Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కేసీఆర్‌ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్‌ బంగారం, కౌన్సిలర్‌ డబ్బు చోరీ..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో స్టార్ ప్లానర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్ షోలో ఆయన ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్నారు. అయితే నిన్న జరిగిన కేసీఆర్ బస్సు యాత్రలో పోలీసుల వైఫల్యం చెందారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్రలో వేల మంది హాజరు కావడంతో జేబు దొంగలు దొరికింది దోచుకుంటున్నారు. ఇదే సమయంగా భావించి పోలీసులు వున్నా ఖాతరు చేయకుండా చేతివాటం చూపిస్తున్నారు. కేసీఆర్ తోపాటు బస్సు యాత్రలో పాల్గొన్న లీడర్లకే ఏకంగా టార్కెట్ చేశారు.

బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాడు.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖాత్ అయి బీఆర్ఎస్ లేకుండా చేయాలనీ చూస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్ లో ముస్లిం మైనార్టీల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీతో పోరాడుతోంది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. మే 13 తరువాత బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ మీకు అందుబాటులో ఉండరన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పోరాటం వల్లనే కేసీఆర్ కూతురు జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. బీజేపీతో మేము కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖాత్ అయి బీఆర్ఎస్ లేకుండా చేయాలనీ చూస్తున్నాడని మండిపడ్డారు.

డీబీటీ పథకాల అమలు.. సీఎస్‌కు ఈసీ కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల కమిషన్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఎన్నికల కమిషన్‌.. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది.. లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. ఖాతాలకు నిధులను జమ చేయడంలో జరిగిన జాప్యంపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.. మొత్తం ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే విషయమై జాబితాను లేఖలో ప్రస్తావించిన ఈసీ. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి రూ. 14,165.66 కోట్లకు బటన్ నొక్కారని పేర్కొంది.. అయితే, ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్‌కు ముందు 11, 12వ తేదీల్లో నిధుల విడుదలయ్యేలా చూశారన్న సమాచారం తమకు ఉందని లేఖలో వెల్లడించింది ఈసీ.. పోలింగ్ కు ముందు లబ్ధిదారుల ఖాతాలకు నిధుల విడుదల చేయడం కోడ్ ఉల్లంఘనే అవుతుందని తెలిపింది.. అయితే, ఎన్నికల కోడ్ ముగిశాక లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయాలని ఆదేశించింది ఎన్నికల కమిషన్‌.

హైదరాబాద్ లోని ప్రతి గల్లీ రేపు ఎల్బీ స్టేడియంకు కదలాలి..

హైదరాబాద్ లోని ప్రతి గల్లీ రేపు ఎల్బీ స్టేడియంకు కదలాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు పార్టీ కార్యకర్తలు.. యువత ఎల్బీ స్టేడియంకు రావాలన్నారు. మన ప్రియతమ ప్రధాని మోడీ సభలో పాల్గొంటారన్నారు. కార్యకర్తలు అందరూ తమ బూత్ లలో ప్రజలను అందరిని తీసుకురావాలన్నారు. తెలంగాణలో రేపటి సభతో మోడీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు. ఎల్లుండి మహిళా మోర్చా తరుపున అందరు డోర్ టూ డోర్ ప్రచారం చేయాలన్నారు. విశ్వాసంతో ముందుకు వెళ్లాలి.. రోజు రోజుకు మన గ్రాఫ్ పెరుగుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సెకండ్ ప్లేస్ కోసం పోటీ జరుగుతుందన్నారు. బలం లేని నియోజకవర్గాల్లో కూడా మన బలం పెరుగుతుందన్నారు. సికింద్రాబాద్ లో కూడా సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్లాడుతున్నాయన్నారు. హైదరాబాద్ లోని ప్రతి గల్లీ రేపు ఎల్బీ స్టేడియంకు కదలాలని పిలుపునిచ్చారు.

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని, శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారని అన్నారు. కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు పార్టీలో చేరికలు జరగాయన్నారు. శంకరమ్మ నా మీదనే పోటీ చేశారు.. కానీ ఎప్పుడూ పరస్పర గౌరవంతో ఉన్నామన్నారు. పార్టీలో బీసీ లకు.. వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారంతో గెలవాలని చూస్తున్నారన్నారు. పదేళ్లు తెలంగాణ కి ఏమి చేయని మోడీ..అమిత్ షా లు మత విద్వేషాలు పెట్టి విభజించాలి అని చూస్తున్నారన్నారు. మోడీ దిగజారి మట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది బీజేపీ అజెండా అని మండిపడ్డారు. జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారని తెలిపారు.

మార్పు కోసం వచ్చాడని భావించాం, కానీ.. పవన్‌పై పోతిన మహేష్ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేక పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించాం.. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి వచ్చాడని ఈ మధ్యే అర్థం అయిందని ఆయన చెప్పారు. సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నానని 2014లో పవన్‌ చెప్పారని.. ఒకప్పుడు కారు ఈఎంఐ కట్టలేనని చెప్పాడని ఆయన అన్నారు. కానీ 2024 నాటికి 1500 నుంచి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. తిరగటానికి సొంతంగా హెలికాప్టర్, భూములు ఎలా వచ్చాయో పవన్ చెప్పాలని పోతిన మహేష్ ప్రశ్నించారు.

ఈసీ కారణాలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం..

ఈసీ కారణాలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో జమచేయలేదని ఈసీ ఆర్డర్ లో పేర్కొంది. స్కీంలు ప్రారంభించి నగదు బదిలీ చాలావరకు జరిగిన వాటిని కూడా అడ్డుకున్నారనీ అంటున్న వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో వివరాలు కూడా వెల్లడించింది అధికార వైసీపీ. జనవరి 29న మొదలైన ఆసరా చివది దఫా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. రూ. 6,394 కోట్లకు గానూ, రూ. 4, 555 కోట్ల బదిలీ అయిందని.. రూ. 1,839 కోట్ల మాత్రమే నగదు పెండింగ్ ఉన్నట్లు పేర్కొంది. ఈ పెండిగ్ డబ్బు ఇవ్వనీయకుండా టీడీపీ ఫిర్యాదులు చేసిందని, ఈసీ అడ్డుకున్నదని వైసీపీ విమర్శిస్తుంది.

కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన “నోట్లతో నిండిన టెంపో” వ్యాఖ్యలకు ధీటుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం మాట్లాడుతూ.. డీ-మానిటైజేషన్‌ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్​కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్‌కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు. మోదీకి ఇష్టమైన ఈడీ, సీబీఐలు స్కాంగ్రెస్‌ విషయంలో ఎందుకు మిన్నకుండి పోయాయని కేటీఆర్​ సూటిగా ప్రశ్నించారు.

నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్‌లో సీపీఐ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా గెలవడానికి సహకరించిన మీ అందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశారని, భవిష్యత్ లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎలాంటి బిఫభిప్రాయాలు ఉండవని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదం లో ఉందని, 30 సంవత్సరాల తరువాత మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు 400 సీట్లు అంటున్నారని, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. పైకేమో శ్రీరామ్ శ్రీరామ్ లోలోపల రిజర్వేషన్లకు రాం రాం చెబుతున్నారని, ఎం చేసామో చెప్పుకోకుండా అక్షింతలు వచ్చాయా…? రాముడు ఫోటో వచ్చిందా అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు..

సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో పోలింగ్ కు సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే.. ఎన్నికల సంఘం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే పలుమార్లు సూచించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఓటేసేందుకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు.. తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు కాబట్టి.. ఓటు వేయడం కోసమని తమ ఊర్లకు ప్రయాణమవుతున్నారు.

 

Exit mobile version