హరీష్‌రావుకి కౌంటర్.. ఒకే వర్షంతో హైదరాబాద్ మునిగిపోతుంది..!
తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంతరి కార్మూరి నాగేశ్వరరావు.. హరీష్ రావును రండి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి తొంగి చూడండి అని సవాల్ చేశారు.. ప్రతి ఇంట్లోనూ మళ్ళీ జగన్ రావాలి అని ప్రజలు అంటున్నారు.. ఇక్కడ ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, రోడ్లు.. ఇతర అంశాలను ప్రస్తావించిన హరీష్‌రావు.. ఏపీ కార్మికులు ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని.. ఏపీలో వదిలేయాలని సూచించిన నేపథ్యంలో.. ఈ రచ్చ మొదలైంది.. అయితే, హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కార్మూరి కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ రోడ్ల సంగతి వాళ్ళు చూసుకుంటే మంచిది.. అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కార్మూరి.. ఒక వర్షం పడితే హైదరాబాద్ నగరం మునిగిపోతుంది.. ఇంత వరకు ఎందుకు ఏం చేయలేకపోయారు? అని నిలదీశారు.. హైదరాబాద్ లో రోడ్లు బాగుంటే సరిపోతుందా? మేం చేస్తున్నట్లు సంక్షేమ పథకాలను మీరు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.. మీ బొక్కలు, మీ లొసుగులు మీ ప్రతిపక్షాలే చెబుతాయి.. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను నేరుగా ప్రజల దగ్గరకే తీసుకుని వెళ్తున్నాం అని తెలిపారు మంత్రి కార్మూరి.
మండలిలో వైసీపీ మెజారిటీ సభ్యులు అట్టడుగు వర్గాల వారే..!
ఎమ్మెల్సీలుగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ, విపక్షాలపై ఫైర్ అయ్యారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తమ తలరాత వాళ్ళే రాసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు ఉన్నాయన్న ఆయన.. 17 మంది గెలిస్తే వారిలో 10 మంది బీసీ వర్గాలకు చెందినవారే అన్నారు. జూన్ నాటికి మండలిలో వైసీపీ మెజారిటీ సభ్యులు అట్టడుగు వర్గాల వారే ఉంటారని ప్రకటించారు.. అయితే, ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.. చంద్రబాబుకు బీసీలు ఓట్ బ్యాంకు మాత్రమే నన్న ఆయన.. తాను అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ, దళిత వర్గాలకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదన్నారు.. చంద్రబాబు మోసానికి, వెన్నుపోటుకు ట్రేడ్ మార్క్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హరీష్‌రావుకి ఇదే నా ఛాలెంజ్.. దమ్ముంటే ఏపీకి రా..!
తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.. టీఆర్ఎస్‌లో టీ తీసి బీ పెట్టినంత మాత్రాన ఏం కాదు.. అసలు టీఆర్ఎస్ పార్టీనే ప్రాంతీయ ఉన్మాదం మీద పుట్టింది.. ఆంధ్ర రాష్ర్ట ప్రయెజనాలకు విరుద్ధంగా పుట్టిన పార్టీ అంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఆంధ్ర ప్రజలను పూర్తిగా అవమానపరుస్తూ, ప్రయెజనాలు విస్మరిస్తూ ఆవిర్భవించింది అంటూ ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్ పెట్టుబడులు ఎవరివి , ఆంధ్ర ప్రజలవి కావా..? అని నిలదీసిన ఆయన.. జాతీయవాదంలేని TRS ఎలా BRS అయిపోతుంది..? గోదారి జలాల విషయంలో కానీ, ఏపీ ప్రజల గూర్చి ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. మీలాగా కుటుంబం అంతా పాలించడానికి ఏపీ ఏమీ తెలంగాణ కాదు.. కూతురు, కోడుకు, అల్లుడు అంతా పాలించడానికి ఏపీ కుటుంబపాలనకు అంగీకరించదు అని వ్యాఖ్యానించారు. ఆధార్ కార్డ్ చేసుకోండి, ఓటు కార్డ్ చేసుకోండని తెలంగాణవాళ్లు అడుక్కుంటున్నారంటూ మండిపడ్డారు మంత్రి అప్పలరాజు.. టీజీ, ఒడిశా నుంచి ఏపీకి చాలా మంది వస్తున్నారు. ఏపీ గురించి మాట్లాడాలంటే ఇక్కడి వచ్చి చూసి మాట్లాడాలని హితవుపలికారు.. హరీష్‌రావుకు ఇదే నా ఛాలెంజ.. దుమ్మంటే ఏపీకిరా? అంటూ సవాల్ చేశారు.. మా గ్రామాలు రండి.. స్కూల్స్ ఎలా ఉన్నాయో వచ్చి చూడండి… ఇంటి ఇంటికి ఏం చేసామె ప్రతి ఇంటికి వెళ్లి అడగండి చెబుతారు.. మీరెందుకు చెప్పలేఖ పోతున్నారు.? అని ఫైర్ అయ్యారు. ఇక, సీఎం కేసీఆర్ ఎందుకు ఏమీ చెప్పలేకపోతున్నారు.. ఎన్నికల ముందు దళితబందు అంటే నమ్మే పరిస్థితిలేదన్నారు.. దొరల పాలన ఎవరూ నమ్మటంలేదన హాట్ కామెంట్లు చేశారు..
చంద్రబాబు ర్యాలీలో సీఎం జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు..
చంద్రబాబు ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో హంగామా చేశారు తెలుగు తమ్ముళ్లు.. మచిలీపట్నం వెళ్తున్న చంద్రబాబుకి విజయవాడలో భారీ ఎత్తున స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు.. ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి తారక రత్న ఫోటో లను చూపిస్తూ హల్ చల్ చేశారు నందమూరి అభిమానులు.. గతంలో ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన ఫొటోలతో పాటు.. తాజాగా, ఆస్కార్ ఉత్సవంలో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫొటోలను.. కొన్ని సినిమాల స్టిల్స్‌ను.. ఫ్లెక్సీలుగా వేయించి ప్రదర్శించారు.. ఫొటోల ప్రదర్శనకే పరిమితం కాకుండా.. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.. మొత్తంగా చంద్రబాబు టూర్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోల ప్రదర్శన.. సీఎం ఎన్టీఆర్ నినాదాలు చర్చగా మారాయి.
మా గురించి ఎందుకు..? మీ సంగతి చూసుకోండి..
ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఎవరని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వాళ్ల రాష్ట్రం గురించి వాళ్లు చూసుకుంటే మంచిదన్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్లు.. జాగ్రత్తగా మాట్లాడాలన్నారు బొత్స. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఎవరు ఏం మాట్లాడారో తమకు తెలుసన్నారు. ఆంధ్ర వాళ్లు తెలంగాణలో ఉండాలనుకుంటారో? తెలంగాణ వాళ్లు అమెరికాలో ఉండాలని అనుకుంటున్నారో? అందరికీ తెలుసన్నారు బొత్స. రాజకీయం కోసం హరీష్ రావు మాట్లాడతాడు.. ఎవరో ఏదో మాట్లాడితే మేం సమాధానం చెప్పాలా? అని నిలదీశారు.. బాధ్యత గల వ్యక్తులు బాధ్యత తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు..
మళ్లీ అలిగిన బాలినేని… సీఎం జగన్ బుజ్జగింపులు
ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి ప్రొటోకాల్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు అధికారులు. మార్కాపురంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని… అక్కడి నుంచి వెళ్లిపోయారు. నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు ప్రయత్నించినా బాలినేని శాంతించలేదు. సీఎం కార్యక్రమంలో పాల్గొనకుండానే తన అనుచరులతో ఆయన ఒంగోలుకు వెనుదిరిగారు. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు సీఎంఓ అధికారులు. ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా బాలినేనికి తెలిపారు. అయితే మార్కాపురంలో ఈబీసీ నేస్తం సభ ప్రారంభమయ్యేసరికి.. అక్కడ వేదికపై కనిపించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎంవో అధికారుల సూచనతో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు.. ఈబీసీ నేస్తం సభా వేదిక దగ్గరకు ఆయన వెళ్లారు. సభావేదిక పైకి బాలినేనిని పిలిపించి.. ఆయనతో ఈబీసీ నేస్తం డీబీటీ బటన్‌ను నొక్కించారు జగన్. కాగా, హెలిప్యాడ్ వద్ద బాలినేనినికి ఎదురైన ఘటన, ఆయన తిరిగి వెళ్లిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు సీఎంవో అధికారులు. దీంతో సీఎం కల్పించుకుని.. బాలినేనికి ఫోన్ చేసి బుజ్జగించారని, అందుకే ఆయన అలకవీడి మళ్లీ సభకు వచ్చారని సమాచారం. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ బుజ్జగింపు అంశం రాజకీయంగా పలు రకాల చర్చకు దారితీసింది. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి.. జగన్ 2 కేబినెట్‌లో చోటు దక్కలేదు.. ఈ సమయంలోనూ ఆయన అలకబూనడం.. వైసీపీ అధిష్టానం, సీఎం జగన్ ఆయనకు నచ్చజెప్పిన విషయం విదితమే.
ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. అమ్మపై కంప్లైంట్ చేయడానికి 130 కిలోమీటర్లు ప్రయాణం..
సాధారణం అమ్మ కొడితేనో, నాన్న తిడితేనో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లడం చూస్తుంటాం. కొందరు కావాలని కొద్ది సేపటి వరకు తల్లిదండ్రులకు కనిపించకుండా దాక్కుంటారు. ఇలాంటి ఘటనలను మనం నిత్య జీవితంలో చూస్తునే ఉంటాం. ఇదిలా ఉంటే చైనాకు చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు మాత్రం తన తల్లిపై కంప్లైంట్ చేయడాని ఏకంగా 130 కిలోమీటర్ల దూరంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. తన తల్లి గురించి అమ్మమ్మకు ఫిర్యాదు చేయాలనుకున్నాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. జెజియాంగ్ లోని మీజియాంగ్ కౌంటీలో ఉన్న తన అమ్మమ్మ ఇంటిని చేరుకోవడానికి ఆ బాలుడు 24 గంటల పాటు సైకిల్ తొక్కి 130 కిలోమీటర్లు ప్రయాణించాడు. దారి తెలుసుకునేందుకు రహదారిపై ఉన్న పేర్లపై ఆధారపడ్డాడు. అయితే చాలా సందర్భాల్లో సరైన మార్గం కనుక్కోలేక తప్పుడు మార్గంలో వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చీ సరైన మార్గాల్లో వెళ్తూ చివరకు అమ్మమ్మ ఇంటిని చేరుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బ్రెడ్, నీటితో పొట్ట నింపుకుని ముందుకు సాగాడు. అయితే చివరకు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులకు ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పిల్లాడి అద్భుతమైన చర్యను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. చెన్నై 15 సార్లు విజయం సాధించగా, రాజస్థాన్ 11 మ్యాచుల్లో గెలిచింది. టాస్ ఓడి పోయిన రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ మైదానంలోకి అడుగుపెట్టారు. ఆకాశ్ సింగ్ వేసిన తొలి ఓవర్ లో యశస్వి జైస్వాల్ రెండు బౌండరీలు కొట్టాడు. 10 పరుగుకే చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేశాడు. యశస్వి జైస్వాల్ ఔట్ కావడంతో క్రీజులోకి అడుగుపెట్టిన దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడుతున్నాడు. మహేశ్ తీక్షణ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. దూకుడుగా ఆడేందుకు యత్నించే క్రమంలో మహేశ్ తీక్షణ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి పడిక్కల్ ఇచ్చిన క్యాచ్ స్లిప్‌లో జారవిడిచారు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని బట్లర్ సిక్స్ కొట్టాడు.
దేవుడా.. సిమ్రాన్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ?
అందాల నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి, ఇప్పటికీ ఆమె నాజూకైన శరీరంతో కుర్రకారును ఇంకా గిలిగింతలు పెడుతూనే ఉంది. చిరంజీవి నుంచి మెహెష్ బాబు వరకు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఏకైక హీరోయిన్ అంటే సిమ్రాన్ అనే చెప్పాలి. అందాల ఆరబోతకు అయినా, డ్యాన్స్ లకు అయినా, ప్రయోగాలకు అయినా అప్పట్లో సిమ్రాన్ పేరే ముందు వరుసలో ఉండేది. ఇక రీ ఎంట్రీలో మాత్రం ఏమైనా తక్కువా..? అందరిలా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా, అత్తగా కాకుండా విలన్ గా, ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సిమ్రాన్.. దీపక్ భగ్గాను వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. అదీప్ భగ్గా, అదిత్ భగ్గా. సోషల్ మీడియాలో సిమ్రాన్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం తన ఫొటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. ఇక తాజాగా సిమ్రాన్ పెద్ద కొడుకు అదీప్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అచ్చు గుద్దినట్లు పోలికల్లో అమ్మను దింపేశాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి వయస్సు 17. ఇంటర్ చదువుతున్నాడు. అయితే అదీప్ లుక్ మాత్రం హీరోలా ఉండడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. సిమ్రాన్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? అని నోళ్లు నొక్కుకుంటున్నారు. ప్రస్తుతం అదీప్ దృష్టి మొత్తం చదువు మీదనే పెట్టాడట. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగాహీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇక సిమ్రాన్ సైతం తన పిల్లలు ఎలాంటి రంగంలో స్థిరపడాలి అనుకొంటే ఆ రంగంలోనే సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరి వచ్చే మూడేళ్లో ఈ కుర్రాడిని హీరోగా చూడోచ్చేమో అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
సాయి పల్లవి.. సమంత.. ఇప్పుడు తేజ్.. దేనికోసం ఇది
భక్తి.. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లినా ఆయన తోడు ఉంటాడని నమ్ముతారు. ఇక ఒక మనిషి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైతే.. అది చావును చూపించి వెనక్కి తీసుకొస్తే.. ఆ మనిషి దైవాన్ని తప్ప మరేదీ నమ్మడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇదేదో సినిమా కథ కాదు.. తేజ్ లో వచ్చిన కొత్త మార్పు కథ. యాక్సిడెంట్ అయ్యిన దగ్గరనుంచి తేజ్ మీడియాకు చాలా దూరంగా ఉన్నాడు. ఆయనలో అప్పటికన్నా.. ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తుంది. ఒక ముఖంలోనే కాకుండా అలవాట్లలో కూడా మార్పు వచ్చింది. ఈ మధ్య తేజ్ .. చేతికి మాల ధరించి కనిపిస్తున్నాడు. ఎక్కడికి వచ్చినా రుద్రాక్ష మాలతోనే కనిపిస్తున్నాడు. యాక్సిడెంట్ లో తేజ్ గొంతు పోయింది.. దానివలన అతను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. ఇది తెలియని నెటిజన్లు.. మందు కొట్టి వచ్చాడని హేళన చేస్తున్నారని, ఆ భయం ఇంకా ఉందని తేజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ భయం పోవాలనే తేజ్ రుద్రాక్ష మాలను ధరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తేజ్ కన్నా ముందు ఇదే రుద్రాక్ష మాలతో సమంత కనిపించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడిన తరువాత మొట్టమొదటిసారి మీడియాకు కనిపించినప్పుడు సామ్ చేతిలో రుద్రాక్ష మాల కనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, భయాన్ని పారద్రోలడానికి ఆమె రుద్రాక్ష మాలను ధరిస్తుందట. ఇక ఇలాంటి జప మాలనే సాయి పల్లవి వద్ద కూడా చూసాం. ఆమె మొదటి నుంచి ఆ మాలతోనే కనిపిస్తుంది. ఇలా వీరు ముగ్గురు తమ భయాలను జయించడానికి తమకు ధైర్యాన్ని ఇచ్చేమాలను ధరించి కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రుద్రాక్ష మాలను ధరించిన వీరి ముగ్గురు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.