NTV Telugu Site icon

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం..
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సి.ఎం. కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీ.ఎస్.పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె.శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని తెలిపారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పరీక్ష వాయిదా పడింది. జెన్ కో రాత పరీక్ష వాయిదా వేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వచ్చింది. ఈ పరీక్ష ఈనెల 17న జరగాల్సి ఉంది.. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు జెన్ కో తెలిపింది. కాగా.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్) మరియు కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 4వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నెల 17వ తేదీన పరీక్ష నిర్వహించాలనుకోగా.. అదే రోజు ప్రభుత్వ పోటీ పరీక్షలున్నందున.. జెన్ కో నిర్వహించే రాత పరీక్షను వాయిదా వేయాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలియజేశారు. దీంతో వారి విన్నపం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ పరీక్షను వాయిదా వేశారు. అయితే.. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు. తదుపరి షెడ్యూల్ ను జెన్ కో వెబ్ సైట్ లో పెడతామని పేర్కొంది.

రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంటలు, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలి.. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది.. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.. ఈ విషయాన్ని రైతులకు చెప్పండి అని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్‌గా ఉండాలి.. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలి.. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను అధికారులు తీసుకుంటారు.. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని సీఎం జగన్ తెలిపారు.

టీడీపీ- జనసేన పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో తేల్చుకోండి..
రాష్ట్రంలో వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు. ఎక్కడ పోటీ చేయాలో.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో.. వాళ్ళకు ఇప్పటికీ స్పష్టత లేదు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మార్పులు చేర్పులు అన్ని అంతర్గత వ్యవహారం.. 2014లో చంద్రబాబు చేసిన తప్పుడు పనులు జనం మర్చిపోయారు అనుకుంటున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నారా లోకేష్ ఇమిటేట్ చేస్తుంటాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లోకేష్ 3 వేల కిలో మీటర్ల పాదయాత్ర ఎక్కడ చేశాడో ఎవరికీ తెలియదు.. నాయకుడిని మార్చితే కింద ఉన్న క్యాడర్ ఇబ్బంది పడటం సహజం.. అందరినీ పిలిచి మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు రేపటికి వాయిదా..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఐఆర్ ఆర్ కుంభకోణం కేసులో అనేక అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో టీడీపీ అధినేతను సీఐడీ నిందితుడిగా చేర్చింది. అయితే దీనిపై తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, చంద్రబాబు పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఇవాళ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని క్విడ్ ప్రోకో జరిగిందని న్యాయస్థానానికి తెలిపారు. భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయని ఏజీ శ్రీరామ్ తెలిపారు. సీఐడీ తరపున వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

సానుకూల అంశాలు ఉన్నాయి కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై ప్రధాని హెచ్చరిక..
ప్రధాని నరేంద్రమోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ డీప్‌ఫేక్ టెక్నాలజీ, ఏఐ ద్వారా వచ్చే ప్రమాదాలను గురించి మంగళవారం హెచ్చరించారు. ఏఐ భారతదేశ టెక్నాలజీని విప్లవాత్మకంగా మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధని అన్నారు. అయితే ముఖ్యంగా ఉగ్రవాదుల చేతికి ఏఐ చిక్కొద్దని హెచ్చరించారు. ఏఐతో అనేక సానుకూలతలు ఉన్నప్పటికీ.. ప్రతికూల ప్రభావాలను కూడా కలిగి ఉందని, ఇది ఆందోళనకలిగించే విషయమన్నారు. 21 శతాబ్ధంలో మానవుడి అభివృద్ధికి ఏఐ సహకరిస్తుందని వెల్లడించారు. అదే సమయంలో దీని వల్ల సమస్యలు కూడా వస్తాయని, ఉదాహరణగా డీప్‌ఫేక్ ప్రపంచానికి సవాలుగా ఉందని తెలిపారు. టెర్రరిస్టుల చేతిలో ఏఐ సాధానాలు ముప్పును పెంచుతాయని, ఉగ్రవాదులు ఏఐ ఆయుధాలు లభిస్తే ప్రపంచ భద్రతపై భారీ ప్రభావం పడుతుదని, దీనిని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేయాలని సూచించారు.

బాలయ్య తో మరోసారి మహేష్.. ?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ సీజన్ 3.. చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయని మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు. అందుకే ప్రతివారం కాకుండా చాలా సెలక్టివ్ గా ఎపిసోడ్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్ లో రెండు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అయ్యాయి. భగవంత్ కేసరి టీమ్ ఒకటి.. యానిమల్ టీమ్ ఒకటి సందడి చేసాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో ఎపిసోడ్ లో గుంటూరు కారం టీమ్ సందడి చేయనుందని టాక్ నడుస్తోంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు మహేష్ బాబు మరోసారి రాబోతున్నాడు. సీజన్ 2 లో మహేష్ బాబు సందడి చేసిన విషయం తెల్సిందే. ఇక రెండోసారి.. బాలయ్యతో మహేష్ సందడి చేయనున్నాడు. ఇక ఈసారి మహేష్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ సీజన్ లో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు త్రివిక్రమ్ వస్తాడనుకున్నారు. కానీ, ఆ ప్లేస్ లో డైరెక్టర్ క్రిష్ వచ్చాడు. ఇక ఈసారి గురూజీ.. మహేష్ తో పాటు రానున్నాడని తెలుస్తోంది.