Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఏపీ ఆర్థిక అంశాలపై నిర్మలా సీతారామన్ కి బీజేపీ ఏపీ చీఫ్ వినతి పత్రం

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ఆర్థిక అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల ప్రకటన విషయంలో కేంద్రం తీరుపై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీకి ఇబ్బందిగా మారిందని లేఖలో పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక స్థితిపై మరింత క్లారిటీ కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని నిర్మలను ఏపీ బీజేపీ చీఫ్ కోరారు. ఏపీ ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదలకు వినతి చేశారు. ఏపీలో మద్యం స్కాంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని ఆమె తెలిపారు.

కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుంది

సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈసారి ఎన్నికల్లో పోటీ ఉంటుందన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలు అని విమర్శించారు. ధరణి వద్దు అని అంటే పటేల్ వ్యవస్థ మళ్ళీ తెచ్చినట్టేనని మంత్రి పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఈసారి కచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగారేస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్…

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మైథలాజికల్ సూపర్ హీరో చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆ!, జాంబిరెడ్డి లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న హనుమాన్‍ సినిమాను ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉంటుందని టాక్ కూడా వచ్చింది. మూవీ యూనిట్ మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. అలాగే, ట్రైలర్ గురించి కూడా అప్‍డేట్ ఇచ్చింది.దసరా సందర్భంగా హనుమాన్ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ విడుదల చేసింది. తేజా సజ్జా కోర మీసాలతో.. స్టైలిష్‍గా కనిపించారు.. ఈ పోస్టర్లో మరోసారి రిలీజ్ డేట్‍పై క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది (2024) జనవరి 12వ తేదీన హనుమాన్ చిత్రం రిలీజ్ అవుతుందని స్పష్టం చేసింది.

రోజా నీ స్థాయి ఏంటి.. నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి..?

మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్దాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నీ స్దాయి ఏంటి.. నోటికోచ్చినట్లు మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదానికి ఒక మంచి భాషా కూడా మాట్లాడలేకున్నావ్.. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయినా నువ్వు ఇప్పుడు వందల ఎన్ని కోట్లు ఎలా సంపాదించావో సీబీఐ ఎంక్వైరి కోరే దమ్ము నీకుందా అని ఆమె ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సీబీఐ,ఈడీ ఎంక్వైరి త్వరగా చేయాలనే కోరే దమ్ముందా నీకు.. సీఎం జగన్ కు ఉందా అంటూ ఎమ్మెల్సీ అనురధా అడిగారు.

మద్యం మత్తులో బాంబును నోటితో కొరికిన వ్యక్తి మృతి

మద్యం మత్తులో ఉన్నప్పుడు కొందరికి అసలు స్పృహ ఉండదు. మత్తులో ఏం చేస్తున్నారో వారికి అవగాహన ఉండదు. మద్యం సేవించి ఆ మత్తులో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొంత మంది మద్యానికి బానిసై తమ కుటుంబాలను రోడ్డుకు మీదకు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో బాంబును నోటితో కొరికి ప్రాణాలు కోల్పోయాడు.

చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెకు చెందిన చిరంజీవి రాత్రి మద్యం మత్తులో బాంబును నోటితో కొరికాడు. అది పేలడంతో అతను మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన చిరంజీవితో అతని భార్య గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో బాంబును కొరకడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

నేను హఠాత్తుగా చనిపోతే.. నా పిల్లలకు ఎంత డబ్బు వస్తుంది అనేది..

యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. నటి అవ్వాలని కేరళ నుంచి వచ్చి.. సీరియల్ నటిగా నటిస్తున్న సమయంలోనే మరో నటుడు రాజీవ్ కనకాల ను ప్రేమించి పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలుగా మారిపోయింది. ఇక రాజీవ్ తో పెళ్లి తరువాత యాంకరింగ్ మొదలుపెట్టి.. టాప్ యాంకర్ గా మారింది. నటుడుగా రాజీవ్ కు వస్తున్న పారితోషికం కంటే సుమ ఎక్కువ సంపాదిస్తుంది. రాజీవ్, సుమ లకు ఇద్దరు పిల్లలు. కొడుకు రోషన్ ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బబుల్ గమ్ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే కొడుకుతో పాటు ఆమె కూడా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై హైప్ పెంచేస్తుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమ.. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా మాట్లాడింది. ముఖ్యంగా.. ఫైనాన్షియల్ విషయాలను చెప్పుకొచ్చింది.

మరో వారసుడు వస్తున్నాడు.. ఆ ‘సుబ్రమణ్య’మే కాపాడాలి!

ఇప్పటికే అనేక పరిశ్రమల్లో వారసుల ఎంట్రీ కామనే, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, ఫిల్మ్ మేకర్ ‘బొమ్మాళి’ రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాను గతంలో గుణ 369 సినిమాను రూపొందించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ “సుబ్రహ్మణ్య”ని నిర్మించనున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామ లక్ష్మి సమర్పిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ దసరా రోజున రిలీజ్ చేశారు. ఇక సుబ్రహ్మణ్య పోస్టర్‌లో కొన్ని విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. పోస్టర్ సూచించినట్లుగా సినిమాలో డివోషినల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అతని వాహనం నెమలిని చూపడం చూస్తే ఇట్టే అర్ధం అయిపోతోంది. ఇక పోస్టర్ లో అద్వయ్ స్టైలిష్, డైనమిక్‌గా కనిపిస్తున్నారు.

రష్యా అధ్యక్షుడికి గుండెపోటు.. బెడ్‌రూంలో కింద పడిపోయిన పుతిన్‌!

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై అనేక పుకార్లు, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుండెపోటుతో పుతిన్ మంచంపై నుంచి పడిపోయినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే పుతిన్ ప్రస్తుత ఆరోగ్యంపై క్రెమ్లిన్ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

తాజాగా వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. పుతిన్‌కు గుండెపోటు వచ్చినట్లు పలు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి 9.05 గంటలకు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో “కార్డియాక్ అరెస్ట్”తో బాధపడుతున్నట్లు పోస్ట్ చేశారు. టెలిగ్రామ్ పోస్ట్ ప్రకారం, ఆయన ఆదివారం రాత్రి తన పడకగదిలో మంచం మీద నుంచి పడిపోయాడు. బెడ్‌రూమ్‌ నేలపై ఆహారపదార్థాల దగ్గర పడి ఉన్నాడని చెబుతున్నారు. అతని వ్యక్తిగత సిబ్బంది అతని చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న ఆహార పదార్థాలను కనుగొన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. నివేదికల ప్రకారం, భద్రతా సిబ్బంది పుతిన్ బెడ్‌రూమ్ తలుపులు పగులగొట్టి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. వెంకీమామ రెండో కూతురి నిశ్చితార్థం

దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది. ఇప్పుడు రెండో కూతురు హయవాహిని పెళ్ళికి సిద్ధమైంది. విజయవాడకు చెందిన ఒక పెద్ద డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యమందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రేపు విజయవాడలో వీరి ఎంగేజ్ మెంట్ వేడుక జరగనుంది. ఇందుకోసం దగ్గుబాటి కుటుంబం ఇప్పటీకే విజయవాడ బయల్దేరిందని తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్దానికి అక్కినేని కుటుంబం కూడా హాజరుకానుందని సమాచారం. దగ్గుబాటి కుటుంబమే కాకుండా చాలా తక్కువమంది సెలబ్రటీలు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది.

రామమందిరంలో అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇవే..

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలయంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపనకు ముందు, ట్రస్ట్ ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు చివరి తేదీ 31 అక్టోబర్ 2023. రామ్‌లల్లా ఆలయానికి అర్చకుల (అర్చకుల) నియామకం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు, 20 నుండి 30 సంవత్సరాల వయస్సు గలవారు, తమ దరఖాస్తులను అక్టోబర్ 31 లోపు ట్రస్ట్‌కు ఇమెయిల్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయోధ్య ప్రాంతంలో నివసించే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఎంపిక ప్రక్రియలో న్యాయబద్ధతను నిర్ధారించడానికి, ట్రస్ట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా ఆరు నెలల శిక్షణ పొందాలి. ట్రస్ట్ ప్రకారం, శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.2,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. వారికి భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు రామనంది సంప్రదాయంలో కనీసం ఆరు నెలల పాటు దీక్షలు చేసి గురుకుల విద్యా విధానంలో చదివి ఉండాలనేది మరో ప్రమాణమన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రస్ట్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. సర్టిఫికెట్లు జారీ చేయబడిన అభ్యర్థులు మాత్రమే తుది ఎంపిక కోసం ఎంపిక కమిటీ ముందు హాజరు కాగలరు.

పవన్ సీఎం అవ్వాలని నేను కోరుకోను.. సపోర్ట్ కూడా ఇవ్వను

బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ తో ప్రేమలో పడి.. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడే అకీరాకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను వివాహమాడింది. పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది. ఇక ఎన్నో ఏళ్ళు వీరి దాంపత్యం సాగలేదు. విబేధాలు కారణంగా పవన్ నుంచి విడాకులు తీసుకొని.. రేణు పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. ఇక పవన్ తో విడాకులు తరువాత రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. ఆద్య చిన్నపిల్ల కావడంతో ఆ ఆలోచనను మానుకొని.. పిల్లలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక దాదాపు 23 ఏళ్ళ తరువాత రేణు.. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో మెప్పించింది. సినిమాలో కొద్దిసేపే కనిపించినా.. రేణుకు మంచి గుర్తింపే దక్కింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.

 

Exit mobile version