మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు. మహిళా దినోత్సవం అనేది ఒక్క రోజు కాదు ప్రతిరోజు మహిళలని గౌరవించాలన్నారు. మహిళలు అన్నిరంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మిటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ , తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్, బాలీవుడ్ నటి & మోటివేషనల్ స్పీకర్ తానాజ్ ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ సోషలిస్ట్, ఫిట్‌నెస్ & కాన్షియస్ లివింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ శిల్పా రెడ్డి పాల్గొన్నారు.
వెలిగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం.. సీఎం సంతోషం
దశాబ్దాల కల నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన.. ట్విన్ కెనాల్స్ ప్రారంభోత్సవ పైలాన్ ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి.. జరగాల్సిన పనులపై ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్.. ఇక, వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందన్నారు.. అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.
రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం ‘రైతు నేస్తం’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 4.07 కోట్లు విడుదల చేసింది.
ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. నాడు నాన్న.. నేడు కొడుకు..
వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పైలాన్‌ను ఆవిష్కరించి.. ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల కలలు కన్న వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసుకున్నాం.. ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాన్ని దేవుడు నాకివ్వటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు వైఎస్సార్ శంఖుస్థాపన చేసి పనులు మొదలు పెడితే.. ఇవాళ ఆయన కొడుకుగా రెండు టన్నెల్స్ ను ప్రారంభించటం దేవుడి రాసిన స్క్రిప్ట్ అని భావిస్తున్నాను అన్నారు..
చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడు.. దానికి నిదర్శనం గుడివాడ సీటే..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడన్న ఆయన.. దానికి నిదర్శనం గుడివాడ సీటే అని వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఈ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో ఇతర పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి.. బీసీ సంఘం నాయకుడు దేవరపల్లి కోటి, 150 మంది యువకులకు పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే నాని.
ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు..
గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను జగన్ అమలు చేశారు అని నెల్లూరు లోక్ సభ వైసీపీ సమన్వయకర్త విజయ సాయి రెడ్ది తెలిపారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు.. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావు.. మరోసారి వైసీపీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. సిద్ధం సభా వేదికగా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారు.. ఇప్పటి వరకూ జరిగిన మూడు సిద్ధం మహా సభలు చరిత్రలో నిలిచిపోయేలా శ్రేణులు హాజరయ్యారు.. జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను.. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు అని విజయసాయి రెడ్డి తెలిపారు.
మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదు
NDSA బృందం నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఎ నాలుగు నెలలు రిపోర్టు సమర్పిస్తామని తెలిపిందని, అంతకన్నా ముందే ప్రాథమిక రిపోర్ట్ వీలైనంత తొందరలో ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగా వెంటనే డాం రిపేర్ తో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ టిఆర్ఎస్ కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణమే మోడీ ప్రభుత్వమని, కార్పొరేషన్ల ద్వారా 84 వేల కోట్ల రుణం అందించింది కేంద్రమే కదా అని ఆయన అన్నారు. మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేము కోరిన వెంటనే జలాశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మీ సలహాలను పాటించి మెడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామన్నారు. బ్యారేజి డ్యామేజ్ కి రీజన్స్ చెప్పాలన్నారు.
కేపీ నాగార్జున రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం జగన్ పిలుపు..
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందురు నాగార్జున రెడ్డిని అత్యధిక మెజారిటితో గెలిపించాలి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. మార్కాపూరంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి చేసిన అభివృద్ధిని గిద్ధలూరు నియోజకవర్గంలో కూడా చేయబోతున్నారు అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కుందురు నాగార్జున రెడ్డి నిరంతరం ప్రజల కోసం కష్ట పడే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చిన ఆయన బాధపడుతాడని సీఎం అన్నారు. మరోసారి కేపీ నాగార్జున రెడ్డిని గెలిపిస్తే మీ నియోజక వర్గం మరింత అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం జగన్ వెల్లడించారు.
మోడీని కలిసిన సందేశ్‌ఖాలీ బాధిత మహిళలు
ప్రధాని మోడీ (PM Modi) పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. కోల్‌కతాలో అండర్ వాటర్‌లో నిర్మించిన మెట్రో రైలును మోడీ ప్రారంభించారు. దేశంలోనే నీటి అడుగున ప్రయాణించే తొలి రైలుగా చరిత్ర సృష్టించింది. మెట్రో రైలును ప్రారంభించి ప్రధాని అందులో ప్రయాణించారు.
ఇదిలా ఉంటే బెంగాల్‌లో పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని సందేశ్‌ఖాలీ (Sandeshkhali Womens) బాధితులు కలిశారు. ఈ సందర్భంగా తమకు ఎదురైన సమస్యలను ప్రధానికి చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన షాజహాన్‌పై భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సందేశ్‌ఖాలీ మహిళలు ఆరోపించారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోళన చేశారు. దీంతో ఆ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుంది. తాజాగా సందేశ్ ఖాలీ బాధిత మహిళలు పలువురు ప్రధాని మోడీని బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ప్రధాని ఎంతో ఓపికగా వారి ఆవేదనను విని కలత చెందారు. దీంతో బాధిత మహిళలు మరింత భావోద్వేగానికి గురయ్యారు.
సిద్ధం సభలు చూస్తుంటేనే చంద్రబాబు బ్యాచ్కి భయం పట్టుకుంది
బెజవాడలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇక్కడ అభిమానుల ఆనందం చూస్తుంటే అవినాష్ పడిన కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది అని అన్నారు. నెహ్రు ఆశయాన్ని తప్పక అవినాష్ నెరవేరుస్తారు.. ఎమ్మెల్యే, మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకు వచ్చి నియోజకవర్గాన్ని అవినాష్ అభివృద్ది చేశారు అని చెప్పుకొచ్చారు. జగన్ వద్దకు నేరుగా వెళ్లి నిధులు తెచ్చుకున్నాడు.. ఎండ అనక వాన ఆనక నాలుగు సంవత్సరాల పాటు అవినాష్ ఏంతో కష్టపడ్డాడు అని ఆయన చెప్పారు. ఈ యాభై రోజులు అవినాష్ కోసం కార్యకర్తలు మరింత కష్టపడాలి.. 298 మంది బూతు ఇంచార్జీలు యాక్తివ్ గా ఉండండి.. జగనన్న తమ్ముడుగా అవినాష్ పడిన కష్టంతో తూర్పులో వైసీపీ జెండా ఎగరబోతవుంది.. నలభై రోజుల్లోపు ఎన్నికలు రానున్నాయి.. మనం కాలర్ ఎగరవేసుకొని తిరగాలి అవినాష్ ని గెలిపించాలి అంటూ మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు.
ఆరు గ్యారంటీల పథకాల అమలు పార్లమెంటు ఎన్నికల కోసమే
తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ పేర ప్రజలపై 20 వేల కోట్ల భారం మోపేల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున గార్కే, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు 420 హామీలు ఇచ్చారన్నారు.
రాహుల్, ప్రియాంక పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే!
రాహుల్ (Rahul Gandhi), ప్రియాంక గాంధీల (Priyanka gandhi) పోటీపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తికర చర్చ సాగింది. ఈసారి ప్రియాంకగాంధీ పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఖాయమైంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటిదాకా రాజకీయ వర్గాల్లో తీవ్ర సందిగ్ధం నెలకొంది. వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారని తొలుత వార్తలు వినిపించాయి. ప్రధాని మోడీపై పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే రాహుల్‌గాంధీ కూడా వయనాడ్ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెడుతూ కాంగ్రెస్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రియాంకగాంధీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీ (Raebareli) నుంచి పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే రాహుల్‌గాంధీ కూడా అమేథీ (Amethi) నుంచే పోటీ చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. గత ఎన్నికల్లో అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. కానీ కేరళలోని వయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గెలుపొందారు. అయితే రాహుల్ ఈసారి వయనాడ్ నుంచి కాకుండా తన సొంత నియోజకవర్గం అమేథీ నుంచే పోటీ చేయనున్నారని ఈ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఎన్నికల సమయంలో అమలుకు నోచుకోని దొంగ హామీలను ఇచ్చారు
ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాలసముద్రంలోని ఏకాశీల పార్క్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అమలుకు నోచుకోని దొంగ హామీలను ఇచ్చారన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలను చెప్పి ఏవి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను రద్దు చేస్తూ.. గత ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
