Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారు..

చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని సూచించారు. పెండింగ్ పనులను అన్నీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్దిలో అగ్రబాగంలో ఉంచుతామన్నారు. దేహాలు ముక్కలు అయినా పర్వాలేదు అని దేశం కోసం పని చేసింది ఇందిరా గాంధీ కుటుంబం అని తెలిపారు. బీజేపి మతాల గురించి తప్ప పనుల గురించి చెప్పరని అన్నారు. మోడీ వచ్చి ఆదిలాబాద్ కు ఏం ఇచ్చారని అని ప్రశ్నించారు. మూత పడ్డ సిసిఐ పరిశ్రమ గురించే మాట్లాడలేదని అన్నారు.

పీకేకు బొత్స కౌంటర్‌.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు..!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ది చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నాడు.. చంద్రబాబు అన్ని రంగాలని మేనేజ్ చేసేవాడు. అందుకే ఆయన హయాంలో అన్ని రంగాలు వెనకపడ్డాయి అని విమర్శించారు. జగన్ పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.. జగన్ అన్నీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వెల్లడించారు. ఇక, ప్రశాంత్ కిషోర్ ని బీహార్‌ నుండి తరిమికొట్టారు.. ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు అని వార్నింగ్‌ ఇచ్చారు.

పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు.. జనసేన.. ప్రజారాజ్యం 2.. అడ్రస్ గల్లంతే..!

జనసేన పార్టీకి షాక్‌ ఇస్తూ.. రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ జనసేన ఇంఛార్జ్‌గా ఉన్న పోతిన మహేష్.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో జనసేన, పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి రాజీనామా ఆవేశంలో చేయలేదు.. సీటు రాలేదని నేను రాజీనామా చేయటం లేదన్నారు. పవన్ కొత్తతరం నేతలను తయారు చేస్తారని ఆయనతో గుడ్డిగా అడుగులు వేశాం.. 2014లో పోటీ చేయక పోయినా, 2019లో ఒక సీటు వచ్చినా పవన్ తో నడిచి మేం భంగపడ్డాం అని ఆవేదన వ్యక్తం చేశారు.. నటించే వాడు నాయకుడు అవ్వలేడు.. నమ్మకం కలిగించే వాడు మాత్రమే నాయకుడన్న ఆయన.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్.. ఇలాంటి పాషాన హృదయం కలిగిన వ్యక్తితో ప్రయాణం చేసిన మాకు మాపై అసహ్యం కలుగుతోందన్నారు.

మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు..

జూన్ 8 లేదా 9న మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఓటెయ్యండి.. అభివృద్ధి కోసం ఓటెయ్యండి అంటూ ప్రజలకు ఆయన సూచించారు. భారత దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటెయ్యాలన్నారు. మోడీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేది.? ఆలోచించాలన్నారు. మోడీ వచ్చాక దేశం ఎలా అభివృద్ధి చెందిందో ఆలోచించాలని పేర్కొన్నారు. పదేళ్లకు ముందు దేశంలో ఉగ్రవాదం, మత కల్లోలాలు ఉండేవి..మేము వచ్చాక బుల్డోజర్ ప్రభుత్వం వచ్చిందన్నారు. దేశంలో ఎటువంటి మార్పులు వచ్చాయో చూడాలన్నారు. గతంలో కీలు బొమ్మలాంటి ప్రధాని ఉండేవారని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రపంచలో నంబర్ వన్‌గా అయ్యామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం..!

సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. రేవంత్ కాన్వాయ్ లోని వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. కాన్వాయ్ లో ఉన్న ఒక ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్లే సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడా వద్ద ఈ ఘటన జరిగింది. అందరూ భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో అని షాక్ లో ఉండిపోయారు. టైర్‌ పేలిందని తెలియడంతో అందరూ వాహనాల నుంచి బయటకు వచ్చారు. పేలిన టైర్లు రిపేరి చేయడంతో మళ్లీ వాహనాలు కొడంగల్‌ కు బయలు దేరాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మొయినాబాద్ మీదుగా కొడంగల్ మీటింగ్ కు బయలు దేరారు.

చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసినా గెలవలేరు.. అందుకే బీజేపీతో దోస్తీ చేస్తున్నారు..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఉయ్యూరులో పోలికేక పెట్టినా జనం నుంచి స్పందన లేదు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు.. చంద్రబాబు కనీసం కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవాలనే ఈ పోరాటం చేస్తున్నారు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ వెళ్లి బీజేపీ పంచన చేరారు అని ఆయన విమర్శలు గుప్పించారు. నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా.. యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగా అనుచరుడిగా ఉన్నాను.. బలహీన వర్గాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి పెనమలూరులో పోటీ చేద్దాం అనుకుంటే నూజివీడు పంపి వెన్నుపోటు పొడిచారు.. అలాగే రెండు సార్లు ఎంపీ అయినా కొనకళ్ళ నారాయణరావుని కూడా వెన్నుపోటు పొడిచారు అంటూ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హామీల అమల్లో విఫలమైంది

తుక్కుగుడా వేదికగా రాహుల్ గాంధీ పంచ్ న్యాయ గ్యారెంటీలు ప్రకటించాడని, సోనియా గాంధీ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు అదే తుక్కుగుడా లో ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్.. హామీల అమలు విఫలం అయ్యిందన్నారు. సోనియా గాంధీ కి తెలంగాణ ప్రజలకు మొహం చూపించలేకే రాహుల్ గాంధీ వచ్చాడన్నారు. రాష్ట్ర మహిళలకు ప్రకటించిన 2500 రూపాయలే ఇవ్వలేక పోతున్న కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా మహిళలకు లక్ష రూపాయలు ఎలా ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పంటలు ఎండి రైతులు, త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు పక్కన పెట్టీ రాజకీయాలు చేస్తున్నాడన్నారు.

వ్యవసాయాన్ని పండగ చేస్తా- రైతన్నకు వెన్నుగా నిలుస్తా..!

రెండు నెలల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది.. మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండగ చేస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని రైతన్నలను ఉద్దేశించి ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. సోమవారం నాడు వింజమూరు మండలం చాకలకొండ జనార్ధనపురం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలు నాయుడు పల్లి వెళ్లే క్రమంలో వరి కోసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా చెత్తను రూలింగ్ చేస్తున్న దృశ్యాన్ని చూశారు.. దీంతో పంట పొలాల్లో గట్ల పైన నడుచుకుంటూ వెళ్లారు. ట్రాక్టర్ ను నడిపిన కాకర్ల రైతు బిడ్డను అనిపించుకున్నారు.

నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.

గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికారంలో నేతన్నల మీద ఉంది శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కేంద్రము చేనేత బోర్డ్ రద్దు చేసిన పార్టీ బీజేపీ అని, బండి సంజయ్ ని డిమాండ్ చేస్తున్న తమిళ్ నాడు కు ఎన్ని నిధులు ఇచ్చింది, తెలంగాణను ఎన్ని ఇచ్చారు నేను 10 తేదీన పూర్తి వివరాలు ఇస్తానన్నారు.

ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి ఈ రౌడీలను తరిమి కొట్టాలి..

అధికారాన్ని కోల్పోవడం ఖాయమని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా విమర్శలు గుప్పించారు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు అని మండిపడ్డారు. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జన స్పందన చూసి ఓర్వలేక ఈ పని చేసారు.. రౌడీయిజం, విధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం.. ఇదే వైసీపీ వాళ్ళ నైజం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి వైసీపీ రౌడీలను తరిమి కొట్టాలని కోరుతున్నాను.. అలాగే, సత్తెనపల్లిలో దివ్యాంగులు నన్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు అని చంద్రబాబు తెలిపారు.

 

Exit mobile version