ఆకాశాన్ని తాకిన అభిమానం…
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఏప్రిల్ 8న సోషల్ మీడియా అంటా బన్నీ పేరుని జపం చేసింది. టాప్ సెలబ్రిటీస్ నుంచి ఫాన్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేశారు. డేవిడ్ వార్నర్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ కి విష్ చేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. పుష్ప పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, పార్ట్ 2తో ఇండియా బౌండరీలు దాటడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అయితే అందరిలా అల్లు అర్జున్ ని బ్రిత్ డే విషెస్ చెప్తే తమ స్పెషాలిటి ఏముంటుందో అనుకున్నారో ఏమో కానీ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ఆకాశం నుంచి శుభాకాంక్షలు తెలియజేసింది. రవితేజ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐకాన్ స్టార్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ‘హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్’ అనే ఫ్లైట్ బ్యానర్ ని ఎగరేసారు. ఒక ప్రొడక్షన్ హౌజ్, ఒక స్టార్ హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈ రేంజులో చెప్పడం ఇదే మొదటిసారి. మరి ఫ్యూచర్ లో ఈ ప్రొడక్షన్ హౌజ్ అండ్ బన్నీ కాంబినేషన్ లో సినిమా పడుతుందేమో చూడాలి.
ఈ బ్యూటీ బాగానే ఉంది కానీ సాలిడ్ బ్రేక్ రాలేదు…
కర్ణాటక నుంచి ఇప్పటికే అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరి దారిలో నడుస్తూ కర్ణాటక నుంచి తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యింది కానీ ఒక డెబ్యు హీరోయిన్ కి కావాల్సిన సాలిడ్ ఎంట్రీకి మాత్రం అషికకి ఇవ్వలేకపోయింది. కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించిన అషిక స్క్రీన్ పైన ప్రామిసింగ్ గా కనిపించింది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత కావాలో అంతే గ్లామర్ గా కనిపించడంతో అషిక రంగనాథ్ కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగింది.
కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కిషన్ రెడ్డి లేఖ
ప్రస్తుత రబీ సీజన్ లో తెలంగాణ నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించండని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైతు సంక్షేమంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్రప్రభుత్వం.. నిరంతరం మద్దతుగా నిలుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
చరణ్ ఇంటి నుంచి మంచు హీరోకి స్పెషల్ గిఫ్ట్…
మెగా మంచు కుటుంబాల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అనే మాట తరచుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ విభేదాలని దాటి మంచు మనోజ్ కి రామ్ చరణ్ కి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. ఎక్కువగా కలిసి కనిపించకపోయినా, బయట ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఈ ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ స్నేహం కారణంగానే మంచు మనోజ్ రీఎంట్రీ సినిమాగా అనౌన్స్ అయిన ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఓపెనింగ్ కి చరణ్ గెస్ట్ గా వచ్చాడు. లేటెస్ట్ ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ ని తెలియజేసేలా ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంచు మనోజ్, ఇటివలే భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చరణ్, ఉపాసనలు ఈ కొత్త జంటకి స్పెషల్ విషెస్ చెప్తూ గిఫ్ట్స్ ని పంపించారు. కపుల్ డాన్స్ చేస్తున్నట్లు ఉన్న క్యూట్ డాల్ ని చరణ్, ఉపాసనలు మంచు మనోజ్, మౌనిక రెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ మెగా కపుల్ పంపించిన గిఫ్ట్ గురించి పోస్ట్ చేస్తూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.
ఒకే ఒక్క క్లిక్‌తో రూ.8.6లక్షలు స్వాహా.. ఉద్యోగం పేరుతో మోసం
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. కరోనా సయమంలోనే చాలామంది ఉద్యోగాలు పొగొట్టుకుని దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు మాంద్యం భయాలు ఇటు ఉద్యోగులు, నిరుద్యోగులను కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫలానా చోట ఉద్యోగం ఉంది అనగానే వేయి ఆశలతో నిరుద్యోగులు ప్రయత్నించడం మొదలుపెడుతున్నారు. వారి దయనీయస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉద్యోగ ప్రకటన కనిపించగానే వివరాలు తెలుసుకునేందుకు దానిపై క్లిక్ చేసింది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ఆ యువతి 8.6 లక్షల రూపాయలకు పైగా కోల్పోయింది. దీంతో లబోదిబోమనుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు చర్య తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటాం
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లిని అట్టహాసంగా జరుపుకోవాలనుకుంటారు. బంధువులంతా తమ పెళ్లికి వచ్చి సందడి చేయాలని భావిస్తుంటారు. పిలిచిన వాళ్లలో ఏ ఒక్కరు తమ పెళ్లికి రాకపోయినా కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అందరి ఆశీర్వాదంతో నూతన జంట ఒక్కటవుతారు. కానీ మధ్యప్రదేశ్ లో కాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. పోలీసులు తమ సమస్య పరిష్కరిస్తే కానీ పెళ్లి చేసుకోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఇలా ఎందుకు జరిగింది.. ఇద్దరి మధ్యా ఏదో గొడవ జరిగిందనుకుంటున్నారా.. విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఓ పెళ్లి వేడుక మొదలైంది. ఓ వైపు పెద్దగా డీజే అదిరిపోతోంది. అందరూ డ్యాన్సులతో సందడి చేస్తున్నారు.
కడప జిల్లాలో విషాదం.. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి
వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో విషాదం చోటుచేసుకుంది. అలవలపాడులో ఆదివారం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్(8), సాయి తేజ(11), చిన్నారుల మేనమామ శశికుమార్ గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. సమీపంలోని జీఎన్ఎస్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందగా.. గ్రామస్థులు వారి ముగ్గురిని వెలికి తీసి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో టోకరా.. లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు దండుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. కానిస్టేబుల్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు సంబంధం ఏమిటనుకుంటున్నారా?. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రాఫిక్ కానిస్టేబుల్ రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో తన కుమార్తెకు ఏడాదికి రూ 1.75 కోట్ల ప్యాకెజీతో ఉద్యోగం అంటూ శివయ్య ప్రచారం చేసుకున్నాడు. కుమార్తె పలుకుబడి, హోదాతో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. దీనిని నమ్మిన నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు శివయ్యకు రూ. లక్షల్లో డబ్బులు ఇచ్చారు.
కాంగోలో నరమేథానికి పాల్పడిన ఉగ్రవాదులు.. 20మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఉగ్రవాదులు మరోసారి నరమేథానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందికి పైగా సాధారణ ప్రజలు చనిపోయారని సమాచారం. ఇది ఇలా ఉంటే, దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. బెనీ టెర్రిటరీలోని ముసందబాలో 20 మృతదేహాలను గుర్తించామని అక్కడి అధికారులు ప్రకటించారు.
టీచర్‌ను చంపేందుకు స్టూడెంట్ మాస్టర్ ప్లాన్.. కత్తి పట్టుకుని
తల్లి, తండ్రి తరువాతి స్థానం గురువు అంటారు. గురువును కూడా దేవుడితో సమానంగా పూజించాలంటారు. అందుకే ఆచార్య దేవో భవ అని పెద్దలు అన్నారు. గురువును పూజించడం అట్లుంచితే అసలు తన ఉన్నత స్థానానికి కూడా గుర్తింపులేకుండా పోయింది. టీచర్ అంటేనే విద్యార్థులకు చిన్న చూపైపోయింది. ఇందతా సినిమాల ప్రభావమా లేక పరిస్థితుల ప్రభావమో చెప్పడం కష్టం. రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో స్కూల్ నుంచి బహిష్కరించినందుకు ఒక విద్యార్థి కక్షగట్టి టీచర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. 16 ఏళ్ల విద్యార్థి స్కూల్‌లో అల్లరి పనులు చేస్తూ అందరి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. టీచర్ శివచరణ్ సైన్(54) చాలాసార్లు అతడిని ఇది పద్ధతి కాదంటూ హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినితో అతడి ప్రేమ వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఆ స్టూడెంట్‌ను టీచర్ స్కూల్ నుంచి బహిష్కరించారు. కాగా, స్కూల్ బహిష్కరణకు కారణమైన టీచర్ శివచరణ్‌పై ఆ విద్యార్థి కక్షగట్టాడు. అతడిని ఎలాగైనా మట్టుపెట్టాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. మంగళవారం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న టీచర్‌ను తన ఇద్దరు స్నేహితులతో కలిసి అడ్డుకున్నాడు. ఆ టీచర్‌ను కత్తితో పలుమార్లు పొడిచి బైక్‌పై పారిపోయాడు. దీంతో ఉపాధ్యాయుడు శివచరణ్ రోడ్డుపై కుప్పకూలి మరణించాడు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. టీచర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.