*హైదరాబాద్‌లో మెట్రో, ఫార్మాసిటీని రద్దు చెయ్యడం లేదు..
కొత్త సంవత్సరం రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను.. ఎయిర్ పోర్ట్ కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది.. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో ఉంటుందన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో ని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం.. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్ పోర్ట్ కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరు.. మేము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుంది.. ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాము.. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అక్కడనే అక్కడి పరిశ్రమల్లో పని చేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుంది.. అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయి.. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన.. పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుంది.. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి.. స్కిల్స్ అదనంగా ఉంటాయి.. అక్కడ నుంచి బైటకి వెళ్ళే వాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుంది.. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని ఆయన అన్నారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి లుగా బాధ్యతలు అప్పగించాం.. 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజ్ ఉంటుంది.. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందు వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తాం.. మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉంది.. వారికీ ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం.. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావిణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉంది.. 3 వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామని ఆయన చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.. నాకు దగ్గరి బంధువనో పదవులు ఇచ్చేది ఉండదు.. నేను ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తాం.. పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తాం.. ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమశ్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
*తెలంగాణ ప్రజలు కొంచెం ఓపిక పట్టండి.. అందరికి ఆరు గ్యారెంటీలు అందిస్తాం..
కొత్త సంవత్సరం శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజానీకంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, యవత్తు దేశ ప్రప్రంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలను రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త సంవత్సరంలో మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, అష్టా ఐశ్వర్యాలతో భగవంతుడు చల్లాగా చూడాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారో అదే ప్రభుత్వం వచ్చింది.. ఇందిరమ్మ రాజ్యం వస్తే మనందరి బతుకులు బాగుపడతాయి అని మీరందరు కలలు కని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకి మంచి జరిగే విధంగా ఎన్నికలు అప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. చెప్పిన విధంగానే ఈ ఆరు గ్యారెంటీలను ఎన్ని అవంతరాలు వచ్చిన.. ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారెంటీలను అమలు చేపడతున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అందరు కొంచెం ఓపిక పట్టాండి.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఫలాన్ని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత మాది.. ఈ సందర్భంగా మరోసారి ఎన్టీవీ ప్రేక్షకులకు, ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.
*బిర్యానీ సరిగ్గా ఉడకలేదని ప్రశ్నించినందుకు హోటల్ సిబ్బంది దాడి
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ఓ హోటల్ లోని బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ధూల్ పేట్ కు చెందిన కొందరు వ్యక్తులు రాత్రి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు.. అయితే, ఆ బిర్యానీలోని మటన్ సరిగ్గా ఉడకలేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రమైంది. మొదటగా హోటల్ వెయిటర్లపై దాడికి దిగడంతో.. వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. కొంత మంది వినియోగదారులకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను మధ్య మండలం టాస్కో ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి.. అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమానిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.
*నేను విజయవాడ పార్లమెంట్‌కు కాపలా కుక్కను.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంత మంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నేను కానీ, నా కుటుంబ సభ్యులు ఎవరూ బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేయరు. నా కుమార్తె శ్వేత పోటీ చేస్తారు అనేది వాస్తవం కాదు. బెజవాడ పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలది. నేను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సేవ కోసం మాత్రమే. నేను ఈస్ట్ లేదా వెస్ట్ ఏలటానికి రాలేదు. కేవలం ప్రజాసేవకు మాత్రమే వచ్చాను. నేను దోచుకోను.. మరి ఎవరిని దోచుకోనివ్వను.. అందుకే నాపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదు. నేను ఎంపీగా లేకుంటే, టీడీపీలో లేకుంటే బెజవాడ పార్లమెంట్‌ను జగ్గయ్య పేట నుంచి దోచు కావచ్చని కొందరి ఆలోచన. వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. కొన్ని కబంధహస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నా. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు’’ అని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటానికి నిజాయితీ పరులు చాలా మంది పార్టీలో ఉన్నారని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. గత 2 ఎన్నికల్లో బెజవాడ పశ్చిమలో తనకు ఎంపీగా మెజార్టీ వచ్చిందన్నారు. 2 సార్లు తనకు 17 వేలకు పైగా మెజార్టీ పశ్చిమలో వచ్చిందన్నారు. పశ్చిమలో మనిషిని చూసి ఓటు వేస్తారు తప్ప పార్టీకి కాదన్నారు. పార్టీ సరైన వ్యక్తికి సీటు ఇస్తే గెలిపిస్తారు, సరైన వ్యక్తికి సీటు ఇవ్వకపోతే ఏడించటం పశ్చిమ నియోజకవర్గంలో తీర్పు అలా ఉంటుందన్నారు. కాల్ మనీ వ్యాపారులు ఏంటి, కేశినేని నాని అంటే ఏంటి అనేది బెజవాడ పశ్చిమ నియోజక వర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారన్నారు. కొందరు తమ స్వార్థం కోసం బెజవాడ కార్పొరేషన్‌ను ఓడించారన్నారు.
*తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలేను: గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి రేవంత్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు సుమారు 3, 500 మందిని కలిశాను అని గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తెలిపారు. 4 గంటల పాటు పబ్లిక్ కి అందుబాటులో ఉన్నాను.. బొకేలు వద్దు బుక్స్, నోట్స్ ఇవ్వమని నా సూచన చాలా మంది రాజ్ భవన్ కి వచ్చి బుక్స్ ఇచ్చారు.. అందరికి ధన్యవాదాలు.. తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలెను అని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు గవర్నర్ పేరుతో వాట్సప్ ఛానెల్ ను లాంఛ్ చేసాను.. రాజ్ భవన్ కి సంబంధించి అన్ని అప్ డేట్స్ ఈ ఛానెల్ లో ఉంటాయని తమిళ సై వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఈ సంవత్సరం ప్రతి పనిలో విజయం సాధించాలని ఆమె సూచించారు.
*మీరు భయపెడితే.. భయపడే రకం కాదు నేను: విడదల రజిని
ప్రశాంతంగా ఉన్న గుంటూరు పశ్చిమలో కావాలనే అలజడి సృష్టిస్తున్నారని మంత్రి విడదల రజిని అన్నారు. టీడీపీ శ్రేణులు భయపెడితే.. భయపడే రకం తాను కాదన్నారు. తమ సొంత భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే.. టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని ప్రశ్నించారు. వైసీపీ కుటుంభం అప్రమత్తంగా ఉండాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆదివారం రాత్రి దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన వైసీపీ ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ… ‘అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండా తో జగనన్న పాలన సాగిస్తున్నారు. జగన్ ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్తగా పని చేస్తున్నాను. గుంటూరు అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తా. పశ్చిమలో ప్రతి ఒక్కరూ సొంత ఆడపడుచులా ఆదరిస్తున్నారు. గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరవేయాలి. మన కార్యాలయంపై టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారు. రాళ్లతో మన కార్యాలయాన్ని పగలగొట్టారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమలో అలజడి సృష్టిస్తున్నారు. వైసీపీ కుటుంభం అప్రమత్తంగా ఉండాలి. రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి’ అని అన్నారు.’మాకు రౌడీ యిజం చేసే అలవాటు లేదు. అధికారం కోసం బీసీ మహిళపై దాడి చేస్తారా?. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మంత్రిగా ఉన్న బీసీ మహిళపై దాడులు చేస్తున్నారంటే.. అధికారం వస్తే టీడీపీ ఏం చేస్తుందో ప్రజలు ఆలోచించాలి. దాడి చేయటం పెద్ద పని కాదు కానీ మాది ఆ సంస్కారం కాదు. ప్రజల మనసులో వైసీపీకి స్థానం ఉంది. ప్రజా బలంతో వైసీపీ పశ్చిమలో విజయం సాధిస్తాం. మీరు భయపెడితే భయపడే రకం కాదు నేను’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ‘సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గుంటూరు పశ్చిమలో అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలో అదే చేసాం. మా సొంత భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఒక బీసీ మహిళ ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించకూడదా?.. ఆ హక్కు మాకు లేదా?. మీ ప్రతాపం ఏదైనా ఉంటే ప్రజలకు మేలు చేయడంలో చూపించండి. అంతేకాని దాడులు చేసి బెదిరించాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం’ అని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
*వామ్మో.. ఒక్కరోజుకే ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులా..!
రాజధాని హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలను అంబరాన్నంటాయి. పలువురు కుటుంబ సమేతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోగా, మరోవైపు హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్‌లో యువతరం ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అబ్బురపరిచే కార్యక్రమాలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటే వరకు రోడ్లపై తిరుగుతూ పటాకులు కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్ డ్రైవ్ (డ్రంక్ అండ్ డ్రైవ్) తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ బానిసలను పట్టుకున్నారు. హైదరాబాద్, సాయిబారాబా కమిషనరేట్ల పరిధిలో 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో 1500 కేసులు, సైబరాబాద్‌లో 1241 కేసులు నమోదయ్యాయి. రాచకొండలో 517 కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 3500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు మహిళలు సహా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను సీజ్ చేశారు. పలుచోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. నగరంలోని ఫ్లై ఓవర్లు, ఓఆర్‌ఆర్‌లను ఆదివారం రాత్రి 8 గంటలకు మూసివేశారు. PV ఎక్స్‌ప్రెస్‌వేలో ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.
*మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి..!
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్‌పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్‌లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీస్తున్నారు. పేలుడు జరిగినప్పుడు మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. మసూద్ అజార్ ను విడుదల చేయించడం కోసం1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది. అంతేకాకుండా.. భారత పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు మసూదర్ అజార్ కారణం. జూలై 5, 2005న అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంపై దాడితో సహా భారత్‌పై క్రూరమైన ఉగ్రవాద దాడులకు జైషే మహ్మద్ క్యాడర్‌ను అజహర్ ఉపయోగించుకున్నాడు. జనవరి 3, 2016న ఆఫ్ఘనిస్తాన్‌లోని బాల్ఖ్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై దాడికి కూడా అతను దర్శకత్వం వహించాడు. అతను అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరియు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ల సన్నిహిత సహచరుడు. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు అజహార్.. కశ్మీర్ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే వాడు. అంతేకాకుండా.. బ్రిటన్‌కు జిహదీని పరిచయం చేసింది అజహార్. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
*బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ పెళ్లి..డెస్టినేషన్ వెడ్డింగ్?
రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో బిజీగా హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పట్నుండి బాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ భగ్నాని తో ప్రేమాయణం సాగించింది.. ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కెర్లు కొడుతూనే ఉంటాయి. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ తో ఉన్న బంధాన్ని కూడా బయటపెట్టింది.. ఆ తర్వాత పబ్లిక్ గానే ఇద్దరు కలిసి బయట తిరుగుతూ కెమెరాలకు చిక్కుతూ వచ్చారు.. పెళ్లి పై వార్తలు రోజు వినిపించేవి.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. వీరిద్దరూ కలిసి త్వరలోనే పెళ్లి చేసుకో బోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమె ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుందని తెలుస్తోంది. అలాగే గోవా లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని,ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిధులను పిలుస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే జాకీ భాగ్నాని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టారని సమాచారం.. మరి దీనిపై ఎప్పుడు ప్రకటన ఇస్తుందో చూడాలి మరి.. ఈ మధ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..
