కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు లక్షల కోట్లు అప్పు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంధకార భవిష్యత్తుగా మారిందని వ్యాఖ్యానించారు. శనివారం కూలిన మేడిగడ్డ డ్యామ్‌ను బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ లక్మణ్ పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత, నిర్మాణ లోపాల వల్లే దెబ్బతిందన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కేంద్ర జలవిద్యుత్ నిపుణులకు లేఖ రాశామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చాలా తీవ్రమైన అంశాలను అందులో చేర్చారనిత తెలిపారు. అన్నారం బ్యారేజీ కింద ఉన్న పైర్ల నీరు నాణ్యత లోపించి వృథాగా పోతోందన్నారు. ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ నీరు కూడా నిల్వ లేదన్నారు. వేల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలు, ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. ప్రాజెక్టు నిర్మాణం శాస్త్రీయంగా లేదన్నారు.
స్వామివారి సన్నిధిలో సీఎం కేసీఆర్.. నామినేషన్ పత్రాలపై సంతకాలు
సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు స్వాగతం పలకగా, అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసిన అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి సన్నిధిలో సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. కేసీఆర్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన ప్రతిసారీ ఈ ఆలయంలో పూజలు చేసేందుకు వస్తుంటారు. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
దళిత యువకుడిపై దాడి, మూత్రవిసర్జన ఘటన.. టీడీపీకి మంత్రి సవాల్
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్‌కుమార్‌పై దాడి ఘటనలో టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత యువకుడిపై దాడి ఘటనపై స్పందించారు.. యువకునిపై దాడి చేసిన ఘటన చాలా బాధాకరం అన్నారు.. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించారు. దాడి చేసిన వ్యక్తులపై ఇప్పటికే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అయితే, ఈ ఘటనను టీడీపీ రాజకీయాలకు వాడుకోవాలని చూడటం నీచమైన చర్యగా మండిపడ్డారు. తప్పు చేసిన వాళ్లు ఏ పార్టీ వాళ్లైనా శిక్ష తప్పదు అని హెచ్చరించారు.. ఇటువంటి ఘటనలను మా ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.. చట్టం ముందు ఎవరైనా సమానమే.. టీడీపీ నాయకులకు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. కేటీఆర్.. నన్ను, రాహుల్ ను తిడుతాడేంటి..!
తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. రాహుల్ గాందీని నన్ను కేటీఆర్ తిడుతున్నాడు టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అయిన అధికారి మురళీధర్ రావు కు బాధ్యతలు ఇచ్చి తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడిగడ్డ మళ్ళీ కూలగొట్టి కొత్తది కట్టాలి అంటున్నారు నిపుణులు అని తెలిపారు. కూలిన దాన్ని ఎల్ అండ్ టి కడుతుంది అంటున్నారు.. ఇంకో ఆరు నెలలు అయితే కంపనీ గడువు కూడా ముగుస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. ఆరు నెలల తరవత ఏదైనా జరిగితే బాద్యులు ఎవరు? అని ప్రశ్నించారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక పై సీబీఐ విచారణ కి కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదన్నారు. అవకతవకలు పై బాద్యులందరి పై కేసులు పెట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కి ప్రొటెస్ట్ మని ఇస్తున్నదని ఆరోపించారు. అందుకే దీనిపై విచారణ చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ దగ్గరే .. సాగు నీటి శాఖ ఉందన్నారు. మరి ఎందుకు నోరు మెదపడం లేదు ? అని ప్రశ్నించారు. బాద్యులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నాడు? అని ప్రశ్నించారు. నీ తప్పిదం లేకుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్నారు.
ముకేష్ అంబానీకి బెదిరింపులు.. తెలంగాణ వ్యక్తి అరెస్ట్..
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి ఇటీవల బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈ కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ముకేష్ అంబానీ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ.. ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ కేసును విచారించిని గాందేవి పోలీసులు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నిందితుడిని గణేస్ రమేష్ వనపర్థిగా గుర్తించారు. అతడిని నవంబర్ 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. ఇది కొంతమంది టీనేజర్లు చేసిన అల్లరి పనిగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత విచారణ జరుపుతున్నామని ముంబై సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అక్టోబర్ 27న షాదాబ్ ఖాన్ పేరుతో ఈమెయిల్స్ వచ్చాయి. అంబానీ మాకు రూ.20 కోట్లు ఇవ్వకపోతే మేము చంపేస్తామని, మా దగ్గర భారతదేశంలోనే అత్యున్నత షూటర్లు ఉన్నారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ముకేష్ అంబానీ సెక్యూరిటీ ఇంఛార్జ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ రూ.20 కోట్ల డిమాండ్ తర్వాత ఇలాగే కొన్ని రోజుల తర్వాత రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. తర్వాత రూ. 400 కోట్లు చెల్లించాలని మరో ఈ మెయిల్ వచ్చాయి.
గొర్లను మింగేటోడు కేసీఆర్ అయితే.. బర్లను మింగేటోడు రేవంత్ రెడ్డి…
గొర్లను మింగేటోడు కేసీఆర్ అయితే, బర్లను మింగేటోడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నేనే కట్టిన అనే చంద్రబాబు ఇక్కడ అభ్యర్థులను ఎందుకు పెట్టడం లేదన్నారు ఎంపీ అరవింద్. అభ్యర్థులను పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడని విమర్శించారు. అవినీతి కేసీఆర్ ను మించిన రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు కంట్రోల్ ఉంటాడని, చక్కెర ఫ్యాక్టరీలను నాశనం చేసింది చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. మేము ముస్లింలను కూడా ఓట్లు వేయాలని కోరుతున్నామని, రానున్న కాలంలో ముస్లిం బస్తీలకు కూడా రోడ్ షో లు వస్తాయన్నారు ఎంపీ అరవింద్. కార్పొరేటర్, కౌన్సిలర్ లను కొని రాజకీయాలు చేయడం లేదు ప్రజలను నమ్మి రాజకీయాలు చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా?.. లేక టీడీపీలో ఉందా?
ఏపీలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గబాటి పురంధరేశ్వరి వర్సెస్ వైసీపీ పార్టీ నేతల మధ్య పెరుగుతున్న డైలాగ్ వార్ నడుస్తుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని పురంధరేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? లేక టీడీపీలో ఉందా!? అని ప్రశ్నించారు. పురంధేశ్వరి లేఖలకు అదిరేవారు, బెదిరేవారెవరూ ఇక్కడ లేరు.. పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల మీడియా హడావుడి చేస్తోంది.. చంద్రబాబు వదినను బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుంది అని కొడాలి నాని సూచించారు.
మరో 25 మందితో బీఎస్పీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల
మరో 25 మందితో బీఎస్పీ అభ్యర్థుల మూడవ జాబితా విడుదల చేసింది. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించారు. మూడవ విడత జాబితాలో మహేశ్వరం – కొత్త మనోహర్ రెడ్డి, చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్, అదిలాబాద్ – ఉయక ఇందిర, ఆర్మూర్ – గండికోట రాజన్న, నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్, బాల్కొండ – పల్లికొండ నర్సయ్య, కరీంనగర్ – నల్లాల శ్రీనివాస్, హుస్నాబాద్ – పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, నర్సాపూర్ – కుతాడి నర్సింహులు, సంగారెడ్డి – పల్పనూరి శేఖర, మేడ్చల్ – మల్లేపోగు విజయరాజు, కుత్బుల్లాపూర్ – మహ్మద్ లమ్రా అహ్మద్, LB నగర్ – గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్, రాజేంద్రనగర్ – రాచమల్లు జయసింహ (రివైజ్డ్), అంబర్ పేట్ – ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్), కార్వాన్ – ఆలేపు అంజయ్య, గోషా మహల్ – మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్, నారాయణ్ పేట్ – బొడిగెల శ్రీనివాస్, జడ్చర్ల – శివ వుల్కుందఖర్, అలంపూర్ (ఎస్సీ) – మాకుల చెన్న కేశవరావు, పరకాల – అముధాలపల్లి నరేష్ గౌడ్, భూపాలపల్లి – గజ్జి జితేందర్ యాదవ్, ఖమ్మం – అయితగాని శ్రీనివాస్ గౌడ్, సత్తుపల్లి (ఎస్సీ) – సీలం వెంకటేశ్వర రావు, నారాయణ్ ఖేడ్ – మహ్మద్ అలాఉద్దీన్ పటేల్ లకు చోటు దక్కింది.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనారోగ్యంతో హస్పటల్ లో చేరారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల్లో వైరల్ ఫీవర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. అంతే కాకుండా జ్వరం తగ్గుముఖం పట్టేందుకు తగిన చికిత్స తీసుకోవాలని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. ఇక, వర్షాకాలం ప్రారంభం కాకముందే తమిళనాడులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతివారం వేలాది వైద్య శిబిరాలను తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్కడ జ్వరానికి సంబంధించిన రుతుపవనాల ప్రభావాన్ని పరిశీలించి తగిన చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు.
కనీసం ‘మహదేవ్’ని కూడా వదలడం లేదు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్..
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’లో ఇరుకున్నారు. యాప్ ప్రమోటర్ల నుంచి బఘేల్‌కి రూ. 508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయం ప్రాముఖ్యతను పెంచింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ని ఉటంకిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్రమ డబ్బును తరలిస్తున్న కొరియర్ని ఈడీ పట్టుకోవడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏజెన్సీ పేర్కొంది.
రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి నిధులు సమకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అక్రమ డబ్బును ఉపయోగిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పరమశివుడి నామమైన ‘మహాదేవ్’ని కూడా కాంగ్రెస్ పార్టీ వదలడం లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ, ఛత్తీస్గడ్ ప్రభుత్వం ప్రజల్ని దోచుకోవడానికి ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు, వారు మహదేశ్ పేరును కూడా వదిలిపెట్టలేదు’’ అని దుర్గ్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని అన్నారు.
