మంచి మనసు చాటుకున్న టమాట రైతు.. కూలీలకు కొత్త బట్టలు పెట్టి..
లక్షల్లో పెట్టుబడి పెట్టినవారు.. ఒకేసారి కోటీశ్వరులుగా మారిపోతున్నారు.. అయితే, మొత్తం లాభాలు నాకే వద్దు.. నా తోటలో పనిచేసేవారికి కూడా నేను సాయం చేస్తానంటూ ముందుకు వచ్చి మంచి మనసు చాటుకున్నారు ఓ రైతు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి పల్లి మండలంలో మంచి మనసు చాటుకున్నాడు ఓ టమాట రైతు.. తనకున్న ఐదు ఎకరాల పొలంలో టమాట సాగు చేశాడు రైతు నరసింహా రెడ్డి.. ఆ పంట దిగుబడి మంచి సీజన్ అంటే.. బాగా ధర పలుకుతోన్న సమయంలో వస్తోంది.. అధిక ధరలతో లాభాలు రావడంతో ఆనంద పడ్డ రైతు. తన పొలంలో టమాట సాగులో భాగస్వాములైన కూలీలకు కొత్త బట్టలు పెట్టి మంచి మనస్సు చాటుకున్నాడు.. మహిళలకు చీరలు, పురుషులకు కొత్త బట్టలు పెట్టి.. వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.. కాగా, వర్షాల దెబ్బకు మార్కెట్‌లో టమాట మాయమైపోయింది.. ఉన్న కొద్దిపాటి పంట మార్కెట్ వచ్చినా ఫుల్ డిమాండ్ ఉండడంతో.. అధిక ధరలు పలుకుతున్నాయి.. హోల్ సెల్ మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.120 వరకు పలుకుతోంది టమాట.. కానీ, అదే వినియోగదారుకు వచ్చేసరికి రూ.150కి పైగానే పలుకుతోంది. ఇక్కడ కూడా దళారీలే దండిగా దండుకుంటూనే ఉన్నారు.
31న తెలంగాణ కేబినెట్ భేటీ.. వరద సాయం, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ
తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వ్యవసాయ రంగం, ముంపు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. భారీ వర్షాలతో పాటు ముప్పైకి పైగా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. చాలా జిల్లాల్లో పంట నష్టం కూడా జరిగింది.
ఈ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముంపు గ్రామాల ప్రజలకు ఆర్థిక సాయం, ఇతర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన నష్టంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల గురించి సమాచారం చర్చించబడుతుంది. రోడ్ల పునరుద్ధరణ చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ లవ్ జిహాద్ వ్యాఖ్యలపై అసోం సీఎం ఫైర్
మహాభారతంలోనూ లవ్ జిహాద్ జరిగిందని అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరా చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు అర్జునుడు మహిళ వేషంలో వచ్చాడని.. మహాభారతంలోనూ లవ్ జిహాద్ ఉందని బోరా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. బోరా ప్రకటన ఖండనార్హమని ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉందని అసోం సీఎం శర్మ ఆక్షేపించారు. కృష్ణుడు, రుక్మిణిలను లవ్ జిహాద్ వివాదంలోకి లాగడం తగదని హితవు పలికారు. తాము ఏ వివాదంలోకి హజ్రత్ మహ్మద్, జీసస్ క్రీస్తును లాగడం లేదని.. అదేవిధంగా మీరు కృష్ణుడిని వివాదంలోకి లాగవద్దని కోరారు. నేర కార్యకలాపాలతో దేవుడుని పోల్చడం సరైంది కాదని హిమంత బిశ్వ శర్మ హితవు పలికారు.
పవన్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నీ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మాయిల అదృశ్యంపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో తప్పిపోయిన అమ్మాయిలు, మహిళలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు బయటపెట్టడంతో.. మరోసారి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది జనసేన.. అయితే, జనసేనాని పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆర్కే రోజా.. ఈ సందర్భంగా మాడియాతో మాట్లాడారు.. పవన్ కల్యాణ్‌ఫై కీలక వ్యాఖ్యలు చేశారు.. పవన్ కల్యాణ్ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలంటూ బాంబ్ పేల్చారు.. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ.. పవన్ కల్యాణ్‌కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా.
ఇక, హెరిటేజ్ లో గంజాయి.. నారావారిపల్లిలో ఎర్రచందనం దొరుకుతోంది అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి రోజా.. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకడం లేదన్నారు. మరోవైపు.. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడే అంటూ మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టులను పరిశీలించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై గురువారం కూడా మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు.
ఆగస్టులోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్దం చేసుకోంటున్నాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై ఆయన అసెంబ్లీ సెషన్స్ లో ప్రస్తావించే ఛాన్స్ ఉంది.
మరో వైపు రాష్ట్ర ప్రజల సమస్యలపై కేసీఆర్ సర్కార్ పై కమలం పార్టీ కూడా సభలో ప్రశ్నలను సంధించేందుకు అవకాశం ఉంది. ఇంకో వైపు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను కూడా ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఎందుకంటే.. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఈ అసెంబ్లీ సెషన్స్ ను అధికార, విపక్షాలు సీరియస్ గా తీసుకొనే ఛాన్స్ ఉందని పొలిటికల్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
విద్యార్థులతో క్లాస్‌రూమ్‌లో మసాజ్ చేయించుకున్న టీచర్ సస్పెండ్
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు అందరూ చదువుకునే ఉంటారు. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలతో సమానం. మనకు జ్ఞానాన్ని బోధించే ప్రత్యక్ష దైవం అని అర్థం. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉంటూ ఎంతోమంది ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఆ జాబితాలోకి మరో ఉపాధ్యాయుడు చేరిపోయాడు.విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చి దిద్దాల్సిన గురువు.. వారి చేతులతో మసాజ్ చేయించుకున్నాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో మసాజ్ చేయమని విద్యార్థులను బలవంతం చేశాడనే ఆరోపణలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు శుక్రవారం ఒక అధికారి తెలిపారు. సేంద్రిముండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న అతడిని గురువారం సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సంజయ్ గుప్తా తెలిపారు. మసాజ్ చేయమని పిల్లలను అడిగారని, వారు నిరాకరించినట్లయితే కొట్టారని కొంతమంది విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నివేదిక అందించడంతో సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు. సంబంధిత క్లస్టర్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్‌కు కూడా నోటీసు అందించామని, తదుపరి విచారణ జరుగుతోందని డీఈవో సంజయ్ గుప్తా తెలిపారు.
వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది.. నువ్వో లెక్కా….?
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల హీట్ ఇప్పుడే కనిపిస్తుంది. అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా విమర్శలు కొనసాగుతున్నాయి. జనసేన,టీడీపీ, బీజేపీ పార్టీలు అధికార వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. విపక్ష నేతలకు అధికార పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది… చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం చేపట్టిన ముఖ్యమంత్రి.. పలువురు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్ష ప్రభావం, తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రాధానంగా చర్చ జరిగింది. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఇప్పటికే ప్రభావిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇండిగోకు రూ.30 లక్షల జరిమానా.. ఎందుకంటే?
గత నెలలో అహ్మదాబాద్‌లో టెయిల్ స్ట్రైక్ చేసినందుకు ఎయిర్ క్యారియర్ నుండి ఇద్దరు పైలట్‌లను సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత, 6 నెలల్లో నమోదైన 4 టెయిల్ స్ట్రైక్స్ కోసం ఇండిగోకు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇండిగో ఎయిర్‌లైన్ తరచుగా టెయిల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించి జరిమానా విధించింది. డీజీసీఏ తన ప్రత్యేక ఆడిట్‌లో, ఇండిగో ఎయిర్‌లైన్ డాక్యుమెంటేషన్, కార్యకలాపాలు, శిక్షణ, ఇంజనీరింగ్, FDM (ఫ్లైట్ డేటా మానిటరింగ్) కార్యక్రమాలపై విధానాన్ని సమీక్షించింది.
ప్రత్యేక ఆడిట్ సమయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు, శిక్షణా విధానాలు, ఇంజనీరింగ్ విధానాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌లో కొన్ని వ్యవస్థాగత లోపాలు గమనించబడ్డాయని సీనియర్ డీజీసీఏ అధికారి శుక్రవారం తెలిపారు. ఆడిట్ తర్వాత ఏవియేషన్ రెగ్యులేటర్ ఇండిగోకు షోకాజ్ నోటీసు జారీ చేసి, నిర్ణీత గడువులోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశించినట్లు అధికారి తెలిపారు.
కేంద్రమంత్రికి బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లేఖ
నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు 2020పై దంతవైద్యులకు సంబంధించిన దంత వృత్తిపరమైన సంస్థలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, బిల్లును ముందుగా స్టాండింగ్ కమిటీకి పరిశీలన, చర్చ కోసం పంపాలని బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయాకు లేఖ రాశారు. బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపడం ద్వారా ప్రజలందరికీ సమాచారం అందించడంతో పాటు దంతవైద్యం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటూ అభ్యంతరాల పరిశీలనకు బిల్లును స్టాండింగ్ కమిటీకి వెంటనే పంపాలని ఎంపీ నామా నాగేశ్వరరావు లేఖలో వైద్యారోగ్య శాఖ మంత్రిని కోరారు.
కేసీఆర్ మీరు ఉండే మూడు నెలలైనా హైదరాబాద్‌ను పట్టించుకోవాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు ఉండే మూడు నెలలు అయినా హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోవాలని రానున్న రోజుల్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని కనీస సౌకర్యాలు కల్పించ లేనటువంటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అంబర్‌పేట పటేల్ నగర్ నుండి ముసారంబాగ్ బ్రిడ్జ్ వరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరవాసులకు కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత మున్సిపల్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిందని ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కిషన్ రెడ్డి తెలిపారు.
తాత్కాలికంగా ఆర్టీసీ బస్సులను నిలిపి వేసిన తమిళనాడు సర్కార్
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులపై ఆందోళన కారులు రాళ్ళు రువ్వి.. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఆర్దీసీ బస్సులను సైతం నిరసన కారులు ధ్వంసం చేశారు. ఎన్‌ఎల్‌సీ విస్తరణను నిరసిస్తూ పీఎంకే నేత అన్బుమణి రామదాస్ నేతృత్వంలో నైవేలిలో భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి.
కడలూరులో నైవేలి థర్మల్ పవర్ ప్లాంట్ రెండువ గని విస్తరణ పనులను వ్యతిరేకిస్తున్న ఏఐడీఎంకే, పీఎంకే పార్టీ నేతలు ఆందోళన బాట పట్టారు. విస్తరణలో భాగంగా వేలాది ఎకరాల పచ్చని వ్యవసాయ భూములను ఎన్ఎల్ సీ అధికారులు చదువు చేస్తున్నారు. దీంతో అధికారులను రైతులు అడ్డుకున్నారు.. ఇక రైతులకు పీఎంకే నేత అన్బుమణి రామదాస్ అధ్వర్యంలో మద్దతు ఇవ్వడంతో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. నైవేలి నిరసనలో పోలీసులపై రాళ్ళు రువ్వీ, వాహనాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఇక పీఎంకే నేత రామదాస్ ను పోలీసులు అరెస్టు చేశారు.
నటి అమిషా పటేల్ కు షాక్ ఇచ్చిన రాంచి సివిల్ కోర్ట్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అమిషా పటేల్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన కహో నా ప్యార్ హై సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకీ పరిచయం అయింది.ఆ తరువాత బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అలాగే తెలుగులోకీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా భారీ విజయం సాధించింది. దీనితో ఈ భామ తెలుగులో బాగా పాపులర్ అయింది. బద్రి సినిమా తరువాత తెలుగులో నాని,నరసింహుడు మరియు పరమవీరచక్ర లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో నటిస్తూనే తెలుగు, తమిళ్ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది.హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కొన్ని కారణాల వల్ల చాలా కాలం పాటు ఈ భామ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవల సినిమాలకు మళ్ళీ రీ ఎంట్రీ కూడా ఇచ్చింది.
