NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మొన్న ఎలుక.. నేడు పిల్లి.. జేఎన్టీయూహెచ్ హాస్టల్లో..

రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి బయటపడింది. హైదరాబాద్ మహానగరంలో నుంచి జేఎన్టీయూ క్యాంపస్ హాస్టల్ లో తాజాగా ఓ పిల్లి కలకలం సృష్టించింది.

ముగిసిన ఏపీ కేబినెట్‌.. కీలక నిర్ణయాలు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్నీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనుంది ఏపీ ప్రభుత్వం.. మరోవైపు.. పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం.. ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది..

రాష్ట్రానికి కొత్త కమిషన్ ఛైర్మన్.. కాసేపట్లో పేరు ప్రకటన..

కేసీఆర్ పదేళ్ల పాలనలో విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ను తొలగించి కొత్త వ్యక్తిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. విచారణ అధికారిని మార్చవచ్చునని స్పష్టం చేశారు. అయితే దీనిపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ మాట్లాడారు. ధర్మాసనం ప్రకటపై అడ్వకేట్ జనరల్ తో ముఖ్యమంత్రి రేవంత్ చర్చిస్తున్నారు. సీఎం కు అడ్వకేట్ జనరల్.. సీనియర్ జడ్జిల పేర్లు సూచించారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జడ్జి పేరును ప్రకటించనున్నారు.

అప్పుడు కామెంట్లు.. ఇప్పుడు కుట్రలు.. కడియం పై కేటీఆర్ ఫైర్

మా పార్టీలో ఉండి కడియం అప్పట్లో కామెంట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అర్ధం అవుతుంది కడియం కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పై స్పీకర్ కు పిటిషన్ సమర్పించామన్నారు. గతలో దానం పై పిటిషన్లు ఇచ్చాము.. తర్వాత స్పీడ్ పోస్ట్ లు ఇచ్చామన్నారు. ఇప్పుడు మళ్లీ మొత్తం10 మంది పై స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఫిరాయింపుల పై సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని తెలిపారు. గడ్డం ప్రసాద్ కు జడ్జిమెంట్ కాపీ చదివి వినిపించానని అన్నారు.

రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కు లింకు పెట్టొద్దు.. సీఎం కీలక ఆదేశాలు..

రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని తెలిపారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.

కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం భేటీ.. కీలక ఆదేశాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది.. పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్‌.. ఇక, మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం నెల రోజుల పని తీరుపై చర్చించారు.. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలంటూ మంత్రులకు కీలక సూచనలు చేశారు.. హెచ్‌వోడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెల సమీక్షలు చేపట్టాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.. తమ తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు.. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచనలు చేశారు.. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని.. మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు ఉద్భోదించారు ఏపీ సీఎం.. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా.. మంత్రులు సమన్వయంతో వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు..

జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగుల హర్షం

ఏపీలో జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వం వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేసి జీపీఎస్ తెచ్చిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. సీపీఎస్ ఉద్యోగులతో పాటు అందరూ దానిని వ్యతిరేకించారన్నారు. ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా బలవంతంగా జీపీఎస్ విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోను కొంతమంది అధికారులు అమల్లో తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. పాత ప్రభుత్వం తాలూకా వాసన ఇంకా అధికారులకు పోయినట్లు లేదన్నారు. జీపీఎస్ జీవో, గెజిట్ బయటికి రావడంపై మంది ఉద్యోగులు ఆందోళన చెందారు. జీవో నిలుపుదల ఆదేశాలతో ఉద్యోగులకు చంద్రబాబు ఊరటనిచ్చారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరి సంఖ్యను కోటికి పెంచి.. వారందరినీ కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 140 కోట్లు మొత్తంగా 480 కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాము.. ఈ రుణాలకు వడ్డీ 1566 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తుంది.. ఆర్థికంగా వారికి చేయూతనిస్తుందని, కొత్త విద్యుత్ పాలసీలో భాగంగా మహిళలను సోలార్ విద్యుత్ పైపు మళ్లించి ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు భట్టి విక్రమార్క. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇప్పించి.. బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విచారణ

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ విద్యుత్ కమిషన్ చైర్మన్ పై వాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. విచారణ కాకముందే ప్రెస్స్ మీట్ లు పెట్టీ చెప్పటం తప్పు అని చెప్పిందని ఆయన ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రిటైర్డ్ జడ్జి స్థాయిలో కమిషన్ వివరాలు చెప్పటం, పైన తీవ్రంగా తప్పుబట్టడం, ఛైర్మెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పటం అంటే ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విచారణ అని, విద్యుత్ కొనుగోళ్లు అప్పటి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలే అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని సక్రమంగానే జరిగాయని, కానీ అవేవీ పట్టించు కోకుండ ఛైర్మెన్ ఇష్టానుసారంగా మీడియాకు వివరాలు చెప్పారన్నారు ప్రశాంత్‌ రెడ్డి. ఎలాగైనా కేసిఆర్ ను ఇలా ఇరికించాలని చూసారని, అందుకే సుప్రీం తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందని ప్రశాంత్‌ రెడ్డి. తెలంగాణ సాధనే కరెంటు కోసమన్నారు ప్రశాంత్‌ రెడ్డి. బీడు భూములు సస్యశ్యామలం చేసేందుకు కేసిఆర్ అనేక ప్రణాళికలు చేశారని, కరెంట్ ఇచ్చి పరిశ్రమలు కాపాడాలని కేసిఆర్ బలమైన దీక్షతో కరెంట్ ఇచ్చారన్నారు ప్రశాంత్‌ రెడ్డి. 24 గంటల కరెంట్ ఇస్తే దేశ వ్యాప్తంగా కేసిఆర్ మంచి పేరు వస్తుందని బురద జల్లడానికి చిల్లర ప్రయత్నం చేసారని, కానీ ప్రభుత్వానికి రివర్స్ అయ్యిందని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి

రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్ళు అని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు, నేతలు… ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని రేవంత్ గతంలో చెప్పిన మాటల వీడియోను చూపిన ఈటల రాజేందర్‌.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలన్నారు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడతారని, విశ్వసనీయత లేని పార్టీలను ప్రజలు బొంద పెడతారని, తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారన్నారు ఈటల రాజేందర్‌. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదని, మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరని, ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదన్నారు ఈటల రాజేందర్‌.