NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. బీఆర్ఎస్‌ వైఖరి స్పష్టం చేసిన తోట
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అధికార పార్టీల మధ్య కాకరేపుతోంది.. బిడ్డింగ్‌లో పాల్గొనే విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పర్యటిస్తోంది అధికారుల బృందం.. బిడ్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తుండగా.. అసలు బిడ్‌లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అంటోంది ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన బీఆర్ఎస్‌ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. క్లారిటీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రైవేటీకరణ త్వరగా చేయాలని చూస్తోందన్న ఆయన.. ఇంకా ఆలస్యం చేస్తే ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్తుంది.. అదానీ కంపెనీలకు వైజాగ్ స్టీల్ వెళ్లేలా ఉందన్నారు.. అయితే, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపడం లేదన్న ఆయన.. అలా వెళ్లకుండా ఉండాలంటే ఏమి చేయవచ్చు అని సాధ్యాసాధ్యలు పరిశీలించడానికి తెలంగాణ అధికారులు అక్కడికి వెళ్లినట్టు వెల్లడించారు.. బిడ్ లో ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొన కూడదని ఎక్కడా లేదన్నారు. బీజేపీతో ఉన్న రాజకీయ వైరుధ్యంతో బీఆర్‌ఎస్‌ బిడ్‌లో పాల్గొంటుందన్న విమర్శలను తిప్పికొట్టారు బీఆర్ఎస్‌ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.

స్టీల్‌ ప్లాంట్‌పై దిక్కు మాలిన రాజకీయాలు.. అసలు ఆ విషయం గమనించరా?
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌గా మారుతోంది.. దీనిపై స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక సీరియస్ అంశంపై స్పందించే తీరా ఇది? అని ప్రశ్నించిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరి కంటే ఎక్కువగా స్పందించింది సీఎం వైఎస్‌ జగనే అన్నారు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటల అర్ధం కూడా ఇదేనన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ ను ఏ విధంగా రక్షించుకోవచ్చు అనే అంశం పై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు.. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని సీఎం కేంద్రాన్ని కోరారు.. స్టీల్ ప్లాంట్ కు ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని తాకట్టు పెట్టి ఆర్ధికంగా ప్లాంట్ ను ఆదుకోవచ్చు అనేది ఒక ప్రతిపాదనగా ఉందన్నారు.. అసలు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలో ఏముందో కూడా చూడకుండా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు..

ఏపీ విభజన కేసు వచ్చే వారానికి వాయిదా..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు… ఈ రోజు కోర్టు సమయం ముగిసిపోవడంతో బెంచ్‌పైకి విచారణకి రాలేదు ఏపీ విభజన కేసు.. కాగా, రాష్ట్ర విభజన పై గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణ వికాస కేంద్ర తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. రాష్ట్ర విభజన కేసు ఈరోజు విచారణకు రాకపోవడంతో కేసు విచారణ అంశాన్ని ప్రస్తావించారు పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. విభజన పిటిషన్లను వచ్చే మంగళవారం విచారణ జాబితా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ , జస్టిస్‌ బీవీ నాగరత్నల ధర్మాసనం..

ఏటీఎంలో నకిలీ నోట్ల కలకలం.. ఫేక్‌ కరెన్సీ డిపాజిట్‌
ఏటీఎంలో డబ్బులు డిపాజిట్‌ చేశారంటే ఆ నోట్లను పరిశీలించిన తర్వాతే ఆ తంతు జరుగుతుంది.. అయినా, కొన్నిసార్లు నకిలీ నోట్లు కలకలం రేపుతుంటాయి.. ఇక, ఈ మధ్య డిపాజిట్‌ మెషన్లు అందుబాటులోకి వచ్చాయి.. వినియోగదారుల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆయా బ్యాంకులు ఈ డిపాజిట్‌ మెషన్లను ఏర్పాటు చేస్తున్నాయి.. అయితే, ఓ డిపాజిట్‌ మెషన్‌లో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.. టెక్కలిలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఏటీఎం కం డిపాజిట్‌ మెషన్‌లో దొంగ నోట్లు డిపాజిట్‌ చేశారు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. గత నెల 29వ తేదీన అర్ధరాత్రి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో 44 వేలు అంటే 88 ఐదు వందల నకిటీ నోట్లను డిపాజిట్ చేశారు.. ఏటీఎంలో డబ్బు నిల్వ చేసేందుకు తెరవడంతో ఈ వ్యవహారం బయటపడింది.. దీనిపై పోలీసులను ఆశ్రయించారు టెక్కలి యాక్సిస్ బ్యాంక్ మేనేజర్.. ఇక, సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

పౌర్ణమి రోజుల్లోనే ఆత్మహత్యలు అధికం.. తాజా అధ్యయనంలో వెల్లడి..
భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని మనస్సుకు కారకుడిగా చెబుతుంటారు. చంద్రుడు మన ఆలోచల్ని ప్రభావితం చేస్తారని చెబుతుంటారు. ఇదిలా పక్కన పెడితే తాజాగా ఓ అధ్యయనంలో మాత్రం పౌర్ణమి సమయంలోనే అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తేలింది. డిస్కవర్ మెంటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఆత్మహత్యల ద్వారా మరణించే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. పౌర్ణమి రోజు ఆత్మహత్యలు పెరుగుతాయని మా అధ్యయనం తేలిందని, ఆ సమయంలో హై రిస్క్ ఉన్న పేషెంట్లను విశ్లేచించడం ద్వారా ఇది తెలుసుకున్నట్లు ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పిహెచ్‌డి అలెగ్జాండర్ నికులెస్కు పేర్కొన్నారు. ఆత్మహత్యలు జరిగిన రోజు, నెలల సమయాలను పరిశోధకులు పరిశీలించారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగినట్లు గుర్తించారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో ఆత్మహత్యలను పరిశీలిస్తే పౌర్ణమి సంభవించే వారంలోనే అధికం ఆత్మహత్యలు జరిగినట్లు తేలింది. ఆందోళన, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రేస్ డిజార్డర్, నొప్పి వంటి ఇతర మానసిక సమస్యలు కోసం ఈ పరిశోధన బృందం బ్లడ్ బయోమార్కర్ పరీక్షలను అభివృద్ధి చేసింది.

ఐఎండీ వార్నింగ్‌.. 126 మండలాల్లో వడగాల్పులు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. ఇక, రేపు కూడా వీటి ప్రభావం కొనసాగనుంది.. ఐఎండీ అంచనాల ప్రకారం.. రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంబేద్కర్ పేర్కొన్నారు.. ఇక, రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు నాలుగు ఉండగా.. అందులో అల్లూరి జిల్లా కూనవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు.. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 126 మండలాల విషయానికి వెళ్తే.. అల్లూరి జిల్లా 9, అనకాపల్లి 14, తూర్పు గోదావరి 16, ఏలూరు 5, గుంటూరు 6, కాకినాడ 12, కోనసీమ 1, కృష్ణా 6, ఎన్టీఆర్ 14, పల్నాడు 1, మన్యం 11, శ్రీకాకుళం 7, విశాఖ 3, విజయనగరం 18, వైయస్సార్ 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, మంగళవారం అనకాపల్లి 5, కాకినాడ 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీసాయి.. అల్లూరి 3, అనకాపల్లి 7,ఏలూరు 4, కాకినాడ 3, కృష్ణా 2, ఎన్టీఆర్, పల్నాడు, విశాఖ, విజయనగరం లో ఒక్కొక్క మండలంలో వడగాల్పులు నమోదైనట్టు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఎలుకను నీటిలో ముంచి చంపిన వ్యక్తి.. 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం..
ఉత్తర్ ప్రదేశ్ బుదౌన్ లో ఓ ‘‘ఎలుక హత్య’’ కేసు చర్చనీయాంశంగా మారింది. ఎలుకకు రాయి కట్టి నీటిలో పడేసిన వ్యక్తిపై యూపీ పోటీసులు 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీటిని బుదౌన్ కోర్టులో మంగళవారం సమర్పించారు. ఎలుకకు సంబంధించి ఫోరెన్సిక్ వివారాలు, వివిధ సోర్సెస్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఛార్జిషీట్ సిద్ధం చేసినట్లు సీఐ అలోక్ మిశ్రా వెల్లడించారు. ఎలుకకు సంబంధించి ఊపిరితిత్తులు, కాలేయం ఇన్ఫెక్షన్ ఉందని, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరి ఆడక చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మనోజ్ కుమార్ అనే వ్యక్తి గతేడాది నవంబర్ 25న ఎలుక పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందింది. కుమార్ ఎలుక తోకకు రాయిని కట్టి కాలువలో విసిరినట్లు జంతు కార్యకర్త వికేంద్ర శర్మ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలుకను కాపాడేందుక తాను కాలువలో దూకానని అయితే అది అప్పటికే చనిపోయినట్లు ఆయన పేర్కొన్నాడు. మంగళవారం సీనియర్ న్యాయవాది రాజీవ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కింద, రూ. 10 నుంచి రూ.2000 వరకు జరిమానా లేదా మూడేళ్లు జైలు శిక్ష, ఐపీసీ 429 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

రైడ్ హ్యాండ్ బ్యాటర్ గా మారిన డేవిడ్ వార్నర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ స్టైల్ ఏంటని అడగ్గానే అందరు టక్కున చెప్పే సమాధానం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అని.. మరి అలాంటి వార్నర్ తొలిసారి తన బ్యాటింగ్ శైలిని మార్చి చరిత్రకెక్కాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో భాగంగా ఇన్సింగ్స్ 8వ ఓవర్ మూడోబంతిని ఎదుర్కొనే క్రమంలో వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైడ్ హ్యాండ్ కు స్విచ్ అయి బ్యాటింగ్ చేశాడు. క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు తన బ్యాటింగ్ శైలిని మార్చడం వీలుకాదు.. ఒక మ్యాచ్ లో బంతి డ్డాకా బ్యాటింగ్ ను స్విచ్ చేయడం చూస్తుంటాం.. కానీ వార్నర్ అలా కూడా చేయలేదు.. మరి వార్నర్ రూల్ ను బ్రేక్ చేసి ఎలా ఆడాడనేగా అందరి డౌట్.. అసలు ఏం జరిగిందంటే.. ఇన్సింగ్స్ 8వ ఓవర్ లో రెండో బంతిని హృతిక్ షోకీన్ నోబాల్ వేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫ్రీహిట్ వచ్చింది. అయితే ఫ్రీహిత్ ఎలా ఆడినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇక్కడే వార్నర్ ఎవరికీ రాని ఆలోచనతో లెఫ్ట్ హ్యాండర్ కాస్త రైట్ హ్యాండర్ గా మారి భారీ షాట్ ఆడాడు. అయితే బంతి పెద్దగా దూరం పోలేదు. కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. ఏదైతేనేం వార్నర్ ఎవరికి రాని ఆలోచనతో చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టెక్‌ దిగ్గజ సంస్థల బంపరాఫర్‌.. రాజీనామా కొట్టు.. ఏడాది జీతం ఫ్రీగా పట్టు..!
గూగుల్‌, అమెజాన్‌ ఇప్పుడు ఉద్యోగులు రాజీనామా చేసే విధంగా ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేయమని ప్రోత్సహించడానికి కంపెనీలు 1-సంవత్సరం జీతాన్ని అందిస్తామని ప్రకటించాయి.. కఠినమైన కార్మిక రక్షణ చట్టాల కారణంగా, ఐరోపా దేశాలలో ఉద్యోగాల కోతలు గూగుల్‌, అమెజాన్‌కు కష్టతరంగా మారాయి.. పెద్ద టెక్ కంపెనీలు ఈ సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అయితే అది సరిపోదు. గూగుల్ మరియు అమెజాన్ ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో చాలా మంది ఉద్యోగులను తొలగించగా, రెండు కంపెనీలు యూరోపియన్ దేశాల్లో మాత్రం ఉద్యోగులను తొలగించడానికి కష్టపడుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ దేశాల్లోని కఠినమైన కార్మిక రక్షణ చట్టాల కారణంగా Google మరియు Amazon ఈ ప్రాంతంలోని వ్యక్తులను తొలగించడం కష్టంగా ఉంది. కొన్ని యూరోపియన్ దేశాల్లో, ఈ టెక్ కంపెనీలు ఈ విషయాన్ని “ఉద్యోగుల ఆసక్తి సమూహాలతో” చర్చించకుండా ప్రజలను వెళ్లనివ్వవు. అందువల్ల, ఈ చర్చలు తొలగింపులను నిరవధికంగా ఆలస్యం అవుతుంది. చట్టం ప్రకారం, కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేయడానికి ముందు చట్టబద్ధంగా ఈ కౌన్సిల్‌లతో సంప్రదించవలసి ఉంటుంది, ఇందులో డేటా సేకరణ, చర్చలు మరియు అప్పీల్ చేసే ఎంపిక యొక్క సంభావ్య సమయం తీసుకునే ప్రక్రియ ఉంటుంది.” ఫ్రాన్స్ మరియు జర్మనీలలో, త్వరలో తొలగింపులను పరిష్కరించడానికి Google ఈ సమూహాల నుండి సహాయం కోరుతోంది. నివేదిక ప్రకారం, ఫ్రాన్స్‌లో, గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయమని మరియు బదులుగా మంచి విభజన ప్యాకేజీలను పొందాలని కోరింది. 5-8 ఏళ్ల అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ మేనేజర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వారికి ఒక సంవత్సరం వేతనంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజీని అమెజాన్ అందజేస్తోందని నివేదిక వెల్లడించింది. కంపెనీ “బయలుదేరే ఉద్యోగులకు సెలవు” కూడా అందజేస్తుంది, తద్వారా వారి షేర్లను వెస్ట్ చేయవచ్చు మరియు బోనస్‌లుగా చెల్లించవచ్చు. జర్మనీలో, అమెజాన్ వారి ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులను తొలగించి, స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశాన్ని అందిస్తోంది.

చరణ్ ఇంట్లో కుక్కలా పుట్టినా బావుండేది.. రైమ్ లక్కీ బేబీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన భార్య ఉపాసనకు పెట్స్ అంటే ప్రాణమని అందరికి తెల్సిందే. చరణ్ కు అయితే మరీ ఇష్టం చిన్నతనం నుంచి కూడా చరణ్ పెట్స్ ను పెంచుతూనే ఉన్నాడు. మగధీర సమయంలో వాడిన కాజల్ అనే గుర్రాన్ని ఎంతో ఇష్టంగా పెంచాడు. ఇక ఆ తర్వాత చరణ్ లైఫ్ లో బ్రాట్ అనే డాగ్ ఉండేది.. ఆ తరువాత వచ్చిందే రైమ్. చాలా రేర్ గా సెలబ్రిటీల కన్నా పెట్స్ పాపులర్ అవుతాయి. అందులో ఈ రైమ్ ముందు వరుస లో ఉంటుంది. రామ్‌చరణ్‌ పెట్‌ డాగ్‌ రైమ్‌ ఇన్‌స్టాలో ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. రైమ్ పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అంది. దాదాపు 50 వేల ఫాలోయర్స్‌ రైమ్‌కు ఉండ‌టం విశేషం. నేషనల్‌ పెట్‌ డే సందర్భంగా రైమ్‌ మీద నెటిజ‌న్స్ స్పెషల్‌ ఫోకస్‌పెట్టారు. రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన ఎప్పుడూ రైమ్‌ మీద ప్రేమ‌ను చూపిస్తూనే ఉంటారు. రైమ్‌ లేకుంటే అడుగుతీసి అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడరు ఈ స్టార్‌ దంపతులు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా వారి వెంట రైమ్‌ ఉండాల్సిందే. హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నా పక్కన రైమ్‌ ఉండాల్సిందే. RRR ప్రమోషన్ల టూర్లలోనూ రైమ్‌ సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ కోసం రామ్ చ‌ర‌ణ్ ఢిల్లీ వెళ్లి అక్క‌డే ఉండి సినిమాను ప్ర‌మోట్ చేశారు. అక్క‌డి నుంచి ఉత్తరాది అంతా సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉండిపోయారు. అక్క‌డి నుంచి తిరిగి వ‌చ్చిన‌ప్పుడు రామ్‌చరణ్‌ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రైమ్‌ ఎదురెళ్లి రామ్ వెల్‌క‌మ్ చెప్పి త‌న‌ ఆనందాన్ని, సంబరాన్ని చూపించింది. రామ్‌ – రైమ్‌ ఇద్దరి మధ్య బాండింగ్‌ అభిమానులకు, ఫాలోవ‌ర్స్‌కు స్ఫెష‌ల్‌గా అనిపించింది. రామ్‌చరణ్‌ ఇంట్లో రైమ్‌గా పుట్టినా చాలు అని చాలా సార్లు అనుకున్నవారూ లేకపోలేదు. అంతటి అదృష్టం రైమ్‌ది. అందుకే నేడు పెట్స్ డే సందర్భంగా ఈ రైమ్ ను అందరు తలుచుకుంటున్నారు. పెట్టి పుట్టావ్ అంటూ పొగిడేస్తున్నారు.