Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఐదు వేల పెన్షన్.. ఐదేళ్లలో ఎందుకు ఇవ్వలేదు..? కేసీఆర్ కు రేవంత్‌ ప్రశ్న..

ఐదు వేల పెన్షన్ ఇస్తా అని ఇప్పుడు అంటున్నారు కేసీఆర్.. మరి ఐదేళ్లు ఎందుకు ఇవ్వలేదు? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజాం రాజు లెక్క కేసీఆర్ మన మీద పెత్తనం చేలాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు స్వేచ్చ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం రాజునే తిరస్కరించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఆకలిని ఐనా భరించారు కానీ.. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిగే ఉరుకోలేదన్నారు. తెలంగాణ వాసన లేకుండా చేశారు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో స్వేచ్ఛ.. సామాజిక న్యాయం జరగలేదన్నారు. మరో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల ప్రజలు కోరుకునే స్వేచ్ఛ..సమాన అభివృద్ధి ఇచ్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టో అని అన్నారు. ఎన్నికల మాదిరిగా కాకుండా ఉద్యమంగా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐదు వేల పెన్షన్ ఇస్తా అని ఇప్పుడు అంటున్నారు కేసీఆర్.. ఐదేళ్లు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఇచ్చే ఆదాయం ఉండగా.. ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ పై పేటెంట్ కాంగ్రెస్ ది. చెప్పుకునేది లేక..కేసీఆర్ కాంగ్రెస్ తప్పుడు మాటలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ సారూ.. 31 ప్రశ్నలకు జవాబు చెప్పి ఓట్లు అడగండి..

కేసీఆర్‌ సారూ.. 31 ప్రశ్నలకు జవాబు చెప్పి ఓట్లు అడగాలని ఎంపీ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రముఖ్యమంత్రిగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా మీ 9 ఏళ్ల పాలనలో ఒరగబెట్టిందేమిటో 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్‌ అన్నారు. మీ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలలోకి పోతే మీ అసమర్థ పాలనపై 1000 ప్రశ్నలను అడిగినా సరిపోదన్నారు.

బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా, నిరంతరం ప్రజల కోసం నిరంతరం పాటుపడే బీజేపీ 4 కోట్ల తెలంగాణ ప్రజల తరుపున అడుగుతున్న ఈ 31 ప్రశ్నలకు కనీసం ఈ ఎన్నికల సందర్భంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీరు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా, పార్టీగా మీరు ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నామన్నారు.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృత్త్యువాత పడ్డారు. వివరాలలోకి వెళ్తే.. ఆదివారం రాజస్థాన్‌ లోని చురు జిల్లా లోని సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జుంజునులో నిర్వహించనున్న ప్రధాని ర్యాలీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నివేదికల సమాచారం ప్రకారం.. నాగౌర్‌లోని ఖిన్‌వ్సర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆరుగురు పోలీసులు అలానే మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు జుంజునులో నిరవహించనున్న ప్రధాని ఎన్నికల సమావేశానికి విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైలో కారులో ఝుంఝునుకు బయలుదేరారు. కాగా కారు సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కనుటా పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 58పై ట్రక్కును ఢీకొట్టింది.

పల్లెల్లో అడుగడుగున ఘన స్వాగతం.. కొత్త మనోహర్ రెడ్డి కి జై కొడుతున్న జనం

అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులే ఉండటంతో పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ వారి చేసిన అభివృద్ధిని తెలుసుపుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మహేశ్వరం నియోజకవర్గం BSP అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్త మనోహర్ రెడ్డికి పల్లెల్లో అడుగడుగున ఘన స్వాగతం లభిస్తుంది…సేవచేయడానికి డబ్బు, మద్యం, అధికారం ఏవి పనికిరావు అని నిరూపిస్తూ కొత్త మనోహర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. దీంతో కొత్త మనోహర్ రెడ్డికి పల్లె ప్రజా దండు జై కొడుతున్నారు. మాట ఇచ్చినట్టే మనోహర్ ప్రతి నిరుపేద కుటుంబానికి 60 గజాల ఉచిత స్థలం, కొందరు ప్రముఖులు కబ్జా చేసిన భూమిని పేద ప్రజలకు పంచుతూ ప్రజాదరణ పొందుతున్నారు.

ఇలాంటివి ప్రజలకు ఇంకా నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేదని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం కబ్జాదారుల చేతుల్లో ఉందని ఆరోపించారు. బీఎస్పీకి ఓటు వేసి వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కొందరు బీఆర్ఎస్ ,కాంగ్రెస్ అభ్యర్థులు వలస పక్షులుగా వస్తున్నారని మండిపడ్డారు. వారిని నమ్మొద్దని ఆయన కోరారు. బీఎస్పీ అన్నీ వర్గాలకు సముచిత స్థానం కల్పించే పార్టీ అని తెలిపారు. మా పార్టీని ఆదరించాలని కొత్త మనోహర్ రెడ్డి కోరారు. ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. 3 వేల మందికి 60 గజాల స్థలాలను అందించామని కొత్త మనోహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏనుగుకు గుర్తుకు ఓటు వేయాలని బీఎస్పీకి గెలిపించాలని మనోహరన్ గెలిపిద్దామని ప్రజలు కోరుతున్నారు.

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ‘ధూమ్’ డైరెక్టర్.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ గాద్వి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.. ఆదివారం రోజు మార్నింగ్ వాక్ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.. సంజయ్ గాద్వి ఆదివారం రోజు ఉదయం లోకండ్ వాలా బ్యాక్ రోడ్ లో మార్నింగ్ వాక్ చేస్తూ గుండెనొప్పికి గురయ్యారు. వేగంగా ఆయన్ని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ మరణించారు..

ఆయన అంత్యక్రియలను సాయంత్రం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈయన లెజెండరి డైరెక్టర్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరాకెక్కించారు.. ధూమ్ ప్రాంచైజీలో మొదటి రెండు చిత్రాలని సంజయ్ గాద్వి తెరకెక్కించారు. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచారు. ధూమ్ సినిమాలతో సినిమాలు ట్రాక్ మార్చాయి.. అప్పటి నుంచి యాక్షన్ సినిమాలు దర్శనమిస్తున్నాయి..

కర్ణాటక గురించి మాట్లాడటం కాదు.. తెలంగాణలో ఏం చేశారు.. కేసీఆర్‌ పై ప్రియాంక ఫైర్‌

కర్ణాటక గురించి మాట్లాడటం కాదు.. 10ఏళ్లుగా తెలంగాణలో ఏం చేశారు కేసీఆర్‌ గారూ.. అంటూ ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. ” కాంగ్రెస్ విజయభేరి యాత్ర ” ఖానాపూర్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. క్రికెట్ వల్డ్ కప్ ఉన్నపటికీ నాకోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ జల్ జంగిల్ జమీన్ కోసం కొట్లదినవరు ఉన్నారన్నారు. ఆదివాసీ సమాజం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు పక్క పట్టాలను ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 సంవత్సారాలు ఔతున్న ఆమె అందరి మదిలో ఉన్నారని అన్నారు. ఇందిరా గాంధీ చేసినా మంచి పనులే ఆమెని మీకు దగ్గర చేశాయనిత తెలిపారు. మీరు ఇచ్చిన అధికారాన్ని అంతే బాధ్యతగా కాంగ్రెస్ నిర్వహించిందని తెలిపారు. తెలంగాణా ప్రజల ఇబ్బందులు చూసి స్వరస్వం ఇచ్చిందని తెలిపారు. తెలంగాణా ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ ఆగం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా ఏ ఉద్దేశంతో ఇచ్చారో అది నెరవేర్చలేదని మండిపడ్డారు.

ప్రజలతో అధికార బంధం కాదు.. పేగు బంధం ఉంది..

10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రజలది మాది అధికార బంధం కాదు, పేగు బంధం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ అహంకారంతో వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఎలాంటి లక్షణాలు లేవని, అధికారం మాత్రమే కావాలన్నారు. హరిత తెలంగాణ అగమ్యగోచరంగా మారవద్దని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు దావ వసంత్ కవిత మహిళా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఉన్నాయని, ఇతర పార్టీల నుంచి వచ్చి ఇస్తామని చెబుతున్నారని, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్లుగా అవకాశం ఇస్తే ఏం చేసి ఉండేదన్నారు. కాంగ్రెస్‌కు 55 ఏళ్లు అనుమతిస్తే పెన్షన్ రూ. రూ.200 ఇచ్చినా రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతో బీఆర్‌ఎస్ పార్టీకి గాఢమైన అనుబంధం ఉందని, ఏమీ లేకపోయినా ప్రజలతోనే ఉన్నామని, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినప్పుడు ప్రజలతోనే ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉన్నామన్నారు. పదేళ్లలో తెలంగాణ సస్యశ్యామలమైందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఏది చెబితే అదే చేశారన్నారు.

కేసీఆర్‌పై కొట్లాడితే నాపై 74 కేసులు పెట్టారు.. అయినా డోన్ట్ కేర్

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు బండి సంజయ్ నారాయణఖేడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన అన్నారు. కేసీఆర్‌పై కొట్లాడితే నాపై 74 కేసులు పెట్టారు.. అయినా డోన్ట్ కేర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒవైసీకి సవాల్ చేసి పాతబస్తీలో సభ సక్సెస్ చేసి సత్తా చాటినమని, 12 శాతం ఓట్లకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారన్నారు బండి సంజయ్‌. కేసీఆర్… అయోధ్యలో రాముడు జన్మించారా? లేదా? చెప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. పొరపాటున కేసీఆర్ కు అవకాశమిస్తే… రాముడు అయోధ్యలోనే పుట్టలేదంటాడు? అని బండి సంజయ్‌ అన్నారు. ఆదిలాబాద్ పటాన్ చెరువు నారాయణఖేడ్ నియోజకవర్గం మీదుగా రైల్వే లైన్ ను తీసుకొస్తామని, లింగాయత్, ఆరె మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియ పూర్తి కావొచ్చిందన్నారు.

‘‘మోడీ బౌలింగ్.. అమిత్ షా బ్యాటింగ్’’.. సంజయ్ రౌత్ సెటైర్లు..

ఈ రోజు జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై యావత్ భారత్ ఆశలు పెట్టుకుంది. ఇండియన్ ఫ్యాన్స్ రోహిత్ సేన వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచు కోసం లక్షలాది మంది చేరుకున్నారు. దీనికి తోడు ప్రధాని మోడీతో పాటు ఆస్ట్రేలియన్ డిఫ్యూటీ పీఎం, విదేశీ రాయబారులు, బాలీవుడ్ సెలబ్రెటీలు వస్తున్నారు. దీంతో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదిలా ఉంటే క్రికెట్ మ్యాచుని ప్రస్తావిస్తూ శివసేన(ఉద్ధవ్) వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీపై సెటైర్లు వేశారు. ‘‘మోడీ బౌలింగ్ చేస్తారు, అమిత్ షా బ్యాటింగ్ చేస్తారు, బీజేపీ లీడర్స్ బౌండరీ దగ్గర నిలబడుతారు. వారు ప్రధాని మోడీ అక్కడ ఉన్నందువల్లే ప్రపంచకప్ గెలిచారని చెప్పుకుంటారు.’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ సంఘటన రాజకీయంగా మారుతోందని రౌత్ అన్నారు. మరణమైనా, క్రీడాపోటీలైనా, అంతా రాజకీయంగా మారిందని అన్నారు. ఈ రోజుల్లో ఈ దేశంలో ఏదైనా జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ నెల 30 తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు

మధిరలో మల్లు భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జానకీపురం గ్రామంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదన్నారు. నేనిక్కడే ఉంటాను.. నాకు ఓటేయండని బీఆర్ఎస్ అభ్యర్థి అంటున్నారని, బీఆర్ఎస్ పార్టీనే ఉండడం లేదు.. ఇక ఆ పార్టీ అభ్యర్థి ఎక్కండుంటారు..? అని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయలేదని, రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆరోగ్య శ్రీ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. రోడ్లేసింది కాంగ్రెస్ అని, కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అని, అభివృద్ధి చేయని బీఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు భట్టి విక్రమార్క. అంతేకాకుండా.. సంపదను పేదలకు పంచబోతున్నామన్నారు భట్టి విక్రమార్క. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని ఆయన విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇస్తున్నారు. ఆరు హామీలకు సంబంధించి భట్టి విక్రమార్క గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరు హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల గురించి ఆయన ప్రజలకు హామీలు ఇస్తున్నారు.

 

Exit mobile version