వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విలేజ్/వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చగా మారింది.. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.. బీసీవై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బోడే రామచంద్ర యాదవ్.. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వీరంతా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పక్కదారి పడతాయని తన పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు.. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. ఇక, ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్న పిటిషనర్.. ఈ ఆదేశాల నేపథ్యంలో 44 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు తన పిటిషన్ ద్వారా హైకోర్టుకి సమాచారం చేరవేశారు.. దీనిపై రేపు విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు పేర్కొంది.
తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుంది.. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు..
బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీయూష్ గోయల్.. ఎంపీ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, తదితరులు హాజరయ్యారు. సంగారెడ్డిలో జహీరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్ కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొన్నారు.
నల్లారి బ్రదర్స్‌ని టార్గెట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి..
నల్లారి బ్రదర్స్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అన్నమయ్య జిల్లా పీలేరులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో.. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్ఏ చింతల రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. సూటు కేసుతో వచ్చారు, తిరిగి వచ్చే నెల 14వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లిపోతారని ఆరోపించారు.
ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరాలు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రుణమాఫీ చేసుకోబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాంజీ గోండు, కొమురంభీం పోరాటాలను సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకు వరాల జల్లు కురిపించారు. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామని.. కడెం ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం నిధులు ఇచ్చామని.. పనులు చేస్తున్నామని తెలిపారు. తుమ్మడిహట్టిలో ప్రాజెక్టు నిర్మిస్తామని.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. అక్కడి ముంపు ప్రాంతాలపై ఆ ప్రభుత్వంను ఒప్పిస్తామని సీఎం రేవంత్ అన్నారు ఆదిలాబాద్‌లో యూనివర్శిటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ, కేడీ కలసి సిమెంట్ కర్మాగారం అలానే ఉంచారని.. ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడి అయినా సరే ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామన్నారు.
కవితకు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్టుపై కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ పిటషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.
ధరలు పెంచినందుకు.. ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీ కి ఓటు వేయాలా..?
కాంగ్రెస్ సంపదను, మహిళల పుస్తెలు.. ముస్లిం లకు పంచుతామనీ అంటున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హెచ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులు ఉంటాయని మర్చిపోయారని, ముస్లిం ఓట్లు బీజేపీ పడవని ఇలా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లలో బీజేపీ ఏం చేశావో చెప్పు అని, ధరలు పెంచినందుకు.. ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీ కి ఓటు వేయాలా..? అని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని, ప్రధాని మోడీ ఎప్పుడైనా పేదల గురించి మాట్లాడావా అని ఆయన వీహెచ్ ఫైర్ అయ్యారు. రాముడి గుడితో సెంటిమెంట్ ఓట్లు తీసుకోవాలని బీజేపీ చూస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు వీహెచ్.
నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి
ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారని, ఏ ఊరికి వెళ్లిన అక్కడి నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ 20మంది టచ్ లో ఉన్నారనే మాటలు చూస్తే .. కేసిఆర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారేమో అని ఆయన అన్నారు. నాకు అయితే అదే అనుమానం ఉందని, సీఎం హామీలను ప్రజలు నమ్మట్లేదన్నారు ఏలేటి మహేశ్వర రెడ్డి. అందుకే దేవుళ్ళ మీద ఓట్లు వేస్తున్నారని, ప్రజలు నమ్మట్లేదని దేవుళ్ళ మీద ఒట్టు వేయడం బాధాకరమన్నారు ఏలేటి మహేశ్వర రెడ్డి.
భారీ ర్యాలీతో కేశినేని నాని నామినేషన్..
వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు.. కుటుంబ సమేతంగా వినాయక గుడిలో ప్రత్యేక పూజలు అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. నాని ర్యాలీలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, షేక్ ఆసిఫ్, స్వామిదాస్ పాల్గొన్నారు. అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు కంటే 3 రెట్లు జగన్ అభివృద్ధి చేశారని తెలిపారు. జగన్ హయంలో రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం పెరిగింది.. బెజవాడలో పార్లమెంట్ లో 7 సీట్లు, ఎంపీ సీటు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. బెజవాడకు చంద్రబాబు రూ.100 కోట్లు కూడా అభివృద్ది కోసం ఇవ్వలేదని ఆరోపించారు.
నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముడు పాలన మొదలైంది.. అదే పునాది
నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముడు పాలన మొదలైంది.. అదే పునాది అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రు పాలన తప్పు పట్టె వాళ్ళు .. నెహ్రు ఉన్నప్పుడే మోడీ పుట్టి ఉంటే బాగుండేది.. మా తప్పు కాదు అది అని, శ్రీరాముడు కూడా దేశానికి మొదటి ప్రధాని నెహ్రు కావాలి అని ఆయన్నే పుట్టించారన్నారు. .గాంధీ..నెహ్రు ల చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.. సీఎం ని కలిసి చెప్తా అని ఆయన వ్యాఖ్యానించారు. రామాయణం.. మహాభారతం చరిత్ర ఎలాగా ఉందో.. స్వతంత్ర ము తర్వాత గాంధీ కుటుంబం ది అలాంటి చరిత్ర అని, . గాంధీ…నెహ్రులు రక్తపాతం లేకుండా శాంతి మార్గమే మంచి మార్గం అని నమ్మినవారని, నెహ్రు 16 ఏండ్లు జైలు జీవితం గడిపారని, స్వాతంత్రం వచ్చిన తరువాత ఏకగ్రీవంగా నెహ్రు మొదటి ప్రధానిని చేశారు ప్రజలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యవస్థ తెచ్చిందే నెహ్రు..బీజేపీ నేతలు కాదంటారా..? ఈ చరిత్ర ని కాదనే శక్తి బీజేపీ నేతలకు ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ..అమిత్ షా అప్పుడు పుట్టనే లేదని, కిషన్ రెడ్డి.. బండి సంజయ్ నిన్న..మొన్న పుట్టినోళ్లే..! అని ఆయన విమర్శించారు.
రేవంత్ రెడ్డి కి పాలన అనుభవం శూన్యం
బీజేపీతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు అని కేసీఆర్ అన్నారని, గతంలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేసిన యత్నాలను కేసీఆర్ ఉదాహరించారన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఓ సీనియర్ కాంగ్రెస్ నేత 20 ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఆంటే వారించా అని కేసీఆర్ ఆ రోజు చెప్పారన్నారు. రేవంత్ మాత్రం ప్రతీ సభ లో కేసీఆర్ తన ప్రభుత్వానికి కూలుస్తారన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని, ప్రభుత్వం రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. జానారెడ్డి , జైపాల్ రెడ్డి లు అనుభవజ్ఞులు .వారి గురించి కూడా చులకన చేసి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
