Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రంగారెడ్డిలో దారుణం.. ఇద్దరిపై పిచ్చికుక్కల దాడి..!

రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం రోజు రోజుకూ ఎక్కువగా మారుతుంది. మంచాల మండలంలో చిన్నపిల్లలపై, మహిళలపై విచక్షణా రహితంగా కుక్కలు దాడి చేస్తున్నాయి. ఉదయం నడుకుంటూ పోతున్న ఓ మహిళ, ఓ బాలుడి పై దాడి చేసి వారిపై కండలు పీక్కుతిన్నాయి. వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు స్థానికులు చేరుకుని కుక్కను తరుముతున్న కుక్కలు దాడి మాత్రం ఆపలేదు. ఓ బాలుడి చేతికి, మహిళలకు కాళ్ల కండరాలను దారుణంగా కర్చాయి. స్థానికులు గుంపుగా కూడి కుక్కలను తరమడంతో అక్కడి నుంచి పరారయ్యాయి. అయితే ఇలాంటి కుక్కలపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువగా చూడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందింది మనషులపై దాడి చేస్తున్న కుక్కలను మున్షిపల్‌ అధికారులు పట్టుకోవాలని వేడుకుంటున్నారు.

 

పవన్‌ కోసం హరిరామ జోగయ్య మరో లేఖ.. వారికి పిలుపు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వరుసగా లేఖ రాస్తూ వచ్చిన కాపు సంక్షేమసేన వ్యవస్థాపకులు, మాజీ మంత్రి చేగోండి హరిరామ జోగయ్య.. పొత్తులు, సీట్లు, సర్దుబాట్లపై సూచనలు చేస్తూ వచ్చారు.. పొత్తులతో ఎదురయ్యే పరిస్థితులను వివరిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ నిర్ణయాలను తప్పుబడుతూ ఆయన లేఖలు రాశారు.. టీడీపీ తొక్కేస్తుంది.. మిమ్మల్ని వాడుకుని వదిలేస్తుంది అని హెచ్చరించారు.. పవన్ కల్యాణ్‌ ఒంటరిగా పోటీ చేయాలని.. కూటమిలో చేరొద్దని.. ఇలా చాలా సూచనలిచ్చారు.. ఆయన రాసిన లేఖలపై విమర్శలు రావడంతో పాటు.. ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే, తొలిసారి.. పవన్ కల్యాణ్ విజయం కోసం పనిచేయాలని హరిరామ జోగయ్య లేఖ రాశారు..

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ కోడలు..

లోక్‌సభ మాజీ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ కోడలు అర్చన పాటిల్ చకుర్కర్ ఇవాళ (శనివారం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. డాక్టర్ అర్చన పాటిల్ చకుర్కర్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను దక్షిణ ముంబైలోని ఆయన అధికారిక నివాసం ‘సాగర్’లో కలిశారు. ఆమె ఉద్గీర్‌లోని ‘లైఫ్‌కేర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్’ చైర్‌పర్సన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, ఆమె భర్త శైలేష్ పాటిల్ చకుర్కర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శివరాజ్ పాటిల్ 2004 నుంచి 2008 మధ్య యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.

కేసిఆర్, కేటీఆర్ చెబితేనే బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్ లోకి వస్తున్నారు..

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చేవాల్లంతా కేసిఆర్, కేటీఆర్ చెబితేనే వస్తున్నారని బీజేపీ కార్యాలయం NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పోలీసులు వాళ్లకు వాళ్ళే చేశారా, DGP చెప్తే చేశారా.. అప్పటి సీఎం చెప్తే చేశారా? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ నీ మొదట ముద్దాయిగా విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. అప్పటి DGP నీ ఎందుకు విచారించడం లేదు? అని ప్రశ్నించారు. డీజీపీ, కేటీఆర్, కేసిఆర్ అప్పటి మంత్రులు.. ఈ నలుగురిని విచారించాలని కోరారని తెలిపారు.

నిన్న దానం.. నేడు కడియం.. అనర్హత వేటుపై బీఆర్‌ఎస్‌ పిటిషన్‌

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. వెంటనే కాంగ్రెస్ గేట్లు తెరిచింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలంతా కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో మెజారిటీ నేతలు కాంగ్రెస్‌లో ఎదిగిన వారే కావడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతల జాబితా పెద్దదే. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌గా కొనసాగుతున్న కె.కేశవరావు మళ్లీ మాతృపార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

కోమటి రెడ్డి లాంటి 5మంది మంత్రులు మాతో టచ్ లో ఉన్నారు

కోమటి రెడ్డి లాంటి 5మంది మంత్రులు మాతో టచ్ లో ఉన్నారని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటో ఇంకో అంశమో తన సీటు కు ప్రమాదం వస్తుందనే భయం తో రేవంత్ రెడ్డి కి నిద్రపట్టడం లేదని అన్నారు. పది మంది మంత్రులు సీఎం సీట్ పై కన్నేశారన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డీ నీ తమ్ముడే నీతో టచ్ లో లేడు అట…. అయన భార్యకు టికెట్ రాకుండా మీరే అడ్డుకున్నారు అట..అంటూ హస్యాస్పదం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే లను కొనుక్కుంటే 48 గంటలో నీ ప్రభుత్వం కూలిపోతుంది బిడ్డా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

లబ్ధి చేకూరింది.. తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్‌ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. 58 నెలల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరగలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం వెల్లడించారు. ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయని ఆయన విమర్శించారు. తుగ్గలి అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 29.65 కోట్లు ఇచ్చామని.. రాతన గ్రామంలో 95 శాతం కుటుంబాలకు లబ్ది జరిగిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. ఇవాళ ఆయన పెద్దపల్లిలో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఏ ప్రాంతం చూసిన రైతుల కష్టాలు కనబడుతున్నాయన్నారు. తుల పంట పొలాలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. రైతుల కోసం 36 గంటల నిరసన దీక్షను చేపట్టామని, ఈ దీక్ష తోనైనా ఎండిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎండుతున్న పంటలను సాగు నీరు అందించి కాపాడాలన్నారు కొప్పుల ఈశ్వర్‌. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా ఉండెనో మళ్లీ అదే పరిస్థితులు ఎదురవుతున్నాయని, కేసీఆర్ రైతుల పక్షపాతిగా పని చేసిన వ్యక్తి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులను అభివృద్ది వైపు నడిపించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు కొప్పుల ఈశ్వర్‌. రైతులకు న్యాయం జరిగేంత వరకు బి అర్ ఎస్ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

మీరు బలహీన వర్గాలకు ఇచ్చిన నిధులు ఏంటో చర్చకు సిద్ధమా..?

కేటీఆర్‌కి ఎంతో తెలుసు అనుకున్నా.. నీ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బీసీ నాయకుడు అధ్యక్షుడు అయ్యాడా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. కేసీఆర్ సీఎం అయ్యాకా అయినా.. బీసీ కి ఇవ్వచ్చు కదా అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధ్యక్షుడు మీరే.. ఫ్లోర్ లీడర్ మీరే.. ఎన్నికల ముందు బీసీ లకు మీ పార్టీ పదవి ఇవ్వండని ఆయన అన్నారు. మీరు బలహీన వర్గాలకు ఇచ్చిన నిధులు ఏంటో చర్చకు సిద్ధమా..? అని కేటీర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. బీజేపీ బీసీ అధ్యక్షుడు ని తీసేసి.. ప్రతిపక్ష నేత పదవి కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. బీసీ అధ్యక్షుడిని ఎందుకు తొలగించారు అంటే బండి సంజయ్ వర్గం.. కేసీఆర్ ఇప్పొంచాడు కిషన్ రెడ్డికి అంటారని, మాకు నీతులు చెప్పే ముందు.. నీ పార్టీలో అయినా పదవులు ఇవ్వు కేటీఆర్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మహేశ్వర్ రెడ్డి మాటలు.. పాడిందే పాట అనే సామెత లెక్క ఉందన్నారు. మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని, మహేశ్వర్ రెడ్డి జోతిష్యం చదవలేదన్నారు పొన్నం ప్రభాకర్‌.

ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలను చంపేద్దామనుకుంటున్నారా?

ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలను చంపేద్దామనుకుంటున్నారా? 3 ఏళ్లుగా రూ.7 వేల 800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలా? విద్యార్థులను రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వ్రుత్తి విద్యా కళాశాలల పరిస్థితి దుర్భరంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఫీజు రీయంబర్స్ మెంట్ట్ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఫీజురీయంబర్స్ మెంట్ నిధులను సక్రమంగా కాలేజీలకు చెల్లించలేదు. నాటి ప్రభుత్వ నిర్వాకంవల్ల అటు కాలేజీ యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. గత మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.7,800 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలు, కళాశాల భవన అద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించలేక గత మూడేళ్లలో వందలాది కాలేజీలు మూతపడ్డాయన్నారు.

వైసీపీలోకి కళ్యాణ దుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు

ఓ వైపు జోరుగా ఎన్నికల ప్రచారం.. మరో వైపు చేరికలతో ఉత్సాహంగా సాగుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నాలుగో రోజు కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. బస్సు యాత్ర సందర్భంగా పలువురు కళ్యాణదుర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణ దుర్గం టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు.. అలాగే కంబదూరు, శెట్టూరుకు చెందిన టీడీపీ నేతలు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఆ పార్టీ నుంచి టికెట్‌ ఆశించారు. టికెట్‌ రాకపోవడంతో మనస్తాపానికి గురై వైసీపీలో చేరారు. గతంలో ఆయన మంత్రి ఉషశ్రీ చరణ్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పోటీకి సిద్ధం కాగా.. టికెట్‌ దక్కకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ బస్సు యాత్రలో భాగంగా టీడీపీ, జనసేన అసంతృప్త నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పి.గన్నవరంలో జనసేన మాజీ నేత పితాని బాలకృష్ణ కూడా ఈ బస్సు యాత్రలో భాగంగా వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ

ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. ఓ వైపు ఎన్నికల ప్రచారం, మరో వైపు చేరికలతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. బస్సు యాత్ర సందర్భంగా పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్‌ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పితాని బాలకృష్ణతో పాటు పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు.

మోడీ ఉచిత బియ్యం ఇస్తే.. తాను ఇచ్చినట్లు చెప్పాడు కేసీఆర్‌

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ, మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఏమి చేయలేదని దుష్ప్రచారాలు చేశారు కేసీఆర్ అంతా మేమే ఇస్తున్నామని దుష్ప్రచారం చేశారన్నారు. ఉచిత బియ్యం కూడా నేనే ఇస్తున్నానని ప్రచారం చేశాడు కేసీఆర్‌ అని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర నేనే పంపిస్తాను అన్నాడని, స్థంబాలకు లైట్‌ బుగ్గలు నేనే ఇస్తున్న అన్నాడు రోడ్లు నేనే వేస్తున్న అని చెప్పుకున్నాడు కేసీఆర్ అని.. కానీ నిజం తెలిసి.. ప్రజలు కేసీఆర్ ని బొంద పెట్టిండ్రు అన్నారు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి.

Exit mobile version