NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

యర్రగొండపాలెంలో టెన్షన్‌ టెన్షన్‌.. 144 సెక్షన్‌ విధింపు..
యర్రగొండపాలెంలో నాలుగు రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి యర్రగొండపాలెం లోని ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకుని ఘర్షణకు దిగారు. దీంతో ఓ కానిస్టేబుల్ సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. స్థానిక పోలేరమ్మ ఆలయానికి ముందు ఆర్చి నిర్మాణాన్ని ప్రారంభించటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ బాక్సులు మరో వర్గం వారు ధ్వంసం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. రాళ్ళ దాడులు, ముఖ ద్వార నిర్మాణం ప్రారంభించిన ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ సేతు మాధవన్ పరిశీలించారు. మతఘర్షణలు జరగకుండా జిల్లా నుండి ప్రత్యేక బలగాలను రప్పిస్తున్నారు. విషయం తెలుసుకుని ఇరువర్గాలతో మాట్లాడిన మంత్రి సురేష్ సంయమనం పాటించాలని కోరారు. ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆర్చి నిర్మాణం ప్రారంభించాలని సూచించారు.

నేడు సీబీఐ ముందుకు అవినాష్‌రెడ్డి.. విచారణపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుపెంచింది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ పూర్తి చేయడానికి సిద్ధమైన సీబీఐ అధికారులు.. ఓవైపు విచారణ, మరోవైపు అరెస్ట్‌లు చేస్తోంది.. ఇక, ఈ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలలయానికి రానున్నారు.. ఇక, తెల్లవారుజామున పులివెందుల నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. ఉదయం 5.20 గంటలకు వినాష్ రెడ్డి పులివెందులలోని ఆయన నివాసం నుంచి వాహనంలో హైదరాబాద్‌కు పయనం అయ్యారు.. ఆయన వెంట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఎంపీ వాహనాన్ని అనుసరిస్తూ వైసీపీ నాయకులు భారీగా వాహనాల్లో హైదరాబాద్ బయల్దేరారు..

ట్విటర్‌ లో కేటీఆర్‌ను ప్రశ్నించిన నెటిజన్‌.. స్మూత్‌ గా బదులిచ్చిన మంత్రి
ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారు అడిగే ప్రశ్నలకు రీట్విట్‌ చేస్తూ సమాధానం ఇస్తుంటారు. ప్రతిపక్షాల విసుర్లకు కూడా ఆయన సరైన రీతిలో సమాధానం ఇస్తూ సెటెర్లు వేస్తుంటారు. రాజకీయంగా కూడా సోషల్‌ మీడియా వేదికగా మారింది. అయితే కేటీఆర్‌ తనకు వచ్చిన ప్రతి ట్వీట్‌ కు సమాధానం చెబుతూ వారికి సలహాలు, మరి కొందరికి సూచనలు కూడా ఇస్తుంటారు. సార్‌ మమ్మల్ని ఆదుకోండి అంటూ వచ్చిన ట్వీట్‌కు కూడా స్పందిస్తూ వెంటనే అధికారులను సైతం ఆదేశాలు జారీ చేస్తుంటారు. అయితే నిమిషాల్లో స్పందించే కేటీఆర్‌ కు ప్రేమ నకుల అనే వ్యక్తి చేసిన ట్వీట్‌ నిర్ఘాంత పోయేలా చేసింది. అలా ఎందుకు సాధ్యం కాదు సార్‌ అంటూ ప్రశ్నించిన తీరుపై మంత్రి స్మూత్‌ గా స్పందించారు. ఎందుకు కాదు సాధ్యమవుతుంది. అది ఎక్కడో తెలుసా అంటూ దాని గురించి మళ్లీ ఆ నెటిజన్‌ రీట్విట్‌ చేశారు కేటీఆర్‌. దీంతో నెటిజన్లు అందరూ వావ్‌ కేటీఆర్‌ సార్‌ ఇది నిజమేనా? అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ నెటిజన్‌ ఏం ప్రశ్నిస్తే కేటీఆర్‌ ఏం చెప్పారో తెలుసుకుందాం. మంత్రి కేటీఆర్‌ గారూ మన హైదరాబాద్‌లో టన్నెల్ అక్వేరియం ఎందుకు లేదు? ఏదైనా హైడ్ అద్భుతమైన సరస్సుల క్రింద ఇది సాధ్యం కాదా? అని మంత్రిని ప్రశ్నించాడు. దయచేసి తెలంగాణకు అద్భుతమైన టన్నెల్ అక్వేరియం బహుమతిగా ఇవ్వండి సార్. దయచేసి ఒక్కసారి ఆలోచించండి అంటూ మంత్రి కేటీఆర్‌ కు ట్వీట్ చేశాడు నెటిజన్‌. అతను చేసిన కొన్ని నిమిషాల్లో మంత్రి స్పందించారు. ఎందుకు సాధ్యం కాదు. చేయొచ్చు మన తెలంగాణలో ఇలాంటి ఇప్పుడు మనం కూడా పెడుతున్నాము ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ లో భారతదేశంలోనే అతిపెద్ద అక్వేరియం మరియు ఏవియరీని నిర్మిస్తున్నామంటూ కేటీఆర్‌ బదులు ఇచ్చారు. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి మన మందరం కూడా ఆహ్లాదకరమైన అద్భుతమైన టన్నెల్ అక్వేరియంను అతి త్వరాలో చూడబోతున్నాము. వైట్‌ అండ్‌ సీ అంటూ నెటిజన్‌ కు రీట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో అద్భుతమైన టన్నెల్ అక్వేరియంను చూడబోతున్నామన్నమాట అంటూ నెటిజన్లు థ్యాంక్యూ కేటీఆర్‌ సార్‌. తెలంగాన ప్రజలు అనుకోవడమే ఆలస్యం అంతకుముందే రాష్ట్ర ప్రజలకు గురించి ఆలోచించి ప్రతీదీ ముందే చేసి మా ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అతిక్ అహ్మద్ శరీరంలో మొత్తం 8 బుల్లెట్లు..
గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అతడితో పాటు ఆయన తమ్ముడు అష్రాఫ్ ను ముగ్గురు వ్యక్తులు, జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వీరిని ప్రయాగ్ రాజ్ లో ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి. అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ శరీరంలోకి 13 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మొత్తం 22 సెకన్ల పాటు డజన్ రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు నిందితులు. అతిక్ అహ్మద్ శరీరంలోకి 8 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తేలింది. అతని తల, మెడ, ఛాతీ మరియు నడుములో వరుసగా బుల్లెట్లను కనుగొన్నారు. అష్రాఫ్ మెడ, వీపు, మణికట్టు, కడుపు మరియు నడుము భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి. అష్రఫ్ శరీరంలో 3 బుల్లెట్లు లభించగా, మిగతా రెండు అతని శరీరాన్ని చీల్చుకెళ్లాయి.

వజ్రంలో వజ్రం.. అత్యంత అరుదైన వజ్రం.. సూరత్ కంపెనీకి లభ్యం..
వజ్రం.. ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువుల్లో ఒకటి. ఎన్నో ఏళ్లు భూగర్భంలో అధిక ఒత్తడి, పీడనానికి గురై వజ్రాలు తయారవుతుంటాయి. లాంటి వజ్రాలకు ప్రపంచంలో చాలా మార్కెట్ ఉంది. వజ్రాల రకాలు, దాని క్వాలిటీ, పరిమాణం, రంగు వంటి వాటిపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్ సూరల్ లోని వీడి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి అత్యంత అరుదైన వజ్రం లభించింది. ఈ వజ్రం ప్రత్యేకత ఏంటంటే.. వజ్రంలో మరో వజ్రం ఇమిడి ఉంది. ఇది ఆ వజ్రం లోపల అటూ ఇటూ కదులుతోంది. 0.329 క్యాటర్ల ఈ వజ్రానికి ‘‘ బీటింగ్ హార్ట్’’ అనే పేరు పెట్టారు. వజ్రాల గనుల్లో తవ్వకాల్లో గతేడాది అక్టోబర్ లో ఈ వజ్రం లభించింది. అత్యంత అరుదైన వజ్రం కావడంతో కేంద్రం ఏర్పాటు చేసిన ది జెమ్ అండ్ జ్యమెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రోమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) దీనిపై మరింతగా అధ్యయనం చేసింది. ఆప్టిక్ల, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా విశ్లేషించి 2019లో సైబీరియాలో లభించిన వజ్రం మాదిరిగా బీటింగ్ హార్ట్ రకానికి చెందినదిగా తేల్చారు. ఈ వజ్రంలో వజ్రం దాదాపుగా 80 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు తెలిపారు. దీని విలువ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఒకదానిలో ఒకటి ఇమిడిపోయే మత్రోష్కా అనే చెక్కబొమ్మల్ని రష్యాలో తయారు చేస్తారు, ఇప్పుడు అదే విధంగా మనదేశంలో వజ్రం లభించింది. ఈ వజ్రంలోపల మరో వజ్రం స్పష్టంగా కనిపిస్తోంది. వజ్రాలపై అధ్యయంన చేసే ‘డి బీర్స్ గ్రూప్’ గ్రూప్ కు చెందిన నిపుణురాలు సమంతా సిబ్లీ గత 30 ఏళ్లలో ఇలాంటి వజ్రాన్ని చూడలేదని చెప్పారు. ఈ వజ్రం ఎలా ఏర్పడిందో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

ఆమె శాపం వల్లే గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ చంపబడ్డాడా..?

గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను శనివారం ప్రయాగ్‌రాజ్‌లో వైద్య చికిత్స కోసం తీసుకువెళుతుండగా దుండగులు కాల్చి చంపారు. అయితే ఈ ఘటనను 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనగా పేర్కొంటున్నారు. నవవధువు చేతికి గోరింటాకు కూడా పోకముందే తన భర్తను కడతేర్చిన దుర్మార్గులకు మహిళ శాపం పెట్టింది. పెళ్లయిన తొమ్మిదో రోజు తన కంటిమీద కునుకు లేకుండా చేసిన వాడి పాపం పండుతుందని ఆగ్రహించింది. ఈ మహిళ ఎవరు..ఎవరి శాపం అతిక్ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసింది. మూడు రోజుల్లో అతిక్ కుటుంబంలోని ముగ్గురిని మట్టిలో కలిపేసింది. తొలుత అతిక్ కుమారుడిని పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. రెండు రోజుల తర్వాత అతిక్, అతని సోదరుడు పోలీసుల ముందే కాల్చి చంపబడ్డారు. శనివారం అర్థరాత్రి జరిగిన మారణకాండకు 18 ఏళ్ల క్రితం జరిగిన ఘటనతో ముడిపడి ఉంది. ఒక మహిళ శాపం అతిక్, అతని అనుచరులు అదే విధిని ఎదుర్కొన్నారు. ఆ మహిళ పేరు పూజా పాల్, మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ భార్య. ఈ ఘటన 2004లో జరిగింది. అతిక్ అహ్మద్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రయాగ్‌రాజ్ నుంచి గెలుపొందారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్ పశ్చిమ విధానసభ ఉప ఎన్నిక జరిగింది. 2005లో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అతిక్ తన సోదరుడు అష్రఫ్‌ను రంగంలోకి దించాడు. బీఎస్పీ టికెట్‌పై రాజుపాల్‌ పోటీ చేశారు. అతిక్ కుటుంబం ఓటమి చవిచూడటం అదే తొలిసారి. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే రాజు పాల్‌కి పూజతో వివాహం జరిగింది. ఎమ్మెల్యే అయ్యి పెళ్లి చేసుకున్న రాజు రెట్టింపు ఆనందాన్ని అతిక్ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. రాజు పాల్‌ని చంపే పనిని అతిక్ సోదరుడు అష్రఫ్‌కి అప్పగిస్తాడు.

టీనేజ్ విద్యార్థులతో ఆరుగురు మహిళా టీచర్ల లైంగిక సంబంధం.. అరెస్ట్..
ఆరుగురు మహిళా టీచర్లు విద్యార్థులతో లైంగిక సంబంధాలు నెరపడంతో అమెరికా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెండు రోజలు వ్యవధిలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని డాన్ విల్ కు చెంది ఎలెన్ షెల్(38) 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కన్సాకు చెంది హెథర్ హరే(32) మరో టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు కేసు నమోదు అయింది. ఓక్లహామాకు చెందిన ఎమిలీ హాన్ కాక్(26) కూడా తన విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను కూడా అరెస్ట్ చేవారు. ఇదిలా ఉంటే లింకన్ కౌంటీలో ఓ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ ఎమ్మా డిలానే, అదే స్కూల్ లో చదువుతున్న 15 ఏళ్ల విద్యా్ర్థితో అనైతిక సంబంధాన్ని నడుపుతోంది. అయోవాలోని ఓ హైస్కూల్ లో క్రిస్టెన్ గ్యాంట్ అనే టీచర్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది. వర్జీనియాలోని హైస్కూల్ లోని ఓ మహిళా టీచర్(33) ఓ విద్యార్థితో తప్పుగా ప్రవర్తిస్తుందనే అభియోగాలతో కేసు నమోదు అయింది. పెన్సిల్వేనియాకు చెందిన జావెలిన్ కోచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా టీచర్లంతా 26 నుంచి 40 ఏళ్ల మధ్యవాళ్లే.

ఐపీఎల్‌లో నేడు రెండు బడా జట్ల మధ్య ఫైట్‌
ఐపీఎల్‌ టోర్నీలో నేడు మరో రెండు బడా జట్ల మధ్య పోరు జరగనుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌ ఓటమితో గెలుపు బాట పట్టాలని CSK కసరత్తు చేస్తోంది. మరోవైపు సొంతగడ్డపై మ్యాచ్‌ కావడంతో మరో విజయం నమోదు చేయాలని RCB భావిస్తోంది. ఇవాళ రాత్రి ఏడున్నరకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచాయి. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన RCB తన మునుపటి ఆటలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లి మరియు ఫాఫ్ డు ప్లెసిస్ జట్టుకు శుభారంభం అందించి పవర్‌ప్లేలో 47 పరుగులు చేశారు. హర్షల్ పటేల్‌ను ఐదవ స్థానానికి ప్రమోట్ చేయడం RCBకి పని చేయలేదు, ఎందుకంటే అతను ఆరు పరుగులు మాత్రమే చేయగలడు. షహబాజ్ అహ్మద్ తన ఇన్నింగ్స్‌లో 12 బంతుల్లో 20 పరుగులతో జట్టుకు కొంత ఫినిషింగ్ టచ్ అందించాడు. పవర్‌ప్లేలో క్యాపిటల్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది, ఇది వారిని బ్యాక్‌ఫుట్‌కు నెట్టింది. మనీష్ పాండే హాఫ్ సెంచరీ చేసినా జట్టును దాటలేకపోయాడు.