NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..!

తెలంగాణలో డీఎస్సీ పరీక్షల హాల్‌ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బాగానే వున్నా డీఎస్సీ హాల్ టికెట్ల వ్యవహారం తెలంగాణలో చర్చకు దారితీసింది. అయితే.. దమ్మాయిగూడ బాలాజీనగర్‌కాలనీకి చెందిన రాంచంద్రయ్య వల్లెపు డీఎస్సీ రాస్తున్నాడు. ఇక హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగా వివరాలు సక్రమంగానే ఉన్నా ఫొటో, సంతకం మాత్రం అమ్మాయిది రావడంతో కంగుతిన్నాడు. డీఎస్పీ అప్లై చేస్తున్నప్పుడు ఎలా చేశారో తెలియదు కానీ.. హాల్‌ టికెట్లలో మాత్రం గందరగోళం చోటు చేసుకుంది. డీఎస్సీ అప్లై కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, అప్లికేషన్ ఫారమ్ లింక్ చేసేప్పుడు ఎలా చేశారో ఏంటో అంటూ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. దరఖాస్తు ప్రక్రియదారులపై మండిపడుతున్నారు. ఇలా రాంగ్‌ వచ్చిన హాల్‌ టికెట్లపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. మేము కూడా పరీక్షలు ఏ విధంగా రాయాలనేదానిపై ప్రశ్నలు వస్తున్నాయని వాపోతున్నారు. ఇన్ని రోజులుగా డీఎస్సీ కోసం ఎదురు చూసామని, ఇప్పుడు తీరా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి డీఎస్సీ ప్రకటిస్తే తప్పులతో విద్యార్థుల జీవితాలు గాడితప్పుతున్నాయని కన్నీరుమున్నీరుగా విలపిస్తు్న్నారు. ఇది ప్రభుత్వం తప్పిదం అంటూ వార్తలు వస్తున్నాయని ఇదంతా అపద్దమని తెలిపారు. అప్లై చేసేందుకు వెళ్లినవారు కంప్యూటర్ల వద్దకు చాలా మంది అభ్యర్థులు వస్తారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. అసలే డీఎస్సీ వాయిదా వేయాని కొందరు అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం యువత భవిష్యత్తును ఆలోచించి డీఎస్సీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో హాల్‌ టికెట్‌ లో ఇలా గందరగోళంపై సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.

నాలుగు నెలలు మాత్రమే.. నైనీ బొగ్గు ఉత్పత్తి పై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు..

మరో నాలుగు నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిర్వాసిత గ్రామ ప్రజలకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, సీఎస్ఆర్ పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. కాలక్రమ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు. నైని బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో, సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు, తదుపరి ఆ స్థలం అప్పగింత పై ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఈ పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని ఆయన సింగరేణి సంస్థను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్ కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. హై టెన్షన్ విద్యుత్తు లైను ను వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ తో సంప్రదిస్తూ ముందుకు సాగాలని కోరారు. పునరావాస, నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్.పి.డి.ఏ.సి. మీటింగ్ ను అతి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో వర్షం బీభత్సం.. ఇప్పటివరకు 40 మంది మృతి

తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ఇక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారింది. కుండపోత వర్షాల కారణంగా ఇక్కడ 40 మంది మరణించగా, దాదాపు 350 మంది గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా పరిస్థితి దారుణంగా ఉంది. జనజీవనం కష్టతరంగా మారింది. రోడ్లతో పాటు ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. వర్షం కారణంగా అపార నష్టం వాటిల్లింది. సోమవారం వర్షం, మెరుపుల కారణంగా సుర్ఖ్ రాడ్ జిల్లాలో ఓ ఇంటి పైకప్పు కూలిపోయిందని ప్రాంతీయ అధికార ప్రతినిధి సెడిఖుల్లా ఖురేషి తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. వర్షం కారణంగా దాదాపు 400 ఇళ్లు, 60 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని ఖురేషీ తెలిపారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పాటు భారీగా నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

డీఎస్సీ విద్యార్థులు అలర్ట్‌.. రేపటి నుండి పరీక్షలు..

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజు రెండు సెషన్ లలో డీఎస్సీ నిర్వహించనున్నారు అధికారులు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 2 లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు పరీక్షలకి దరఖాస్తు చేసుకున్నారు. ఒకవైపు పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.

రేపే రైతుల ఖాతాల్లోకి రుణ మాఫీ సొమ్ము.. కార్డు లేకున్నా వర్తింపు..

రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు (గురువారం) సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో రూ.లక్ష వరకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 70 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయని తెలిపారు. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని.. వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులు లేనంత మాత్రాన రైతులకు అన్యాయం జరగనివ్వమి సీఎం అన్నారు. రుణమాఫీ చేస్తామన్న రైతువేదికలకు రైతులను తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ ఆనందాన్ని వారితో పంచుకోవాలి. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారి అందుబాటులో ఉంటారని అన్నారు. కలెక్టర్లకు ఏవైనా సందేహాలుంటే వారిని సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు సీఎం. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు.

త్వరలోనే నూతన మద్యం పాలసీ..

త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్‌ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం కుటుంభసభ్యులతో కలసి తిరుమల విచ్చేసిన కొల్లు రవీంద్ర.. ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. రాష్ట్రాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధోగతి పాల్జేసిందని మండిపడ్డారు.. గత పాలకులు సాగించిన ఆరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు వుంచుతున్నామని తెలిపారు.. ఇక, త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేత పత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడిండారు మంత్రి కొల్లు రవీంద్ర..

మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. కువైట్ నుంచి సొంత గ్రామానికి చేరుకున్న శివ

కువైట్‌లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఓ తెలుగు కార్మికుడు సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్‌.. ఎట్టకేలకు తన మాటను నెలబెట్టుకున్నారు. ఏపీ ప్రభుత్వం చొరవతో కువైట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ కువైట్‌ నుంచి తన స్వగ్రామానికి చేరుకున్నారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్‌ చేసిన విషయం విదితమే. నెల రోజుల ముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏజెంట్ సాయంతో కువైట్‌ వెళ్లిన శివను అక్కడ పని పేరుతో హింసకు గురి చేశారు. దీంతో తనను కాపాడాలని, లేకపోతే మరణమే శరణ్యం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎంబసీని సంప్రదించి శివను ఇండియాకు రప్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శివను ఇండియాకు రప్పించేలా ఏర్పాట్లు చేయడంతో సురక్షితంగా సొంత గ్రామానికి చేరుకున్నాడు. శివ సేఫ్‌గా ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్, చంద్రబాబు, పవన్‌కు శివ, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శివ సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శివ సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబానికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు.

దారుణం..చేయని నేరానికి 11 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి..

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ నిరుపేద గ్రామస్థుడు చేయని నేరానికి 11 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ట్రయల్ కోర్టు, హైకోర్టు నిర్ణయం వల్ల ఇన్నాళ్లు జైలులో చిప్పకూడు తిన్నాడు. తాజాగా తడిని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం దోషిగా నిర్ధారించి విడుదల చేసింది. సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అసలేం జరిగిందంటే… ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని ఖరోరా గ్రామానికి చెందిన రత్ను యాదవ్‌ మార్చి 2, 2013న తన సవతి తల్లిని బలవంతంగా నీటిలో ముంచి చంపాడని పోలీసులు ఆరోపిస్తూ.. అరెస్ట్ చేశారు. ట్రయల్ కోర్టులో హాజరు పర్చగా.. 2013 జులై 9న ఫాస్ట్ ట్రాక్ విచారణ ద్వారా అతడిని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఏప్రిల్ 7, 2018న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. నిందితుల తరఫు న్యాయవాది ఎవరూ హాజరుకాకపోవడంతో, ప్రాసిక్యూషన్ రికార్డులో ఉంచిన సాక్ష్యాధారాలను పరిశీలించిన సుప్రీం కోర్టు.. న్యాయవాది శ్రీధర్ వై చిటాలేను అమికస్ క్యూరీగా నియమించింది. పోస్టుమార్టం నివేదికలో నీట మునిగి మృతి చెందినట్లు తేలిందని, అయితే అది హత్య అని నిరూపించే బాధ్యతను ప్రాసిక్యూషన్‌ చేయలేదని చితాలే అన్నారు. విచారణ సమయంలో నిందితుడు తన సవతి తల్లిని బలవంతంగా మానభంగం చేశాడన్న ప్రాసిక్యూషన్ కథనం విశ్వసనీయతను దెబ్బతీసిందన్నారు.

ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం

ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వమన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ నాయకులారా రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. తల ఎత్తుకొని … ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండని, మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని 25000 చొప్పున.. నాలుగు ద పాలుగా పూర్తి చేశారన్నారు భట్టి విక్రమార్క.

గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం

ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని ఆయన అన్నారు. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని, రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని, నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.