శాంతి కోసం ప్రార్థనతో జీ20 సమావేశాన్ని ముగించిన ప్రధాని
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు జీ20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు. “ప్రపంచంలో శాంతి నెలకొనాలి” అని స్థూలంగా అనువదించే ఈ నినాదం, జీ20 సమ్మిట్‌లో సాధించిన పురోగతిగా పరిగణించబడే న్యూ ఢిల్లీ లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్ శనివారం ఆమోదించబడిన నేపథ్యంలో ఇవ్వబడింది. ఉక్రెయిన్ సమస్యపై ఒప్పందంపై జీ20 సంధానకర్తల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, జీ20 నాయకులు సమ్మిట్‌లో సమావేశమయ్యారు. వంద శాతం ఏకాభిప్రాయంతో ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు. “నేటి యుగంలో యుద్ధం ఉండకూడదు” అని డిక్లరేషన్ పేర్కొంది.
భారత ఆత్మపై దాడి.. వారు మూల్యం చెల్లించాల్సిందే..
భారత వర్సెస్ ఇండియా వివాదం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశం అయింది. అయితే ఈ వ్యవహారంపై మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోని సైన్సెస్ పిఓ యూనివర్సిటీలో మాట్లాడారు. దేశం పేరు మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ప్రాథమికంగా చరిత్రనను తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నారని, భారతదేశ ఆత్మపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎవరైనా తమ చర్యలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
కరీంనగర్ జిల్లాలో వింత జీవుల సంచారం.. భయాందోళనలో ప్రజలు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో వింత జీవుల సంచారం కలకలం రేపుతోంది. బూరుగుపల్లి గ్రామ చెరువు కట్ట మైసమ్మ వద్ద దూలం కృష్ణ అనే వ్యక్తి తన పొలం వద్ద పాడి గేదెలకు మేత వేస్తుండగా చెరువు కట్ట వద్ద పది నుంచి 15 వరకు వింత రకం జీవులు కనిపించడంతో భయాందోళనకు గురి అయ్యాడు. గ్రామస్తులకు విషయాన్ని తెలుపగా కొంతమంది వీటిని నీటి కుక్కలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇలాంటి వింత జీవులను మునుపెన్నడూ చూడలేదని వీటి ద్వారా మనుషులకు ప్రమాదం పొంచి ఉంటుందని రైతులు పొలాల వద్దకు వెళ్తే అవి మనుషులపై దాడి చేస్తే పరిస్థితి ఏమిటని గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వింత జీవులు గ్రామ సమీపంలో ఉన్న కట్టపై సంచరిస్తూ కలకలం రేపుతూ ఉండడంతో ఇవి గ్రామంలోకి కూడా వస్తాయని సంబంధిత అధికారులు చొరవ చూపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆ హీరో అసలు తండ్రిని నేనే.. నటుడి సంచలన వ్యాఖ్యలు
అందాల నటుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళపతి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనఆయన .. బొంబాయి, రోజా లాంటి సినిమాలతో మణిరత్నం ఫేవరేట్ హీరోగానే కాకుండా తెలుగువారికి కూడా అందాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో అమ్మాయిలందరూ ఎలాంటి భర్త కావాలి అంటే అరవింద్ స్వామిలా ఉండాలి అని చెప్పేవారట.. అంతల ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. ఇక అన్ని భాషల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకునం అరవింద్ స్వామి.. ప్రస్తుతం విలన్ గా మెప్పిస్తున్నాడు. ఇక తాజాగా అరవింద్ స్వామి గురించి కోలీవుడ్ నటుడు ఢిల్లీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అరవింద్ స్వామి తన సొంత కొడుకు అని, కానీ తమ ఇద్దరి మధ్య ఆ అనుబంధం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఏంటి నిజమా.. ? అరవింద్.. నటుడు ఢిల్లీ కుమార్ కొడుకా.. ? అంటే.. నిజమే అని తెలుస్తోంది.
తెలంగాణలో మహిళా సాధికారతకు ఐలమ్మ ప్రతీక
తెలంగాణ మహిళా సాధికారతకు చాకలి ఐలమ్మ ప్రతీక అని ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు ఆదివారం కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సిద్దిపేటలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఐలమ్మ జీవితం నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇతర నేతలు స్ఫూర్తి పొందారని, ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు హరీశ్‌రావు తెలిపారు.
నేను పెళ్లిచేసుకునే వ్యక్తిలో ఆ క్వాలిటీస్ ఉండాలి
వైష్ణవి చైతన్య.. ఈ భామ రీసెంట్ విడుదల అయిన బేబీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాతో వైష్ణవి చైతన్య కు మంచి పేరొచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ . ఇలా చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న వైష్ణవి చైతన్యకు సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఏదో చిన్న సినిమాగా స్టార్ట్ అయిన బేబీ.. టాీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్అయింది.అయితే ఆ మధ్యకాలంలో వైష్ణవి చైతన్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలో ఉండే క్వాలిటీస్ గురించి చెప్పింది. వైష్ణవి చైతన్య ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కాబోయే భర్త పై భారీ అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు.ఆస్తిపాస్తులు ఏమీ లేకున్నా,అందచందమేమీ లేకపోయినా నాకు పరవాలేదు. మంచి మనసు ఉంటే చాలు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్తాన్‌లో ఖతం
పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రవాదుల హత్యల్లో ఇది నాల్గొవది. తాజాగా హతమైన ఉగ్రవాది జనవరి 1న జరిగిన ధంగ్రీ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు. ఈ ఏడాది జనవరి 1న హిందూమెజారిటీ గ్రామమైన ధంగ్రీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న క్రమంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు.
ఎన్నికల బరిలో దత్తాత్రేయ కుమార్తె.. ముషీరాబాద్ అభ్యర్థిగా విజయ లక్ష్మి దరఖాస్తు
అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి అభ్యర్థిగా బండారు విజయ లక్ష్మీ దరఖాస్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఆమె పుల్ స్టాప్ పెట్టారు. ఇవాళ ఉదయం విజయ లక్ష్మి ముషీరాబాద్ నియోజకవర్గ అభ్యర్తిగా దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తును బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీసులో సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ నుంచి పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందని విజయలక్ష్మి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి బీజేపీ అధిష్ఠానం దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. బీజేపీ ఆశావహుల నుంచి వెల్లువలా దరఖాస్తుల సమర్పణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శనివారం (నిన్న) ఒక్కరోజే 1,603 మంది దరఖాస్తులు వచ్చాయి. దీంతో గత ఆరు రోజుల్లో మొత్తం అందిన అప్లికేషన్ల సంఖ్య 3,223కు చేరుకుంది. నేడు (ఆదివారం) దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో దరఖాస్తులు భారీ సంఖ్యలోనే వస్తాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
7,200 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు.. పంపిణీ చేసిన హరీష్ రావు
తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో విజేతలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. గతంలో మత్స్యకారులు సభ్యత్వం పొందడం కష్టతరంగా ఉండేది. కానీ, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన 7,200 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల గంగపుత్రులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల సంక్షేమానికి 2000 కోట్ల రూపాయలు వెచ్చించిన ఏకైక నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ హయాంలో కొన్ని చెరువుల్లో సబ్సిడీపై చేప పిల్లలను పెంచేవారని, నేడు రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో 100% సబ్సిడీతో ఉచితంగా అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
భారత్‌ని చూసి పాక్ అసూయ.. చివరకు సౌదీ ప్రిన్స్ కూడా పట్టించుకోలేదు..
పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ ఎదుగుదలను చూసి అక్కడి ప్రజలు అసూయ వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఒకేసారి స్వాతంత్య్రం పొందినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం ప్రజాస్వామ్యం మాటున సైన్యం రాజ్యమేలుతోంది. చివరకు 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో ఎదిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత ఉంది. చివరకు ప్రజలకు నిత్యావసరాలు, కరెంట్, గ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. ఒక వేళ ఉన్నా కూడా ధరలు చుక్కలను అంటుతోంది.
కేసీఆర్ కంటే పెద్ద దగా కొరు పార్టీ కాంగ్రెస్
కేసీఆర్ కంటే పెద్ద దగా కొరు పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ అప్లికేషన్ పెట్ట లేదని, పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ రాసిన లెటర్ ఉంటే బయట పెట్టాలన్నారు ఇంద్రసేనారెడ్డి, నీకు ( రేవంత్) కవిత కి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని, ఓటు కు నోట్ కేసులో రేవంత్ బయటికి వచ్చిన తర్వాత కేసు ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. మీకు బీఅర్ఎస్ తో బిజినెస్ సంబంధాలు లేవా? కేసిఆర్ తో పొత్తు పెట్టుకొని వాళ్ళతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాదా? అని ఆయన ఇంద్రసేనా రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ పల్లాపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కీలక వ్యాఖ్యలు
జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని సోలిపురం అంకుశ పురం గ్రామంలో కమ్యూనిటీ భవనాలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. తరిగొప్పుల మండలానికి నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎస్టిమేషన్ ఇస్తే 104 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణానికి మంజూరు చేశారని, ప్రణాళిక సిద్ధం చేసి సాంక్షన్ పూర్తయిన తర్వాత తెలిసి తెలియని కొంతమంది నేనే 80 కోట్లు సాంక్షన్ చేయించినట్టు చంకలు గుద్దుకుంటు ప్రచారం చేస్తున్నారు, ఇది అవమానకరమన్నారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరిగొప్పుల మండలాలకు చెందిన నాయకులతో, కార్యకర్తలతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం పార్టీకి విరుద్ధమని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని గ్రహించి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఉన్నారని, ఇద్దరు ఎమ్మెల్సీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మందలించారని ఆయన అన్నారు.
