే: వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి
పుతిన్‌కు ప్రధాని మోడీ విషెస్
రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా పుతిన్‌కు మోడీ విషెస్ చెప్పారు. రాబోయే రోజుల్లో భారత్-రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. మూడురోజుల పాటు జరిగిన ఎన్నికల్లో పుతిన్ భారీ విజయం సాధించారు. సుమారు 87 శాతం ఓటింగ్ సంపాదించారు. తాజా ఫలితంతో మరో ఆరేళ్ల పాటు రష్యాను పాలించనున్నారు. గత 24 ఏళ్లుగా అధికారంలో చెలామణి అవుతున్నారు. ఈ పదవీకాలం పూర్తయితే రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా పుతిన్ రికార్డు సృష్టించనున్నారు.ఇటీవలే రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మృతిపై ఆయా దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. నావల్నీ హత్యకు గురై ఉంటారని అనుమానించారు. ఇదిలా ఉంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్లుగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భవంతలు నేలమట్టమయ్యాయి. ఇప్పటికే యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికయ్యారు. భవిష్యత్‌లో పరిస్థితి ఇంకెలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే పశ్చిమదేశాలకు అణు హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌కు సహకరిస్తే.. అణు ప్రమాదం తప్పదని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రేమికులారా గెట్ రెడీ.. ప్రేమికుడు మళ్ళీ వస్తున్నాడు!
కేటి కుంజుమోన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ప్రభుదేవా, నటి నగ్మా నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ఈ సినిమాను ఇప్పుడు రమణ, మురళీధర్ నిర్మాతలుగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించగా ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, దర్శకుడు ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవ ని చూసి స్ప్రింగ్ లు ఏమన్న మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథ గా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అన్నారు.
శక్తిమాన్ గా రణవీర్.. ఛీఛీ.. అతను శక్తిమాన్ ఏంటి.. ఒంటిపై బట్టలు లేకుండా..
ఇప్పుడంటే చిన్నపిల్లలు చూడడానికి చాలా వీడియో గేమ్స్, షోస్ వచ్చాయి కానీ, అప్పట్లో చిన్న పిల్లలు చూసిన ఒకే ప్రోగ్రామ్ శక్తిమాన్ . ఈ ప్రోగ్రామ్ కోసం పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎదురుచూసేవారు. చాలామంది చిన్నపిల్లలు తమను కాపాడడానికి శక్తిమాన్ వస్తాడని.. గోడల మీద నుంచి దూకేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతలా శక్తిమాన్ పిల్లల మనస్సులో కొలువుండి పోయింది. ఇక శక్తిమాన్ గా నటించిమెప్పించిన నటుడు ముకేశ్ ఖన్నా. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ముకేశ్.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. తనకు నచ్చని విషయం అయితే నిర్మొహమాటంగా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తాడు. ఇక గత కొన్నిరోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. శక్తిమాన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు కాస్తా ముకేశ్ వద్దకు వెళ్లగా .. ఆయన దీనిపై స్పందించాడు. నేను ఈ వార్తలపై స్పందించకూడదనే అనుకున్నాను. కానీ,నోరు విప్పక తప్పడంలేదు. ఇప్పటికే చాలామంది ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఇంకొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఇప్పటివరకు మౌనం వహించాను. కానీ, ఎప్పుడైతే ఛానల్స్ కూడా రణ్‌వీర్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని ప్రచారం మొదలుపెట్టాయో.. అప్పుడే ఇక నోరు విప్పక తప్పదని నిర్ణయించుకున్నాను. అయినా ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్లు చేసే వ్యక్తి శక్తిమాన్‌గా కనిపిస్తాడా? .. ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి లాభం. శక్తిమాన్ అంటే సూపర్ హీరో కాదు.. సూపర్ టీచర్ అని నొక్కి చెప్తున్నాను.
