బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. వాయుగుండంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉందనీ.. చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. మంగళవారం ఉదయం నుంచి మల్కన్ గిరి, కోరాపుట్, నబరంగాపూర్, రాయగడ, గజపతి, గంజాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఇంటీరియర్ ఒడిశాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్ లో పేర్కొంది. భారీ వర్షాలను ప్రస్తావిస్తూ ఐఎండీ మంగళ, బుధవారాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఐదుగురు కార్మికులకు గాయాలు
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. కాంక్రీట్ పనులు చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడగా, పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా కంపెనీలో ప్రమాదం జరగడంతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదంపై సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.
చాలా బాధగా ఉంది.. వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలి!
కుకీ, మొయితీ అనే రెండు వర్గాల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ లో ఒక దారుణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను మరో వర్గానికి చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ గా మారగా ఈ అంశం మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ ఘటన మే 4వ తేదీన జరగగా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ఇక ఈ అంశం మీద సినీ, రాజకీయ వర్గాల వారు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశం మీద మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మణిపూర్‌లో ప్రజలు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, మహిళలను అగౌరవపరుస్తున్న ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయని విశ్వక్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఆ సీనియర్ హీరోయిన్ తో కలిసి చిందేసిన సాయి ధరమ్ తేజ్..
సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా బ్రో ది అవతార్.ఈ సినిమా ఈనెల 28న విడుదల కానుంది.ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ నీతోనే డాన్స్ షోకి హాజరై సాయి ధరమ్ తేజ్ ఆడుతూ పాడుతూ ఎంతో సందడి చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇవ్వగానే ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటారు అని శ్రీముఖి ప్రశ్నించగా.. జీవితాంతం అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు. వెంటనే తనకు సపోర్ట్‌గా క నటి సదా బ్రో అంటూ పిలిచింది.దీనికి సాయి తేజ్ మీరు బ్రో అంటే మేము వెళ్లవయ్యా వెళ్లు అంటాం అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ సీనియర్ హీరోయిన్ రాధా తో కలిసి స్టెప్పులు కూడా వేశాడు యముడికి మొగుడు సినిమాలోని అందం హిందోళం సాంగ్‌కి రాధ ఎంతో ఎనర్జిటిక్‌గా మూమెంట్స్ వేసి ఆశ్చర్యపరిచింది.. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ఇలా నేను చిరంజీవి గారితో డ్యాన్స్ చెయ్యలేకపోయాను కానీ మీతో కలిసి డ్యాన్స్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఢిల్లీలో భవనం బాల్కనీ కూలి తల్లీ కొడుకు మృతి
ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికే పలు రహదారుల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు యమునా నది వరద ప్రవాహం పొంచి ఉండటంతో.. ఢిల్లీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ.. ఢిల్లీలో వరద ప్రవాహం కొనసాగుతుంది. మరోవైపు దేశ రాజధానిలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా రేపు, ఎల్లుండి మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముంది.
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ముగ్గురు నైజీరియన్ లతో పాటు ఇద్దరు ఇండియన్స్ ని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు. వీరి లావాదేవీలపై దృష్టి పెట్టిన హైదరాబాద్ పోలీసులు.. డ్రగ్స్ కోసం కస్టమర్ల నుండి 4 కోట్ల రూపాయలు వసూలు చేసిన్టలు గుర్తించారు. 4 కోట్ల రూపాయలను 22 విదేశీ అకౌంటులకు మళ్లించినట్టు, 22 అకౌంట్లోను హెన్రీ అనే డ్రగ్ సప్లయర్ ఆపరేట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో.. హెన్రీ కోసం హైదరాబాద్ పోలీసుల వేట కొనసాగుతోంది. 22 బ్యాంక్ అకౌంట్స్ పరిశీలన కోసం ప్రైవేట్ ఏజెన్సీని హైదరాబాద్ పోలీసులు ఆశ్రయించారు. వీరి వద్ద నుండి 200 మంది కస్టమర్లు డ్రగ్స్ సేకరించినట్టు గుర్తించారు పోలీసులు. వీరిలో 90 శాతం బెంగళూరుకు చెందిన కస్టమర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరో 10 శాతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కస్టమర్లు ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల కస్టమర్స్ గా ఉన్నవారు బెంగళూరులో చదువుకునే రోజుల్లో డ్రగ్స్ కొన్నట్టు పోలీసులు విచారణలో తేలింది.
మీరు ఎలానైనా పిలవండి.. ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్
ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రతిపక్షాల కూటమి పేరుపై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. విపక్షాలను ఇండియన్ ముజాహిదీన్‌తో పోల్చారు. ప్రతిపక్ష కూటమి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వారి తీరు మారుతుందా? అని ప్రశ్నించారు. ఆఖరికి పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందన్నారు. ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. మణిపూర్‌ను నయం చేయడానికి ప్రతిపక్ష కూటమి సహాయం చేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. మణిపూర్‌లో ఇండియా ఆత్మను పునర్నిర్మించడంలో సహాయపడుతుందని తెలిపారు. మీరు ఎలానైనా పిలవండి. మేము ఇండియా. మేము మణిపూర్‌ను నయం చేయడానికి, అక్కడి మహిళలు, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాము. ప్రజలందరికీ ప్రేమ మరియు శాంతిని తిరిగి తెస్తాము. మేము మణిపూర్‌లో భారతదేశం ఆత్మను పునర్నిర్మిస్తాము’’రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
బీసీల సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ సర్కార్ కృషి
విదేశీ యూనివర్శిటీలతో పాటు దేశీయ ప్రతిష్టాత్మక సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వెనుకబడిన వర్గాల ఫీజులు ప్రభుత్వం తెలంగాణ చెల్లిస్తుందని ఆయన తెలిపారు. దీంతో.. 10వేల మంది మెరికలైన తెలంగాణ బీసీ విద్యార్థులకు లబ్ది చేకూరనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం 150కోట్లకు పైగా అదనంగా బీసీ విద్యకు ప్రభుత్వం కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రీయెంబర్స్‌మెంట్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి సైతం ఫీజు రీయెంబర్స్‌మెంట్ అమలు చేస్తామన్నారు. దీంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజును చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి గంగుల వెల్లడించారు. బీసీల సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ సర్కార్ కృషి చేస్తోంది మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.
ఆగస్టు 1 నుంచి టిఫిన్, టీ ధరలు పెరగబోతున్నాయ్..
గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు వీడకుండా కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో భారీగా వరదలు పొంగి పొర్లుతున్నాయి.. మరోవైపు నిత్యావసర వస్తువులు కూడా భారీగా పెరుగుతున్నాయి.. సామాన్యుడుకు కడుపునిండా నాలుగు వేళ్ళు నోటి దగ్గరకు వెళ్లడం లేదని తెలుస్తుంది.. హోటల్స్, రెస్టారెంట్ లలో కొన్ని కూరలను ఎత్తివేశారు.. అయితే ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతుంది.. పెరిగిన కూరగాయల ధరలను దృష్టిలో ఉంచుకొని వచ్చే నెల నుంచి టిఫిన్ ధరలు, టీ, కాఫీల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తుంది..
నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్ ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్ బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది.. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్ ఈ మేరకు నగరంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరల అధికంగా ఉన్నాయని ఆ ప్రకటనలో తెలిపారు.. ఇక వచ్చే నెల ఒకటి నుంచి పాలు లీటర్ పై రూ.3 రూపాయలు భారీగా పెరగను నున్నట్లు తెలుస్తుంది..
మాదిగలంతా రుణపడి ఉంటారు.. ఆ కేసుల మాఫీకి సీఎం అంగీకారం
విజయవాడలోని స్వరాజ్య మైదానంలో డా.బిఆర్.అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఫినిషింగ్ పనులు చివరి దశకు వచ్చినట్లు ఆయన అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని.. అతి త్వరలోనే అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా దేశం నలుమూలల నుంచి అంబేద్కర్ విగ్రహం చూసేందుకు పర్యాటకులు రావడం ఖాయమని ఆయన అన్నారు. దళితులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై ఎంతో నమ్మకం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నమ్మకంతోనే హృదయాలను గెలవగలమని.. చంద్రబాబులాగా మాటలతో మాయలు చేస్తే ప్రజలు విశ్వసించరని ఆరోపించారు.
విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు
పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు పాఠశాలలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరగణ జిల్లాలోని ఓ స్కూల్ లో.. జూలై 21న జరిగింది. విద్యార్థిని వాష్రూమ్ కి అని వెళుతుంటే వెంబడించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో.. నిందితుడు విద్యార్థిని కొట్టి వాష్‌రూమ్‌లో పెట్టి తలుపు వెయ్యటానికి ప్రయత్నించాడు.
వెంటనే బాలిక కేకలు విన్న తోటి స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ బాలికను రక్షించి.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ ఘటనపై బాలిక తల్లి స్కూల్ సిబ్బందిని, మేనేజ్మెంట్ ను ప్రశ్నించగా.. వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
