“సిందూర్” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ..
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల తర్వాత తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు.
ఆ ఇద్దరి వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది..
అమరావతి రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలను కొనసాగిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వ పని తీరును ప్రజలే మెచ్చుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. జగన్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి రూ. 10 లక్షల కోట్ల అప్పులు వదిలి వెళ్ళడం.. ఏపీలో రూ. 85లక్షల టన్నుల చెత్తను వదిలేశారు.. ఏపీని స్వచ్ఛాంధ్రాగా మారుస్తున్నాం.. మచిలీపట్నంలో సీఎం ప్రకటన చేసిన విధంగా అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మారుస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం.. పెన్షన్లను పెంచాం.. నిన్న ఒక్కరోజే రూ.10 వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా ఖాతాల్లో జమ చేశామని పొంగూరు నారాయణ వెల్లడించారు.
కేసీఆర్‌తో మాట్లాడానో.. లేదన్నది ఇప్పుడు అనవసరం
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తన తండ్రి కేసీఆర్‌తో మాట్లాడానో.. లేదన్నది ఇప్పుడు అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. కవిత మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇటీవల ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసేందుకు కవిత వెళ్లింది. కవితను పలకరించకుండానే కేసీఆర్ బయటకు వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే అంశంపై కవిత నోరు విప్పారు. ఫాంహౌస్‌కు వెళ్లినప్పుడు మా నాన్నతో మాట్లాడానో లేదో అనేది ఇప్పుడు అనవసరమైన మేటర్ అంటూ కొట్టిపారేశారు. ఇక కేటీఆర్ విచారణకు వెళ్తున్నప్పుడు వెళ్లాలో.. వద్దో అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయినా విచారణ సమయంలో ఎవరినీ రానీయకుండా దూరంగానే అడ్డుకుంటున్నారు కదా? అని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ నార్మల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారన్నారు. బోన్‌కు ఇంజక్షన్ వేయించుకుంటున్నారని.. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ట్రీట్‌మెంట్ ఇప్పుడు జరుగుతోందని కవిత వెల్లడించారు.
రైతులు మామిడి సాగుతో పాటు ఇతర లాభసాటి పంటలపై దృష్టి సారించాలి
పాకాల(మం) దామలచెరువులో మామిడి రైతులు, వ్యాపారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు అవుతుందన్నారు. ఇప్పటికి 22వేల టన్నులు మార్కెటింగ్ జరిగింది.. లక్ష టన్నులకు పైగా మార్కెటింగ్ జరగాల్సి ఉందన్నారు. తోతాపూరి కేజీకి రూ.12 రైతులకు చెల్లించాలి. చివరి మామిడి కాయ వరకు రు.4 సబ్సిడీ కల్పిస్తాం. పరిశ్రమలు రూ.8 తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
“నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.
సమోసా సెంటర్ కాదు.. ఆరోగ్యానికి ఓ ఓపెన్ ఛాలెంజ్..!
గోల్కొండ ఫోర్ట్ సమీపంలోని బడా బజార్ ప్రాంతంలో నిబంధనలకీ నాణ్యతకీ వ్యతిరేకంగా నడుస్తున్న సమోసా తయారీ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టీమ్ అక్కడికి వెళ్లి తనిఖీలు చేసింది. కమిషనర్ ఆదేశాలతో జరిగిన ఈ తనిఖీల్లో అనేక అధ్వాన్న పరిస్థితులు బయటపడ్డాయి. ఆ సెంటర్‌కు సరైన లైసెన్స్ లేకపోవడమే కాక, చాలా అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు అక్కడ తయారీని నిలిపివేశారు.
రాహుల్ గాంధీని చూస్తుంటే జెలెన్స్కీ గుర్తొస్తున్నారు
కాంగ్రెస్ నాయకత్వంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని చూస్తుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తొస్తున్నారు అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ జెలెన్స్కీ లాంటివారిగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రోజుకో తీపి కబురుతో కాలయాపన చేస్తోంది అని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించిన ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)ను కుదించడం ద్వారా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు.
కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయింపు ఇలా..
తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు సచివాలయంలో తమ తనఖా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చాంబర్ల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్న అడ్లూరి లక్ష్మణ్‌కు సచివాలయ మొదటి అంతస్తులో 13, 14, 15, 16 నంబర్ గదులు కేటాయించగా, మంత్రి వివేక్ వెంకటస్వామికి రెండో అంతస్తులో 20, 21, 22 నంబర్ గదులు లభించాయి. వాకిటి శ్రీహరికి రెండో అంతస్తులోనే 26, 27, 28 నంబర్ గదులు కేటాయించారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో సౌతాఫ్రికా నయా హిస్టరీ.. 27 ఏళ్ల నిరీక్షణకు తెర..
ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సఫారీలు చిత్తు చేశారు. కెప్టెన్ భవుమా, ఓపెనర్ మార్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 27 ఏళ్ల తర్వాత తొలిసారి ICC టైటిల్ సాధించింది. 27 ఏళ్ల కలను నిజం చేసుకున్న సఫారీలు. దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి 282 లక్ష్యాన్ని చేధించింది. గత 27 సంవత్సరాలుగా ఆఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’ ముద్ర తొలిగిపోయింది. దక్షిణాఫ్రికా 1998లో తన ఏకైక ICC టైటిల్‌ను గెలుచుకుంది.
