NTV Telugu Site icon

Top Headlines @ 5PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చేస్తే తాటతీస్తాం

ఏపీలో ఏ విద్యాసంస్థలోనూ ర్యాగింగ్ కి పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యా సంస్థలో ర్యాగింగ్‌ నిషిద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది ఉన్నా అధ్యాపకులకు తెలపాలని సూచించారు.స్కూల్‌ నుంచి ఉన్నత విద్య వరకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించాలి. విద్యాసంస్థలతో పాటు తల్లిదండ్రులు కూడా ర్యాగింగ్ గురించి వివరించాలి. భరించలేని విధంగా ఇబ్బందిపెడుతుంటే మాత్రం ఉపేక్షించకూడదు. విద్యార్ధుల ప్రాణాలు తీసుకోకూడదు. ర్యాగింగ్ అంటే ఏదో సరదా కాదు. కళాశాలల్లో సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించడం చేస్తుంటారు. అలాంటివాటిని మొగ్గలోనే తుంచేయాలి.

సిసోడియా అరెస్ట్‌కు దారి తీసిన “మిస్సింగ్ ఫైల్స్”

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం అరెస్ట్ చేసింది. సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసులో సిసోడియా అరెస్ట్ కు మిస్సింగ్ ఫైల్స్ కారణం అని తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ విభాగంలో సీజ్ చేసిన ఓ డిజిటల్ డివైస్ సిసోడియా పాత్రను బయటపెట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో గతేడాది ఆగస్టు 19న సీబీఐ సోదాలు చేసింది. అయితే ఈ సమయంలో ఓ డిజిటల్ డివైస్ ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని పరిశీలించగా.. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేని ఓ కంప్యూటర్ లో లిక్కర్ పాలసీకి చెందిన ఓ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ఉన్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.ఈ కంప్యూటర్ గురించి కూపీలాగగా.. ఇది సిసోడియా ఆఫీసులోని సిస్టమ్ గా తేలింది. జనవరి 14న సిసోడియా ఆఫీసు నుంచి కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే కంప్యూటర్ లో చాలా వరకు ఫైళ్లు డిలీట్ అయినట్లు సీబీఐ అధికారు గుర్తించారు. ఫోరెన్సిక్ సాయంతో ఆ ఫైళ్లను రీట్రీవ్ చేశారు అధికారు. ఇందులో ఓ ఫైల్ పరిశీలించగా.. లిక్కర్ పాలసీకి సంబంధించిన ఓ ఫైల్ వాట్సాప్ ద్వారా పంపినట్లు తేలింది. సిసోడియా మాజీ సెక్రటరీని సీబీఐ ప్రశ్నించి, అతడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. 2021 మార్చిలో సిసోడియా తనను సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి పిలిచారని, అక్కడే మంత్రుల బృందం తయారు చేసిన డ్రాఫ్ట్ రిపోర్టు కాపీని తనకు ఇచ్చినట్లు, ఆ సమయంలో సత్యేంద్ర జైన్ కూడా అక్కడే ఉన్నట్లు అధికారి సీబీఐకి వెల్లడించినట్లు తెలుస్తోంది.

పాముకాటుతో చనిపోయాడు… 15 ఏళ్ళ తర్వాత తిరిగొచ్చాడు

ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 15ఏళ్ల క్రితం 12ఏళ్ల బాలుడు పాముకాటుతో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని సరయూ నదిలో సంప్రదాయపద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. కానీ 15ఏళ్ల తర్వాత యువకుడు తన సొంత ఇంటికి తిరిగివచ్చాడు. ఇప్పుడు ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది.వివరాలు.. భాగల్‌పూర్ బ్లాక్‌లోని మురసో గ్రామానికి చెందిన రామ్‌సుమేర్ యాదవ్ కుమారుడు అంగేష్ (12) 15 ఏళ్ల క్రితం పాము కాటుకు గురయ్యాడు. దీంతో అతని శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది. కుటుంబసభ్యులు అతడిని అంత్యక్రియల నిమిత్తం భాగల్పూర్‌లోని సరయూ నది ఘాట్‌కు తీసుకెళ్లారు. అంగేష్ మృతదేహాన్ని నదిలో వదిలేందుకు కుటుంబ సభ్యులు పడవ ఎక్కుతుండగా, అతడు అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో బతికే ఉన్నాడని నమ్మి తిరిగి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అంగేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని అరటి మొక్కకు కట్టి, సంప్రదాయం ప్రకారం సరయూ నదిలో వదిలారు.

షిరిడీ భక్తులకు గుడ్ న్యూస్..గన్నవరం నుంచి విమాన సర్వీసులు

షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు.. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు బస్సులు, రైళ్లలో మాత్రమే షిర్డీకి వెళ్లే అవకాశం ఉంది.. త్వరలోనే విమానాల్లో కూడా షిర్డీ వెళ్లే అవకాశం దక్కనుంది.. విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.. మార్చి 26వ తేదీ నుంచి ఈ సర్వీసులు స్టార్ట్‌ కాబోతున్నాయట.. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ ముందుకు రావడంతో పాటు ప్రయాణ షెడ్యూల్‌ను కూడా ప్రకటించడంపై సాయి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్‌ 72-600 విమానం.. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ రోజు మధ్యాహ్నం 12.25 గంటలకు బయల్దేరుతుంది.. అది మధ్యాహ్నం 3 గంటలకు షిర్డీ చేరుకోనుంది.. ఇక, షిర్డీ నుంచి ఏపీకి రావాల్సిన ప్రయాణికుల కోసం నడిపే మరో విమానం.. ప్రతీ రోజు మధ్యాహ్నం 2.20 గంటలకు షిర్డీ నుంచి బయల్దేరి.. సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. ఇక, విమాన టికెట్‌ ధరను కూడా ప్రకటించింది ఇండిగో.. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టికెట్‌ ధర రూ.4,246గా ఉండగా.. షిర్డీ నుంచి గన్నవరంకు రూ.4,639గా నిర్ణయించారు. రైళ్లు, బస్సుల్లో నానా ఇబ్బందులు పడి షిర్డీ వెళ్తున్న భక్తులు.. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. త్వరగా షిర్డీకి వెళ్లే సౌకర్యం రానుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు

అదీ అది మా చైతన్య అంటే.. నీలా కాదు

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో సమంత- నాగచైతన్య విడిపోతే.. వారికన్నా ఎక్కువ బాధపడింది మాత్రం అభిమానులే అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కూడా కలిసిఉండకుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విడాకుల విషయంలో తప్పు ఎవరిది అనేది ఎవరికి తెలియదు. సామ్ అభిమానులు చై అంటుంటే.. చై అభిమానులు సామ్ దే తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక విడాకుల ముందు అక్కినేని ఇంటి కోడలిగా ఎంతో గౌరవ మర్యాదలు అందుకున్న సామ్.. విడాకులు అయ్యాక ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ మధ్య సామ్.. మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో ఆమెపై ట్రోల్స్ చేయడం కొద్దిగా తగ్గించారు అభిమానులు.. ఇక తాజాగా చైతూ పెట్టిన పోస్ట్ వలన మరోసారి సామ్ పై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఆ పోస్ట్ ఏంటంటే.. ఈ జంట నటించిన మొదటి సినిమా ఏమాయ చేసావే సినిమా రిలీజ్ అయ్యి నిన్నటితో 13 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ విషయాన్నీ తెలుపుతూ చై.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరిలో ఏ మాయ చేసావే పోస్టర్ తో పాటు.. ఆ సినిమా మొత్తంలో ఉన్న సామ్ ఫొటోస్ ను కలిపి పోస్ట్ చేశాడు.ఇక దీంతో అభిమానులు చై మనసును తెలుసుకున్నారు. విడాకులు అయిన దగ్గరనుంచి చై, ఏనాడు సామ్ గురించి నెగెటివ్ గా మాట్లాడింది లేదు. ఇప్పుడు కూడా చై మాత్రమే ఈ పోస్ట్ ను పెట్టాడు.. కానీ, తనకు లైఫ్ ఇచ్చిన సినిమా గురించి సమంత ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో సామ్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది మా చైతన్య అంటే.. నీలా కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

డాక్టర్ ప్రీతి కేసు విచారణ.. సిట్టింగ్ జడ్జితో జరపాలి

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె నిన్న రాత్రి ప్రీతి మరణించింది. ఆమె స్వగ్రామంలో నేడు ప్రీతి అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే.. ప్రీతి మృతిపై విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సైఫ్ వేధింపులపై తండ్రి ఫిర్యాదు చేయగానే విచారణ జరిపితే సమస్య వచ్చేది కాదన్నారు. హెచ్‌ఓడీ ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేయడం ఏంటని ఆయన అన్నారు. సైఫ్‌ని హెచ్చరిస్తే సమస్య తీవ్రత తగ్గేదని, నిందితుడితో పాటుగా.. పోలీస్ అధికారి.. కళాశాల ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీని కూడా సహనిందితుడిగా చేర్చాలన్నారు జీవన్‌ రెడ్డి. సిట్ విచారణ.. సీట్టింగ్ జడ్జితో జరపాలన్నారు. రక్షిత అనే అమ్మాయి కూడా వేధింపులతో చనిపోయిందని, భూపాలపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. జరుగుతున్న ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మూడు నెళ్లలోనే విచారణ పూర్తి చేసి.. శిక్ష వేస్తేనే న్యాయమని ఆయన అన్నారు. నవీన్ హత్య కేసు కూడా ప్రత్యేక విచారణ అధికారిని నియమించాలని ఆయన కోరారు. సోనియా గాంధీ రాజకీయాల నుండి విరమించుకోలేదని, అధ్యక్షురాలిగా టర్మ్ ముగిసే సందర్భంలో భారత్ జోడోని ఉద్దేశించి కామెంట్స్‌ చేశారంతేనన్నారు.

ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ కావాలని ఉందా?

ఇన్‌స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆదాయపు పన్ను శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17 మార్చి 2023. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఏదైనా పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి. ఫిబ్రవరి 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 17 మార్చి 2023. అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్ అధికారిక నోటిఫికేషన్‌తో పాటు అప్‌లోడ్ చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. దీనితో పాటు, అవసరమైన పత్రాలను జతచేయాలి. దరఖాస్తు ఫారమ్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా డిప్యూటీకి పంపాలి. కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (HQ) (Admn.), O/o ఇన్‌కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్, NWR, Aayakar భవన్, సెక్టార్-17E, చండీగఢ్-160017కి పంపించాలి.

అజ్నాలా హింసాకాండ పాక్ పనే

ఖలిస్తానీ వేర్పాటువాదులు, రాడికల్ సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ కార్యకర్తలు, దాని చీఫ్ అమృత్ పాల్ సింగ్ అజ్నాలాలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో మళ్లీ ఖలిస్తాన్ పేరుతో విభజన బీజాలు నాటాలని ప్రయత్నిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ అనుచరుడు జైలులో ఉన్న లవ్ ప్రీత్ సింగ్ తూఫాన్ ను విడిపించేందుకు పెద్ద ఎత్తున ఖలిస్తానీ వేర్పాటువాదులు కత్తులు, ఇతర ఆయుధాలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. కేవలం 1000 మంది పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించరని అన్నారు. రాష్ట్రంలో శాంతికి భంగం కలిగించే ప్రయత్నంలో పాకిస్తాన్ వారికి నిధులు సమకూర్చిందని ఆరోపించారు. విదేశీ శక్తులు, ముఖ్యంగా పాకిస్తాన్ నిధులు సాయంతో ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.