NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ బుకింగ్ పై టీమిండియా క్రికెటర్ అసంతృప్తి..

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ.. ‘ నేను ప్రయాణిస్తున్న విమానంలోనూ ఇలాంటి ఘటన ఎదురైంది. ఇండిగో ఎయిర్ లైన్స్లో ఇది సర్వ సాధారణమైపోయింది. మీతో ముందు పేమెంట్ చేయిస్తాయి. ఆ తర్వాత వారికి ఇష్టమైన సీటింగ్ ఇస్తారు. మనం ఏం కోరుకున్నా పట్టించుకోవు. ఇది స్కామ్ అని ఖచ్చితంగా తెలియదు. మీరు పేమెంట్ చేసినా.. మీరు బ్లాక్ చేసిన సీట్లను మాత్రం మీకు ఇవ్వరు. కావున, దయచేసి మీ టైం, ఎనర్జీని వృథా చేసుకోవద్దు’ అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

త్వరలో ఏపీలో టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్‌!

గత ప్రభుత్వంలో పాలనా మొత్తం అస్తవ్యస్తంగా సాగిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. 19 వందల కోట్ల పురపాలక శాఖ నిధులు ఇతర పనుల కోసం మళ్ళించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక్క తుడాలో మాత్రమే జీతాలకోసం 15కోట్లు ఖర్చు చేశారన్నారు. గత సర్కారు ఏపీ ఖజానాను ఖాళీ చేసిందని.. మళ్లీ పాలనా గాడినా పడాలంటే రెండేళ్లు పడుతుందన్నారు. తిరుపతి టీడీఆర్ బాండ్ స్కామ్‌పై విచారణ కమిటీ వేశామని మంత్రి తెలిపారు. టీడీఆర్‌ బాండ్స్ వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందన తెలిపారు. త్వరలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో ఏపీలో టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్‌తో సులువుగా అనుమతి తీసుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. టీడీఆర్ స్కామ్‌పై విచారణ వేగవంతంగా జరుగుతోందని మంత్రి నారాయణ వెల్లడించారు.

v6, వెలుగు మీడియా హౌస్‌ను అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేశారు…

వారం రోజులుగా కేటీఆర్, అతని మనుషులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమం, ప్రజల సమస్యలు చూపేందుకు v6 ఛానెల్ ను స్థాపించామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటసామి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా తెలంగాణ కల్చర్ చూపించింది v6 ఛానల్ అని, కాళేశ్వరం, మిషన్ భగీరధ లో జరిగిన అక్రమాలు, లోపాలను v6, వెలుగు పేపర్లు చూపించాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఈ రెండు సంస్థలను బ్యాన్ చేయాలని.చూసినా ప్రజల నుండి ఉన్న ఆదరణతో ఏమి చేయలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో v6, వెలుగుకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకండ వివక్ష చూపారని, మీడియా హౌస్ ను అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైం లో నాపై ఈడి రైడ్స్ చేయించారని, మేము తప్పు చేయలేదని మా డబ్బులు మాకు ఇచ్చారన్నారు వివేక్‌ వెంకటసామి. ఎవరిదో చూపించి నా ఫామ్  హౌస్ అని చెప్తున్నారని, కేసీఆర్ ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్ అని ఆయన మండిపడ్డారు.

పెరుగుతున్న డెంగ్యూ మరణాలపై కేటీఆర్‌ ఆందోళన

పెరుగుతున్న డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన సమస్యను గుర్తించి తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సూచించారు. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, శనివారం కనీసం ఐదుగురు, సోమవారం మూడు మరణాలు నమోదయ్యాయని రామారావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు మందుల కొరతను ఎదుర్కొంటున్నాయని, పెరుగుతున్న కేసుల కారణంగా చాలా ఆసుపత్రుల్లో ముగ్గురు నలుగురు రోగులు ఒకే బెడ్‌ను పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. “డేటాను ఎవరు దాచారు , ఎందుకు? తీవ్రమైన సమస్య ఉందని అంగీకరించడానికి , ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి సమయం ఆసన్నమైంది, ”అని ఆయన చెప్పారు.

మరో ఘటన.. ఇద్దరు విద్యార్థినులను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

దేశంలో రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెట్రేగిపోతున్నాయి. అమాయక అమ్మాయిలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కోల్కతా, బద్లాపూర్ ఘటనలు మరువక ముందే ఇలాంటి దారుణ ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా.. యూపీలో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులను నలుగురు యువకులు బైక్‌లపై కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అయితే.. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో, ఆచూకీ కోసం వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు పారిపోయారు. అనంతరం.. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నలుగురు యువకులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉ..2:45గంటల వరకు బతికే ఉన్న ట్రైనీ డాక్టర్ !.. తర్వాత ఏం జరిగింది?

కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత వైద్యురాలు ఆగస్టు 9 తెల్లవారుజామున 2:45 వరకు జీవించి ఉన్నట్లు సమాచారం. ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాల ద్వారా ఇది ధృవీకరించబడింది. ఆజ్ తక్ కథనం ప్రకారం.. వాస్తవానికి.. ఆ రాత్రి బాధితురాలి బంధువు ఆమెకు ఒక సందేశాన్ని పంపారు. దానికి బాధితురాలు ఉదయం 2:45 గంటలకు సమాధానం ఇచ్చింది. సాంకేతిక ఆధారాల ప్రకారం బాధితురాలి మొబైల్ ఫోన్ నుంచి ఆ సమయంలో మెసేజ్ వెళ్లింది. ఏజెన్సీలు ఈ సందేశాన్ని ఒక ముఖ్యమైన క్లూగా పరిగణించాయి. ఇది బాధితుడి చివరి క్షణాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

మంకీపాక్స్కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును వైద్య అధికారులు ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేసులు వస్తే సంసిద్ధంగా ఉండేలా ఆరు పడకలతో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ఇంజెక్షన్లు సిద్ధం చేసిన వైద్య అధికారులు.. మంకీపాక్స్ కు సపోర్టు ట్రీట్మెంట్ మాత్రమే ఉందంటున్న వైద్యులు.. ప్రత్యేక మందు అనేది మంకీపాక్స్ కు లేదని వెల్లడించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలి..

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేసారు. సీపీఐలో కష్టపడి పని చేసిన బాల మల్లేష్.. శ్రీనివాస్ రావులు రాష్ట్ర సహా కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పశ్య పద్య జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలని.. హైడ్రా చర్యల వల్ల బడా బాబులు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది లేదా.. వాళ్ళ ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయిన జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోడీ అయ్యాక నేను సన్యాసిని.. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు అన్నారు. 2014 లో 2.25 లక్షల కోట్లు IP ఉంటే.. ఇప్పుడు 16 లక్షల కోట్లు ఉందన్నారు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళలో ఒక్క విజయ్ మాల్య తప్ప మిగితా అందరూ గుజరాత్ వల్లే అని ఆయన పేర్కొన్నారు.