NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు పనుల పరిశీలన, సమీక్ష..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆ వెంటనే పాలనపై ఫోకస్‌ పెట్టారు.. ఓ వైపు సమీక్షలు, మరోవైపు పర్యటనకు సాగిస్తున్నారు.. ఇక, నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన.. తొలి సారి పోలవరం పర్యటనకు వెళ్తున్నారు.. ఈ రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు పూనుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధా న్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మొత్తంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మొదటి పర్యటనను పోలవరంతో ప్రారంభించనున్నారు.  ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించడంతోపాటు, ప్రాజెక్ట్ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి ఉదయం 11.45 గంటలకు చేరుకుంటారు. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 1. 30 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1. 45 గంటలకు ప్రాజెక్ట్ అతిధి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2. 05 గంటల నుండి 3.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు.  సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్ట్ సైట్ నుండి హెలికాప్టర్ లో తిరిగి ఉండవల్లి బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

వేలి రింగ్‌ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సీఐని ఏ2గా చేర్చాలని కోర్టు ఆదేశాలు..
ఓ వ్యక్తి వేలుకి పెట్టుకునే రింగ్‌ మిస్సింగ్‌ వ్యవహారం ఇప్పుడు ఓ సీఐ మెడకు చుట్టుకుంది.. ఈ కేసులో సీఐని ఏ2గా చేర్చాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో 2023 సెప్టెంబర్‌లో జరిగిన చోరీ కేసులో కీలమైన ఆదేశాలు ఇచ్చిన కోర్టు.. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాన్ని ఓ రెస్టారెంట్‌లో పోగొట్టుకున్నాడు టి.జయరామిరెడ్డి అనే వ్యక్తి అయితే.. తన రింగ్‌ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కానీ, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయాకపోగా.. చంద్రబాబు ఫొటో ఉంటే ఎవరైనా కేసు నమోదు చేస్తారా..? అంటూ హేళనగా మాట్లాడారట అప్పటి సీఐ మహేశ్వరరెడ్డి.. దీనిపై బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.. ప్రైవేట్‌ కేసు వేశారు.. దీనిపై తాజాగా తిరుపతి 2వ మున్సిపల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. బాధితుడు కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో అప్పటి ఈస్ట్ సీఐ మహేశ్వరరెడ్డిని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది తిరుపతి 2వ మున్సిఫ్ కోర్టు. దీంతో.. రింగ్‌ మిస్సింగ్‌ కేసులో కొత్త ట్విట్ట్ వచ్చిచేరినట్టు అయ్యింది.

రూ. 2లక్షల రుణమాఫీపై బిగ్ అలర్ట్.. కేవలం వారికి మాత్రమే వర్తింపు..!
ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు రేవంత్ సర్కార్ విధివిధానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు. పాస్‌బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఉద్యోగులకు దీని నుంచి మినహాయించాలని మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో మరోసారి భేటీ కావాలని సర్కార్ చూస్తుంది. రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పించాలని ఇప్పటికే వ్యవసాయాధికారులకు ప్రభుత్వం తెలిపింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరే ఛాన్స్ ఉంది. కాగా, రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. రూ.2 లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంత మందే ఉంటారని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్‌లు లేవు.. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అంటున్నారు. మరోవైపు కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది.. వారందరికీ రేషన్‌ కార్డుల్లేవు.. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది.. రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే ఛాన్స్ అవకాశం ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలా పాస్‌బుక్, రేషన్‌కార్డు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనలతో కేవలం 40 లక్షల మంది వరకు రుణమాఫీ పథకం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం నిధులు అందుతున్నాయి.. రుణమాఫీ కోసం ఈ పథకం విధివిధానాల మీదా చర్చ కొనసాగుతుంది.

బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద్ బోస్పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు..
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 376, 120బి కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో సీవీ ఆనంద్ బోస్ మేనల్లుడి పేరు కూడా ఉంది. ఈ ఎఫ్‌ఐఆర్ హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయింది. సాధారణంగా సంఘటన జరిగిన చోట మాత్రమే పోలీసులకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు.. అయితే జీరో ఎఫ్ఐఆర్ నమోదైతే కేసు నమోదు చేసే పోలీసులు ఎక్కడైనా ఘటనపై దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కాగా, ఫిర్యాదు అందిన ప్రకారం, జూన్ 2023 లో, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఒక కార్యక్రమం పేరుతో ఒడిశా నుంచి ఢిల్లీకి ఒక ప్రముఖ డ్యాన్సర్‌ను తీసుకెళ్లాడు.. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో డ్యాన్సర్ కు బస ఏర్పాటు చేశారు. అక్కడే బెంగాల్ గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత డ్యాన్సర్ ఫిర్యాదుతో రాష్ట్ర సచివాలయం నవన్‌ను ఆశ్రయించింది. నవన్ తర్వాత ఈ విషయంపై ప్రాథమిక విచారణ జరపాలని కోల్‌కతా పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్ ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర సచివాలయానికి విచారణ నివేదికను సమర్పించింది. ఇక, ఇటీవల రాజ్‌ భవన్‌లోని తన ఛాంబర్‌లో మహిళా ఉద్యోగినిపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో గవర్నర్‌ కార్యదర్శితో పాటు రాజ్‌భవన్‌లోని ఇతర ఉద్యోగులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

విమానంలో అలాంటి పని చేసిన మహిళకు రూ.68లక్షల జరిమానా
విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ మహిళకు భారీ జరిమానా విధించింది. 2021వ సంవత్సరంలో ఓ మహిళ విమానంలో తప్పతాగి తోటి ప్రయాణికులపై దాడి చేసినందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 81,950డాలర్ల అంటే రూ. 68 లక్షల 46 వేలకు పైగా జరిమానా విధించింది. అయితే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ జరిమానాను ఆమె చెల్లించలేదు. దీంతో ఆమెపై కేసు పెట్టింది. 2021వ సంవత్సరంలో 34 ఏళ్ల హీథర్ వెల్స్ అనే మహిళ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో అల్లకల్లోలం సృష్టించింది. శాన్ ఆంటోనియో నివాసి అయిన హీథర్ వెల్స్ జూలై 7, 2021న టెక్సాస్ నుండి షార్లెట్‌కి వెళ్లే విమానంలో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ సమయంలో ఆమె విస్కీని ఆర్డర్ చేసింది. అది తాగిన తర్వాత ఆమె తప్పుగా ప్రవర్తించింది. ఆమె విమానంలో ప్రయాణిస్తున్న సమయంతో ఇతర ప్రయాణికులు, సిబ్బందితో గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా వారిపై ఉమ్మి వేసింది. అంతేకాదు విమానం మధ్యలో ఉన్న ప్రధాన గేటును కూడా తెరవడానికి ప్రయత్నించింది. చివరికి, సిబ్బందితో సహా ప్రయాణికులు హీథర్‌ను పట్టుకుని టేప్ సహాయంతో సీటుకు కట్టేశారు. ఆమె చర్యలకు ప్రస్తుతం రూ.68 లక్షలకు పైగా జరిమానా విధించారు. ఇది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విధించిన అత్యధిక జరిమానా.

ఈక్వెడార్‌లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి.. 30మంది గల్లంతు
ఈక్వెడార్‌లోని బానోస్ డి అగువా శాంటాలో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించారు. మరో 30 మంది తప్పిపోయారు. దేశంలోని సెంట్రల్ రీజియన్‌లోని బానోస్ డి అగువా శాంటా నగరంలో విధ్వంసకర కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఆరుగురు మరణించారు. 30 మంది గల్లంతయ్యారని అధికారులు ఆదివారం తెలిపారు. ఈక్వెడార్‌లోని రిస్క్ మేనేజ్‌మెంట్ సెక్రటేరియట్ తన నివేదికలో కొండచరియలు విరిగిపడడాన్ని చాలా తీవ్రతతో వివరించింది. ఈక్వెడార్ పబ్లిక్ వర్క్స్ మంత్రి రాబర్టో లూక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అన్ని కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ క్యూట్ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సోషల్ మీడియాలో సెలెబ్రేటీల గురించి ఏదొక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ఇటీవల కాలంలో చిన్నప్పటి ఫోటోలు, స్కూల్ ఈవెంట్స్ ఫోటోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పైన ఫొటోలో కనిపిస్తున్న క్యూట్ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించింది.. పెళ్లి తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తుంది.. పెళ్లైన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది. గతంలోలా గ్లామరస్ రోల్స్ కాకుండా కథా నేపథ్యమున్న చిత్రాలే ఎక్కువగా చేస్తోందీ బ్యూటీ.. అందులో లేడీ ఓరియేంటెడ్ సినిమాలతో రచ్చ చేస్తుంది.. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ ను కూడా అందుకుంది.. ఎస్ మీరు గెస్ చేసింది కరెక్టే.. ఆమె ఎవరో కాదు అందమైన చందమామ కాజల్ అగర్వాల్.. ఆ ఫోటో కాజల్ చిన్నప్పటి ఫోటోనే.. ఎంత క్యూట్ గా ఉందో కదా.. కాజల్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది వరుసగా మూడు సినిమాల్లో నటించింది.. బాలయ్య భగవంత్ కేసరి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.. రీసెంట్ గా ఏసీపీ సత్యభామగా ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో కమల్ హాసన్-శంకర్ ల క్రేజీ మూవీ ఇండియన్ 2 ఉంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలోనూ కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది..

కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన నితిన్?
ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు కొత్త బిజినెస్ ల్లోకి అడుగు పెడుతున్నారు.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టి సక్సెస్ అవుతున్నారు.. ఎక్కువగా స్టార్ హీరోలు మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు.. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలు అందులో సక్సెస్ అయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో ఆ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది… యంగ్ హీరో నితిన్ మల్టీప్లెక్స్‌ బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. నితిన్ ఏషియన్‌ సంస్థతో కలిసి ఏఎన్‌ఎస్‌ స్‌ అనే మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.. నితిన్ కు ఆల్రెడీ సితార పేరుతో ఒక థియేటర్ కూడా ఉంది.. ప్రస్తుతం ఈ థియేటర్‌ను రేనోవేషన్‌ చేస్తున్నారు. అయితే ఇదే థియేటర్‌ను ఏషియన్‌ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్‌ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.. ఆ మల్టీఫ్లెక్స్ కు ఏసియన్ సితార మల్టీ ఫ్లెక్స్ అనే పేరు పెడుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే నితిన్ క్లారిటి ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నితిన్ తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి..