NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మెట్ల మార్గంలో తిరుమలకు పవన్‌ కల్యాణ్‌.. అక్కడే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టిన విషయం విదితమే.. అయితే, తిరుమలలోనే దీక్ష విరమించేందుకు సిద్ధం అవుతున్నారు పవన్‌ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమల చేరుకోనున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న ఆయన.. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. కాగా, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి రావడంతో.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి విదితమే. 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమించనున్నారు.. 2వ తేదీన తిరుమల కొండపై ఉంటారు పవన్‌ కల్యాణ్.. ఇక, 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చర్చగా మారగా.. దీక్ష విరమించిన తర్వాత నిర్వహించే వారాహి సభ వేదికగా.. గత ప్రభుత్వంపై పవన్ కల్యాణ్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..

అందమైన ఫొటోలతో ఇస్టాన్‌లో వల.. నమ్మితే జేబులు గుల్ల..!
సోషల్‌ మీడియాలో ఏది నిజమో ఏ అబ్దమో తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఏ అందమైన ప్రకటన వెనుక ఏ మోసం దాగి ఉందో..? ఏ అందమైన అమ్మాయి చాటింగ్‌, వీడియో కాల్‌ వెనుక ఏ కుట్ర కోణం దాగి ఉందో కనిపెట్టడమే కష్టంగా మారిపోయింది.. తాజాగా గుంటూరులో మరో మోసం వెలుగు చూసింది.. ఇంటి దగ్గర ఉండే డబ్బులు సంపాదించొచ్చు అని ఆశ పడిన యువత.. ఆ వర్క్‌ ఫ్రమ్‌ హోం విషయం ఏమో గానీ.. జేబులు మాత్రం ఖాళీ చేసుకున్నారు.. గుంటూరులో వెలుగు చేసిన నయా మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇంస్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోమం అంటూ యువకులకు వల వేస్తున్నారు.. మీరు ఇంట్లో కూర్చొనే నెలకు 50,000 వేల వరకు సంపాదించుకోవచ్చు అంటూ ఓ ప్రకటన ఇచ్చారు.. తమను సంప్రదించిన యువకులకు.. అందమైన యువతీతో వీడియో సందేశాలు పంపించారు.. ఇలా యువతను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌లో స్కామ్‌లతో కొత్త ఎత్తులు వేశారు.. అయితే, ఈ టీంలో చేరాలంటే విడతల వారీగా డబ్బు చెల్లించాలని ఒక్కొక్కరి నుంచి రూ.12,000 వసూలు చేశారు.. సోప్‌లు, కూల్‌డ్రింక్స్‌, తదితర కిరణా వస్తువులు, తక్కువ ధరకే ఇస్తామని.. 50 వేల రూపాయల విలువైన సరుకులు పాతిక వేలకు ఇస్తామని, నమ్మించి డబ్బు జమ చేయించుకుంది ఆన్‌లైన్‌ ముఠా.. ఇక, ఆ మొత్తాన్ని జమ చేసిన తర్వాత తమ ఫోన్లకు ఎలాంటి రిప్లే ఇవ్వకపోవడంతో.. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రేపటి నుంచి గాంధీభవన్‌కు మంత్రులు.. బుధవారం దామోదర, శుక్రవారం శ్రీధర్‌బాబు
‘ప్రజాస్వామ్యం- ఇందిరమ్మ రాజ్యం’ నిర్మాణమే ధ్యేయంగా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వారంలో రెండు రోజులు గాంధీభవన్‌లో ఒక్కో మంత్రి కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభిస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమం గత శుక్రవారమే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ రోజే మంత్రివర్గ సమావేశం ఉండడంతో బుధవారానికి వాయిదా పడింది. . ఇక నుంచి ప్రతి బుధ, శుక్రవారాల్లో గాంధీభవన్‌లో తనతో పాటు ఒక మంత్రి అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పారు. రేపు బుధవారం (25న) మంత్రి దామోదర రాజనర్సింహ, 27న శ్రీధర్ బాబు అందుబాటులో ఉంటారు. అక్టోబర్ 4న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 9న పొన్నం ప్రభాకర్, 11న సీతక్క, 16న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, 18న కొండా సురేఖ, 23న పొంగులేటి శ్రీనివాస రెడ్డి, 25న జూపల్లి కృష్ణారావు, 30న తుమ్మల నాగేశ్వరావు భేటీ కానున్నారు. ప్రత్యేక రోజులు, సెలవులు మినహా ప్రతి బుధ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా వచ్చే వారం బుధవారం విరామం ఇచ్చారు. ఆ తర్వాత శుక్ర, బుధవారాల్లో గాంధీభవన్‌లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు కార్యకర్తలకు సమయం కేటాయిస్తారు.

సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం.. పడవలో 30 మృతదేహాలు!
పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌ రాజధాని డాకర్ తీరంలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. డాకర్ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు అన్ని కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని సెనెగల్‌ మిలిటరీ ప్రతినిధి ఇబ్రహీమా సౌ ఒక ప్రకటనలో తెలిపారు. పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కునే దిశగా విచారణను ముమ్మరం చేసినట్ల తెలిపారు. సెనెగల్‌ నౌకాదళానికి ఆదివారం సాయంత్రం ఓ పడవ గురించి సమాచారం అందింది. డాకర్ నుండి 70 కిలోమీటర్ల (38 నాటికల్ మైళ్లు) దూరంలో ఉన్న ప్రాంతానికి పెట్రోలింగ్‌ బోట్‌ను పంపారు. పెట్రోలింగ్‌ బోట్‌ అధికారులు పడవను చెక్ చేయగా.. 30 మంది మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారిని గుర్తించలేకపోయారు. పడవ ఎక్కడి నుంచి వచ్చిందో అనే వివరాలను సెనెగల్‌ మిలిటరీ అధికారులు కనుకునే పనిలో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో సెనెగల్ తీరంలో 89 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. అందులో 37 మంది మరణించారు. ఘర్షణలు, పేదరికం, ఉద్యోగాల కొరత వంటి కారణాలతో.. పశ్చిమ ఆఫ్రికా నుంచి వేలాది మంది వలసదారులు సెనెగల్ ద్వారా విదేశాలకు అక్రమంగా వలస వెళుతున్నారు. చాలామంది స్పెయిన్‌కు చెందిన కానరీ దీవులకు వెళుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 22300 మందికి పైగా వలసదారులు కానరీ దీవులకు వెళ్లారట. వలసదారులు పడవలో వెళుతుండగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

గబ్బర్‌ గర్జించినా.. గుజరాత్‌ గ్రేట్స్‌కు తప్పని ఓటమి!
లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో శిఖర్‌ ధావన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్‌ గ్రేట్స్‌ టీమ్.. దినేశ్‌ కార్తీక్‌ నేతృత్వంలోని సథరన్‌ సూపర్‌ స్టార్స్‌పై ఓడిపోయింది. గబ్బర్‌ హాఫ్ సెంచరీతో గర్జించినా గుజరాత్‌ గ్రేట్స్‌కు ఓటమి తప్పలేదు. 37 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ధావన్.. 48 బంతుల్లో 108.33 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన గబ్బర్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ (53 నాటౌట్‌; 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ద సెంచరీ చేశాడు. మార్టిన్‌ గప్తిల్‌ (22), హమిల్టన్‌ మసకద్జ (20), దినేశ్‌ కార్తీక్‌ (18) పరుగులు చేశారు. గుజరాత్‌ గ్రేట్స్‌ బౌలర్లలో మనన్‌ శర్మ 6 వికెట్లు పడగొట్టాడు.

‘దేవర’ నైజాం 1AM షో థియేటర్ల లిస్ట్ ఇదే..
‘దేవర’ రిలీజ్ కు కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేసారు మేకర్స్. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవరకు ప్రత్యేకే షోలు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు ఏపీ, టీజీ ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో నైజాంలో తెల్లవారుజామున 1: 08 షోస్ ప్రదర్శించేందుకు దేవర నిర్మాతలు ఓ లిస్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని థియేటర్లు కు స్పెషల్ పర్మిషన్స్ ఇస్తూ లిస్ట్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒకసారి ఆ లిస్ట్ గమషనిస్తే RTC క్రాస్ రోడ్: సుదర్శన్ 35MM, దేవి 70 MM, సంధ్య 35 MM, సంధ్య 70 MM కు పర్మిషన్ ఇచ్చారు.  కూకట్‌పల్లి : విశ్వనాథ్, భ్రమరాంబ – మల్లికార్జున, అర్జున్, PVR నెక్సస్ మాల్ (ఫోరమ్), ఎర్రగడ్డ – గోకుల్, మూసాపేట్ – శ్రీరాములు థియేటర్, అత్తాపూర్ – SVC ఈశ్వర్,Rc పురం – SVC సంగీత, మల్కాజిగిరి – శ్రీ సాయిరామ్, దిల్షుక్‌నగర్ – కోనార్క్, ఖర్మన్‌ఘాట్ – SVC శ్రీలక్ష్మి, మాదాపూర్ – BR హైటెక్, గచ్చిబౌలి – AMB సినిమాస్, అమీర్‌పేట్ – AAA సినిమాస్, NTR గార్డెన్స్ – ప్రసాద్ మల్టీప్లెక్స్, నల్లగండ్ల – అపర్ణ సినిమాస్, ఖమ్మం : శ్రీ తిరుమల, వినోద, సాయిరామ్,శ్రీనివాస, KPS (ఆదిత్య). మిర్యాలగూడ – విట్రోస్ సినీప్లెక్స్. మెహబూబ్‌నగర్ – AVD తిరుమల కాంప్లెక్స్. గద్వాల్ – SVC మల్టీప్లెక్స్. మొత్తం 29 థియేటర్లలో బెన్ ఫిట్ షోస్ ప్రదర్శిస్తున్నారు. కానీ హైదరాబాద్ లోని బాలానగర్ విమల్ థియేటర్ లో బెన్ ఫిట్ షో  పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు.

నార్త్ అమెరికాలో ‘దేవర’ సునామి.. ఎన్ని మిలియన్స్ అంటే..?
జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. ఇప్పటికే దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీలా దూసుకెళ్తున్నాయి. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో దేవరా ప్రీమియర్స్ 2మిలియన్ డాలర్ మార్క్ దాటింది. RRR తర్వాత 2M ప్రీమియర్ గ్రాసర్ & డే-1 ప్రీ సేల్స్‌ కలిపి 2.5M మార్క్ దాటేసాడు దేవర. విడుదలకు 3 రోజులు ఉండగానే దేవర ఈ రేంజే బుకింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చెసాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్ పై దేవర తుఫాను పూర్తి స్థాయిలో విరుచుకుపడేందుకు సర్వం సిద్ధమైంది. అయిదు నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ 2M కలెక్షన్స్ రాబట్టిన హీరోగా NTR మరొక రికార్డు క్రియేట్ చేసాడు.  కరెంట్ ట్రెండ్ చూస్తే ప్రీమియర్ డే  $2.5 నుంచి $3 మిలియన్, ఫస్ట్ వీకెండ్ నాటికి $5 మిలియన్ వచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంది అనే టాక్ వస్తే నంబర్స్ నంబర్స్ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది. టాక్ ఎలా ఉన్న సరే దేవర ఒకసారి చూసేయాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఆడియెన్స్, అందుకే నిదర్శనమే  నార్త్ అమెరికా దేవర బుకింగ్స్.