NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు బిచ్చగాళ్ళలాగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధ్యానం కొనుగోళ్ళు వెంటనే చేబట్టాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎంతమందికి అయ్యింది? అని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫి టైం పాస్ గా మారిందన్నారు. మోడీ మీద యుద్ధం చేయడం కాదు, యుద్దప్రాతికనా రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలన్నారు. కుల గణనకి మేం వ్యతిరేకం కాదు, పారదర్శకంగా కులగణన జరగాలని తెలిపారు. అమృత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. రూ.7000 కొట్ల రూపాయలు అమృత్ స్కీం ద్వారా తెలంగాణకి నిధుల కెటాయింపు జరిగిందన్నారు. పార్టీలకి అతితంగా అందరం కలిసి నగర అభివృద్ధి చేసుకుందామన్నారు.

పిఠాపురం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం..

కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులోని ఎమ్మార్వో ఆఫీసులో మిగిలిన పనులు, సుద్దగడ్డ బ్రిడ్జి నిర్మాణం, సూరంపేట గొల్లప్రోలు అప్రోచ్ రోడ్డు నిర్మాణం, ఎంపీపీ స్కూలు అదనపు గదులు నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులతో ఆయన నేరుగా మాట్లాడుతూ.. ఉద్యోగం కోసం కంటే దేశం కోసం పనిచేయాలని సూచనలు చేశారు. నేను నా కోసం రాలేదు మీకోసం వచ్చాను అని తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్ లేదని డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి విద్యార్థులు తీసుకోచ్చారు. త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. విజువల్ థింకింగ్ మీద పిల్లలకి పాఠాలు చెప్పాలని టీచర్లకి ఉప ముఖ్యమంత్రి పవన్ సూచించారు. అలాగే, గొల్లప్రోలులో వికలాంగులకు ట్రై సైకిళ్ళు, ఇతర ఉపకరణాలను అందజేశారు.

తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రేపటి నుండి (5 వ తేదీ) దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా, టెట్ పరీక్షల కోసం రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనవరిలో పరీక్షలు జరగనున్నందున లక్షలాది మంది ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. TET పరీక్షలు ఆన్‌లైన్‌లో 2025 జనవరి 1 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు నవంబర్ 5 నుండి 20 మధ్య దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఎందుకు మౌనంగా ఉన్నారు?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ..

పులకేసి మాదిరిగా మీ ముఖ్యమంత్రి ప్రజలను హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో పదేళ్ల విధ్వంసం సృష్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుకున్నారు? అని ప్రశ్నించారు. గాంధీ భవన్ కు కాదు… ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా? అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలన్నారు. ఏడాదిలోనే అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత మీ ప్రభుత్వానిదే అన్నారు. సబ్బండ వర్గాలను మోసం, నయవంచనకు గురి చేసిన పాపంలో ప్రధాన పాత్ర మీదే అని తెలిపారు. మీ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టా అంతా ఉన్నాయన్నారు.

నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాద్యతలు తీసుకుంటాను అని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా హోం మంత్రి వంగలపూడి అనిత రివ్యూ చేయాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. .పోలీసులు మర్చిపోకండి అని తెలిపారు. మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండి.. ఆడ పిల్లలు రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది.. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకి ఏం చెప్తుంది.. తెగే వరకు లాగకండి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు , క్రీడల నిర్వహణ, గ్రామ స్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటు పై చర్చించారు. స్టోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో నూతన క్రీడా విధానాన్ని అధికారులు రూపొందించారు. ఒలంపిక్స్, ఏషియన్స్ గేమ్స్‌లో పతకాలు పొందే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో స్టేడియాలు, వ్యక్తులు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చించారు. సమగ్ర క్రీడా విధానంపై సీఎంకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారు

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్‌ రావు. మాజీ సర్పంచులను పోలీసులు అవమానించారని, తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో సర్పంచులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని హరీష్‌ రావు మండిపడ్డారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని, తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారని, రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలన్నారు హరీష్‌ రావు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చారని, జీవో 29 ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని, ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా రాహుల్ గాంధీ రివ్యూ చేయాలన్నారు హరీష్‌ రావు.

అమరావతి పనులకు కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఇవాళ జరిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు. 41వేల కోట్ల టెండర్లను 2014-19లో పిలిచి 38వేల కోట్ల పనులు ప్రారంభించామని చెప్పారు. మధ్యలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ప్రపంచంలోని టాప్‌ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్ అయిందన్నారు. రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. ఈ సంవత్సరం జులై 24న చీఫ్ ఇంజనీర్లతో కమిటీ వేశామన్నారు. పనులకు సంబంధించి చీఫ్ ఇంజినీర్ల కమిటీ అక్టోబర్‌ 29న 23 పాయింట్ల నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ప్రపంచబ్యాంక్ రూ.15 వేల కోట్ల రుణం ఇస్తుందన్నారు. గత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయం ఇవాళ సమీక్షలో నిర్ణయించారని తెలిపారు. డిసెంబర్ 31 కల్లా అన్ని టెండర్లు పిలవాలని ఆదేశించామని వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్‌.. అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తాం

పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెంలో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ మొదలవుతుందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్ ను తయారు చేశామన్నారు. యాప్ ద్వారా ఇళ్ళ నిర్మాణం ఎలా జరుగుతుందో పరిశీలిస్తామని, కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం కోసం రూరల్ లో 71 వేలు అర్బన్ లో లక్షా యాబై వేలు ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి. మిగిలిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరించి పేదవారి చిరకాల స్వప్నం నెరవేరుస్తుందని, గత BRS ప్రభుత్వం లో పింక్ కలచొక్కా వేసుకున్న వాళ్ళకే స్కీం లు ఇచ్చారన్నారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు

కిషన్ రెడ్డి తెలంగాణ కి ఏం ఇచ్చారో చెప్పండని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి టూరిజం నుండి ఏం తెచ్చావు చూపించాలన్నారు. కిషన్ రెడ్డి ది నిజంగా తెలంగాణ డీఎన్ఏ ఐతే.. మోడీ వ్యాఖ్యలు ఖండించాలని, తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన మోడీ వ్యాఖ్యలు తప్పు కదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సలహా మేరకు.. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయ్యారని, ఆయన మమ్మల్ని తిడితే అశ్చర్యపోవాల్సిన ఏముందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. మోడీ వ్యాఖ్యలు ఖండించక పోతే తెలంగాణ బిడ్డలు కారు మీరు అని మండిపడ్డారాయన. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి బీఆర్‌స్ నేతలు రాష్ట్రంలో సర్పంచులు గురించి మాట్లాడ్తున్నారని, బీఆర్‌స్ టైం లో సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయినవారే మద్దతుగా ధర్నా లు చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.