NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఆరుద్రకు సీఎం చంద్రబాబు హామీ
తనను కలిసిన కాకినాడ జిల్లాకు చెందిన బాధిత మహిళా ఆరుద్రకు అండగా నిలిచారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ. 10 వేల పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించారు.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సాయం అందక, కుమార్తెకు వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆరుద్ర. అంతేకాదు.. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌తో పాటు వైసీపీ నేతల దాడిలో బాధిత మహిళ ఆరుద్ర, ఆమె కుమార్తె గాయపడ్డారు.. మరోవైపు.. ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని కూడా హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.

కూరగాయల ధరలు పైపైకి.. రెండు వారాల్లో 30-60 శాతం పెరుగుదల..
కూరగాయల ధరలు క్రమంగా కొండెక్కుతున్నాయి.. 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 శాతం నుంచి 60 శాతం మేర పెరగడంతో.. సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా.. డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించగా.. కూరగాయలు త్వరగా కుళ్లిపోతుండడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గించగా.. రాష్ట్రంలో కూరగాయల సాగు కూడా తగ్గింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పరిస్థితే ఉంది.. ఇక, తూర్పుగోదావరి జిల్లాలోనూ ‘భారీగా పెరిగాయి కూరగాయల ధరలు.. కూరగాయల ధరలు 2-3 వారాల వ్యవధిలోనే 30-60 శాతం పెరడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కూరగాయల పంటల సాగు కొని లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ధరలు పెరుగుదలకు కారణంగా విశ్లేస్తున్నారు.. ఇక, మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.40-50కి చేరగా.. టమాటా ధర రూ. 60-90గా ఉంది, వంకాయ రూ.40-50 పలుకుతుండగా.. పచ్చి మిర్చి రూ.80-120కి పెరగడంతో.. మార్కెట్‌కు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక, బీన్స్, క్యారట్, బీట్రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ఇలా అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో.. క్రమంగా వంట గదిలో కూరగాయాలు మాయం అవుతున్నాయి.

మూగ యువతిని బెదిరించి 3 నెలలుగా సామూహిక అత్యాచారం..
ఎవడిని నమ్మాలో.. ఎవడు నమ్మించి కాటేస్తాడు తెలియని పరిస్థితులు దాపురించాయి.. చివరకు దివ్యాంగురాలు అనే కనికరం చూడకుండా.. అదే అదునుగా భావించి నెలల తరలబడి అత్యాచారం చేయడమే కాక.. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి ఓ మూగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు ఓ కామాంధుడు.. చివరకు యువతి గర్భం దాల్చడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన ప్రకాశం జిల్లాలలో కలకలం సృష్టిస్తోంది.. చీమకుర్తి మండలం చండ్రపాడులో ఓ దివ్యాంగురాలిపై మూడు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు ముగ్గురు యువకులు.. మాటలు రాని, వినపడని యువతిపై మూడు నెలలుగా అఘాయిత్యం కొనసాగిస్తూ వచ్చారు.. యువతి గర్భిణీ అని తేలటంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు.. అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.. యువతికి ఒంగోలు రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు చంద్రపాడులో ఓ నిరుపేద కుటుంబం నివాసం ఉటుంది.. అయితే, వారి కుమార్తె పుట్టుకతోనే మూగ కావడంతో ఆమెను ఇంటి వద్దే ఉంచి.. వారు పనులకు వెళ్లేవారు.. ఇక, యువతి ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న స్థానికంగా ఉండే ఓ యువకుడు.. ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు.. మాయమాటలు చెప్పి ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు.. అక్కడితో ఆగకుండా తన స్నేహితులిద్దరిని కూడా కొంతకాలంగా వెంట తీసుకెళ్లి.. ఆ బాధితురాలిని బెదిరించి సామూహికల అత్యాచారానికి పాల్పడ్డారని.. యువతి గర్భం దాల్చడంతో.. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫిట్ నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో వరుసగా తనిఖీలు చేస్తున్నారు. అయితే, గత మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నారు. రాజేంద్రనగర్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ లో అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. విద్యార్ధులను రవాణా చేసే స్కూల్ బస్సులపై రవాణా శాఖ సీరియస్ గా వ్యవహరిస్తుంది. పాఠశాల యజమానులకు ఆర్టీఏ చమటలు పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఏ పాఠశాల బస్సు తిరిగినా తక్షణమే సీజ్ చేస్తున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 150 బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే, నూతన విద్యా సంవత్సరం ఈనెల 12నుంచి ప్రారంభం అయింది. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. స్టూడెంట్స్ ను తరలించేందుకు స్కూల్‌ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వీటికి తప్పకుండా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉండాల్సిందే అని ఇప్పటికే ఆర్టీఏ అధికారులు చెప్పుకొచ్చారు. వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పిల్లలను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంది. ఇందుకోసం రవాణా శాఖ అధికా రులు వాహనాల సామర్థ్య పరీక్షల గడువు మే 15వ తేదీ వరకు ఇచ్చారు. ఒక వైపు విద్యాసంస్థలు ప్రారంభమైనా ఇంకా ఉమ్మడి జిల్లాలో 25 శాతానికి పైగా బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉందని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు కాంగ్రెస్ ప్లాన్
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పనితీరు సంతృప్తికరంగా ఉందని భావించిన కాంగ్రెస్, భవిష్యత్తు వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది.. ఇందుకోసం పార్టీలో మార్పుకు శ్రీకారం చుట్టి.. మొదటగా అరడజను మందికి పైగా రాష్ట్ర అధ్యక్షులను, మరికొందరు ఇన్ చార్జి ప్రధాన కార్యదర్శులను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ఫలితాలను మెరుగ్గా పరిగణించింది. అందుకే ఇక్కడి రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతానికి వారి పదవుల్లో కొనసాగుతారు. అయితే పంజాబ్ రాజకీయాల్లో చురుగ్గా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన రాజస్థాన్ ఇన్‌చార్జి సుఖ్‌జిందర్ రంధావా ఈసారి ఎంపీ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. అందుకే ఆయన్ను భర్తీ చేయనున్నారు. ఢిల్లీ, హర్యానా ఇన్‌ఛార్జ్ దీపక్ బవారియా – ఒరిస్సా , తమిళనాడు ఇన్‌ఛార్జ్ అజోయ్ కుమార్ నుండి ఒక్కొక్క రాష్ట్రం వెనక్కి తీసుకుంటారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో అరవిందర్ సింగ్ లవ్లీ బీజేపీలో చేరడంతో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన దేవేంద్ర యాదవ్ ప్రస్తుతం ఈ పదవిపై దృష్టి సారించడంతో పంజాబ్ ఇంచార్జ్ పదవిని మరొకరికి ఇవ్వనున్నారు. హిమాచల్‌ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌, ఛత్తీస్‌గఢ్‌ అధ్యక్షుడు దీపక్‌ బైజ్‌, బీహార్‌ అధ్యక్షుడు అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌, జార్ఖండ్‌ అధ్యక్షుడు రాజేష్‌ ఠాకూర్‌, ఉత్తరాఖండ్‌ అధ్యక్షుడు కరణ్‌ సింగ్‌ మహారా, ఎంపీ అధ్యక్షుడు జితు పట్వారీతో ఓడిపోయిన బెంగాల్‌ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌదరి భర్తీ చేయాలి కత్తి వేలాడుతోంది.

నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశాంత్ కిషోర్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారంలో కొనసాగేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. జన్ సూరజ్ ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన సభలో కిషోర్ ప్రసంగిస్తూ, “ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇక పై ఏది చేయాలనుకున్నా నితీష్ కుమార్ ఆదేశించాలని కొన్ని రోజుల క్రితం దేశం చూసింది. నితీష్ కుమార్ వద్దనుకుంటే దేశంలో ప్రభుత్వం ఏర్పడదు. నితీష్ కుమార్ చేతిలో చాలా అధికారం ఉంది. దానికి ప్రతిగా నితీష్ కుమార్ ఏమి అడిగారు? బీహార్ పిల్లలకు ఉపాధి కల్పించాలని అడగలేదు. బీహార్ జిల్లాల్లో చక్కెర కర్మాగారాలు పనిచేయాలని డిమాండ్ చేయలేదు. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. 2025 తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా ఉండాలని, దీనికి బీజేపీ కూడా మద్దతివ్వాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. బీహార్ ప్రజలందరి గౌరవాన్ని అమ్మేశాడు’ అని మండిపడ్డారు. నితీష్‌పై తన దాడిని కొనసాగిస్తూ, “13 కోట్ల మంది ప్రజల నాయకుడు, మనకు గర్వకారణం, అతను మొత్తం దేశం ముందు నమస్కరిస్తున్నాడు, జన్ సూరజ్ కిషోర్ ముఖ్యమంత్రిగా ఉండటానికి నితీష్ పాదాలను తాకుతున్నాడు” అని అన్నారు. ప్రచారం ప్రారంభించే ముందు నితీష్ పార్టీ జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు, గత వారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో మోడీని ఎన్డీయే నాయకుడిగా ప్రకటించిన తర్వాత నితీష్ ప్రవర్తనకు సంబంధించి సోషల్ మీడియాలోవీడియో క్లిప్ వైరల్ అయింది.

వామ్మో.. ఈ ఫైనాఫిల్ ఒకదాని ధర ఎన్ని వేలో తెలుసా?
సాదారణంగా ఫైనాఫిల్ ఒక దాని ధర మహా అయితే ఎంత ఉంటుంది.. వందో లేదా రెండు వందలు ఉండొచ్చు.. కానీ వేలు ఉండటం ఎప్పుడైనా విని ఉండరు.. కానీ పైన కనిపిస్తున్న ఫైనాఫీల్ ధర వేలల్లో ఉంటుందట.. అంత ఆ పండులో ఉండే ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అమెరికాలోని ఒక ప్రత్యేక ఉత్పత్తుల దుకాణం పరిమిత ఎడిషన్ ఈ ఫైనాఫిల్ ను అమ్ముతుంది.. ఎరుపు రంగులో ఉండే పై ​​తొక్క కారణంగా దీనికి రూబిగ్లో అని పేరు పెట్టారు.. ఈ పండు ఒకదాని ధర $395.99 మన కరెన్సీ లో రూ. 33073 వసూలు చేస్తున్నారు. ఈ పైనాపిల్‌ను సామాన్యులకు కాకుండా ప్రీమియం పండ్లను కొనుగోలు చేసే వారికి మాత్రమే అందిస్తున్నారు.. ఈ కాయలో ఉన్న ప్రత్యేకతలను కూడా ఒకసారి చూద్దాం.. ఈ పండు చూడటానికి ఎరుపు రంగులో ఉంటుంది.. ఇది ఎర్రటి తొక్క, గుజ్జు మామిడికాయలా పసుపు రంగులో ఉంటాయి. అమెరికాలోని ప్రముఖ ఆహార నిపుణుడిగా పరిగణించబడుతున్న డెల్ మోంటే ఈ పండును అభివృద్ధి చేయడానికి దాదాపు 15 పరిశోధనలు జరిపినట్లు తెలుస్తుంది..ఈ పండు చాలా ఖరీదైనది కావడంతో ధనవంతులు మాత్రమే దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ రకం పండ్లు ఈసారి 5 వేలు, వచ్చే ఏడాది 3 వేల పైనాపిళ్లు అమ్ముడవుతాయని అంచనా.. ఈ పండు ధర తో పాటుగా రుచితో పాటుగా పోషకాలు కూడా బాగా ఉండటంతో ఎక్కువగా దీన్ని కొనుగోలు చేస్తున్నారు..

నేడు కెనడాతో భారత్‌ ఢీ.. కళ్లన్నీ అతడిపైనే!
టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా నేడు కెనడాను భారత్‌ ఢీకొట్టనుంది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. భారీ విజయంతో ఘనంగా గ్రూప్‌ దశను ముగించి.. సూపర్‌-8కు మరింత జోష్‌తో వెళ్లాలని టీమిండియా చూస్తోంది. కీలకమైన సూపర్‌ 8కు ముందు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించాలి భారత్ భావిస్తోంది. మరోవైపు పటిష్ట రోహిత్ సేనకు కనీస పోటీని ఇవ్వాలని కెనడా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్‌.. హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ఐర్లాండ్‌ను చిత్తుచేసిన టీమిండియా.. పాకిస్థాన్, అమెరికాతో మ్యాచ్‌ల్లో శ్రమించాల్సి వచ్చింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్‌ దూబే ఆకట్టుకున్నారు. అయితే ఆందోళనంతా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పైనే. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తున్న విరాట్‌.. వరుసగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్‌ 2024లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ.. ప్రపంచకప్‌లో మాత్రం తేలిపోతున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో 5 పరుగులే చేశాడు. కెనడాతో మ్యాచ్‌లో అయినా అతడు పుంజుకోవాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ప్రస్తుతం అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి.

తీవ్ర మెడ నొప్పితో రవితేజ షూటింగ్.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్..
మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీనితో రవితేజ తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్”..స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ధమాకా, ఈగల్ సినిమాల తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో  రవితేజ మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ లో రవితేజ పాల్గొంటున్నారు. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారిందిహరీష్ శంకర్.. తాజాగా రవితేజ ఫోటోను షేర్ చేశారు. అందులో రవితేజ మెడకు బ్యాండ్ తగిలించుకుని కనిపించారు.. “మాస్ మహారాజా రవితేజ డెడికేషన్ కు హ్యాట్సాఫ్. తీవ్రమైన మెడ నొప్పి ఉన్నాకూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. థ్యాంక్యూ అన్నయ్య.. రోజూ మాకు స్ఫూర్తిని ఇస్తున్నారు” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసారు.అయితే ఈ పోస్ట్ చూసిన రవితేజ ఫ్యాన్స్ టేక్ కేర్ అన్న అని పోస్ట్లుపెడుతున్నారు.

అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన మెగా హీరో.. నిహారిక సమాధానం ఇదే!
దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలామంది కొత్త నటులతో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమిటీ కుర్రోళ్లు చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో టీజర్‌ని విడుదల చేసింది. ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు నిహారిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ గురించి స్పందించారు. ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్‌ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం అల్లు అర్జున్‌ను మెగా హీరో సాయి తేజ్‌ సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో చేశారు. దాంతో సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అల్లు అర్జున్‌ భార్య స్నేహను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్‌ను మాత్రమే తేజ్‌ ఫాలో అవుతున్నారు. సాయి తేజ్‌ తప్ప మిగతా మెగా హీరోలందరూ బన్నీని ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు. ఈ వివాదం గురించి నిహారిక కొణిదెల తాజాగా స్పందించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఈ విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా.. అల్లు అర్జున్‌, సాయి తేజ్‌ విషయం గురించి తనకు ఇంకా తెలియదన్నారు. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూ… ‘ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తీశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. వంశీ కథ చెప్పే సమయంలో పదకొండు మంది జీవితాల్ని చూసినట్టుగా అనిపించింది. ఎమోషన్స్‌ అందరికీ కనెక్ట్‌ అవుతాయి’ అని అన్నారు.