Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

త్వరలో బండి సంజయ్‌ అవినీతిని బయటపెడతాం..

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ రాముని ఫోటోలు పెట్టి రాజకీయం చేయడం సరికాదని.. బండి సంజయ్ ఎన్ని ఆలయాలను అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు.

రాముడు అందరికీ దేవుడు.. మేం కూడా శ్రీరామనవమి రోజు పూజలు చేస్తామన్నారు. కేసీఆర్ హిందూ గాళ్ళు బొందు గాళ్లు.. అన్న పదంతో, నినాదంతో గెలిచిన బండి సంజయ్ ఆలయాలకు నువ్వు ఏమి అభివృద్ధి చేశావో చెప్పాలన్నారు. ఎన్నికలు రాగానే మాయగాళ్ళు అందరూ వస్తారని.. ప్రజలు మోసపోవద్దన్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఇక్కడే ఏమీ లేదని.. నీ దగ్గర ప్రాంతంలో ఏమైనా ఓట్లు అడుక్కోవాలని అన్నారు. త్వరలో బండి సంజయ్ అవినీతిని బయట పెడతామని ఆయన పేర్కొన్నారు. అవినీతి చేసినందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. కొండగట్టు ఆంజనేయస్వామి విగ్రహం కట్టిస్తా అని మాట తప్పిన కవితక్క జైలుకు పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రాక్షస పాలన పోయి కాంగ్రెస్ పాలన రావాలని ఎన్నికల ముందు ముడుపు కట్టి ఈ రోజు ముడుపు చెల్లించుకున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఏడాది గురు బలం కేసీఆర్ కన్నా సీఎం రేవంత్‌కు, తనకే ఎక్కువగా ఉందన్నారు.

తనయుడి కోసం తల్లి, అల్లుడు కోసం అత్త మామలు ఇంటింటి ప్రచారం..!

ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం తల్లి కాకర్ల మస్తానమ్మ, అత్త కడియాల పద్మావతి, మామ కడియాల వెంకటేశ్వర్లు కలిగిరి మండలం లక్ష్మీపురం పంచాయతీ కండ్రిక గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లక్ష్మీపురం పంచాయతీ కండ్రిక గ్రామంలో ఇంటింటికి తిరిగి మహిళలకు కాకర్ల సురేష్ తల్లి తన తనయుడిని గెలిపించాలని బొట్టు పెట్టి మరి చెప్పారు. టీడీపీ ప్రవేశపెట్టనున్న పథకాలను వివరించారు. తమ తనయుడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని మంచి ఆశయంతో వచ్చారని ఆశీర్వదించాలని తెలిపారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో 150 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రాజకీయాలలోకి రాక ముందు నుంచి సేవ చేస్తున్నారని, ఆయన నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని.. సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఇప్పుడున్న వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పగలరా..?

ఇప్పుడున్న వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పగలరా..? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రకాశం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్ల విషయంలో రోజుకోమాట మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ఇటీవల ఇళ్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేసింది టీడీపీనే.. కానీ, ఇవాళ వ్యతిరేకత వస్తుందని డోర్ టు డోర్ ఇవ్వాలని చెబుతున్నారని దుయ్యబట్టారు. పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుందని రోజుకో రకంగా మాట్లాడుతున్నారు.. వాలంటీర్లు లేకుండా ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయటం సాధ్యం కాదు కదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఎందుకు పంచలేదు.. అప్పుడు వృద్దులు గుర్తుకు రాలేదా..? అని నిలదీదశారు.

అధికార లాంఛనాలతో రాజీవ్ రతన్ అంత్యక్రియలు పూర్తి.. నివాళులర్పించిన సీఎం

గుండెపోటుతో హఠాన్మరణం పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్‌ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరై నివాళులు అర్పించారు. రాజీవ్ రతన్ కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. రాజీవ్ రతన్‌ గుండెపోటుతో మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజీవ్ రతన్‌ ప్రస్తుతం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొన సాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్​మెంట్​ విచారణకు ఆయనే సారధ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ఆకస్మిక మరణం పోలీస్‌ శాఖను దిగ్భ్రాంతికి గురి చేసింది.

మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం బాగుంటుంది

దేశం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో తెలిపే ఎన్నికలే జరగబోయే ఎన్నికలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్‌లో కార్నర్ మీటింగ్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. మోడీ మూడోసారి అధికారంలోకి రావాలంటే.. మే 13న అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘‘కరోనా కాలంలో మన ప్రాణాలు కాపాడటం కోసం మోడీ చర్యలు తీసుకున్నారు. కరోనాలో తినడానికి తిండి లేకపోతే ఉచిత బియ్యం ఇచ్చాం. ప్రతి పేద ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని.. టాయిలెట్స్ మోడీ సర్కార్ కట్టించింది. రాజకీయం, మిలటరీ ఇలా అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాం. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్స్‌ని కొత్తగా కడుతున్నాం. బస్తీ దవాఖానాలకు నిధులు ఇచ్చేది మోడీనే. కొమరవెల్లిలో కూడా రైల్వే స్టేషన్ మంజూరు చేయిపించాం. దేశంలో ఎక్కడా ఉగ్రవాద కార్యక్రమాలు.. బాంబు పేలుళ్లు లేవు. కాంగ్రెస్ పార్టీ అంటనే దోపిడీ… రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది.. దోపిడీ స్టార్ట్ అయ్యింది. కేసీఆర్ తెలంగాణను ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చేసి దోచేశారు. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 2500 ఇస్తామన్నారు.. ఇప్పటిదాకా అతీగతి లేదు.’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

సుప్రీంకోర్టులోనూ కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. పిటిషన్ తిరస్కరణ

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్‌పై అత్యవసరంగా విచారించాలంటూ బుధవారం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. ఈరోజే ఎమర్జెన్సీగా విచారించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసును పరిశీలించి త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

బుధవారం తెల్లవారుజామున కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారించాలని కోరారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు విషయాన్ని తెలియజేశారు. ఎమర్జెన్సీగా విచారించాలని కోరారు. కానీ విచారించడానికి సమయం ఇవ్వలేదు. పరిశీలించి ఒక తేదీని చెబుతామని పేర్కొన్నారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణం జరిగింది

సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణం జరిగింది అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది అన్నారు. కాకణి ఆధ్వర్యంలో దోపిడీ జరుగుతోంది.. 7 వేల ఎకరాలు ఇచ్చాం అని చెప్పే కాకణి.. మండల కార్యాలయాల్లో వాటి వివరాలను ప్రదర్శించాలి అని తెలిపారు. శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నామని చెప్పి దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మనుబోలు మండలంలో తెలుగు దేశం పార్టీలో చేరిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు అని పేర్కొన్నారు. మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి అల్లుడి తరపున మీడియేటర్ మాట్లాడి డీల్ చేస్తున్నాడు.. టీడీపీలో చేరితే భూములను జాబితాలో పెడతామని బెదిరిస్తున్నారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

సొంత దుకాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారన్నారు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి. ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పిసిసి పదవీ వేరే.. సిఎం పదవీ వేరే అని, సీఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారన్నారు మహేశ్వర్‌ రెడ్డి. సెకండ్ పోజిషన్ కోసం కాంగ్రెస్ లో పోటీ పడుస్తున్నారని, భట్టి B ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్ళే లీకులు ఇచ్చారన్నారు. చంద్రబాబుకు, రేవంత్ కు సేమ్ పోలికలు ఉన్నాయని, ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ మూడు గ్రూపులు ఉన్నాయన్నారు. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా BRS ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారని, రేవంత్ కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారన్నారు.

భువనగిరిలో బీఆర్‌ఎస్‌ లేదు.. బీజేపీతోనే మాకు పోటీ

భువనగిరి పార్లమెంట్‌ స్థానంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రంజాన్‌ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. భువనగిరిలో బీఆర్‌ఎస్‌ లేదు. బీజేపీతోనే మాకు పోటీ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ రానున్నట్లు, మిర్యాలగూడ, చౌటుప్పల్ లో సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్లకుండా పని చేస్తామని, సీఎం ఆదేశాల ప్రకారం పని చేసి పార్టీని గెలిపిస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రివ్యూ మీటింగ్‌లో నాకు ఇంఛార్జి భాద్యతలు పార్టీ అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని చర్చించామని, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారన్నారు.

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశాన్ని విభజిస్తుంది

ఫిరోజ్ ఖాన్ అంటేనే ఓవైసీకి వ్యతిరేకం.. ఆ వ్యక్తి కాంగ్రెస్ అసలు రంగు బయట పెట్టారని, ఓవైసీ హైదరాబాద్ లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటుందని ఫిరోజ్ ఖాన్ చెప్పారన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పాలించిన అన్ని పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంఐఎంను పెంచి పోషించారని, మజ్లిస్, కాంగ్రెస్ అనేక సార్లు కలిసి పని చేశాయన్నారు ప్రకాష్ రెడ్డి. ఎవ్వరికీ ఎవ్వరూ బీ టీమ్ అర్థమైందని, టగ్రెస్ పార్టీ జిన్నా మేనిఫెస్టోను అమలు చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశాన్ని విభజిస్తుందన్నారు.

 

Exit mobile version