రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న జగన్ ప్రభుత్వం
వైఎస్ జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం రైతులకు భరోసా కల్గిస్తోంది. ఇప్పటికే వరసగా నాలుగో ఏడాది, ఈ ఏడాదికి మూడో విడతగా రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 3 ఏళ్ళు రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం అందించడంతో పాటు నాలుగో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 11,500 చొప్పున సాయం అందించింది జగన్ ప్రభుత్వం. నేడు మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 1090.76 కోట్ల రైతు భరోసా సాయాన్ని మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 1,090.76 కోట్లతో కలిపి ఈ మూడున్నరేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం మాత్రమే రూ. 27,062.09 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.
పడిపోయిన ధర.. ఉల్లి రైతుల కంట కన్నీళ్ళే
ఉల్లిపాయలు.. ఇవి లేకుంటే కిచెన్ లో అంతే సంగతులు.. ఒకప్పుడు ఉల్లిపాయలు కొనాలంటే వినియోగదారులకు చుక్కలు కనిపించేవి. కానీ ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లి పంట కోత దశలోనే రైతులకంట కన్నీరు పెట్టిస్తుంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో కర్నూలు జిల్లా రైతులు తమ పంటలను కోత దశలోనే ధ్వంసం చేస్తున్నారు. పంటను మార్కెట్ కు తీసుకుపోతే కనీసం రవాణా ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. షఫి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు… అనే ముగ్గురు రైతులు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన వారు.వీరు తమ పొలాలలో ఉల్లి పంటను వేశారు. ఎకరాకు డెబ్భై వేల రూపాయల ఖర్చు వచ్చింది. అయినా ధరమీద నమ్మకంతో పంటను సాగు చేశారు. పంట ఏపుగా పెరిగి కోత దశకు వచ్చింది. కాని ఇంతలో మార్కెట్ లో ధర ఢమాల్ అనడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. క్వింటాలు ఉల్లి మూడు వందల నుంచి ఏడు వందల లోపే వుండటంతో హతాశులయ్యారు. కనీసం కూలీ రవాణా ఖర్చులు కూడా రావని తేలడంతో వీరి కడుపు మండిపోయింది.
నిజాయితీగా పనిచేసిన టీడీపీలో గుర్తించలేదు
నూతన కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి వైసిపి నేతల సహకారం, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సిఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బలపరచి నందుకు కృతజ్ఞతలు…18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 మంది వెనుకబడిన వర్గాల, తరగతుల వారిని ఎంపిక చేశారు సిఎం జగన్..పదవుల కోసం పార్టీలు మారలేదు..40 ఏళ్లు సుదీర్ఘంగా ఒకే పార్టీలో పోన్నపు రెడ్డి కుటుంబం కొనసాగిన చరిత్ర నాది అన్నారు. చేయని తప్పులు హత్య కేసులో ఇరికించారు. నిజాయితీగా టిడిపిలో పని చేశానన్నారు. ఆనాడు ఆదినారాయణ రెడ్డి ఎన్నో ఇబ్బందులు మా కుటుంబాన్ని పెట్టారు. టీడీపీలోకి ఆది నారాయణరెడ్డి రాకను ఆనాడు వ్యతిరేకించాను. ఎప్పుడూ రాజీ పడలేదు. నన్ను అల్లుడులాగా చూసుకున్నారు అంటున్నారు..పార్టీలో ఉండగా ఎన్నో కష్టాలు పడ్డాము…ఎన్టీయార్ కు కొడుకులా పనిచేశాను..నేను కాదు ఇప్పుడు ఉన్న నేతలు అల్లుళ్ల లాగా ఉన్నారు..నిజాయితీగా టిడిపి నేతలు మాట్లాడాలి..ప్రలోభాలకు ఎప్పుడూ లొంగలేదు..నేను వదిలేసిన ఎమ్మెల్సీ పదవిని దేవగుడి కుటుంబం అనుభవిస్తోంది..అభివృద్ధి కోసం డైనమిక్ నాయకుడైన వైఎస్ జగన్ నాయకత్వంలో ఉండాలని వైసీపీలోకి వచ్చానన్నారు రామసుబ్బారెడ్డి.
నెలంతా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా?
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే కొన్ని మసాలాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను శరీరానికి అందిస్తాయి. ఉదాహరణకు అల్లం తీసుకున్నట్లైతే.. అల్లాన్ని నిత్యం ఉపయోగించడం వల్ల సానుకూల ప్రభావం శరీరంపై కలుగుతుంది. అల్లంలో ఆరోగ్య ప్రయోజనాలను పుష్కలంగా కలిగించే పదార్థాలున్నాయి. రుచికరమైనది మాత్రమే కాదు, ఇందులో జింజెరోల్, షోగోల్, జింజిబెరెన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఔషధ మూలికగా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. నిజానికి, శతాబ్దాలుగా అల్లం వివిధ వ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతోంది. క్రమం తప్పకుండా అల్లం తినడం వల్ల మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అల్లంలో జింజెరాల్ అనే బయోయాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇది వికారం, వాంతులు, అలాగే కీళ్ల వాపు వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ఇంకా, అల్లంలోని షోగోల్ అనాల్జేసిక్.. క్యాన్సర్, గుండె జబ్బుల నుండి రక్షణ అందిస్తుంది. అల్లంలోని జింగిబెరెన్ జీర్ణక్రియకు ప్రయోజనకారిగా ఉంటుంది. చివరగా, అల్లం కూడా యాంటీ-డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉండి.. మెదడు పనితీరు, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అల్లం రోజువారీగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అంటే.. ప్రతిరోజూ తాజా అల్లం నమలవలసిన అవసరం లేదు. 1.5 సెంటీమీటర్ల తాజా అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి.. టీ లేదా వంటలలో వేసుకుని వాడుకోండి.
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 21 మంది అభ్యర్థులు
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. 27వ తేదీ సాయంత్రం వరకు ఉపసంహరణ గడువు ఉండగా ఎవరూ విత్ డ్రా చేసుకోలేదని అధికారులు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థిగా ఏ వెంకట నారాయణరెడ్డి పోటీ చేస్తుండగా.. ప్రజావాణి పార్టీ తరపున ఎల్ వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. ఇక 19 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు అయిలునేని సంతోశ్‌కుమార్, కే సాయన్న, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కే ప్రభాకర్, డాక్టర్ డీ వెంకటేశ్వర్లు, జీ హర్షవర్థన్‌రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి, సీ చంద్రశేఖర్, సీ పార్వతి, టీ అన్నత్ నారాయణ్, డీ మల్లారెడ్డి, డాక్టర్ వీ నాథనైల్, పాపన్నగిరి మానిక్‌రెడ్డి, బీ భుజంగరావు, ఎం తిరుపతి, లక్ష్మీ నారాయణ మారంపల్లి, ఎస్ విజయకుమార్, ఎ వినయ్‌బాబుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 9 జిల్లాల పరిధిలో 137 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సామాగ్రిని సిద్ధంచేశారు. మార్చి 13న పోలింగ్ జరుగనుంది. మార్చి 16న కౌంటింగ్, 21న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. తొమ్మిది జిల్లాల పరిధిలో 29,720 మంది ఓటర్లు ఉన్నారు. 9,186 మంది ఓటర్లతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. రెండో స్థానంలో మేడ్చల్, అత్యల్పంగా 877 ఓటర్లతో జోగులాంబ గద్వాల్ నిలిచింది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.
రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
చిత్తూరు జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఉన్న ఫాక్స్ లీక్ కంపెనీలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగసి పడుతున్న పొగలతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అంచనా వేస్తుంది యాజమాన్యం. మూడు అగ్నిమాపక వాహనాలు మంటలు ఆర్పేపనిలో నిమగ్నం అయి వున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కేటుగాళ్ళు రెచ్చిపోయారు. ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఖాతా నుండి 1.60 లక్షల నగదు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సింగరాయకొండకు చెందిన వి.గోపాలకృష్ణంరాజు అనే ఉపాధ్యాయుడి కరెంట్ బిల్ పెండింగ్ ఉందంటూ ఫేక్ మెసేజ్ పంపారు సైబర్ నేరగాళ్లు. అకౌంట్ అప్ డేట్ చేసుకోవాలంటే లింక్ క్లిక్ చేయాలని చెప్పటంతో ఫేక్ మెసేజ్ ఓపెన్ చేసి బుక్కయ్యాడు ఉపాధ్యాయుడు..ఫోన్ హ్యక్ చేసి బాదితుడి రెండు బ్యాంక్ ఖాతాల నుండి 1.60 లక్షల నగదు కాజేశారు సైబర్ నేరగాళ్లు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు 5 రోజుల కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం 8 గంటల విచారణ తర్వాత సీబీఐ అధికారులు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. తాజాగా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఆగస్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపైకి వచ్చింది. ఇందులో ఏ-1గా మనీష్ సిసోడియాను పేర్కొంది సీబీఐ. గత ఆదివారమే ఆయన్ను విచారణకు రమ్మని కోరగా..బడ్జెట్ తయారీలో బీజీగా ఉన్నానని సమయంలో కోరడంతో నిన్న ఆదివారం విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. విచారణకు వెళ్లే కొన్ని గంటల ముందు, సిసోడియా తనకు జైలుకు వెళ్లడం అంటే భయం లేదని, భగత్ సింగ్ అనుచరుడిని అంటూ పరోక్షంగా అరెస్ట్ పై సంకేతాలు ఇచ్చారు. ఈ కేసులో డిజిటల్ డివైస్ లను నుంచి డిలీట్ చేసిన పలు ఫైళ్లు సిసోడియా అరెస్ట్ కు కారణం అయినట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ మధ్యం కేసు తర్వాత సిసోడియా 18 మొబైళ్లను, 4 సిమ్ కార్డులను ఛేంజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. గతేడాది గోవా ఎన్నికల సమయంలో ఈ స్కామ్ లో వచ్చిన డబ్బు రూ.100 కోట్లను ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉపయోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో తెలుగు రాష్ట్రాలకు కూడా లింకులు ఉన్నాయి.
రణబీర్ కపూర్ ఆ మూవీలో ఉన్నట్టా? లేనట్టా?
ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన ‘సంజూ’లో నటించి, భలేగా సందడి చేసిన రణబీర్ కపూర్ మరో బయోపిక్ చేయనున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ జీవితం నేపథ్యంలో రూపొందబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పేర్కొన్నాడు. దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ పై వర్క్ జరుగుతోందనీ రణబీర్ చెప్పాడు. అనురాగ్ బసు ఈ సినిమా రచన చేస్తున్నట్టు రణబీర్ తెలిపాడు. అయితే కిశోర్ కుమార్ తనయుడు అమిత్ కుమార్ తాము కిశోర్ పై ఓ బయోపిక్ రూపొందిస్తున్న మాట వాస్తవమే కానీ, అందులో రణబీర్ కానీ, అనురాగ్ బసు కానీ పనిచేయడం లేదని తెలిపారు. తాము సొంతగా కిశోర్ బయోపిక్ రూపొందిస్తున్నట్టు అమిత్ చెప్పారు. మరి కిశోర్ బయోపిక్ లో రణబీర్ ఉన్నాడా? లేదా? అన్నది ఆసక్తి కలిగిస్తూ ఉంటే, మరోవైపు రణబీర్ తాను సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నాడు. అసలు లివింగ్ లెజెండ్ సౌరవ్ గంగూలీ వంటి క్రీడాకారుని జీవితాన్ని తెరకెక్కించడానికి, అందులో ఆయన పాత్ర పోషించడానికి గట్స్ కావాలనీ రణబీర్ చెప్పాడు. ఇటీవల రణబీర్, సౌరవ్ గంగూలీ కలసి కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ ఆడిన పిక్స్ చూస్తే, సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కడం ఖాయమని తెలుస్తోంది. అందులో రణబీర్ నటించడమూ ఖాయమేననీ అంటున్నారు. ఔనంటే కాదనిలే… కాదంటే అవుననిలే… ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నారు. కానీ, ఇక్కడ మాట్లాడుతోంది ఆడవారు కారు. కిశోర్ సొంత కొడుకు అమిత్ కుమార్, అలాగే సౌరవ్ తో అదే పనిగా క్రికెట్ ఆడిన రణబీర్ కపూర్. మరి వీరెందుకని విరుద్ధమైన స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు? లోగుట్టు తేలేదెప్పుడో?
డేటా ఎక్స్ పర్ట్ ఇంజనీర్లను తొలగించిన ట్విట్టర్
ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ తో మొదలైన ఉద్యోగాల కోతలు ఆ తరువాత మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కొనసాగించాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఆర్థికమాంద్యాన్ని బూచిగా చూపుతూ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను ఫైర్ చేస్తున్నాయి. ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతేడాది తన సంస్థలో పనిచేస్తున్న 50 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపుగా 3000కు పైగా ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే ట్విట్టర్ మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. తాజా తొలగింపుల్లో భాగంగా దాదాపుగా 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది కంపెనీ వర్క్ ఫోర్స్ లో 10 శాతం తొలగింపులలో మెషిన్ లర్నింగ్ , ఫ్లాట్ ఫామ్ రిలియబిలిటీపై పనిచేస్తున్న ప్రోడక్ట్ మేనేజర్లను, డేటా నిపుణులను, ఇంజనీర్లను తొలగించింది. ముఖ్యంగా అమెరికాలోని ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. భారత ఐటీ నిపుణులు కూడా తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.
