NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణం..

రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని హోదాలో ఉండి మత విద్వేషాలను రెచ్చగొడు తున్నారన్నారు. స్వార్ధ రాజకీయాలకోసం మీరు దేశాన్ని ఎటు వైపు తీసుకపోవాలని అనుకుంటున్నారు మోడీ అన్నారు. ఆర్టీసీ బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మోడీ తప్పు పడుతున్నారన్నారు. మహిళల పట్ల మోడీకి ఉన్న వివక్షత అర్ధమౌతుందన్నారు. మోడీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ద్వంద వైఖరి ని అవలంబిస్తున్నాడన్నారు. దేశంలో బుల్ డోజర్ కల్చర్ ను తెచ్చింది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ కాదన్నారు. ఫైజాబాద్ కోర్ట్ తీర్పు ను గౌరవించి 1989 లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. అయోధ్య రామ్ లాల్లో గేట్లు తెరిచాడన్నారు.

కేజ్రీవాల్ తో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భేటి.. అసలేం చర్చించారు?

ఢిల్లీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విభవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. పార్టీలో రాఘవ్ కీలక నేత అన్న విషయం తెలిసిందే. ఆప్ లో పార్టీలో చేరిన ఆయన పార్టీలో అనేక ప్రధాన బాధ్యతలను నిర్వర్తించారు. కాగా.. ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ సమయంలో రాఘవ్‌ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. బీర్లు అడిగాడని యువకుడిపై దాడి

మద్యం షాప్ లో బీరు అడిగినందుకు ఓ యువకుడిని చావగొట్టారు వైన్స్‌ షాపు నిర్వాహకులు. ఈ దాడిలోగాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది . అడ్డాకుల మండలం బలీద్‌పల్లి చెందిన శ్రీ కాంత్‌ (26) గత నెల 26న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం శివారులోని బండమీదిపల్లిలో ఉన్న శ్రీమల్లికార్జున వైన్స్‌ వద్దకు వెళ్లి బీర్‌ కావాలని షాప్‌ నిర్వాహకులను అడిగాడు. అయితే బీర్ల షాటేజ్ కారణంగా ఎక్స్ట్రా రేట్ కు విక్రయిస్తున్న వైన్స్‌ నిర్వాహకులతో శ్రీకాంత్ కు మాటా మాటా పెరిగింది . రెచ్చిపోయిన వైన్స్‌ షాప్‌ నిర్వాహకులు.. మరో పది మందిని తీసుకొచ్చి శ్రీకాంత్‌ను బలవంతంగా షాపులోకి ఈడ్చుకెళ్లారు.

లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌.. నినాదాలు చేసిన అభిమానులు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగియడంతో.. విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్ట్‌) నుంచి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి బయలుదేరిన సీఎం జగన్‌.. ఇవాళ మధ్యాహ్నం లండన్‌ చేరుకున్నారు. జగన్‌ లండన్‌ విమానాశ్రయంలో దిగగానే.. అక్కడ కూడా జై జగన్‌ అంటూ నినాదాలు మారుమోగాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. చిరునవ్వుతో జగన్‌ ఎయిర్‌పోర్టులో ఉల్లాసంగా కనిపించారు. ఈ నెల 31వ తేదీ తిరిగి బెజవాడ చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డీజీపీతో సిట్ సారథి వినీత్ బ్రిజ్‌ లాల్ భేటీ

ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనలపై సిట్‌ విచారణ జరుపుతోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇప్పటికే పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్టు డీజీపీకి సిట్ సారథి వినీత్ తెలిపారు. ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సిట్‌ ముందు పరిశీలించనుంది. ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా, లేకా సెక్షన్లు మార్చాలా అని సిట్‌ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు కేసులు పెట్టక పోతే కొత్తగా కేసులు నమోదు చేయించనుంది సిట్ బృందం. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీయనుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం నివేదికను ఎన్నికల సంఘానికి సిట్ అందజేయనుంది.

హైదరాబాద్‌లో మరో ప్రీ-లాంచ్‌ ఆఫర్‌ మోసం

కొంపల్లి ప్రాంతంలో నివాస గృహాలు నిర్మిస్తామని మాయమాటలతో ‘ప్రీ లాంచ్ ఆఫర్ల’ పేరుతో పెట్టుబడిదారుల నుంచి దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, కంపెనీ ఎండీ ముల్పూరి శివరామ కృష్ణ, కంపెనీ సీఈవో తొడ్డాకుల నరసింహారావు కూడా ఉన్నారని శనివారం అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 406, 420, తెలంగాణ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-1999లోని సెక్షన్‌ 5 కింద కేసులు నమోదు చేశారు. కంపెనీ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ ముల్పూరి శివరామ కృషా 2021లో భారతి బిల్డర్స్‌ను ప్రారంభించి, కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, “భారతి లేక్ వ్యూ” పేరుతో నివాస అపార్ట్‌మెంట్లను నిర్మించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియామకం.. ఈసీ ఉత్తర్వులు

పల్నాడు కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల నియామకంపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు, ఆ తర్వాత అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడుతో పాటు తదితర జిల్లాల్లో 144 సెక్షన్‌ కూడా విధించారు. ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఎన్నికల సంఘం.. ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకువాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలకు ఆదేశించింది.

60 లక్షల సైబర్‌ మోసం నుంచి మహిళను కాపాడిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ

త్వరితగతిన, TS సైబర్ సెక్యూరిటీ బ్యూరో ( TGCSB )లోని సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ సైబర్ మోసానికి గురైన బాధితురాలిని రక్షించింది , ఆమె రూ.60 లక్షలను కోల్పోకుండా కాపాడింది. మే 15 సాయంత్రం, సైబర్ మోసగాడు, మహారాష్ట్ర పోలీసు అధికారి అని చెప్పుకుంటూ, మహిళకు ఫోన్ చేసి, పెద్ద మనీలాండరింగ్ నేరంలో ఆమె ప్రమేయం ఉందని అభియోగాలు మోపుతూ, ఆమెపై వారెంట్ పెండింగ్‌లో ఉందని ఆమెకు చెప్పాడు. మోసగాడు బాధితురాలిని రాత్రంతా స్కైప్ వీడియో కాల్‌లో ఉండమని బలవంతం చేశాడు , తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమెను బెదిరించాడు. బెదిరింపులకు భయపడిన బాధితురాలు చివరకు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్న ఖాతాకు రూ.60 లక్షలు వేసింది.

కడప గౌస్‌ నగర్‌ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్ సీరియస్

కడప గౌస్‌ నగర్‌లో పోలింగ్‌ రోజున సాయంత్రం జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్ సీరియస్‌ అయ్యారు. సంబంధిత పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు. వారికి ఛార్జ్ మెమో జారీ చేశారు జిల్లా ఎస్పీ. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి, కడప వన్ టౌన్ ఎస్సై రంగ స్వామి, తాలూకా ఎస్సై తిరుపాల్ నాయక్, చిన్నచౌక్ ఎస్సై మహమ్మద్ రఫీ, రిమ్స్ ఎస్సై యు.ఎర్రన్న, కడప టూ టౌన్ ఎస్సై మహమ్మద్ అలీ ఖాన్‌లకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.. నివేదిక వచ్చాక మరింత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత..

కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లార్‌రెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇవాళ వాగ్వాదానికి దిగారు. అయితే ఆ స్థలం తమదేనంటూ కొందరు వారిద్దరినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక సమాచారంతో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై మాల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు.