NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

జమిలి ఎన్నికల అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

జమిలి ఎన్నికల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. జమిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పులు.. సవరణలు విషయంలో బీజేపీ అవలంబిస్తున్న తీరు చూస్తున్నామన్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్ ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని సీఎం అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. సీతారాం ఏచూరి పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి.. అధికారులతో సీఎస్ సమీక్ష..

ఈ నెల 28న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రపతి రాష్ట్రంలో ఒకరోజు పర్యటన సందర్భంగా ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారని తెలిపారు. సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలిపారు. శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని నియమించాలని తెలిపారు. అలాగే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ సమన్వయంతో నియమించాలని అటవీ శాఖను ఆదేశించారు. సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

మల్లన్న సాగర్ కు వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్ళా..? హరీష్ కు పొన్నం ప్రశ్న..

మల్లన్న సాగర్ కు వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్ళా..? హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రతిపక్షం గుడ్డిగా మాట్లాడుతుందని మండిపడ్డారు. వాస్తవాలు చెప్పాలి అని మా ప్రయత్నం అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి అయ్యాకా.. ప్రారంభానికి వస్తా అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే.. హెలికాప్టర్ పేల్చేస్తం అన్నం అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండె కాయ లాంటిదని తెలిపారు. రిడిజైన్ చేసిన ఇంజనీర్ కానీ ఇంజనీర్ కేసీఆర్ కట్టుకథలు అల్లారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కుంగిపోతే.. కుట్ర జరిగింది అన్నారని తెలిపారు. మిడ్ మానే రు నుండి వరంగల్ వరకు రిజర్వాయర్లు నింపింది ఎల్లంపల్లి నుండే అని క్లారిటీ ఇచ్చారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకున్నది ప్రభుత్వం అన్నారు.

సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ దేవుడే నా నోట నిజాలు చెప్పించాడేమో..?

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. రామతీర్థంలో రాములవారి విగ్రహం తల తొలిగిస్తే దిక్కులేదు.. కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలా ఒక్కటని కాదు.. నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులేదు అన్నారు.. నాటి ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్లతో ఆడుకున్నారు. ప్రజల మనోభావాలకు గత ప్రభుత్వం విలువ ఇవ్వలేదు. పోలవరం, అమరావతి నాశనం చేసి.. వాటిపైనా ఎదురు దాడి చేసి తప్పుడు ప్రచారం చేశారు. బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో.. నేడు ప్రకాశం బ్యారేజ్ కు బోట్ల విషయంలో అలాగే మాట్లాడుతున్నారు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చాను అన్నారు..

క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి..

క్రియేటివ్ గా ఆలోచించండి.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి అన్నారు. నేను తెలుగు అర్దం చేసుకోగలను… కానీ మాట్లాడలేనని తెలిపారు. ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు పురుషులతో పోలిస్తే స్మార్ట్ అన్నారు. ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది.. మహిళలు దేనికైనా అడ్జెస్ట్ అవ్వగలరని తెలిపారు. ఒక్కొక్క బంధంలో అడ్జెస్ట్ అవ్వగలదు.. అవసరమైతే కంట్రోల్ చెయ్యగలదన్నారు. భారత దేశంలో అనేకమంది మహిళా ఉపాధ్యాయురాళ్ళు ఉన్నారని తెలిపారు. జీవితంలో అనేక సమస్యలు చూసాను.. సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలన్నారు. స్థిత ప్రజ్ఞత ఉండాలి… విద్యకు లింగ విభేదం లేదు.. విద్యా అందరి హక్కు.. అన్నారు. ఎక్కడ ఉంటే అక్కడే ప్యాలస్ లాగా మార్చుకోవాలన్నారు. అధైర్య పడకు..
రియాలిటీ లో ఉండాలి.. అని తెలిపారు. కలలు కనండి.. కానీ రియాలిటీ లో ఉండి ఆలోచించండి అన్నారు. క్రియేటివ్ గా ఆలోచించండి.. ఎప్పుడు నాలెడ్జ్ నీ సంపాదించండి అన్నారు. అన్ని పుస్తకాల్లో ఉండవు… సమాజాన్ని కూడా బోధించాలన్నారు. విద్యార్థుల స్ఫూర్తిని నింపేవిధంగా మన బోధన ఉండాలన్నారు. కష్టాలు..సుఖాలు వస్తాయి… కానీ ఏదీ పేర్మినెంట్ కాదు… అది ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు.

మా హయాంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం..

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్‌.. విజయవాడలో సీఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్‌ ప్రణాళికలపై మాట్లాడారు.. 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.. ఏపీలో ఉద్యోగ కల్పన చాలా అవసరం… ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా లక్ష్యంగా పేర్కొన్నారు.. వ్యవసాయం, MSME రంగాలకు ఏపీ ఒక కేంద్రంగా ఉంది.. చంద్రబాబు సీఎం అయిన ప్రతీసారీ కొత్తగా ముందుకెళుతున్నారు.. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు చంద్రబాబు మాట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా అభివర్ణించారు.

మెడికల్ కాలేజీలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేశాం

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు శనివారం మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించండం కోసం బైక్ అంబులెన్సు ఎంతో ఉపయోగ పడుతుందని ఆమె అన్నారు. కంటైనర్ స్కూల్ మా ప్రాంతంలో ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతంలో వైద్యులు రాక ఇబ్బంది పడుతున్నామన్నారు మంత్రి సీతక్క. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం పంపించామని, గ్రామీణ ప్రాంత బిడ్డలకు సేవ చేయడం వృత్తికి ఇచ్చే గౌరవమన్నారు మంత్రి సీతక్క. మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేసే దశలో ఉన్న వాటికి మేము జీవం పోసామని, మెడికల్ కాలేజీలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేశామన్నారు. అంతేకాకుండా.. మారుమూలా అటవీ ప్రాంతాల్లో ఎంత సేవ చేస్తే అంత మంచి పేరు సంపాదించవచ్చు అని, కష్టమైనా ఇష్టంగా మలుచుకొని ట్రైబల్ ఏరియాలో పనిచేయండన్నారు సీతక్క. ముఖ్యంగా వైద్యులు ముందుకు వచ్చి గిరిజన గ్రామాల్లో సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా?.. అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు, అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు అన్నారు. కోర్టుల దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదు.. 200 మంది పోలీసులు వచ్చి ధ్వంసం చేశారు.. ల్యాండ్ సీలింగ్ కేసు ఉందని నా కుటుంబ సభ్యులకు చెందిన చెరువులు ధ్వంసం చేశారు.. అడిగితే ఈ భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉందని అధికారులు చెప్తున్నారు అని ఆయన మండిపడ్డారు. 2005లో ఈ భూమి నేను కొన్నాను.. రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్ ప్లస్ ల్యాండ్ కాదని గతంలోనే చెప్పారు.. ఆర్డీఓ నెల రోజుల కిందట నోటీసు ఇచ్చారు.. దానికి సమాధానం ఇచ్చాం.. 11 ఎకరాల 38 సెంట్లు ఎక్కువ ఉందని తీసుకుంటున్నాము అని చెప్తున్నారు అని తోట త్రిమూర్తులు అన్నారు.

దేవుడిని అడ్డం పెట్టుకుని జగన్పై కక్ష తీర్చుకోవద్దు..?

ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, తెలుగు ప్రజల మధ్య తిరుమల లడ్డూపై చర్చ జరుగుతుంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ను రాజకీయంగా అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ పై బురద చల్లుతున్నారు.. బుడమేరు, ఏలురుకు వచ్చిన వరదను కూడా జగన్ మీద ఆరోపణ చేస్తున్నారు.. ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర చేశారని జగన్ పై ఆరోపణ చేశారు.. అలా చేసిన ఆరోపణల కుట్రలో భాగమే లడ్డూపై చేస్తున్న వివాదం అని ఆయన పేర్కొన్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని చెప్పడం దుర్మార్గం అని అంబటి రాంబాబు అన్నారు.

రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఫిర్యాదు..

రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన సమయంలో రిజర్వేషన్లు, సిక్కులపై మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బెంగళూర్‌లోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని విభజన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, భారత అంతర్గత భద్రత, సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ న్యాయమైన ప్రదేశం అయినప్పుడు రిజర్వేషన్లను రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అన్నారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో విద్యార్థులతో తన సంభాషణల సమయంలో రిజర్వేషన్లపై ఆయన వ్యా్ఖ్యానించారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీ వర్గాలకు ఇప్పటికీన వ్యవస్థలో తగిన భాగస్వామ్యం కల్పించబడలేదని, భారతదేశం అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత లేదని ఆయన అన్నారు.