Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం..

విశాఖ పట్నంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ అధ్యక్షతన VMRDAలో జరిగిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. సమీప భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం అని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశాం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. మెట్రో ట్రైన్ కు సంబంధించిన ప్రతిపాదనలు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయ్ అని ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న విశాఖను అత్యంత నివాసయోగ సిటీగా మార్చడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం అంటూ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. మూడు జిల్లాల్లో విస్తరించిన మహా విశాఖ నగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రాజెక్టులపై సమీక్షించాం.. మెట్రో సహా అన్ని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దిపై జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేయనున్నారు అని ఆయన తెలిపారు.

మిషన్‌ గగన్‌యాన్‌లో 21న కీలక పరీక్ష.. ప్రధాని మోడీ సమీక్ష

అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ మిషన్‌ కీలక దశకు చేరుకోనుంది. గగన్‌యాన్ మిషన్ కింద అక్టోబర్ 21న టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం ప్రకటించింది. గగన్‌యాన్ మిషన్ సమయంలో వ్యోమగాముల భద్రతను నిర్ధారించడం దీని లక్ష్యం. పరీక్ష సమయంలో మాడ్యూల్ అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. అనంతరం మళ్లీ భూమిపైకి తీసుకొచ్చి బంగాళాఖాతంలో ల్యాండ్ చేయనున్నారు. ఈ నెల 21న టీవీ-డీ1 టెస్ట్‌ ఫ్లైట్‌ను శ్రీహరికోటలోని షార్‌లో ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి 9గంటల మధ్య టెస్ట్ చేపట్టనున్నట్లు ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ దశలో షార్‌ కేంద్రం నుంచి మనుషులు ఎవరూ లేకుండా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపి.. ఆ తర్వాత బంగాళాఖాతంలో పారాచూట్ల సాయంతో సురక్షితంగా ల్యాండ్‌ చేయనున్నారు.

టీవీ-డీ1 మాడ్యూల్‌ నిర్మాణం తుదిదశలో ఉందని.. ఈ మాడ్యూల్‌ 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత అబార్ట్‌ సీక్వెన్స్‌లో భాగంగా మళ్లీ భూమి మీదకు వస్తోందని ఇస్రో వెల్లడించింది. టీవీ-డీ1 టెస్ట్‌ ఫ్లైట్‌ను శ్రీహరికోటలోని షార్‌లో ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి 9గంటల మధ్య టెస్ట్ చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. మొదటి టెస్ట్ ఫ్లైట్ తర్వాత మరో మూడు టెస్ట్ మిషన్లు, D2, D3, D4 ప్లాన్ చేశామన్నారు.

అంత కష్టపడి చేస్తే సె* క్లిప్ అంటారా.. హానీ పాప ఆవేదన

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి “ఎఫ్ 2,” “రాజా ది గ్రేట్,” “మహానుభావుడు” వంటి తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు పొందిన మెహ్రీన్ పిర్జాదా ఈమధ్యనే ఒక వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె చేసిన సీన్ లో ఆమె కాస్త ఘాటుగా రొమాన్స్ చేయడంతో ట్రోల్స్‌కు గురి అయింది. మెహ్రీన్ పిర్జాదా “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ” అనే వెబ్ సిరీస్‌లో తన OTT అరంగేట్రం చేసింది. ఈ సిరీస్ లో ఆమె సెక్స్ సన్నివేశాలతో పాటు లిప్-టు-లిప్ కిస్ సన్నివేశాలలో కూడా చాలా చలాకీగా కనిపిచింది. అయితే ఈ సిరీస్ విషయంలో మెహ్రీన్ నెటిజన్ల నుండి నెగటివ్ ట్రోల్స్, ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ప్రీమియర్ అయినప్పటి నుండి మీమ్స్, ఆ సీన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ట్రోల్స్‌పై స్పందిస్తూ, అలాంటి సన్నివేశాలలో నటించడంపై తన వైఖరి గురించి ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ సీన్స్ పబ్లిక్ నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా, ఒక ప్రొఫెషనల్ యాక్టర్‌గా, కథాంశానికి అనుగుణమైన సీన్ లో నటించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది.

మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం

జందాపుర్ నుంచి బోరాజ్ వరకు బీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం బోరాజ్ లో జోగు రామన్న కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లు అధికారం లోకి వచ్చేది లేదు ఇచ్చేది లేదన్నారు. మోడీ అన్ని వర్గాలను మోసం చేసారని, మెడీ నల్ల చట్టాలు తెచ్చారన్నారు జోగు రామన్న. 4 వందలు ఉన్న గ్యాస్ ధర ను 12 వందలు చేసిన ఘనత మోడీదే అని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట తప్పకుండా మేనిఫెస్టోతో పాటు అందులో లేని వాటిని సైతం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని జోగు రామన్న కొనియాడారు. కాంగ్రెస్ వి బట్టేవాజ్ పనులు అని, మహిళలకు కర్ణాటకలో బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారని, మగవాళ్ళు మాత్రమే బస్సు ఎక్కాలే అని బోర్డు పెట్టారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలేనని, వేశాలు మార్చి వస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీ లకు అడ్రస్ ఉండదన్నారు జోగు రామన్న

సీఎం జగన్ కు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ

తెలుగు దేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సీఎం జగన్ కు లేఖ రాశారు. మూడో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలి.. రాష్ట్రంలో ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహణపై ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించాలంటూ ఆయన అన్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన అంశంపై మీనమేషాలు లెక్కించడం సరికాదు అంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖలో వెల్లడించారు.

ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఎంసెట్ రాస్తుంటారు అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇప్పటి వరకు ప్రతేడాది 3 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది అర్ధాంతరంగా 2 కౌన్సెలింగ్ లకే పరిమితం చేశారు.. తమకు నచ్చిన కళాశాలలో సీటు, ఎంచుకున్న కోర్సు రాలేదని.. చాలా మంది 2, 3 కౌన్సెలింగ్ లకు వరకు వెళ్తుంటారు ని ఆయన చెప్పారు. కానీ.. విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. 3వ కౌన్సెలింగ్ క్యాన్సిల్ చేసి, స్పాట్ అడ్మిషన్లకు మాత్రమే అనుమతిస్తామని చెప్పడం సరికాదు అంటూ టీడీపీ ఎంపీ ఆరోపించారు. ఇది కేవలం కళాశాలల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చేదే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. వెంటనే ఇలాంటి చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో 3వ విడద కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం

కరీంనగర్ ప్రజలు రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఈ సభకు మంత్రి కేటీఆర్‌ హజరవుతారని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇవాళ ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఫోటోతో ఎలక్షన్లకు వెళ్తున్నామని, తొమ్మిదో తారీఖున నామినేషన్ పదో తారీఖున రెండో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీకి స్థానం లేదని, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌ని తీర్చిదిద్దుతామన్నారు మంత్రి గంగుల. హుజురాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ గతంలో కాంగ్రెస్ తో కుమ్మక్కై గెలుపొందారన్నారు.

మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా భవన నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. అంతకు ముందు ఆయన.. మార్కాపురం మండలం మాల్యమంతుని పాడు గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగర్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష పథకంలో పాల్గొన్న ప్రజలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు వైద్యశాఖ సిబ్బంది.. ఈ నేపథ్యంలో కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న సురక్ష పథకం ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీదేనని వెల్లడించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలంతా సంతోషం గా ఉన్నారని, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు కూడా ఉచితంగా ఇస్తారని నాగార్జునరెడ్డి అన్నారు. గనన్న సురక్ష పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఉద్దేశంతో జగనన్న ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు ఒక గొప్ప వరమని తెలియజేశారు.

భూహక్కు-భూరక్షపై 15వ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం అధ్యక్షతన భేటీ అయింది. పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రుల సబ్ కమిటీ సమీక్షించింది. అయితే, వచ్చే ఏడాది జనవరి నాటికి మూడో దశ సర్వే పూర్తి కావాలి.. దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే మన రాష్ట్రంలోనే జరుగుతోంది అని సబ్ కమిటీ పేర్కొంది.

రెండు దశల్లో ఇప్పటి వరకు 4 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూహక్కు పత్రాలను కూడా పంపిణీ చేశారు అని మంత్రుల సబ్ కమిటీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తి చేశామన్నారు. కేంద్ర అధికారులతో పాటు అయిదు రాష్ట్రాల నుంచి సర్వే విభాగ కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించారు.. రాష్ట్రం అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి సర్వే పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు అని కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు అన్నారు.

నాతో వస్తా అన్న వారిని హరీష్ రావు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు

తెలంగాణలో ఎన్నికల వేళ పలు పార్టీల నుంచి నేతల మరోపార్టీల తీర్థం పుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీలో చేరారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్‌ నాయకులు రంజిత్ యాదవ్, పాశం గోపాల్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. అంతేకాకుండా.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, యడవల్లి చంద్రశేఖర్ రెడ్డి. కోదాడ నుండి ఓరుగంటి కిట్టు పలువురు తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల నగారా మోగిన తరువాత వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆశావాహులు చాలామంది బీజేపీలో చేరుతున్నారు. మీడియాలో చూపించకపోయినా.. ప్రజాక్షేత్రంలో బీజేపీనే సరైన వేదిక అని భావిస్తున్నారు. బీజేపీకి ఓటు వేయాలని కేసీఆర్ ను ఒడగొట్టాలని ప్రజలు భావిస్తున్నారు.

‘నన్ను విడిపించండి ప్లీజ్‌’.. హమాస్ చెరలో ఇజ్రాయెల్‌ యువతి.. వీడియో వైరల్

హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు చేయడంతో తీవ్రవాద సంస్థ ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. అక్టోబరు 7 నుంచి జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తొలిసారిగా హమాస్ ఓ వీడియోను విడుదల చేసింది. బాంబు దాడిని ఆపాలనే ఉద్దేశంతో బ్లాక్ మెయిల్ చేయడం కోసం హమాస్ ఈ వీడియోను రూపొందించింది. వీడియోలో 21 ఏళ్ల యువతి హమాస్ కమాండర్ నుంచి చికిత్స పొందుతోంది. వాస్తవానికి, 21 ఏళ్ల అమ్మాయి మియా షెమ్‌ను బందీగా ఉంచిన వీడియోను ఉగ్రవాద సంస్థ హమాస్ విడుదల చేసింది. వీడియోలో ఉన్న అమ్మాయి చాలా భయపడుతోంది. అయితే తాను పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు ఆమె చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే తనను త్వరగా అక్కడి నుంచి విడిపించాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని వేడుకుంది. ఆమెకు హమాస్ చికిత్స అందిస్తోంది.

పార్టీ తదుపరి కార్యాచరణపై పవన్ కళ్యాణ్-నాదెండ్ల మనోహర్ చర్చ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నేడు (మంగళవారం) ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణ పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది.

బ్రేకింగ్.. నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ

ట్టకేలకు టాలీవుడ్ కల నెరవేరింది. 69 ఏళ్లుగా ఒక టాలీవుడ్ హీరో అందుకోలేని అవార్డును.. ఎట్టకేలకు అల్లు అర్జున్ కైవసం చేసుకున్నాడు. నేడు ఢిల్లీలో ఈ జాతీయ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా గెలిచిన నటీనటులు అవార్డులు అందుకున్నారు. ఇక పుష్ప చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. వైట్ అండ్ వైట్ డిజైనర్ డ్రెస్ లో అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా కనిపించాడు.

ఇక అల్లు అర్జున్ స్టేజిమీదకు రావడంతోనే.. మిగతానటీనటులందరూ ఫొటోగ్రాఫర్లుగా మారిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్.. బన్నీ అవార్డు అందుకుంటున్న సమయంలో ఫోటో తీస్తూ కనిపించడం ఆకట్టుకుంటుంది. ఇక బన్నీతో పాటు పుష్ప సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ అవార్డును అందుకున్నాడు. ఇక వీరితో పాటు.. బెస్ట్ సినిమా ఉప్పెనకు గాను బుచ్చిబాబు సానా అందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ లో పెట్టింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట నేడు (మంగళవారం) పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్‌ లాయర్ హరీష్ సాల్వే తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును మాత్రం రిజర్వ్‌ చేసింది. అయితే, ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బంది పడొద్దనే సెక్షన్‌ 17ఏ చట్టం తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్‌ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారన్నారు. వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్‌ 422 సీఆర్‌పీసీ కింద క్వాష్ చేయలేమని రోహత్గీ తెలిపారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయ పన్ను దర్యాప్తులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ వాదించారు. జీఎస్టీ, ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయన్నారు.

 

Exit mobile version