కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం..
లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో లీడర్ల చెంపలు పగులుతున్నాయి. గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక సందర్బంగా నాయకుల మధ్య విద్వేశాలు రగులుతున్నాయి. అయితే, తాజా ఘర్షణలకు ఎక్కువ భాగం నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణాల్లో సాఫీగా జరుగుతున్నప్పటికీ గ్రామాల్లోమాత్రం నేతల మధ్య వాగ్వావాదాలు, ఘర్షణలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో వీఎం బంజర్ లో గ్రామసభ జరుగుతుండగా కాంగ్రెస్- బీఆర్ఎస్ నాయకుల మద్య వాగ్వావాదం చోటు చేసుకుంది. అర్హల జాబితాపై తీవ్ర వాగ్వాదం జరిగింది. గత పదిహేను రోజుల క్రితం బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరిన నాయకుడికి కారు పార్టీ నేతకు మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకుడి చెంపపగల కొట్టారు బీఆర్ఎస్ నాయకుడు.. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కొడుకు ప్రేమకు తల్లి ఒప్పుకోకపోవడం, అమ్మాయి ఆత్మహత్యని ప్రేరేపించదు.
కొడుకు ప్రేమ వ్యవహారాన్ని తల్లి ఒప్పుకోకపోవడం అనేది, అతడిని ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్యను ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తన ప్రేమికుడిని వివాహం చేసుకోకుండా జీవించలేదని, ఆత్మహత్యకు పాల్పడటం, సదరు అమ్మాయిన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఐపీసీ సెక్షన్ 306 కింద అభియోగాలను మోపాలంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని అణగదొక్కే వాతావరణాన్ని సృష్టించే చర్యలు అవసరం’’ అని న్యాయమూర్తులు బీ.వీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
జూన్ 13, 2014న కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా లక్ష్మీ దాస్ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అనుమతించింది. అంతకుముందు హైకోర్టు ఉత్తర్వుల్లో తన కొడుకు ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకోకపోవడంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించిన ఛార్జిషీట్‌ని కొట్టివేయాలని ఆమె చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. సదరు అమ్మాయి జూలై 3, 2008న ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో తల్లి, ఆమె కొడుకు, మరో నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైకోర్టు ఇద్దరు నిందితులు ఆమె భర్త, కొడుకుపై చర్యల్ని రద్దు చేసింది.
హైదరాబాద్లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ.. కొత్తగా 17 వేల ఉద్యోగాలు!
ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించడనికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ సంగ్రాజ్కా మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫోసిస్ సంస్థ రూ. 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది.. వచ్చే రెండు మూడేళ్లలో ఈ నిర్మాణం పూర్తైతుంది.. ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. దేశంలో ప్రముఖ ఐటీ గమ్యస్థానంగా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుంది.
భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందన్నారు.. దావోస్ వేదిక గా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు… రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు.. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు.. .అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పని చేసే యువత ఉన్న దేశంగా భారత్ కు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
అమెజాన్‌తో బిగ్ డీల్.. తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు
దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లో రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 60 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి.
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి.. నిర్వాసితులకు న్యాయం చేస్తాం..
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించినట్లుగానే జనవరిలోనే డయా ఫ్రం వాల్ పనులు మొదలుపెట్టాం.. డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులుసగం పూర్తవ్వగానే, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా మొదలుపెడతాం.. గతంలో 18 నెలలు కష్టపడి చంద్రబాబు డయా ఫ్రం వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంసం చేశాడు. జగన్ తుగ్లక్ పాలన ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని విమర్శించారు.. పాత డయా ఫ్రంవాల్ బదులు కొత్త డయా ఫ్రం వాల్ నిర్మాణం వల్ల మరో 1000 కోట్లు అదనపు భారం పడింది.. ఏడేళ్ళ క్రితం పోలవరం నిర్వాసితులకు 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే మరలా ఇప్పుడు మరో 1000 కోట్లు పరిహారం అందించారని వెల్లడించారు.
టీడీపీకి దశ, దిశ లోకేష్ మాత్రమే.. చంద్రబాబు తర్వాత ఆయనే సీఎం..
తెలుగుదేశం పార్టీకి దశ, దిశ నారా లోకేష్ మాత్రమే.. నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే సీఎం అని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ కార్యలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. భారీ కేక్ కట్ చేశారు వెంకన్న, టీడీపీ కార్యకర్తలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తరువాత పార్టీకి దశ దిశ లోకేష్ మాత్రమే అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ లోకేష్ చేపట్టిన యువగళంకి వచ్చిందన్నారు.. ఇక, నారా లోకేష్ వారసత్వ రాజకీయ నాయకుడు కాదు.. లోకేష్ ప్రజల్లో నుంచి ఎదిగిన నాయకుడిగా పేర్కొన్నారు.. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, చంద్రబాబు తర్వాత లోకేష్ వారసుడు అని స్పష్టం చేశారు.. పార్టీ కష్ట కాలంలో వున్నప్పుడు లోకేష్ చేపట్టిన పాదయాత్రతో పార్టీ మళ్లీ గాడిలో పడిందన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..
వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం..
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి 6) న ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. అంతేకాకుండా.. వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ కేబినెట్ భేటీలో ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరిస్తూ.. పెట్టుబడులతో రండి అని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.
పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారు..
విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు. 500 మందితో మెగా రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అనంతరం.. 100 కేజీల భారీ కేక్ కట్ చేశారు శ్రేణులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏ నిర్ణయమైన ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీల పెద్దలు నిర్ణయించి అమలు చేస్తాయని అన్నారు. ఎవరు వద్దన్నా.. కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత లోకేష్ నాయకత్వం మాత్రమే అని చిన్న పిల్లాడిని నిద్ర లేపి అడిగిన చాలా క్లియర్‌గా చెప్తాడని తెలిపారు. డిప్యూటీ సీఎం అంశం వ్యక్తిగతంగా ఎవరు తీసుకునేది కాదు.. పదవులైన, నిర్ణయాలైన కూటమి చేస్తుంది.. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు.
లిస్టు తుది జాబితా కాదు.. అది కేవలం వెరిఫికేషన్ కోసమే
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని, చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 40,000 రేషన్ కార్డులు మాత్రమే జారీ చేసిందని, అయితే తమ ప్రభుత్వం లక్షల్లో కార్డులు ఇవ్వబోతుందన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న లిస్టు తుది జాబితా కాదని, అది కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తుల పరిశీలన ఐదేళ్ల పాటు జరుగుతుందని వివరించారు.