NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో గిరిజనుల గొప్ప సహకారం ఉంది : ప్రధాని మోడీ

ధర్తీ అబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా బీహార్‌లోని జాముయ్‌లో ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించి, ఆయన పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 6000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను కూడా బహుమతిగా ఇచ్చారు. దీనితో పాటు గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేయడానికి గత ప్రభుత్వాలే కారణమని ప్రధాని మోడీ అన్నారు. గత ప్రభుత్వాల వల్ల గిరిజన సమాజం నిర్లక్ష్యానికి గురైందన్నారు. గిరిజన సమాజం దేశాభివృద్ధి రేసులో వెనుకబడింది. దేశ స్వాతంత్య్రానికి ఒక పార్టీ లేదా ఒక కుటుంబం సహకరించిందని, గిరిజన సమాజంలోని ఎందరో మహానాయకులు త్యాగాలు చేశారని ప్రధాని మోడీ అన్నారు. గిరిజన సమాజం చేసిన కృషికి చరిత్రలో సముచిత స్థానం దక్కలేదన్నారు. ఏళ్ల తరబడి గిరిజన సంఘం నిర్లక్ష్యానికి గురైంది. గిరిజన సమాజం, సహకారం, త్యాగాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం జరిగిందన్నారు.

నా జీవితంలో ఇలాంటి విజయాన్ని చూడలేదు: సీఎం చంద్రబాబు

తన జీవితంలో ఇలాంటి ఘన విజయాన్ని చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతం స్టైక్‌ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ నం.1గా ఉండటానికి కారణం టీడీపీ పార్టీనే అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

బడ్జెట్‌పై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. 2014లో లోటు కరెంట్‌ ఉండేది. పలు విధానాలు తీసుకొచ్చి… ఇప్పుడు మిగులు కరెంట్‌ పరిస్థితికి తెచ్చాం. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు నమ్మకంతో భూములు ఇచ్చారు. 2019లోనూ మేం విజయం సాధించి ఉంటే.. 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గత ప్రభుత్వం జీవోలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టలేదు. విభజన నష్టం కంటే.. గత ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది’ అని అన్నారు.

రూ.2 లక్షలకు పైబడిన వాళ్ళ రుణమాఫీ పై త్వరలోనే ప్రకటన చేస్తాం..

రూ.2లక్షలకు పైబడిన వాళ్ళ రుణమాఫీ పై త్వరలోనే ప్రకటన చేస్తామని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా సబ్ కమిటీ నివేదిక రాగానే రైతులకు అందజేస్తామన్నారు. ఈ ఏడాది వరి సాగులో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచిందన్నారు. ఒక కోటిన్నర లక్షల ఎకరాల దిగుబడితో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టామన్నారు. గతంలో 41లక్షల ఎకరాలల్లో ఉన్న దొడ్డు ధాన్యం ఈ ఏడాది 21లక్షలకు పడిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి పెరిగిందని, దేశ వ్యాప్తంగా సన్న ధాన్యానికి డిమాండ్ పెరిగిందన్నారు. 25 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ఈ రోజు నాటికి 17 జిల్లాల్లో మాత్రమే జరిగాయన్నారు.

నా దగ్గర డబ్బులు లేవు కానీ.. నూతన ఆలోచనలు ఉన్నాయి: సీఎం

తన దగ్గర డబ్బులు లేవని, కానీ నూతనమైన ఆలోచనలు మాత్రం ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం అని, ఆదాయం స్వీడ్‌గా వస్తుందన్నారు. 1వ తేదీనే 64 లక్షల 50 వేల మందికి పింఛన్, జీతాలు ఇస్తున్నాం అని.. ధనిక రాష్ట్రాలు కూడా ఇంత పింఛన్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. రాష్ట్ర ఆస్తులు కాపాడతాం అని, అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బడ్జెట్‌పై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.

కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పదే పదె అరెస్టు మాట కేటీఆర్ సింపతీ కోసమే అన్నారు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మేము ఏమి కుట్ర చేయడం లేదని క్లారటీ ఇచ్చారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. లగచర్ల ఘటనలో.. కలెక్టర్,గ్రూప్ 1 అధికారిని చంపే ప్రయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఎవ్వరినీ తప్పుపట్టం… విచారణ జరుగుతుందన్నారు. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. బీజేపీ – బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రక్రియ జరుగుతోందన్నారు.

లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు

నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల కనుసైగల్లో వారి స్వార్థం కోసం నిస్వార్థంతో పనిచేసే ఉద్యోగులను భయభ్రాంతలకు గురిచేశారని మండిపడ్డారు. వారి ఫోన్లో ఏమాట్లాడారో చూసామని, భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. కలెక్టర్‌ను చంపాలని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. పింక్‌ కలర్ అసలు నాయకుల పాత్ర ఉందో దాన్నంతా ప్రభుత్వం ఎక్స్ రే తీసినట్ట అంతా బయకు తీస్తదని ఆయన అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టదని, గత ప్రభుత్వ నాయకుల్లా కాదు.. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలనేది మా ప్రభుత్వ చిత్తశుద్ది అని ఆయన అన్నారు.

ఘటనతో సంబంధం లేని వారిని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు

సంగారెడ్డి సెంట్రల్ జైలులో కేటీఆర్ ములాఖత్ ముగిసింది. సుమారు 40 నిమిషాలు 16 మందితో ములాఖత్ సాగింది. ములాఖత్‌ అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల, హాకింపేట రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారని, రాబందుల్లా రేవంత్ రెడ్డి పేదల భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తొమ్మిది నెలలు ఎవరు పట్టించుకోకుంటే అధికారులు వస్తే నిరసన తెలిపితే తప్పా అని, ఘటనతో సంబంధం లేని వారిని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. దుగ్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ అనుచరులే ఈ దాడి చేశారని చెబుతున్నారని, సీఎం రేవంత్ అన్నే ఈ దాడి డైరెక్షన్ ఇస్తున్నారని రైతులు చెప్పారన్నారు. దాడి జరిగాక బీఆర్‌ఎస్‌ నాయకుల్ని అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని ఆయన ఆరోపించారు. థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు ఔట్టారని, మేజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంటి వాళ్ళని కొడుతామని బెదిరించారని రైతులు చెబుతున్నారన్నారు.

ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దనే వికేంద్రీకరణ చేశాం

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై.. ఏడాది మా పాలనపై చర్చకు మేం సిద్ధమని పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ అన్నారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామని ఆయన తెలిపారు. కేటీఆర్ తప్పు చేశా అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి జైలుకు పోతా అంటున్నాడని, మేం విచారణ జరపకుండా నే..జైలుకు పోతా అంటున్నాడని ఆయన అన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో సమస్యలు ఉన్నాయి.. వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ లో ఉన్న మాట వాస్తవమని, మాది కార్యకర్తల పార్టీ.. వాళ్లకు పదవులు ఇవ్వాల్సి ఉంది.. కాస్త ఆలస్యం అయ్యిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయంలో అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయని, కాస్త సమయం పడుతుందన్నారు. పార్టీ.. ప్రభుత్వం మధ్య సమన్వయంతోనే నడుస్తుందని, అధికారంలోకి వచ్చాము.. కాబట్టి సోషల్ మీడియా కొంత ఆక్టివ్ గా లేదన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ వాళ్ల మాదిరిగా మేము దిగజారి రాజకీయాలు చేయలేమన్నారు.

కడపలో రేపు విద్యా సంస్థలకు సెలవు..

కడపలోని పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.. నవంబర్ 16వ తేదీన ప్రారంభమయ్యే ఈ ఉరుసు ఉత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు మహారాష్ట్రల నుండి వేలాది మంది భక్తులు ఈ సమయంలో ప్రసిద్ధ సూఫీ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.. నవంబర్ 16 నుండి 21వ తేదీ వరకు జరగనున్న కడపలోని ‘పెద్ద దర్గా’ అని కూడా పిలువబడే అమీన్ పీర్ దర్గాలో వార్షిక ఉరుసు ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. భక్తులు దర్గాకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు… ఇక్కడ ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.. అయితే, కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో రేపు కడపలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రటించారు జిల్లా అధికారులు..

రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం.. ‘‘కుట్ర’’ అంటున్న కాంగ్రెస్..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం కావడం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుండి క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం అయింది. జార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఊహించని విధంగా ఈ ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ నెల 20న రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో టేకాఫ్ కావడానికి 45 నిమిషాలు ఆలస్యమైంది.