NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో కేంద్రం చెప్పాలి..?

ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సింగరేణిని ప్రయివేటు పరం చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టారని తెలిపారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో సింగరేణిని కాపాడతారని భావించామని తెలిపారు. సింగరేణి ఒక సంస్థ మాత్రమే కాదు ఈ ప్రాంతం కొంగు బంగారం లక్షలాది మందికి ఉపాధినిస్తున్న సంస్థ అన్నారు. కేంద్రం, రాష్ట్రం భాగస్వామ్యంతో సింగరేణి నడుస్తున్నప్పటికి కేసీఆర్ వచ్చాక ఆయన చొరవతో లాభాల్లోకి వచ్చిందని తెలిపారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థ అయిన సింగరేణిని ప్రయివేటు కి ఇవ్వాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒరిస్సాలో, తమిళనాడు, గుజరాత్ లో ఉన్న బొగ్గుగనులను ఆయా రాష్ట్రాలకు ఇచ్చారన్నారు.

బీజేపీలో కలకలం.. రాజాసింగ్ కు ఈటెల ఘాటు రిప్లై..

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల పై ఈటెల రాజేందర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అగ్రెసివ్ గా ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్న రాజాసింగ్ మాటలకు ఈటెల గట్టిగ రిప్లై ఇచ్చారు. ఏ ఫైటర్ కావాలా, స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ ఈటల రిప్లై ఇచ్చారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలన్నారు. సందర్భం వస్తె జెజమ్మతో కొట్లాడేటోల్లం అంటూ ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర నూతన చీఫ్‌ నియామకంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హైకమాండ్‌ను కోరారు. దేశం, ధర్మంపై అవగాహన ఉన్న వ్యక్తినే రాష్ట్రపతిగా నియమించాలి. ఇదే విషయాన్ని ఓ వీడియో ద్వారా బీజేపీ నాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇతర సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి పొన్నంపై ఆరోపణలు.. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్‌ నోటీసులు..

ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పలు న్యూస్ ఛానెల్స్, పత్రిక లకు లీగల్ నోటీసులను అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు జారీ చేశారు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుంది..అది వినియోగించుకోవడానికి వీలుండదన్నారు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారన్నారు. ఈ ఫ్లే యాష్ ను రోడ్ల నిర్మాణానికి ,బ్రిక్స్ తయారీ కి ఉపయోగిస్తారని తెలిపారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుందన్నారు. ఈ లారీలలో ఎంత ఫ్లై యష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందన్నారు. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగల్సింది పోయి హుజురాబాద్ లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి గారిపై ఆరోపణలు చేశారని తెలిపారు.

మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీకు బ్లాక్ డెస్..

బుధవారం 11 గంటలకు జూబ్లి హిల్స్ టిటిడి టెంపెల్ దగ్గరకు మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. నా బ్లాక్ బుక్ లో మీ పేర్లు రాస్తున్న…మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బ్లాక్ డెస్ ఉంటాయన్నారు. 34 నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. మాకు తెలియకుండా నియోజకవర్గాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించాలని కోరుతున్న అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తాడు అని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఆపుతున్నారని తెలిపారు. 368 కళ్యాణ లక్ష్మి చెక్కులు హుజూరాబాద్ నియోజకవర్గం కు వచ్చాయి …అవి ఇవ్వడం లేదు…ఈ నెల 27 న చెక్కుల తేది అయిపోతుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తె అభ్యంతరం లేదు… ఎందుకు పొన్నం ప్రభాకర్ భయపడుతున్నారు ? అని ప్రశ్నించారు.

మియాపూర్, చందనగర్ పరిధిలో 144 సెక్షన్

మియాపూర్, చందనగర్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంటీ అన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వారిని ఖాళీ చేయించామన్నారు. నిన్న పోలీసులపై కొంత మంది రాళ్లు విసిరారని తెలిపారు. లా అండ్ ఆర్డర్ తప్పేలా ….వ్యవహరించారని మండిపడ్డారు. వారిపై కేస్ లు నమోదు చేసామన్నారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవచ్చు అని ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. దీనికి వెనుక ఉన్న వారిపై కేస్ లు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ భూమి కాబట్టి నేటి నుండి ప్రత్యేక భద్రత ను ఏర్పాటు చేసామన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించు కోవచ్చు అని వచ్చే వదంతులు నమ్మవద్దన్నారు. దాదాపు వెయ్యి మంది ఫోర్స్ ని ల్యాండ్ దగ్గర పెట్టామన్నారు. ఈ పరిసరాల్లో అనుమానస్పదం గా తిరిగితే అరెస్ట్ లు ఉంటాయని తెలిపారు. దీంతో మియాపూర్ లోని సర్వే నెంబర్ 100, 101 వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

రైతు బంధు ఆపడానికి వీలు లేదు

రైతు బంధు ఆపడానికి వీలు లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. రైతు భరోసా ఇస్తున్నట్టు చెప్పారు… మరి కేబినెట్‌ సబ్ కమిటీ ఎందుకు వేశారు..? అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు ను బీఆర్‌ఎస్‌ సర్కార్ హయంలో జూన్ చివరి నాటికి వేసేవాళ్ళమని, రుణమాఫీ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు. మహిళలకు 2500 రూపాయల హామీ గురించి మాట్లాడం లేదన్నారు. కేబినెట్ సబ్ కమిటీ కేవలం రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. కమిటీలతో అవసరం లేకుండా రైతు భరోసా ఇవ్వాలని, లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో దెబ్బతిన్నదని ఆయన అన్నారు. వీధి కుక్కలు జనం పై దాడి చేస్తున్నాయి …చైన్ స్నాచర్ల సంఖ్య పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు అవుతున్నా ఒక్క పనిని మొదలు పెట్టలేదన్నారు.

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్‌ నిర్వహణలో అవకతవకలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే యూజీసీ-నెట్‌ లీక్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ.. విచారణను వేగవంతం చేసింది.

తెలంగాణ ప్రభుత్వంలో రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయం

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరెంపల గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఎంతయితే ఆనందంతో పాలాభిషేకం చేశారన్నారు. గత ప్రభుత్వములో లాగా పది సంవత్సరాలు రుణమాఫీ ఇచ్చేయకుండా మాయ మాటలు చెప్పి గడిపిన నట్లుగా మా ప్రభుత్వం ఉండదని, ముఖ్యమంత్రి క్యాబినెట్ సమక్షంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయమని, నిబద్ధత గల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ప్రజలు కోరుకునే ప్రభుత్వం మీ ప్రభుత్వమన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి ఇద్దరు యువకులు మృతి

విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువకులు సముద్రంలో మునిగి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 10 గోల్డ్ వర్కర్స్ సరదాగా గడిపేందుకు రామాపురం సముద్ర తీరానికి వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తు్ండగా.. అలలు తాకిడికి పడవల బాల సాయి (24), కొసనం బాలు(24) గల్లంతయ్యారు. కొద్దిసేపటికి ఇద్దరు యువకుల మృతదేహాలు ఒడ్డుకు చేరాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.