NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు.. ఫన్‌ బకెట్‌ భార్గవ్‌కు 20 ఏళ్ల శిక్ష
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది.. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు.. అంతేకాదు.. ఈ కేసులో బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. కాగా, టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు ఫన్ బకెట్ భార్గవ్. వీడియోస్ చేసే క్రమంలో 14 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడం.. ఆ బాలికను గర్భవతిని చేశారు ఫన్ బకెట్ భార్గవ్. అయితే, బాలిక ఫిర్యాదుతో భార్గవ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పుడు కోర్టు శిక్ష ఖరారు చేసింది..

సారీ చెప్పి తప్పించుకోలేరు.. తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..
తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సుమోటోగా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యన్నారాయణ విజ్ఞప్తి చేశారు. సారీ చెప్పడం ద్వారా జరిగిన నష్టం నుంచి తప్పించుకోలేరని.. ప్రయశ్చిత దీక్ష సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల్లో ఎవరు చేస్తారు అని ప్రశ్నించారు. తొక్కిసలాట దైవ నిర్ణయం అనే వ్యాఖ్యలు… కుట్ర కోణం ఉంది అనే మంత్రుల మాటలు చూస్తే పాలకవర్గం, ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తోందన్నారు బొత్స. రాజకీయాలు చేయడం ద్వారా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగిన ఘటన నుంచి తప్పించుకోలేరు అన్నారు బొత్స.. ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వల్ల తిరుపతిలో ఆరు ప్రాణాలు పోయాయి… ప్రభుత్వాలు ఎన్ని మారినా.. దురదృష్టకర ఘటనలు గతంలో ఎన్నడు చోటు చేసుకోలేదు.. ఇది చాలా బాధాకరం అన్నారు బొత్స.. తొక్కిసలాట వెనుక కుట్ర కోణం, డబ్బులు ఇచ్చారు అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందన్న ఆయన.. తిరుపతి ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి.. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి కలిగించుకొని విచారణ చేయించాలని సూచించారు.. కూటమి ప్రభుత్వం నియమించిన అధికారులు విధుల్లో ఉన్నప్పుడు కొంత మందికి పార్టీలు, కులం ముద్రలు వేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం కదా..? అని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ట్రాఫిక్ లో కావాలనే ఆపేయడం ఎంత వరకు సమంజసం.. ఇటువంటి చర్యల వల్లే సమస్యలు వస్తాయని హెచ్చరించారు.. ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి సరిపెట్టేశారు.. ఇంగ్లీషోడు థాంక్స్ అని చెప్పినట్టు.. ఒక్క సారీ చెప్పేస్తే సరిపోతుందా? అని మండిపడ్డారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టులో పిల్‌..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైకుంఠద్వారా దర్శనం టోకెన్ల జారీ దగ్గర జరిగిన తొక్కిసలాట తీవ్ర కలకలం రేపుతోంది.. టీటీడీ, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి విపక్షాలు.. అయితే, తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది.. సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తితో 30 రోజుల్లో విచారణ జరపాలని కోరారు పిటిషనర్‌.. ఇక, 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పిల్‌ దాఖలు చేశారు ప్రభాకర్ రెడ్డి.. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.. దీనిపై లంచ్ మోషన్ నిరాకరించిన న్యాయస్థానం.. వెకేషన్‌ బెంచ్‌లో విచారణ చేపడతామని చెప్పింది.. అయితే, ఈ నెల 17వ తేదీన ఈ పిల్‌పై వెకేషన్ బెంచ్ లో విచారణ జరిగే అవకాశం ఉంది..

టీటీడీ పాలకమండలి అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు..
టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను వెల్లడించారు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించామని.. సీఎం ఆదేశాలు మేరకు మృతి చెందిన ఆరుగురు భక్తులకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని వెల్లడించారు.. ఇక, తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తాం.. గాయపడిన భక్తులకు 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం.. రేపటి నుంచి భాదిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన చెక్కులు అందిస్తామని తెలిపారు.. మృతి చెందిన భక్తుల కుటుంబంలో విద్యార్థుల వుంటే వారికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు వారి కుటుంబంలోని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.. జ్యుడిషియల్ ఎంక్వయిరీలో భాద్యులను గుర్తించి వారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు టీటీడీ ఛైర్మన్‌.. మరోవైపు.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు పాలకమండలి సభ్యులు ప్రశాంతి రెడ్డి, సుచిత్ర ఎల్లా.. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజు..

గంజాయిపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
కాకినాడ జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఎంత ఫోకస్ పెట్టిన నిలువరించలేకపోతున్నారు.. సరఫరా చేసేవాళ్లు వ్యక్తులకు ఎత్తుల పై ఎత్తులు వేసి పని పూర్తి చేసుకున్నారు.. ఏజెన్సీ ఏరియా రంపచోడవరం చింతూరు నుంచి కాకినాడ తీసుకుని వస్తున్నారు.. దానిని తెలివిగా వ్యవహరించి రాష్ట్రాలు దాటించేస్తున్నారు.. పది రోజుల కిందట గంజాయి స్మగ్లర్లు ఏకంగా పోలీసులపై కారు ఎక్కించేశారు. దానిని బట్టి గంజాయి స్మగ్లర్లు ఎంత రెచ్చిపోతున్నారో అర్థం అవుతుంది.. దానికి కూడా ఒక కోడ్ ఉపయోగిస్తున్నారు.. ఏజెన్సీ ఏరియా నుంచి కాకినాడ కి తీసుకురావడానికి ఒక రేటు ఫిక్స్ చేస్తున్నారు.. ఇక్కడ వాళ్ళు చెప్పిన మూడో పార్టీకి సరుకు ఇచ్చేస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తారు.. అక్కడ నుంచి హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా జరుగుతుంది.. దానికి మరో రేటు ఉంటుంది.. అసలు నెట్వర్క్ నడిపే వాళ్ళు మాత్రం ఎక్కడ సీన్ లో ఇన్వాల్వ్ కావడం లేదు.. వ్యవహారం మొత్తం ఆన్లైన్లో నడుపుతున్నట్లు పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి లెక్కలు సరి చేయడానికి సిద్ధము అవుతున్నారు గంజాయి సరఫరా చేసే వారికి కాకినాడ గేట్ వే గా మారింది.. నిత్యం జిల్లాలో ఏదో మూల గంజాయి మత్తు పదార్థాలు దొరుకుతూనే ఉన్నాయి.. ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం అన్ని రకాల రవాణా అనువుగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు.. గంజాయి తాగేవాళ్ళు ఎక్కువయ్యారని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు..

కేటీఆర్ పై మరో కేసు నమోదు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా ర్యాలీ చేశారని అభియోగం మోపారు. అయితే నిన్న (గురువారం) ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. బయటికొచ్చిన తర్వాత ర్యాలీతో తెలంగాణ భవన్ కు వచ్చారు. అయితే అనధికారికంగా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ర్యాలీ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు గురువారం ఏసీబీ విచారణ అనంతరం ఏసీబీ ఆఫీసు దగ్గర మాట్లాడుతుండగా డీసీపీ అడ్డుకున్నారు. రోడ్డుపై మాట్లాడొద్దని, పార్టీ ఆఫీసుకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవాలని కేటీఆర్ కు డీసీపీ సూచించారు. ఈ క్రమంలో.. ఇక్కడ మీడియాతో మాట్లాడితే మీకెందుకు భయమని కేటీఆర్ అన్నారు. అనంతరం.. తెలంగాణ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు వస్తా.. కలెక్టర్ల సమావేశంలో సీఎం
సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందని.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లేది కలెక్టర్లేనని అన్నారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అని తెలిపారు. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చాం.. కానీ కొంతమంది ఇంకా ఆఫీసులలో కూర్చునే పనిచేయాలని భావిస్తున్నారని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.. మీ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు.. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు పెట్టుబడి సాయం అందించారు.. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందే.. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలన్నారు. రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నాం.. తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని సీఎం కలెక్టర్లకు చెప్పారు. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని తెలిపారు.

రెండేళ్లలో అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లు అందుబాటులోకి తెస్తాం
రాబోయే రెండు సంవత్సరాల్లో 50 అమృత్ భారత్ రైళ్లను అధునాతన ఫీచర్లతో తయారు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ రైళ్లలో మెరుగుపరిచిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను అశ్విని వైష్ణవ్ పంచుకున్నారు. శుక్రవారం ఐసీఎఫ్‌లో కోచ్‌లను అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. సీట్లు, బెర్త్‌లు, మెరుగైన లైటింగ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌లు, డైనింగ్ కార్లు, మెరుగైన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలే లక్ష్యంగా 50 అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఛార్జీలను త్వరలో రైల్వేబోర్డు ఖరారు చేస్తుందన్నారు. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి వైష్ణవ్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని, ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అమృత్ భారత్ వెర్షన్ 2.0 చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అమృత్ భారత్ వెర్షన్ 1.0ను గత జనవరి 2024లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని, గత ఏడాది అనుభవం ఆధారంగా అమృత్ భారత్ వెర్షన్ 2.0లో అనేక మెరుగులు చోటు చేసుకున్నాయని వైష్ణవ్ తెలిపారు. దాదాపు 12 ప్రధాన మెరుగుదలలు కనిపించాయి.

సావర్కర్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట..
హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పూణేలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, ఈ కేసులో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కోర్టు రూ. 25,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ జోషి కోర్టు ముందు పూజీకత్తుగా నిలిచారు. రాహుల్ గాంధీ తరుపున వాదించిన న్యాయవాది మిలింద్ పవార్ మాట్లాడుతూ.. కోర్టు ముందు హాజరుకాకుండా రాహుల్ గాంధీకి శాశ్వత మినహాయింపు కూడా ఇచ్చిందని చెప్పారు. దీనిపై ఫిబ్రవరి 18న విచారణ వాయిదా పడింది. 2023 మార్చిలో లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రసంగంలో సావర్కర్ రాసిన పుస్తాకాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సావర్కర్ మనువడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

రూ. 6 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలా?.. ఈ మొబైల్ పై ఓ లుక్కేయండి!
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్లను తీసుకొస్తున్నాయి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. ఐటెల్ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ itel ZENO 10 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కేవలం రూ. 5,999 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. పవర్ ఫుల్ బ్యాటరీ కెపాసిటీ, క్రేజీ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. చౌక ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. itel ZENO 10 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 5,999, దీని టాప్ వేరియంట్ రూ. 6,499. ఐటెల్ జెనో 10 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 3GB + 64GB ను రూ. 5,999 ధరకే అందిస్తోంది. 4GB + 64GB వేరియంట్ ధరను రూ. 6,499 గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ రెండు కలర్స్ లో లభిస్తోంది. ఫాంటమ్ క్రిస్టల్ అండ్ ఒపల్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంది.

మీరు ఊహించిన దానికంటే మించే ఈ సినిమా ఉంటుంది
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుక రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా, ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావుకి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాన్న గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఆయన మాదిరిగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించుకుంటూ వస్తున్నాను. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల్లో నేను పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే అప్పట్లో ‘ఆదిత్య 369’లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ ‘డాకు మహారాజ్’ కథ పుట్టింది. ఈరోజు విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది.

అభిమానుల కోసం నేను ఎంత కష్టమైనా పడతానన్నారు!
బాలకృష్ణ డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా జరుగుతున్నప్పుడు వంశీ నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ఒకే ఒక మాట అడిగారు. ఈ సినిమా రిజల్ట్ నాకు సంబంధం లేదు. నేను బాలయ్య బాబు గారితో సినిమా చేయాలి అని మొదలుపెట్టారు, అక్కడి నుంచి ఎప్పుడు గెలిచినా బాలయ్య బాబు గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, సినిమా రిలీజ్ అయిపోయింది. తర్వాత మళ్లీ బాలకృష్ణ గారిని ఒక రోజు కలవాలి మీటింగ్ అని చెప్పారు. నిజానికి అంతకంటే ముందే ఒకరోజు పూరి జగన్నాథ్ కారణంగా ఆయన ఆఫీసులో బాలకృష్ణ గారిని కలిసాను. చాలా కూల్ గా మాట్లాడారు, ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఆరోజే నేను చూశాను. బాలయ్య బాబు గారికి కోపం సీరియస్ గా ఉంటారు అని వినేవాళ్ళం కానీ అన్ స్టాపబుల్ తర్వాత ఆ ఇమేజ్ మారిపోయింది. ఒకరోజు నేను వంశీ కలిసి బాలయ్య బాబు గారిని కలిసాము ఆరోజు నాకు బాబు, బాల లేదా బ్రో అని పిలవమని మూడు ఆప్షన్స్ ఇచ్చారు.

స్పీకర్లు కాలిపోతే కాలిపోనివ్వండి నాకు సంబంధం లేదు
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ డాకు సినిమా కోసం వీరు క్రియేట్ చేసుకున్న వరల్డ్ చాలా గొప్పది. వరల్డ్ అంటే ఇష్యూ చాలా చాలా గొప్పది. వీళ్ళు పడిన కష్టం కూడా చాలా ఎక్కువ. అఖండ సమయంలో బాలయ్య బాబు కష్టం నేను చూశాను. అది అంత ఈజీ కాదు కరోనా టైంలో అంత దుమ్ముతో, అంత విభూది అవన్నీ చల్లుతారు. ఆ టైంలో లైట్గా దగ్గితేనే నీకు కోవిడ్ అని తీసుకువెళ్లి పోయేవారు. ఆ టైంలో ఎంతో దుమ్ముతో ఎంతో కష్టమైన పరిస్థితులలో ఆ సినిమా చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకి ఎంత అయితే కష్టపడ్డారో అంతే కష్టం ఈ సినిమా కూడా పడ్డారు. ఈ సినిమాకి వీరు పడిన కష్టం అంతా ఇంతా కాదు. అనంతపురంలో మాట్లాడాలని మేము పెద్ద పెద్ద స్పీచ్ లు ప్రిపేర్ చేసుకున్నాం. స్పీచ్ అంటే స్పీచ్ అని కాదు ఈ సినిమా కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది. చాలా రోజుల తర్వాత నేను డైరెక్ట,ర్ డిటిఎస్ థియేటర్లో కొట్టుకు చచ్చాము. ఇది అక్కడ ఉండాలి అది ఇక్కడ ఉండాలి అని. డిటిఎస్ ఇంజనీర్ మమ్మల్ని చూసి మీరు గొడవలు ఆపరా అని అడిగారు. అంతలా చిన్నపిల్లల లాగా అవుట్ పుట్ కోసం కొట్టుకుంటూ ఉన్నాము. మీరు చూస్తే గాలిపోయిన ఫుట్బాల్ లాగా మా ముఖాలు తయారయ్యాయి ఎందుకంటే అంత స్ట్రెస్ తీసుకుంటున్నాం. దీని వెనకాల జరిగిన మ్యూజిక్ వర్క్ గానీ ఇతర డిపార్ట్మెంట్స్ వర్క్ గాని చాలా కష్టమని అన్నారు. ఇలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేసినందుకు బాబికి, నాగ వంశీ గారికి థాంక్స్.

థమన్ అంటే అంతేరా.. బాక్సులు బద్దలు అవ్వాల్సిందే!
మామూలుగానే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే ఒక రేంజ్ లో కొడతాడు. దానికి తోడు అది నందమూరి బాలకృష్ణ సినిమా అని తెలిస్తే దాని ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. ఇదే విషయం తాజాగా మరోసారి వెల్లడైంది. అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమా తెరకెక్కింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ కి బాలకృష్ణ హాజరైన తర్వాత సినిమాలోని కొన్ని పాటలు ప్లే చేసి చూపించారు. ఆ సందర్భంలో రేజ్ ఆఫ్ డాకు అనే సాంగ్ ప్లే చేసి ముగిస్తున్న సమయంలో స్పీకర్లు ఒక్కసారిగా కింద పడిపోయాయి. దీంతో వెంటనే నిర్వాహకులు వాటిని సర్దుకోవాల్సి వచ్చింది. దీంతో వెంటనే సుమ కల్పించుకుని బాలకృష్ణ సినిమా అంటే తమన్ బాక్సులు బద్దలు కొడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అది ఇప్పుడు లైవ్ లో ప్రూవ్ అయింది అంటూ చెప్పుకొచ్చింది.

Show comments