NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చదరంగంలో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డును సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డును సాధించాడు. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు. నారా దేవాన్ష్ ఈ ఘనత సాధించడంతో నారా ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. నారా దేవాన్ష్ ఇటీవల మరో రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. సెవెన్‌ డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక్క నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. అలాగే తొమ్మిది చెస్‌బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగంగా సరైన స్థానాల్లో ఉంచి రికార్డును సాధించాడు. దేవాన్ష్‌ ఈ ఘనత సాధించడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్ లేజర్ షార్ప్‌ ఫోకస్‌లో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానన్నారు. దేవాన్ష్‌ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని.. గ్లోబర్‌ అరేనాలో ఇండియన్ చెస్ ఛాంపియన్స్‌ నుంచి ప్రేరణ పొందాడని చెప్పాడు. ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటలు శిక్షణ పొందినట్లు నారా లోకేష్ చెప్పారు. చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేవాన్ష్‌ ఓ డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె.రాజశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌ను రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారధి అభినందించారు. వేగంగా పావులు కదపడం, వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవాన్ష్ మరిన్ని విజయాలు సాధించాలని, ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగి మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.

 

 

కిమ్స్ ఆస్పత్రిలో శ్రీ తేజ్‌ను పరామర్శించిన కేంద్రమంత్రి..
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈరోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన బండి సంజయ్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, స్థానిక బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆకాంక్షించారు. పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని కోరారు. ఈ విషయం రాజకీయం చేయడం ఆపేయండని అన్నారు. బాబు కోలుకోవాలని ముందు కోరుకోండని తెలిపారు. ఆయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించాలని బండి సంజయ్ కోరారు. అల్లు అర్జున్‌ను, సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు సీఎం స్థాయి వ్యక్తి యత్నించడం అత్యంత బాధాకరమని బండి సంజయ్ కుమార్ మధ్యాహ్నం మాట్లాడారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా సినిమా తరహాలో స్టోరీ అల్లడం విస్మయం కలిగిస్తోందని ఆరోపించారు. పనిగట్టుకుని ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు పవిత్రమైన శాసనసభను వేదికగా మార్చుకోవడం మంచిది కాదని వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తో పాటు సినిమా ఇండస్ట్రీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని బండి సంజయ్ తెలిపారు.

 

అల్లు అర్జున్ ఇంటిపై దాడి..
హైదరాబాద్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ జేఏసీ యత్నించింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వారు. అల్లు అర్జున్ ఇంట్లో పూల కుండీలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా.. ఇంటిపైకి టమాటాలు విసిరారు. దీంతో.. ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు.. అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేసిన విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన విద్యార్థులను అడ్డుకున్నారు. రేవతి చావుకు కారణం అల్లు అర్జున్ అని నినాదాలు చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు బయట కనిపించలేదు.

 

ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా.. పోలీసులు రెడీగా ఉన్నారు
ఈరోజు అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ ముట్టడించిన సంగతి తెలిసిందే.. ఇంటిపై టమాటాలు, రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో.. ఇంట్లో పూల కుండీలు ధ్వంసమయ్యాయి. కాగా.. విషయం తెలుసుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని విద్యార్ధి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే.. దాడి జరిగిన సమయంలో ఇంట్లో అల్లు అర్జు్న్ లేరు. దాడి అనంతరం.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని సెక్యురిటీ నుంచి వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం.. అల్లు అర్జున్ కొడుకు, కూతురును తన వెంట తీసుకొని వెళ్లారు. కాగా.. దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారని.. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారన్నారు. వారిపై కేసు పెట్టారని చెప్పారు. ఇంటి దగ్గరికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే.. పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు.. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకే సమయమనం పాటిస్తున్నాం.. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు అల్లు అరవింద్ చెప్పారు.

 

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. తన మామ ఇంటికి కొడుకు, కూతురు
అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ జేఏసీ యత్నించింది. ఓయూ జేఏసీ అధ్యక్షుడూ బైరు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వారు. అల్లు అర్జున్ ఇంట్లో పూల కుండీలు ధ్వంసమయ్యాయి. అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళన చేసిన విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది ఓయూ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. దాడి అనంతరం అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. దాడి ఎలా జరిగింది..? దాడి వివరాలను సెక్యూరిటీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లారు. మరోవైపు.. అల్లు అర్జున్ నివాసానికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. దాడి ఘటనపై అల్లు అరవింద్ నుంచి ఫిర్యాదుని జూబ్లీహిల్స్ పోలీసులు స్వీకరించారు. దాడి జరిగిన అంశంపై ఇంట్లో ఉన్న వారి వద్ద నుండి వివరాలు సేకరించారు. అయితే.. దాడి జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. ఈ క్రమంలో.. సెక్యూరిటీ సూపర్వైజర్‌ని వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లిపోయారు పోలీసులు.. మరోవైపు దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ బెటాలియన్ పోలీసులతో భద్రత ఉంచారు.

 

సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సంచలన వీడియో విడుదల..
సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ వీడియోను విడుదల చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీవీ ఆనంద్.. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనను వివరించారు. సంధ్య థియేటర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్‌హెచ్‌వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని సీపీ పేర్కొన్నారు. విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత కానీ.. అల్లు అర్జున్ బయటకు రాలేదని సీపీ తెలిపారు. ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. బయట తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అనే విషయాన్ని అల్లు అర్జున్‌కి చెప్పేందుకు వెళ్తుండగా.. మేనేజర్ నేను చెప్తాను అన్నాడని అన్నారు. దయచేసి వెళ్ళండని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారన్నారు. కానీ నేను సినిమా మొత్తం చూసిన తర్వాతే వెళ్తాను అని అల్లు అర్జున్ అన్నారన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయం అల్లు అర్జున్ దృష్టికి తాను తీసుకువెళ్లానన్నారు. ఓ మహిళ చనిపోయింది.. బాబు సీరియస్ ఉన్నాడని అల్లు అర్జున్‌కు చెవిలో చెప్పాను.. నేను సినిమా చూశాకే వెళ్తాను అని అల్లు అర్జున్ తనకు చెప్పాడని అన్నారు. చిక్కడపల్లి సీఐ, రాజు నాయక్ మాట్లాడుతూ.. రేవతిని, చిన్న బాబు తేజను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించానని అన్నారు. ఎస్సై మౌనిక, తాను రేవతికి సీపీఆర్ చేశాం.. కాపాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. కానీ తమ ముందే రేవతి ప్రాణాలు పోయాయని తెలిపారు. తొక్కిసలాటలో తన ప్రాణాలు కూడా పోయేవని సీఐ అన్నారు.
సీపీ వార్నింగ్:
సీపీ సీవీ ఆనంద్ బౌన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాట తీస్తామని అన్నారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీనే భాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. బౌన్సర్లను పెట్టుకున్న వాళ్ళదే పూర్తి బాధ్యత అని సీపీ పేర్కొన్నారు.

 

రాబోయే సమావేశంలో దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వ్యూహరచన..
రాబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో దేశాన్ని భవిష్యత్ కోసం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆదివారం తెలిపారు. 1924 బెలగావి సదస్సు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సీనియర్ మంత్రులతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని నడిపించేందుకు పార్టీ చేపట్టి పోరాట కార్యక్రమాలపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశం డిసెంబర్ 26న మధ్యాహ్నం 03 గంటలకు జరగనుంది. అన్ని రాష్ట్రాల కాంగ్రెనస్ అధ్యక్షులు, సీడబ్ల్యూసీ మెంబర్స్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు, 150 మంది ఎంపీలు సమావేశంలో పాల్గొంటారని డీకే శివకుమార్ చెప్పారు. ‘‘డిసెంబర్ 26-27 తేదీల్లో 1924 బెలగావి సదస్సు శతాబ్ధి ఉత్సవాల సన్నాహాలను పరిశీలించడానికి ఆదివారం ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించారు. సువర్ణ సౌధలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పార్టీ శ్రేణులకు అతీతంగా ఆహ్వానాలు అందిస్తాము. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భద్రతా ఆంక్షల దృష్ట్యా ఈ కార్యక్రమానికి ప్రజలను ఆనుమతించడం లేదు’’ అని ఆయన చెప్పారు. డిసెంబర్ 27న ఖర్గే నేతృత్వంలో మెగా బహిరంగ ర్యాలీ ఉండనుంది.

 

నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీతో చేతులు కలుపుతుందా.. క్లారిటీ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా పార్టీ..
నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), బీజేపీ కలుస్తుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే, ఎన్‌సీ ఈ వాదనల్ని ఆదవారం తోసిపుచ్చింది. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మీడియా కథనాలను నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది జర్నలిస్టులు ఈ వార్తలు ప్రచురిస్తున్నారని, ఈ వార్తలు పచ్చి అబద్ధమని ఎన్‌సీ ముఖ్య అధికార ప్రతినిధి తన్వీర్ సాదిక్ అన్నారు. కేంద్రపాలి ప్రాంతాన్ని రాష్ట్ర హోదాకు మారిస్తే జమ్మూ కాశ్మీర్‌లో అధికారంలో ఉన్న ఎన్‌సీ, బీజేపీ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధమువుతందని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ‘‘ఎవరైనా ఇలాంటి నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేయడం అవమానకరం, బాధ్యతారాహిత్యం… ఈ కట్టుకథ వెనుక ఉన్న వ్యక్తిని నేను సవాలు చేస్తున్నాను. ఒమర్ అబ్దుల్లాని కలిసినట్లు ఆరోపించబడిన బీజేపీ అగ్ర నేత పేరు చెప్పంది లేదా మీ కథనాలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పండి’’ అంటూ తన్వీర్ సాదిక్ ఓ పోస్టులో చెప్పారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని పూర్తిగా ప్రజాప్రయోజనాల కోసం ఒమర్ అబ్దుల్లా కలిశారని చెప్పారు. ఈ కల్పిత కథనాలను తక్షణమే ఉపసంహరించకుంటే, ప్రజల్ని తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని, ఇలాంటి నిజాయితీ లేని జర్నలిజాన్ని సహించేది లేదని ఆయన అన్నారు.

 

‘‘న్యూ హోండా యాక్టివా 125’’.. ఆకర్షించే ధర, అదిరిపోయే ఫీచర్లు..
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్తగా 125 సీసీ హోండా యాక్టివాను తీసుకువచ్చింది. అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్‌తో పాటు మరికొన్ని అత్యాధునిక ఫీచర్లు అందిస్తోంది. రూ. 94,422 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో యాక్టివాను ఇంట్రడ్యూస్ చేశారు. లేటెస్ట్ ‘‘ఉద్గార నిబంధనలకు’’ అనుగుణంగా యాక్టివా ఉండనుంది. 6 కలర్స్‌తో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లతో వస్తోంది. 2025 యాక్టివా 125 అప్‌గ్రేడ్ చేయబడిని 123.92 సీసీ, సింగిలి-సిలిండర్ PGM-Fi (ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్) ఇంజన్‌తో 6.20 kW పవ, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఇడ్లిండ్ స్టాప్ సిస్టమ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమయాల్లో ఎక్కువ సేపు స్టాపుల్లో ఉంటే, ఆటోమేటిక్‌గా ఇంజన్‌ని ఆపేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. యాక్టివా 125 బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త 4.2-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. యూఎస్‌బీ టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. జర్నీలో మొబైల్స్ వంటికి ఛార్జింగ్ చేసుకునేందుకు సహకరిస్తుంది. పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెరల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్ మరియు పెర్ల్ ప్రెషియస్ వైట్ అనే ఆరు కలర్‌లతో వస్తోంది. DLX వేరియంట్ ధర రూ. 94,442 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), అయితే H-స్మార్ట్ ధర రూ. 97,146 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

 

ఇంటర్వెల్‌ బ్లాక్‌ బస్టర్‌.. రామ్‌ చరణ్‌కు జాతీయ అవార్డు పక్కా: సుకుమార్‌ రివ్యూ
ఎస్ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’పై స్టార్ దర్శకుడు సుకుమార్‌ తన రివ్యూ ఇచ్చారు. గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌ హాఫ్‌ అద్భుతం అని, ఇంటర్వెల్‌ బ్లాక్‌ బస్టర్‌ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌కు గూస్ బంప్స్‌ వస్తాయన్నారు. క్లైమాక్స్‌లో చరణ్‌ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నా అని సుక్కు పేర్కొన్నారు. గేమ్‌ ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ అమెరికాలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈవెంట్‌లో పాల్గొన్న లెక్కల మాస్టారు పై వ్యాఖ్యలు చేశారు. ‘ఓవర్సీస్ ఆడియెన్స్ తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. నేనొక్కడినే సినిమాని ఓవర్సీస్ ఆడియెన్స్ ఆదరించి ఉండకపోతే.. నేను ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నేను శంకర్ గారి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు చాలా ఆనందం వేసింది. మెగాస్టార్ చిరంజీవి గారు శంకర్ గారితో ఎందుకు సినిమా చేయలేదు, శంకర్ గారు ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదు? అని అనుకునే వాళ్లం. అయితే శంకర్ గారితో చరణ్ సినిమా అని తెలిసి తెగ ఆనందపడ్డాను. ఈ విషయాన్ని చరణ్ నాకే మొదటగా చేపడనుకుంటున్నా’ అని సుకుమార్‌ చెప్పారు. ‘ఎస్.జే. సూర్య తీసిన ఖుషి సినిమా నాకు చాలా ఇష్టం. రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా చేశాను. ఖుషి సినిమాను రిఫరెన్సుగా పెట్టుకున్నా. అంజలి మా ఊరమ్మాయి. చాలా బాగా నటించారు. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ సాయం చేశాడు కానీ.. దాన్ని నేను వాడుకోలేకపోయాను. సినిమా చేసేటప్పుడు నేను ప్రతి హీరోను ప్రేమిస్తా. ఆ సినిమా చేసేటప్పుడు మా అనుబంధం 1-2 ఏళ్లు ఉంటుంది. కానీ రంగస్థలం అయిపోయాక కూడా చరణ్‌తో మాత్రమే నా అనుబంధం కొనసాగింది. చిరంజీవి గారితో కలిస్ గేమ్ చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ పక్కా. శంకర్‌గారి సినిమాలు జెంటిల్‌మెన్‌, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో.. గేమ్ ఛేంజర్‌ను అంతే ఎంజాయ్ చేశాను. రంగస్థలంలో చరణ్‌ నటనకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను కానీ.. రాలేదు. గేమ్ చేంజర్‌ క్లైమాక్స్‌లో చరణ్‌ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది’ అని సుకుమార్‌ పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్‌ ఛేంజర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments