Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

వరుణ యాగానికి సాయంత్రం అంకురార్పణ

తిరుమలలో ఉదయం శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగం నిర్వహించారు. ఆచార్య రుత్విక్ నేపథ్యంలో ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. సమృద్దిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని ఆయన పేర్కొన్నారు. గత నెల(ఆగష్టు)లో తిరుమలలో వరుణ యాగం నిర్వహించడం వల్ల వర్షాలు కురిసాయని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం (వరుణ యాగం) నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసిన పర్సెవరెన్స్ రోవర్

అంగారక గ్రహంపైకి 2021లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పంపిన పర్సెవెరెన్స్ రోవర్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే అక్కడి వాతావరణం, మట్టి నమూనాలను విశ్లేషిస్తున్న ఈ రోవర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దీంతో వెళ్లిన బుల్లి హెలికాప్టర్ కూడా అక్కడి వాతావరణంలో పలుమార్లు పైకి ఎగిరింది. తాజాగా ఈ రోవర్ లో ఓవెన్ పరిమాణంలో ఉన్న ఓ యంత్రం అంగారకుడిపై ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేసింది. ఈ ప్రయోగం ద్వారా అరుణ గ్రహంపై ప్రాణవాయువు ఉత్పత్తి చేయవచ్చని నిరూపించింది.

అంగారకుడిపై భవిష్యత్తులో మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రయోగం దోహదపడతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్(MOXIE)’ అనే పరికరం ఆక్సిజన్ ని తయారుచేసి తన మిషన్ పూర్తి చేసింది. మైక్రో ఓవెన్ పరిమాణంలో ఉండే ఈ పరికరం 2021లో పర్సెవరెన్స్ రోవర్ ల్యాండైనప్పటి నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. MOXIE ఇప్పటి వరకు 122 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి చేసినట్లు నాసా తెలిపింది. ఇది నాసా అనుకున్న లక్ష్యం కన్నా రెండింతలు ఎక్కువ అని తెలిపింది. తయారు చేయబడిన ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛంగా, మెరుగ్గా ఉన్నట్లు, ఇది శ్వాస, ఇంధన ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని నాసా ప్రకటించింది.

వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదు.. పువ్వాడ పై రాములు నాయక్ ఫైర్

పువ్వాడ అజయ్‌ కుమార్‌ పై ఎమ్మెల్యే రాములు నాయక్‌ ఫైర్‌ అయ్యారు. వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదంటూ రాముల నాయక్ మంత్రి పువ్వాడ చేయకు హెచ్చరికలు జారీ చేశారు. వైరా నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలో తన ఒక్కడే గెలిచి మిగిలిన నియోజకవర్గాల్లో అందరూ ఓడిపోవాలని కుట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్నాడని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా తన విధుల్ని నిర్వహించు కోనీయకుండా పువ్వాడ అజయ్ చేస్తున్నాడని ఆరోపించారు. కేటీఆర్ రాజు యువరాజు అయితే సామంత రాజుగా పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు పన్నుతున్నాడని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని రాముల నాయక్ ఆరోపించారు. అంతేకాదు పువ్వాడ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే వా? లేక వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావా? అని ప్రశ్నించారు. దళిత బంధు లబ్ధిదారులు ఎంపికలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ రాముల్ నాయక ఆరోపించారు.

గనుల శాఖ ప్రగతి సాధించడం అభినందనీయం

గనులు,భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సచివాలయంలో రాష్ట్ర గ‌నులు, భూగ‌ర్భ వ‌న‌రుల శాఖ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డికి రాష్ట్రంలో 2014 ఆర్ధిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు శాఖ సాధించిన విజయాలను అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని అధికారులకు సూచించారని, గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 అధికారులు, సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి ఈ విషయాన్ని తెలియపరుస్తామని ఆయన అన్నారు.

జైలర్ నటుడు మృతి.. ఎమోషనల్ అయిన రజినీ

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నటుడు, డైరెక్టర్ అయిన మారిముత్తు నేడు గుండెపోటుతో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకున్న జైలర్ సినిమాలో మారిముత్తు వర్మ గ్యాంగ్ లో కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించాడు. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించిన మారిముత్తు.. జైలర్ సినిమా తరువాత మరిన్ని అవకాశాలను అందుకుంటాడని అందరు అనుకున్నారు. కానీ, ఇంతలోపే ఆయన గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌కే ఆ ఛాన్స్.. మిగతా మ్యాచ్‌లకు లేనట్టే..!

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కే రిజర్వ్ డే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లీగ్ దశలో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌ ఫలితం తేలేలా రిజర్వు డేని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కొలంబోలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సెప్టెంబర్ 10న జరగాల్సిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌‌లో ఫలితం తేలడం కూడా కష్టమే.. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో నిలిచిపోతే, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి సెప్టెంబర్ 11న జరుగనుంది.

ఖర్గేని విందుకు పిలువకపోవడంపై రాజకీయం.. కుల వివక్ష అంటూ విమర్శలు..

భారత్ ప్రతిష్టాత్మకంగా జీ20 సదస్సును నిర్వహిస్తోంది. దాదాపుగా 30కి పైగా దేశాధినేతలు ఈ సమాశాలకు హాజరవుతున్నారు. వివిధ దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులను, వ్యాపార దిగ్గజాలను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఈ విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, క్యాబినెట్ హోదా ఉన్న మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు.

కాగా ఇప్పుడు ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తిచూపుతోంది. కులవివక్ష అని విమర్శలు గుప్పిస్తోంది. దళిత నేత అయిన ఖర్గేను జీ20 విందు అతిథి జాబితా నుంచి తప్పించడంతో మోడీ ప్రభుత్వం కులవివక్ష చూపించిందని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత మోహన్ కుమారమంగళం ఆరోపించారు. మనుస్మృతి రచించిన మహర్షి మనువు వారసత్వాన్ని ప్రధాని మోడీ సమర్థిస్తున్నారంటూ, కుల వివక్ష చూపిస్తున్నాంటూ ఆయన ఆరోపిస్తున్నారు.

అవినీతి చేస్తే అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా

చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. లోకేష్ యువగళం పేరుతో వెళ్లిన ప్రతీ చోటా రెచ్చగొడుతున్నాడని అవినాష్ పేర్కొన్నారు. లోకేష్ రౌడీ షీటర్లు, గూండాలను తయారు చేసే ఫ్యాక్టరీలా టీడీపీని మార్చాడని దుయ్యబట్టారు. రౌడీయిజం, గూండాయిజం, అల్లర్లు చేస్తే పదవులిస్తానని లోకేష్ సిగ్గులేకుండా ఆఫర్లు ఇస్తున్నాడని తెలిపారు. ఏపీలో దొంగతనాలు, గంజాయి, మహిళలపై వేధింపులు, మర్డర్ కేసుల్లో టీడీపీ వాళ్లే ఉంటున్నారని చెప్పారు. యువగళం పాదయాత్రకు జనం రాక, నాయకులు లేక.. లోకేష్ యువగళం రౌడీలను రెచ్చగొడుతున్నాడని దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో చంద్రబాబు విధ్వంసం సృష్టిస్తే, భీమవరంలో లోకేష్ అదే విధ్వంసాన్ని కొనసాగించాడని తెలిపారు. విధ్వంసంలో తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన అవినీతి పై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. 118 కోట్ల ముడుపుల పై ఎందుకు ఎవరూ స్పందించరని అవినాష్ ప్రశ్నించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరని అన్నారు. అమరావతి ల్యాండ్ స్కామ్, టిడ్కో ఇళ్ల స్కామ్, స్కిల్ డెవలప్ మెంట స్కామ్ పై టీడీపీ, చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందని అవినాష్ కోరారు.

కేసీఆర్‌ మాటలకు చేతలకు పొంతన ఉండదు

నల్లగొండ జిల్లా దేవరకొండ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు పేదలు, గిరిజనులు, దళితులు ఎన్నికల సమయంలో నే గుర్తుకు వస్తారని ఆయన విమర్శించారు. చందంపేట మండలానికి చెందిన బాలికను హైదరాబాద్ లో అత్యాచారం చేశారంటే కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చిన వారికి ఒక్క రూపాయి అయిన సహాయం చేశారా అని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు కానీ పాలన మొత్తం కేసీఆర్‌దే అని ఆయన వ్యాఖ్యానించారు. గుండంబా తయారు చేయకండి అని చెప్పి.. గల్లీలో మద్యం షాపులు తెరిచాడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు.

ఇండియా-భారత్ వివాదం.. ప్రభుత్వం భయపడుతోందన్న రాహుల్ గాంధీ..

యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇండియా-భారత్ వివాదంపై స్పందించారు. బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి భయంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆయన ఆరోపించారు. బెల్జియంలోని బ్రస్సెల్స్ లో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, భయపడుతోందని, ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహాలుగా రాహుల్ గాంధీ అన్నారు. జీ20 విందు ఆహ్వానంలో ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ బదులుగా ‘‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’’అని కనిపించడంతో కేంద్రం ఇండియా పేరును భారత్ గా మారుస్తుందనే ఊహాగానాలు వెల్లవెత్తాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదానీ వ్యవహారం బయటకు రావడంతో దీనిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడీ ఆడుతున్న నాటకం అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పేరు బీజేపీలో భయం నింపిందని అన్నారు.

బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులపై కసరత్తు

ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తర్వాత బీజేపీ హైకమాండ్.. పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరీని ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులపై పురందేశ్వరి కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో భారీగా జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 15 నుంచి 17 జిల్లాల్లో బీజేపీ అధ్యక్ష స్థానాలు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అధ్యక్ష స్థానాలను ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశముంది. మరోవైపు జిల్లా అధ్యక్షులతో పాటు ఇంఛార్జులను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తుండగా.. సోము వీర్రాజు హయాంలో నియమించిన జిల్లా అధ్యక్షుల్లో మార్పులు లేవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీపై సచివాలయంలో గ్రేటర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపైన రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదని అన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని తెలిపారు. హైదరాబాద్ నగరం ఒక్కొక్క 50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నామన్నారు. హైదరాబాద్లో నిర్మాణం చేస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ 9100 కోట్లు ఉందని తెలిపారు. ప్రభుత్వానికి అయిన ఖర్చు 9100 కోట్లు, కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పైనే అన్నారు.

నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు

నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని గవర్నర్ తమిళి సై అన్నారు. మా తండ్రి పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ అని అన్నారు. నాకు గవర్నర్ గా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రపతి కూడా మహిళ కావడం గర్వకారణమన్నారు. కోవిడ్ నుండి ఎలా బయట పడాలి, ప్రతి విద్యార్థీ కి నాణ్యమైన విద్యను అందించడం నా ప్రాధాన్యతగా ఉండేదని అన్నారు. 6 గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నాను… అక్కడ మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టానని తెలిపారు. గిరిజనుల మధ్య వాక్సిన్ తీసుకున్నానని, పిర్యాదులు బాక్స్ ద్వారా వచ్చే ధరకాస్తు లని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నా పరిధిలో ఉన్న వాటిని పరిస్కరిస్తున్నానని తెలిపారు. రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని అన్నారు. బతుకమ్మ వేడుకలు మొదటి సారి రాజ్ భవన్ లో నిర్వహించామన్నారు. తెలంగాణ, పుదుచ్చేరిలలో నా విధుల్లో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటున్నానని గవర్నర్ అన్నారు.

 

Exit mobile version