Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

రంజాన్‌ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు అందిస్తూ వెల్‌కమ్ చెప్పారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు సీఎం రంజాబ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రంజాన్‌ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఈ మేరకు ఒక ప్రకటనలో ముస్లింలకు ముఖ్యమంత్రి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని వెల్లడించారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. చర్యలు తప్పవని ఈసీ వార్నింగ్‌

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై సీరియస్‌గా స్పందించారు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా.. ఒంగోలు ఘర్షణపై రాత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ తమతో టచ్‌లో ఉన్నారని తెలిపిన ఆయన.. ఈ గొడవపై పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా దృష్టికి కూడా తీసుకువెళ్లామని తెలిపారు.. అయితే, గోడవలకు కారణం అయిన వారిపై కచ్చితంగా కేసులు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. స్టేట్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆద్వర్యంలో ఎంక్వైరీ చేసి తగు చర్యలు చేపడతామని తెలిపారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా..

కాగా, ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్‌ ఫైట్‌ తారాస్థాయికి చేరింది.. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఇరుపార్టీల ప్రధాన నేతలు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందినవారికి గాయాలయ్యాయి.. ఒంగోలులోని సమత నగర్ లో ప్రారంభమైన ఈ గొడవ కాస్తా.. ఒంగోలు రిమ్స్‌ వరకు చేరింది.. అయితే, సమత నగర్‌ ప్రచారం నిర్వహించారు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య రెడ్డి.. అయితే, ఆమె ప్రచారాన్ని ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు అడ్డుకున్నారు. అపార్ట్ మెంట్ వద్ద మహిళలకు వైసీపీ కార్యకర్తలకు మాటామాట పెరగటంతో గొడవకు దిగారు ఇరు పార్టీల శ్రేణులు.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనున్నీ ఏప్రిల్‌ 10న మధ్యాహ్నంతో పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు.

కవితకు మరో షాక్.. తీహార్ జైల్లో సీబీఐ అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగలింది. తీహార్ జైల్లో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవలే లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు.. తీహార్ జైల్లో కవితను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఆమెను జైల్లో సీబీఐ విచారించింది. విచారణ అనంతరం గురువారం కవితను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీకి తరలించారు. కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఇదే కేసులో విచారించేందుకు కోర్టును సీబీఐ అనుమతి కోరింది. దీనికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. విచారణ అనంతరం సీబీఐ జైల్లో కవితను అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే తన కుమారుడి పరీక్షల కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టులో పిటిషన్ వేసింది. కానీ న్యాయస్థానంలో ఊరట లభించలేదు. పిటిషన్ కొట్టేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై కూడా త్వరలో ధర్మాసనం విచారించనుంది.

పవన్‌కు మరోసారి ముద్రగడ సవాల్.. దమ్ము ఉంటే నాపై మాట్లాడు..!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. నాపై తెరచాటు రాజకీయం చేయడం కాదు.. జూనియర్‌ ఆర్టిస్టులతో మాట్లాడించడం కాదు.. నీకు దమ్ముంటే ప్రెస్‌మీట్‌ పెట్టి.. నాపై మాట్లాడు.. నాపై విమర్శలు చేయి.. నన్ను ప్రశ్నించు అంటూ ప్రతీ సమావేశంలోనూ సవాల్‌ చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయమంటున్నారు.. అసలు ఎందుకు చేయాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు పద్మనాభాన్ని అవమానించారు అని చంద్రబాబుని పవన్ కల్యాణ్‌ ప్రశ్నించలేక పోయారు? అని నిలదీశారు.

ఇక, వైఎస్‌ జగన్ ను ఎందుకు ప్రశ్నించ లేదు అన్న పవన్ కల్యాణ్‌కి వయస్సు అయిపోయింది అని చెప్పాను.. ఆయన ఎందుకు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవాలి అని ప్రశ్నించారు ముద్రగడ.. తెరచాటు రాజకీయాల్లో పవన్ ఎందుకు చేస్తున్నారు.. దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టు.. నన్ను విమర్శించి చూపించు అని మరోసారి ఛాలెంజ్‌ చేశారు. తెరచాటు రాజకీయం చేసే పవన్ కల్యాణ్‌కు ఎందుకు సపోర్ట్ చేయాలి అని క్వచ్ఛన్‌ చేశారు. మరోవైపు.. చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.. ఆ సమయంలో పవన్ జైలుకు వెళ్లి మద్దతు తెలపడంతో బాబు గ్రాఫ్ పెరిగింది.. అందుకే 80 సీట్లు తీసుకోవాలి, పవర్ షేరింగ్ అడగండి అని సూచించాను అని గుర్తుచేసుకున్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక మినీ ఇండియా..

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ పైలా సోమి నాయుడు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలను చూశా… ప్రపంచం మొత్తం తిరిగానన్నారు. కృష్ణా జిల్లా నా పుట్టినిల్లు.. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగడాన్ని భగవంతుడి వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలకు సేవలందించేందుకే భగవంతుడు పంపాడనుకుంటున్నానని అన్నారు. సూర్య చంద్రులున్నంతవరకు విజయవాడ వెస్ట్ కు సేవలందిస్తానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని సమస్యలున్నాయి… కొండప్రాంతంలోని సమస్యలు తన కళ్ళు తెరిపించాయని చెప్పారు.

కర్పూరీ ఠాకూర్‌కి భారత రత్న ఇచ్చింది మోడీ ప్రభుత్వం

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతి బా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ హాజరై.. మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..

మహాత్మా జ్యోతి బా పూలే ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పదేళ్లుగా సామాజిక న్యాయాన్ని మోదీ అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహాత్మా జ్యోతి బా పూలే స్ఫూర్తి తీసుకుని అభినవ మహాత్మా జ్యోతి బా పూలేగా మోడీ కీర్తించబడుతున్నారని, కేంద్ర మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీఠ వేశారన్నారు. విద్య, ఉద్యోగ కల్పనతో పాటు పారిశ్రామిక వెత్తలుగా తయారు చేశారని, లోక్ సభ లో 85 మంది  బీసీలకు అవకాశం కల్పించామన్నారు ఎంపీ లక్ష్మణ్‌. రాహుల్ గాంధీ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో బిసిలను అణిచి వేశారని, అంబేడ్కర్ ను రెండు సార్లు ఓడించి చట్ట సభలకు రాకుండా అడ్డుకున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్‌.

వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామనడం ఎన్నికల స్టంట్‌ కాదా..?

టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అంబటి తెలిపారు. ప్రతి పేదవాడి గుండెను తట్టి చూసినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అంటున్నారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పనిచేశారని కొనియాడారు. ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మాటలు ప్రజలు నమ్మరు… నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో నాలుక మడతేశారని ఆరోపించారు. వాలంటీర్ల పై, నీచమైన అపవాదులు వేశారని తెలిపారు. ఈరోజు వాలంటీర్లకు రూ. 10,000 జీతం ఇస్తామనటం మాయమాటలు చెప్పడం కాదా అని పేర్కొన్నారు. ఇది ఎన్నికల స్టంట్ కాదా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

ఇప్పుడు లోలోపల సెటిల్మెంట్ లు బయటకు వస్తున్నాయి

అవినీతి, అరాచకాలు గత ప్రభుత్వం లో జరిగిన దానికన్నా ఎక్కువ జరుగుతున్నవన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తా అన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు లోలోపల సెటిల్మెంట్ లు బయటకు వస్తున్నాయన్నారు. రేవంత్ అంటే నా వంతు ఎంత అని అడుగుతున్నాడు ఆట అని, రేటెంత రెడ్డి నీ రేట్ ఎంతా అని వెళ్లిన వారు అడుగుతున్నారు అట… అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం లో జరిగిన అవినీతి నీ ముందు పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకుంటున్నాడని ఆయన విమర్శించారు. 15 ఎకరాలు గత ప్రభుత్వం హేటిరో డ్రగ్స్ కి ఇచ్చింది… 15 వందల కోట్ల విలువైన భూమి అని, ఈ ప్రభుత్వం ఆ కేటాయింపు ను రద్దు చేసింది… అది ప్రభుత్వ స్థలం గా బోర్డు పెట్టిందన్నారు మహేశ్వర్‌ రెడ్డి.

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో వైసీపీ ఫేక్ పరిశ్రమను తెర పైకి తెచ్చిందని ఆరోపించారు. వైసీపీ ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలు సృష్టిస్తూ.. ప్రజల్ని గందరగోళం సృష్టించాలని చూస్తోందని తెలిపారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను సైతం వదలట్లేదని ఆరోపించారు. వాలంటీర్లతో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని జగన్ చూస్తున్నాడని చంద్రబాబు తెలిపారు. వాలంటీర్లను ఐదేళ్ల బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు మనం పదివేలు ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నాడని తెలిపారు. వైసీపీ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి అని పార్టీ ముఖ్యులకు చెప్పారు. కూటమి అభ్యర్థి ఎవరైతే అతనికి మూడు పార్టీల ఓట్లు పడేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువును వెంట తీసుకువచ్చింది

ఎన్నికల్లో ప్రియాంకా గాంధీతో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి, నిండు అసెంబ్లీలో చేతులెత్తేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువును వెంట తీసుకువచ్చిందన్నారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి 150 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేశాడు…వెటర్నరీ కళాశాలను కొడంగల్ కు తీసుకుపోయాడని, దేవున్ని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీ కే దక్కుతుందన్నారు కిషన్‌ రెడ్డి. కేసీఆర్ అంత భక్తుడు ఎవరన్నా ఉన్నారా, ఆయన చేసిన యజ్ఞ, యాగాదులు ఎవరన్నా చేశారా అని ఆయన ప్రశ్నించారు. రఘునందన్ రావు డోఖా చేయడంతోనే దుబ్బాకలో ఓడగొట్టారు..

Exit mobile version